Wednesday, 29 April 2026

Blog

కడప

జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ తొలి పర్యటన – రైల్వే కోడూరు అభివృద్ధి పనులపై సమీక్ష

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టిడిపి నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కస్తూరిబా స్కూల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల అవసరాలను తెలుసుకున్నారు. రైతులతో భేటీ అవుతూ వ్యవసాయ సమస్యలపై సమీక్షించారు. రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి మెరుగుదల చర్యలను సూచించారు. కోడూరు–చిట్వేల్ డబుల్ రోడ్డు పనుల పురోగతిని సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

హనుమకొండ

*కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్‌ను పదవి నుండి టెర్మినేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కొండా సురేఖ అటవీ శాఖలో డిప్యుటేషన్లు, బదిలీలు అంతా సుమంత్ చెప్పినట్టే జరిగేవి అంటూ ఆరోపణలు

హనుమకొండ

కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు_

*_గ్రేటర్ వరంగల్ బ *_కార్పొరేటర్ భర్తతో పాటు 10 మంది అరెస్ట్_* _వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు_ _ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా మరో 10 మంది(ముగ్గురు మహిళలు)ని అరెస్టు చేసి వారి నుండి రూ.60 వేలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు…_

హనుమకొండ

కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు_

*_గ్రేటర్ వరంగల్ బ *_కార్పొరేటర్ భర్తతో పాటు 10 మంది అరెస్ట్_* _వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు_ _ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా మరో 10 మంది(ముగ్గురు మహిళలు)ని అరెస్టు చేసి వారి నుండి రూ.60 వేలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు…_

యాదాద్రి భువనగిరి

పుట్టపాకలో నేతన్నలకు ఉచిత కంటి అద్దాల పంపిణీ*

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్ 14,(తెలంగాణ గళం): పుట్టపాక గ్రామంలో క్రియేటర్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ సామల భాస్కర్ గారి ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్స్ చైర్మన్ అశ్విన్ అగర్వాల్,కో చైర్మన్ పూనమ్ అగర్వాల్,గ్రామీణ ఇనిషియేటివ్ చైర్మన్ అర్జున్ కేడియా, కో చైర్మన్ నిఖిల్ బహేటి గారల సౌజన్యంతో ఈరోజు పద్మశాలి చేనేత కళాకారులకు ఉచితంగా కంటి అద్దాలను ఇవ్వడం జరిగినది.ట్రస్ట్ ఫౌండర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందుటకు పద్మశాలి చేనేత కళాకారులందరూ ఏకతాటిపై ఉండి,మన జీవన స్థితిగతులు మారడానికి ప్రతి చేనేత సమావేశాలకు హాజరుకావాలని,మన హక్కులు మన వాటాను సాధించుకోవాలని అన్నారు. ఇండియన్స్ వారికి పుట్టపాక గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంగ్ ఇండియన్స్ అధినేత ఈ యొక్క కార్యక్రమంలో పుట్టపాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం హనుమంతు,రాష్ట్ర పద్మశాలి మహిళా సంఘం ఉపాధ్యక్షులు శ్రీమతి సామల విజయలక్ష్మి,మండల పద్మశాలి నాయకులు గజం వెంకటేశ్వర్లు,పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పానుగంటి వెంకట్రావు, కోశాధికారి అయిటిపాముల శంకర్, సహాయ కార్యదర్శి రావిరాల మల్లేష్, కార్యవర్గ సభ్యులు గంజి శంకరయ్య, వాసం మహేష్,సామల యాదయ్య, తడక వెంకటేశ్వర్లు,గుండు చంద్రకళ, గజం నిర్మల,పానుగంటి పద్మ మరియు పద్మశాలి చేనేత కళాకారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

29న పోలవరం, దేవాదులపై పీఎం సమీక్ష

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిపై చేపట్టిన దేవాదుల, పోలవరం ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ఈనెల 29న సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టుల బ్యాక్ వాటర్ ముంపుపై ప్రభావిత రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలు, భూసేకరణ, పునరావాసంపై ‘ప్రగతి’ కార్యక్రమంలో చర్చించనున్నారు. APలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 60% పూర్తికాగా TGలో దేవాదుల పనులు 92% మేర పూర్తయ్యాయి. వీటిపై PM చర్చించి తగిన ఆదేశాలు జారీ చేసే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్

SAILలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) అనుబంధ సంస్థ IISCO స్టీల్ ప్లాంట్(WB)లో 11 అడ్వైజర్/ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), డిప్లొమా, ఎంబీఏ, CA/ICWA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 25లోగా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://sailcareers.com/

ఆంధ్రప్రదేశ్

గుంటూరు పశ్చిమలో మహిళా గ్రీవెన్స్ డే ప్రారంభం – మహిళా సమస్యల పరిష్కారానికి గళ్ళా మాధవి ముందడుగు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం: మహిళల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా “మహిళా గ్రీవెన్స్ డే” ప్రారంభించబడింది. ఈ కార్యక్రమం మహిళల శ్రేయస్సు కోసం, వారి విన్నపాలకు స్పందించే వేదికగా నిలవనుంది. మహిళల భాగస్వామ్యంతో చురుకైన కార్యక్రమం 23వ డివిజన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలురకాల మహిళా సమస్యలపై చర్చ జరిగింది. స్థానిక మహిళలు తమ అభ్యంతరాలు, విన్నపాలను “రెడ్ బుక్”లో నమోదు చేసి, మా లేడీ లెజెండ్ గౌరవనీయులైన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారిని వ్యక్తిగతంగా కలసి వివరించారు. ముఖ్య అంశాలు 1️⃣ అంగన్వాడీ సెంటర్ల పరిస్థితులు: గళ్ళా మాధవి గారు స్వయంగా పలు అంగన్వాడీ సెంటర్లను సందర్శించి, పిల్లల పోషణా సేవలు, సదుపాయాలపై సమీక్ష జరిపారు. 2️⃣ పరిశరాల పరిశుభ్రత: మహిళలు తమ ప్రాంతాల్లో పరిశుభ్రత లోపాలను ఎమ్మెల్యే గారికి తెలియజేయగా, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. 3️⃣ ప్రజల్లో అవగాహన కార్యక్రమం: 23/09/2025 నుంచి 13/10/2025 వరకు ఇంటింటికీ, షాపులకు వెళ్లి GST పై అవగాహన కల్పించిన వర్క్ గురించి ఎమ్మెల్యే గారికి వివరించబడింది. గళ్ళా మాధవి గారు ఈ చర్యను అభినందిస్తూ మహిళల సామాజిక చైతన్యాన్ని ప్రశంసించారు. మహిళా నాయకురాళ్ల పాల్గొనిక ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. అంగన్వాడీ, డ్వొక్ర సాధికారిక సంస్థ ప్రతినిధులు, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమి లాం ✌️, 164వ బూత్ ఇన్‌చార్జ్ నవమి లాం ✌️ పాల్గొని కార్యక్రమాన్ని మరింత బలపరిచారు. గళ్ళా మాధవి గారి మాటల్లో… “మహిళల సమస్యలు పరిష్కరించడమే మా మొదటి ప్రాధాన్యత. మహిళలు నిస్సంకోచంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయాలి. ప్రభుత్వం ప్రతి స్థాయిలో మీకు అండగా ఉంటుంది,” అని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కామారెడ్డి తెలంగాణ

వరుసగా ధ్వంసం భయంతో వణికుతున్న రామారెడ్డి

కామారెడ్డి,15 అక్టోబర్, పున్నమి ప్రతినిధి    : రాత్రి పుట్టకముందే రామారెడ్డి వీధులన్నీ నిశ్శబ్దం గా మారిపోతున్నాయి. ఎవరి వాహనం బయట ఉంటుందో వారికి నిద్రే దొరకడం లేదు.ఒకపక్క ఈ కో, సండ్రో, మరోపక్క ఈకో,ఒక్కో వాహనం ధ్వంసా నికి గురైనాయి.వరుసగా మెరుగు గణేష్‌, మేకల శ్రీనివాస్‌, లింగాల స్వామి గౌడ్ వాహనాలు ఒకే సారి  పాడైపోవడమే ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేసింది. మండలంలో పోలీస్ స్టేషన్ ఉన్నా, ఈ ధాటికి అంతు కనపడట్లేదు.గంజాయి గ్యాంగ్ పని అంటున్నార. మెకానిక్‌ల గ్యాంగ్ అని మరోకరు అంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో అనుమానం. తెల్లవారితే వాహనాల గ్లాస్ లు పగలగొట్టబడి, లోపల సామాన్లు విరిగి పడిపోవడం ప్రజలను ఆవేదనలో ముంచేస్తోంది. రాత్రి పహారా కాస్తున్న పోలీసులు తలలు పట్టుకున్నారు.ఎవరు చేస్తు న్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదని అంటు న్నారు. కానీ మండల ప్రజలు మాత్రం కోపంతో ఉడుకుతున్నారు.ఇలా కొనసాగి తే మనమే గస్తీ కాస్తాం, అని నిర్ణయించు కుంటున్నారు. రామారెడ్డి లో భయం రెట్లు పెరుగుతుంటే, అందరి నోట ఒక్క మాటే వినిపిస్తోంది.వీళ్లను ఊరుకోరాదు అని అంటున్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఆదివాసి గుండెల్లో తాగునీటి కష్టాలు

అక్టోబర్ 15 పున్నమి ప్రతినిధి ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు పాడిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మండపల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు కొమురం భీం వారసులు నేటికీ గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ళ దూరం నడవాల్సి వస్తుంది గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క చేతి పంపు పని చేయడం లేదు అధికారులు స్పందించి బాగు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.