Wednesday, 29 April 2026

Blog

కుమురం భీమ్ ఆసిఫాబాద్

రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కదలాలి

రాజ్యాధికార పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పిడికిలి ఎత్తి కదలాలి అని ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేష్, శ్రీనివాస్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని స్థాపించిన తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే పార్టీ ప్రధాన లక్ష్యమని, అధికారంలోకి వస్తే, ప్రజల కోసం నిరంతరం ప్రజల కష్టసుఖాలను పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన ఉంటుందని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అన్నారు. తీన్మార్ మల్లన్న స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులు,పార్టీని మల్లన్నను అభిమానించి కొలిచే ప్రజలకు అభిమానులకు ముఖ్య గమనిక జల్‌, జంగల్‌, జమీన్‌’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది కుమ్రంభీం ఆ మహనీయుడు త్యాగాల ఫలితంగా గోండు బెబ్బులి కుమ్రం భీం జిల్లా పేరుగా గర్విస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి నగేష్, ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్ జిల్లాప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించాలని కోరారు.ప్రజల్లో మంచి పేరు నమ్మకం ఉన్న వారిని పార్టీ గమనిస్తుందని, ప్రతి యొక్క మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్టీలో చేరికలను మొదలు పెట్టాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు పట్టుదలతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. పార్టీ కష్టపడిన వారిని ఎన్నటికీ మరువదన్నారు.ప్రతియొక్క గ్రామాలలో పల్లెల్లో పార్టీ జెండా ఎగరా లని,మండలాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం బి ఆర్ ఎస్ దే. ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం లో మాజీ మంత్రి పువ్వాడ

పున్నమి ప్రతినిధి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సందర్బంగా ఖమ్మం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో ఖమ్మం నియోజకవర్గ నాయకులు పాల్గొని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారి గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. దివంగత నేత మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తి..నాకు అయనతో వ్వక్తిగత సంబంధం ఉంది అయన మరణం తీరని లోటని అన్నారు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కరోనా వచ్చి అందరు బయపడుతుంటే గోపినాథ్ గారు అయన కార్యకర్తలతో ఖమ్మం వచ్చి కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేసి గెలుపు కొరకు ప్రధాన పాత్ర పోషించారని అన్నారు.. ఈ ఉప ఎన్నికల్లో మనం కూడా కష్టపడి పనిచేసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారిని గెలిపించి రుణం తీర్చుకోవాలని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు విసుగుచెంది మరలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన దొంగ హామీలు రైతు రుణమాపీ,రైతు భరోసా,రైతు బందు,నిరుద్యోగ భృతి,4వేల పెంక్షన్,ప్రతి మహిళకు 2500,ఆడపిల్లలకు స్కూటీలు,కల్యాణలక్ష్మితులం బంగారం ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతుందని ఈ విషయాలన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందం

విశాఖలో గూగుల్‌ భారీ ప్రాజెక్ట్‌ – అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఏఐ హబ్! సాంకేతిక రంగంలో మరో గర్వకారణమైన ఘట్టం. విశాఖపట్నంలో అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కృత్రిమ మేధస్సు (AI) హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు, ఆధునిక పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు కలుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్‌ టెక్‌ మ్యాప్‌లో నిలబెట్టే ఈ కేంద్రం, డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ రంగాల్లో కొత్త దారులు తీసుకురానుంది. విశాఖలోని ఈ ఏఐ హబ్ భారతదేశాన్ని సాంకేతిక మహాశక్తిగా మరింత బలోపేతం చేస్తుంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భారతదేశ రక్షణలో విప్లవం ! “సుదర్శన్ చక్ర” భద్రతా కవచం!

భారతదేశ రక్షణలో విప్లవం – DRDO రూపొందిస్తున్న “సుదర్శన్ చక్ర” భద్రతా కవచం! భారతదేశం రక్షణ రంగంలో మరో అద్భుతమైన అడుగు వేసింది. DRDO ప్రస్తుతం “సుదర్శన్ చక్ర” అనే అత్యాధునిక భద్రతా కవచాన్ని అభివృద్ధి చేస్తోంది, ఇది మొత్తం దేశాన్ని వైమానిక ముప్పుల నుండి రక్షించనుంది. ఈ వ్యవస్థలో 6,000 నుండి 7,000 రాడార్లు, అంతరిక్షంలో ప్రత్యేక ఉపగ్రహాలు, లేజర్ ఆధారిత ఆయుధాలు ఉంటాయి. ఇవి శత్రు క్షిపణులు, డ్రోన్లను గాలిలోనే నాశనం చేయగలవు. దేశాన్ని 24 గంటలు కాపాడే ఈ సాంకేతిక కవచం భారతదేశాన్ని భవిష్యత్తులో ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా నిలబెడుతుంది.

హెల్త్ టిప్స్

నిద్ర లో మెలుకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే. తీసుకోవాల్సిన జాగ్రత్త లు ఇవే

పున్నమి ప్రతినిధి. రాత్రి కన్నంటుకోగానే లోపల ఒక్కొక్క ఆర్గాన్‌‌‌‌ డ్యూటీ ఎక్కుతాయి. ‘ఈ టైంకి నువ్వు! ఫలానా టైంకి నువ్వు’ అని వంతులు పెట్టుకొని షిష్ట్‌‌‌‌వైజ్‌‌‌‌ పని చేసుకుంటాయి. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్‌‌‌‌ లేకుండా పని చేసుకుంటే.. నిద్ర కూడా సుఖంగా ఉంటుంది. వాటికేదన్నా ప్రాబ్లమ్‌‌‌‌ వస్తే.. అవి మన నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే ఆ టైమ్‌‌‌‌ల డ్యూటీ చేస్తున్న ఆర్గాన్‌‌‌‌కి సుస్తీ చేసినట్టు! అంటే టెస్ట్‌‌‌‌లు లేకుండా ఆర్గాన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కండిషన్‌‌‌‌ని గుర్తు పట్టొచ్చన్నమాట! రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్ర పోవాలి. కానీ మంచి నిద్ర ఎంత మందికి దొరుకుతుంది? లైఫ్‌‌స్టైల్ ఎంతో హెల్దీగా ఉంటే కానీ అలా జరగదు. ఆరోగ్యానికి నిద్రకు లింక్ ఉంది. నిద్ర పోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు. చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అయితే రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు. *రిపేరింగ్ టైం..* నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌‌ను బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. ఒక్కో అవయవానికి ఒక్కో టైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట. శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం. 9–11 తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11 గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన లైఫ్‌‌స్టైల్‌‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్లు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. 11–1 సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు డైట్‌‌లో అన్‌‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి. 1–3 ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది. శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం. రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్​ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్లు ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది. 3–5 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్ అందే సమయం ఇదే. ఈ సమయంలో మెలకువ వస్తోందంటే లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు రెగ్యులర్‌‌‌‌గా బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌‌ ఫుడ్‌‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది. 5–7 5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే.. శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది. *ఇవి కూడా..* ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది. *మంచి నిద్ర కోసం..* నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి. 6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఆల్కహాల్​, సిగరెట్‌‌ అలవాట్లకు దూరంగా ఉండాలి. పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి. రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌‌ఫోన్‌‌ వాడడం తగ్గించాలి.

తిరుపతి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకములు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున్న శ్రీ కుమారస్వామి వారికి మంగళవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు అయిన కరుణాకరన్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో కుమార స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది.అనంతరం శ్రీ కుమారస్వామి వారిని విభూది మరియు వివిధ రకాల పుష్పాలతో శోభామయంగా అలంకరించి, దూప దీప నైవేద్యాలను సమర్పించడం జరిగింది.

విశాఖపట్నం

జనసేన బలోపేతం దిశగా విస్తృత స్థాయి సమావేశం

విశాఖపట్నం, అక్టోబర్ 14: దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం జగదాంబ జంక్షన్ అంబికా బాగ్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ – జనసేన పార్టీలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ తన పదవిని వదిలి పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని ఆయన కొనియాడారు. పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ వంటి నాయకులు పార్టీ విజయానికి కృషి చేశారని అన్నారు. జనసేన పార్టీ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పొందిందని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే పార్టీగా ఎదిగిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల మనోభావాలను ప్రతిబింబిస్తూ కేంద్ర నాయకత్వానికి వివరించారని తెలిపారు. వైసీపీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయాన్ని సాధించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు తీసుకురావడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలందరికీ ఐదు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ – స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని తెలిపారు. కొంతమంది కార్యకర్తలు నామినేటెడ్ పదవులు రాలేదనే అపోహలో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు తప్పక గుర్తింపు వస్తుందని అన్నారు. తాను కూడా 12 సంవత్సరాల నిరీక్షణ తర్వాత విజయాన్ని సాధించానని గుర్తు చేశారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేనలో గుర్తింపు లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ – వైసీపీ దుర్వినియోగ పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ బీజేపీ, తెలుగు దేశం పార్టీలతో కూటమి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు, రానున్న ఎన్నికల అభ్యర్థిత్వాలు న్యాయంగా కేటాయించబడతాయని భరోసా ఇచ్చారు. వార్డు స్థాయి నుండి పార్టీ బలోపేతం అవసరమని, రాబోయే ఎన్నికల్లో 100 శాతం విజయాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి, కందుల నాగరాజు, మహమ్మద్ సాదిక్, ఆళ్ల లీలావతి, ఉషశ్రీ, కామేశ్వరి, సూర్యకుమారి, మేరీ జోన్స్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ.రెహమాన్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంగ దుర్గాప్రసాంతి, పసుపులేటి ఉషాకిరణ్, పి.శివ ప్రసాద్ రెడ్డి, వార్డ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మహిళా కోఆర్డినేటర్లు, వీర మహిళలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పశువులకు గర్భ కోశ వ్యాధుల నివారణ చర్యలు

ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి* సహాకారం తో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్ గారు తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితం గా మందులు అందజేశారు .జేడీ ఏ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం 75శాతం రాయితీతో పశుగ్రాసాన్నీ రైతులకు అందజేస్తోంది అన్నారు అలాగే ఈశాన్య రుతు పవనాలు సమయంలో పశువులకు,గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల బాలకృష్ణ ,Ch. నరసింహారావు ,M.శ్రీకాంత్, Ch.వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎసమ్మ మరియు అధికారులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు G శ్రీధర్ రావు, EODLDA (కోవూరు) D.శ్రీనివాసరావు , AD సురేష్ బాబు (కలిగిరి ),VAS SK మహమూద్ అలీ (కొండాపురం), DR వీర హరీన్ మరియు కొండాపురం పశువర్ధ శాఖ సిబ్బంది పాల్గొన్నారు…

తిరుపతి

తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.*

*తిరుపతి జిల్లా పోలీస్ శాఖ* తేదీ: 14.10.2025 – *తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన బాలుడిని — 30 నిమిషాల్లో సురక్షితంగా గుర్తించిన వెస్ట్ పోలీసులు.* – తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద తల్లితండ్రుల వద్దనుండి తప్పిపోయిన చిన్న బాలుడిని తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి తల్లితండ్రుల ఒడికి చేర్చారు. – తల్లితండ్రులు పోలీసులకు సమాచారం అందించగానే, వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణం, సమీప ప్రాంతాలు, రోడ్లపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ చుట్టూ ప్రక్కల వెతికారు. కేవలం అర్థగంటలోనే బాలుడిని సురక్షితంగా గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు. – ఈ సందర్భంగా బాలుడి తల్లితండ్రులు కన్నీటి కళ్ళతో పోలీసులు చూపిన స్పందన, మానవతా విలువలు, సేవాస్ఫూర్తిని ప్రశంసిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. – జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు వెస్ట్ పోలీస్ సీఐ గారు,స్టేషన్ సిబ్బంది చూపిన వేగవంతమైన చర్యను అభినందించారు. చిన్న పిల్లలు లేదా పెద్దవారు తప్పిపోతే వెంటనే 112 నంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. – *పోలీస్ వారి జాగ్రత్త సూచన:* – ప్రజలు ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, దేవాలయాలు వంటి జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్నారులపై ఎప్పటికప్పుడు దృష్టి ఉంచాలి. తాత్కాలిక నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చిన్నారుల భద్రత అంటే సమాజ భద్రత అని గుర్తుంచుకోవాలి. – *తిరుపతి జిల్లా పోలీస్* – *ప్రజల నమ్మకం – మా బలం*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.