Wednesday, 29 April 2026

Blog

నిర్మల్

గాలికుంటు వ్యాధికి ఉచిత టీకా – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన ఉచిత టీకాల కార్యక్రమం గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. పశువులకు ఉచితంగా టీకాలు వేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి రాజేశ్వర్, బాలిక్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నాడు హైదరాబాద్‌, నేడు విశాఖ అభివృద్ది సీఎం చంద్రబాబుకే సాధ్యం..అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అంటున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!!!

ఉదయగిరి, అక్టోబర్ 15 :(పున్నమి న్యూస్ ):/// గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి..,!ఎన్డీఏ ప్రభుత్వం కృషితోనే గూగుల్ డేటా సెంటర్ రాక..,,!డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..!సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గూగుల్ రాకతో రాష్ట్రం స్వర్ణతో ముఖాభివృద్ధి చెందుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ,ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి వికేంద్రీకరణను చేతల్లో చూపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో,ముందుకు,తీసుకెళ్తున్నారన్నారు.విశాఖపట్నం కేంద్రంగా 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్‌ సంస్థ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్‌ కి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాంకేతిక రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటాయని, సాంకేతికంగా దేశంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ గా విశాఖ వైపు చూసేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చొరవ చూపారన్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద, దేశంలోనే తొలి ఏఐ హబ్‌ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు,చేయబోతోందన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలు,మెరుగుపడతాయన్నారు. ఈ డేటా సెంటర్‌ అంతర్జాతీయ నెట్వర్కు కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో మంత్రి శ్రీ నారా లోకేష్ 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం ఆయనకే సాధ్యమైంది అన్నారు, దేశంలోనే 15 మిలియన్ డాలర్ల ఎఫ్ డి ఐ ను సాధించడం ఇదే ప్రథమం అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సమస్త విశాఖలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. దేశం మొత్తం గర్వించే సమస్త రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ ప్లైవుడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సమస్త పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు.

పిల్లలకు

సమయస్ఫూర్తి

అనగనగా ఒక నైమిశారణ్యం.ఆ అడవిలో ఒక సింహం గాడిద మిగతా జంతువులు ఉండేవి.సింహం అడవికి రాజు.అయితే అది తెలివి తక్కువ సింహం.అది ప్రతిరోజు దొరికిన జంతువులను చంపితినేది.అలా ఒకరోజు ఏనుగునే చంపాలని చూసింది. ఏనుగు ఒక్కసారిగా కాలుపై ఎత్తి సింహం ముందుగా నేలకేసి కొట్టింది అంతే ఆ సింహం గుహలోకి పరిగెత్తింది. ఇక ఆరోజు మొత్తం దానికి ఆహారం లేదు.తర్వాత రోజు ఉదయం ఒక కుందేలును చంపి తినింది.ఆరోజు అలా.. గడిచిపోయింది.ఆరోజు రాత్రి దానికి గాడిద మాంసం తినాలని అనిపించింది అంతే పొద్దున్నే లేచి గాడిద కోసం వెతికసాగింది.ఒక దగ్గర దానికి గాడిద పొదల్లో గడ్డిమేస్తూ కనిపించింది.ఈ తెలివి తక్కువ సింహం ఎగిరి దూకి చంపకుండా గాడిద దగ్గరకు వెళ్లి గాడిద గాడిద నేను నిన్ను తినొచ్చా అని అడిగింది.కానీ ఒక్క షరతు నువ్వు పరిగెత్త కూడదు అని చెప్పింది సింహం.మహారాజా మీరు నన్ను తినాలి అంటే నాది కూడా ఒకసారి షరత్తు అని చెప్పింది గాడిద.సింహం దానికి సరే త్వరగా చెప్పు అని చెప్పింది.మనిద్దరిలో ఎవరు శక్తివంతులో నాకు తెలుసుకోవాలని ఉంది అనింది గాడిద.దాంట్లో సందేహం ఏముంది నేను శక్తివంతుడిని అని తటపటాయించకుండా చెప్పింది సింహం.అలా ఎలా చెప్తారు మహారాజా మనం ఒక పోటీ పెట్టుకుందాం అని చెప్పింది గాడిద.ఇదిగోండి ఇక్కడ ఒక గోడ ఉంది కదా దానిని ఎవరు పడగొడితే వారే శక్తివంతులు అని చెప్పింది గాడిద.దానికి సింహం కూడా సరేంది.గాడిద ముందు సింహానికి అవకాశం ఇచ్చింది.సింహం వెళ్లి ఆ గోడని గోళ్ళతో గీకి,గీకి తన వల్ల కాక వచ్చేసింది.గాడిద వంతు వచ్చేసరికి గాడిద పరిగెత్తుకుంటూ వెళ్లి తన వెనక రెండు కాళ్ళు ఎత్తి గట్టిగా ఒక్క తన్ను తన్నింది అంతే ఆ గోడ దబెల్ మని కిందపడిపోయింది.అప్పుడు సింహం ఇది నాకంటే శక్తివంతమైనది గా ఉంది నేను ఇప్పుడు దానికి దొరికాను అంటే నన్ను చంపేస్తుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది సింహం.గాడిద తప్పించుకుందనుకొని గట్టిగా ఊపిరి పిల్చుకొని సంతోషంతో ఎగిరి గంతేసింది. నీతి:సమయస్ఫూర్తితో ఏ ఆపదనుండైనా బయటపడవచ్చు

అనకాపల్లి

పంచాయతీ కార్యదర్శుల తో సమీక్ష సమావేశం

గొలుగొండ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఇంచార్జ్ ఎంపీడీవో శ్రీనివాస రావు పంచాయతీ కార్యదర్శు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు,పథకాల అమలు, శుభ్రత కార్యక్రమాలు తదితర అంశాలపై ఆయన అధి కారులు కార్యదర్శులతో చర్చించారు గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించా లంటూ సూచనలు చేసి గ్రామాల్లో పారిశుధ్యం పనులు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యంగా గ్రామ కుడలి లను శుభ్రంగా ఉంచా లన్నారు ఈ సమావేశంలో 27 గ్రామపంచాయతీ కార్య దర్శులు సిబ్బంది పాల్గొన్నారు

విశాఖపట్నం

దీపావళి పండుగ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ సూచనలు

🎇 అనుమతి లేకుండా బాణాసంచా అమ్మకం, నిల్వ, తయారీ లేదా రవాణా చేయడం పూర్తిగా నిషేధం. ప్రతి సంవత్సరం కొంతమంది వ్యక్తులు అనుమతి లేకుండా బాణాసంచా స్టాళ్లు పెట్టడం, ఇళ్లలో నిల్వ చేయడం లేదా చిన్నపిల్లలను కూడా ఇలాంటి పనులకు ఉపయోగించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారు చట్టపరమైన కఠిన చర్యలకు గురవుతారని గట్టిగా హెచ్చరించబడుచున్నది. ఇప్పటికే పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పొర్లుపాలెం గ్రామం వద్ద కొండవలస రవికుమార్ అనే వ్యక్తి బాణాసంచా అక్రమంగా తయారు చేస్తున్నప్పుడు పట్టుబడగా, పెద్ద మొత్తంలో బాణాసంచా మరియు తయారీకి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం చేయబడ్డాయి. అతనిపై Explosive Substances Act ప్రకారం కేసు నమోదు చేసి, కోర్టులో హాజరపరచగా రిమాండ్‌కు పంపించబడినాడు. 🔸 బాణాసంచా అమ్మకానికి స్టాల్ ఏర్పాటు చేయదలచిన వారు తప్పనిసరిగా ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి. ఒక పర్మిషన్ మీద బహుళ స్టాళ్లు ఏర్పాటు చేస్తే, అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోబడతాయి. 🔸 పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, పార్కింగ్ సౌకర్యం ఉన్న సురక్షిత ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవాలి. పార్కింగ్ లేకుండా ఉన్న ప్రదేశాలకు అనుమతి ఇవ్వబడదు. 🔸 దీపావళి సందర్భంగా పెందుర్తి పోలీస్ పరిధిలో నిఘా బలపరచబడింది. ఎవరైనా అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలు, నిల్వలు లేదా రవాణా నిర్వహించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవు. ఎక్కడైనా అక్రమ బాణాసంచా తయారీ లేదా అమ్మకాలు గమనించినట్లయితే వెంటనే 112 లేదా పెందుర్తి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 96767 97314, పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 94407 96039 కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

హైదరాబాద్

**మల్కాజ్‌గిరి లో రేవంత్ రెడ్డి మరో అరాచకం**

కాంగ్రెస్ ప్రభుత్వం గూండాయిజం మరియు పోలీసు బలగాలను ఉపయోగించి సామాన్య ప్రజలను వేధించడంలో మానవత్వానికి విరుద్ధమైన మార్గాలను అవలంబించింది. పోలీసుల వేధింపుల కారణంగా హైదరాబాద్‌లో మానవ హక్కుల కేసులు పెరిగాయి. జూలై 2025లో ‘కార్తికేయ’ అనే వ్యక్తి మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్‌పై అలాంటి NHRC కేసు నమోదు చేశాడు, అతని సోదరీమణులు సరితాశ్రీ మరియు దీప్తిశ్రీ, మల్కాజ్‌గిరి జిల్లాలోని గౌతమ్‌నగర్ ప్రాంతంలో ఎం.శ్రీనివాస్‌తో కలిసి వేధిస్తున్నాడు. ఈ మహిళలు తప్పుడు సమాచారం, బెదిరింపు, అడ్డంకులు మరియు మల్కాజ్‌గిరి పోలీస్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్ కార్తికేయ ముందు అక్రమ నిర్మాణాలు చేశారు. ‘కార్తికేయ’ ఇంటి మ్యుటేషన్‌ను రద్దు చేయడానికి ఈ ఇద్దరు మహిళలు పోలీసులకు మరియు GHMCకి వివిధ సందర్భాల్లో లంచం ఇచ్చారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలలో అలాంటి లంచాలను పట్టించుకోరు. ఇటీవల బోనాలు సంఘటన సమయంలో, హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రదేశాలలో పోలీసులను ప్రజలు కొట్టడం గమనార్హం. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ప్రాంతంలో, కాంగ్రెస్‌కు చెందిన రౌడీ షీటర్ మైనంపల్లి హనుమంతరావు బోనాలు సందర్భంగా హింస జరిగినట్లు నివేదించబడింది. 2019 మరియు 2020లో అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన తర్వాత, ఈ కార్తికేయను 2020లో రౌడీ షీటర్ బాదరవాడ మోహనరాజు కొట్టాడు, అతను ఆ సమయంలో TRSలో ఉన్న మైనంపల్లి హనుమంతరావుకు సన్నిహితుడు. కార్తికేయ సోదరీమణులు సరితాశ్రీ మరియు దీప్తిశ్రీ కార్తికేయను కొట్టడానికి ఈ బాదరవాడ మోహన రాజును నియమించుకున్నారు. ఆసక్తికరంగా అనుముల రేవంత్ రెడ్డి ఆ సమయంలో మల్కాజ్‌గిరి ఎంపీ. తరువాతి కాలంలో మళ్ళీ బెదిరింపులు కొనసాగాయి. మైనంపల్లి హనుమంతరావు – రౌడీ షీటర్ తరువాత కాంగ్రెస్‌లో చేరాడు మరియు ఇటీవల బోనాలు సమయంలో ప్రజా హింసకు కారణమయ్యాడు. ఈ మరియు GHMC మల్కాజ్‌గిరి కమిషనర్ గొధుమల రాజు ఇంటిని రద్దు చేయడానికి USAలో భారీగా డబ్బును లంచంగా స్వీకరించడం సరితశ్రీ మరియు దీప్తిశ్రీల నుండి కార్తికేయను మ్యుటేషన్ చేయడం అనేది మైనంపల్లి హనుమంతరావు మరియు ఇతరుల వంటి కాంగ్రెస్ గూండాలు పగటిపూట నిర్వహించే బహిరంగ విషయం. ఈ ఇద్దరు మహిళలు సరితశ్రీ మరియు దీప్తిశ్రీ 12+ సంవత్సరాలకు పైగా దూరంగా ఉన్న తర్వాత USA నుండి తిరిగి వచ్చారు. వారు ఇంటి కోసం పోరాడటానికి వచ్చారు మరియు కార్తికేయ పూర్వీకుల ఆస్తులను పొందారు. ఇప్పటికే కార్తికేయ తల్లిదండ్రులు ఈ ఇద్దరు మహిళలకు పుష్కలంగా బంగారం, డబ్బు మరియు USA విద్యను ఇచ్చారు. కానీ వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీలు మరియు రాజకీయ నాయకులచే మోసపోయారు. కార్తికేయ ACBకి ఫిర్యాదు చేసింది, వారు గాజులు ధరించారు మరియు ఎటువంటి చర్య తీసుకోలేదు. తన తండ్రి తాతగారు నిర్మించిన ఈ ఇంటిని సెటిల్ చేయడానికి కార్తికేయ ఒక్కగానొక్క కుమారుడు వెళ్ళాడు. మొదటగా GHMC మల్కాజ్‌గిరి కమిషనర్ గొధుమల రాజు లంచం ఇచ్చి ఇంటిని మ్యుటేషన్ చేయించాడు. కానీ కాంగ్రెస్ గూండాయిజం మరియు కార్తికేయ సోదరీమణులు సరితాశ్రీ మరియు దీప్తిశ్రీలు ఇచ్చిన USA నుండి భారీ డబ్బు తీసుకోవడం వల్ల మ్యుటేషన్ రద్దు చేయబడింది. సామాన్య ప్రజలపై జరిగిన ఈ రౌడీ మరియు పోలీసుల దురాగతాలలో కాంగ్రెస్ మరియు అనుముల రేవంత్ రెడ్డి హస్తం ఉందా? ప్రజలు దానికి సమాధానం చెప్పి ఇలాంటి సంఘటనలను నివేదించాలి. రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు ఇచ్చారు, కానీ దయనీయమైన కాంగ్రెస్ ప్రభుత్వం పగలు మరియు రాత్రి హింసించబడుతున్న ఇలాంటి పురుషుల సమస్యలకు ఎవరు సహాయం చేస్తారు? అనుముల రేవంత్ రెడ్డికి ఒక కుమారుడు ఉంటే, అతను తన ఆస్తులకు ఇలా చేస్తాడా? శరత్ చంద్ర (జర్నలిస్ట్) Video: https://m.youtube.com/watch?v=QfFRnuSQlug

జాతీయ అంతర్జాతీయ

బలహీనపడిన అమెరికా పాస్‌పోర్ట్ – ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయింది!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా పేరుగాంచిన అమెరికా పాస్‌పోర్ట్‌ ఇప్పుడు తన ప్రభావాన్ని కోల్పోతోంది. తాజా గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ ప్రకారం, యూఎస్ పాస్‌పోర్ట్‌ 2025 ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి పడిపోయింది. గతంలో టాప్ 5లో ఉన్న అమెరికా ఇప్పుడు యూరోపియన్, ఆసియన్ దేశాలకు వెనుకబడి ఉంది. సింగపూర్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల పాస్‌పోర్ట్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్వేచ్ఛ లభిస్తోంది. వీసా లేకుండా ప్రయాణించే అవకాశాల సంఖ్య తగ్గిపోవడం అమెరికా పాస్‌పోర్ట్ బలహీనతకు కారణంగా చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా ప్రతిష్ట తగ్గుతోందనే సంకేతంగా దీనిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

యాదాద్రి భువనగిరి

మృతుని కుటుంబానికి భరోసాగా. పిల్లల బంగారు భవిష్యత్తుకు అండగా ఉంటా అని హామీ . కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి

సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిమిర్యాల గ్రామానికి చెందిన బొడిగె రవి ఇటీవల మృతి చెందారు. ఇతనికి ముగ్గురు పిల్లలు విష్ణు,అమ్ములు,శాశ్విత. విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి ఈరోజు మృతుని తల్లిదండ్రులను పిల్లలను పరామర్శించి 20,000,వేల రూపాయల తక్షణ సహాయం సహాయాన్ని చేశారు.తదుపరి మృతుని పిల్లల భవిష్యత్తుకు 1,00,000 ఒక లక్ష రూపాయలు అందించి ఆసటగా నిలుస్తానని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాసమల్ల యాదయ్య,చిలువేరు నరసింహ,చెక్క వెంకటేశం,స్వామి యొక్క బైక్ అని నరేందర్ యాదవ్, అబ్బనగోని వంశీ యాదవ్,పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు,తదితరులు,పాల్గొన్నారు.

హైదరాబాద్

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి గా దీపక్ రెడ్డి

పున్నమి ప్రతినిధి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ తమ అభ్యర్థి గా నేడు లంకల దీపక్ రెడ్డి ని ప్రకటించినది. మరో వైపు కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ప్రచారం ని ఉదృతం చేసాయి. గెలుపు మీద ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా: నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూభారతి, సాదా బైనామా, ధ్రువపత్రాల జారీ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రజావాణి, సిఎం ప్రజావాణి, ఇసుక అక్రమ రవాణా వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. భారీ వర్షాలు, వరదలు సంభవించినప్పుడు, విపత్కర పరిస్థితులు ఎదుర్కునేందుకు దోహదపడే వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్ లను కలెక్టర్ అభిలాష అభినవ్ తహసిల్దార్లకు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.