Wednesday, 29 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి – నవంబర్ 24న ఢిల్లీలో ఏఐపిటిఎఫ్ చలో ఢిల్లీ ధర్నా – దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయుల పాల్గొననున్నారు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అక్టోబర్ : దేశంలో ఇతర ఉద్యోగులకెలాంటి అర్హతా పరీక్షలు లేకపోయినా, కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పుడే పదోన్నతి అర్హత ఇవ్వడం అన్యాయం అని పేర్కొంటూ సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ, నవంబర్ 24న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య (AIPTF) ఆధ్వర్యంలో భారీ “చలో ఢిల్లీ” ధర్నా నిర్వహించనున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు బసవరాజ్ గురికర్ ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర గూగుల్ మీట్‌లో 25 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని, దేశవ్యాప్తంగా వేలాదిమంది ఉపాధ్యాయులతో ఢిల్లీలో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ వివరాలను జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి ఎ.జి.ఎస్. గణపతి రావు వెల్లడించారు. జాతీయ సెక్రటరీ జనరల్ కమల్కాంత్ త్రిపాఠి మాట్లాడుతూ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఈ విషయమై ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఏఐపిటిఎఫ్ నాయకులు కోరినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఆప్త) ప్రధాన కార్యదర్శి కె. ప్రకాశ్ రావు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నుంచి 8,000 మంది, గుజరాత్ నుంచి 5,000 మంది, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల నుండి 2,000 మంది, హిమాచల్, పంజాబ్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, మణిపూర్, వెస్ట్ బెంగాల్, ఒడిశా మరియు దక్షిణాది రాష్ట్రాల నుండి 5,000 మంది చొప్పున ఉపాధ్యాయులు పాల్గొంటారని నాయకులు తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి కూడా ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఎ.పి. ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మరియు ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణి పిలుపునిచ్చారు.

యాదాద్రి భువనగిరి

శ్రీ శ్రీ శ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన నూనె పంపిణీ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ ,10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం గుడికి దీపారాధన చేసే చిలివేరు లింగమ్మకు అందజేశారు.కార్యక్రమంలో రాపర్తి కరుణాకర్,సికిలమెట్ల ప్రభాకర్,దోమలపల్లి కిరణ్ తదితరులు,పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మనుబోలు మండలంమండలం కాగితాలపూరు క్రాస్ రోడ్లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్ (18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్సై శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

యాదాద్రి భువనగిరి

శ్రీ శ్రీ శ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన నూనె పంపిణీ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రాజ్యపాల ముత్యాలమ్మ దేవాలయానికి నిత్య దీపారాధన కొరకు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ 10 కేజీల నూనె,పూజా సామాగ్రి లను నిత్యం గుడిని అలంకరించే చిలివేరు లింగమ్మకు అందసారు.ఈ కార్యక్రమంలో రాపర్తి కరుణాకర్,సికిలమెట్ల ప్రభాకర్, దోమలపల్లి కిరణ్ తదితరులు,పాల్గొన్నారు.

ఖమ్మం

ప్రజా సమస్య ల పరిష్కారమే ద్యేయం గా ధనియాకలు పర్యటన

ఖమ్మం అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) ప్రజా సమస్య ల పరిష్కారమే ద్యేయం గా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ ఖమ్మం రెండవ పట్టణ పరిధిలో గల ప్రతి డివిజన్లో, పోలింగ్ బూత్ అధ్యక్షులను కలిసి వారి పోలింగ్ బూత్ లో ఆ డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా మొదటిరోజు పర్యటన రెండవ పట్టణ పరిధిలో ఉన్న 10వ డివిజన్లో ఉన్నటువంటి రాములవారి దర్శనం అనంతరం వారి ఆశీస్సులతో 10 &11 డివిజన్లో మొదలుపెట్టారు, పది రోజులు సుమారు ఈ పర్యటన ఉంటుందని తమ దృష్టికి వచ్చిన సమస్య ల పరిష్కారం కోసం అవసరం అయితే పెద్ద ఎత్తున ధర్నా లు, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అని వెంకట్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పదవ డివిజన్ శక్తి కేంద్ర ఇన్చార్జి యుగంధర్ నాయుడు,11వ డివిజన్, శ్రీనివాస చార్యులు,మరియు, రుద్ర గాని మాధవ్, కన్నెగంటి కృష్ణ చారి, వేల్పుల సుధాకర్, మహేందర్,భూక్య వెంకట్ దాసరి వీరభద్రం, పోలింగ్ బూత్ అధ్యక్షులు, శేఖర్, అయ్యప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిర్మల్

వరి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధం కావాలి – మంత్రులు ఉత్తమ్, తుమ్మల.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి) వరి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శాఖ రాజేందర్, డిఎం సుధాకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,ముగోడు ప్రతినిధి,స్థాన్ నారాయణపురం,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి):):

తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ని మర్యాదపూర్వకంగా మినిస్టర్స్ క్వార్టర్స్ లో కలిశారు కాంగ్రెస్ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రజా అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని,రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరులు,పాల్గొన్నారు.

నిర్మల్

గాలికుంటు వ్యాధికి ఉచిత టీకా – జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లా అక్టోబర్ 15 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో గాలికుంటు వ్యాధి నిర్మూలనకు ఉద్దేశించిన ఉచిత టీకాల కార్యక్రమం గోడప్రతులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. పశువులకు ఉచితంగా టీకాలు వేసి వ్యాధి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి రాజేశ్వర్, బాలిక్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నాడు హైదరాబాద్‌, నేడు విశాఖ అభివృద్ది సీఎం చంద్రబాబుకే సాధ్యం..అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అంటున్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..!!!

ఉదయగిరి, అక్టోబర్ 15 :(పున్నమి న్యూస్ ):/// గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి..,!ఎన్డీఏ ప్రభుత్వం కృషితోనే గూగుల్ డేటా సెంటర్ రాక..,,!డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..!సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గూగుల్ రాకతో రాష్ట్రం స్వర్ణతో ముఖాభివృద్ధి చెందుతుందని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ,ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి వికేంద్రీకరణను చేతల్లో చూపిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో,ముందుకు,తీసుకెళ్తున్నారన్నారు.విశాఖపట్నం కేంద్రంగా 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్‌ సంస్థ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్‌ కి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాంకేతిక రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటాయని, సాంకేతికంగా దేశంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ గా విశాఖ వైపు చూసేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చొరవ చూపారన్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద, దేశంలోనే తొలి ఏఐ హబ్‌ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు,చేయబోతోందన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలు,మెరుగుపడతాయన్నారు. ఈ డేటా సెంటర్‌ అంతర్జాతీయ నెట్వర్కు కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో మంత్రి శ్రీ నారా లోకేష్ 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం ఆయనకే సాధ్యమైంది అన్నారు, దేశంలోనే 15 మిలియన్ డాలర్ల ఎఫ్ డి ఐ ను సాధించడం ఇదే ప్రథమం అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సమస్త విశాఖలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. దేశం మొత్తం గర్వించే సమస్త రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ ప్లైవుడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సమస్త పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు.

పిల్లలకు

సమయస్ఫూర్తి

అనగనగా ఒక నైమిశారణ్యం.ఆ అడవిలో ఒక సింహం గాడిద మిగతా జంతువులు ఉండేవి.సింహం అడవికి రాజు.అయితే అది తెలివి తక్కువ సింహం.అది ప్రతిరోజు దొరికిన జంతువులను చంపితినేది.అలా ఒకరోజు ఏనుగునే చంపాలని చూసింది. ఏనుగు ఒక్కసారిగా కాలుపై ఎత్తి సింహం ముందుగా నేలకేసి కొట్టింది అంతే ఆ సింహం గుహలోకి పరిగెత్తింది. ఇక ఆరోజు మొత్తం దానికి ఆహారం లేదు.తర్వాత రోజు ఉదయం ఒక కుందేలును చంపి తినింది.ఆరోజు అలా.. గడిచిపోయింది.ఆరోజు రాత్రి దానికి గాడిద మాంసం తినాలని అనిపించింది అంతే పొద్దున్నే లేచి గాడిద కోసం వెతికసాగింది.ఒక దగ్గర దానికి గాడిద పొదల్లో గడ్డిమేస్తూ కనిపించింది.ఈ తెలివి తక్కువ సింహం ఎగిరి దూకి చంపకుండా గాడిద దగ్గరకు వెళ్లి గాడిద గాడిద నేను నిన్ను తినొచ్చా అని అడిగింది.కానీ ఒక్క షరతు నువ్వు పరిగెత్త కూడదు అని చెప్పింది సింహం.మహారాజా మీరు నన్ను తినాలి అంటే నాది కూడా ఒకసారి షరత్తు అని చెప్పింది గాడిద.సింహం దానికి సరే త్వరగా చెప్పు అని చెప్పింది.మనిద్దరిలో ఎవరు శక్తివంతులో నాకు తెలుసుకోవాలని ఉంది అనింది గాడిద.దాంట్లో సందేహం ఏముంది నేను శక్తివంతుడిని అని తటపటాయించకుండా చెప్పింది సింహం.అలా ఎలా చెప్తారు మహారాజా మనం ఒక పోటీ పెట్టుకుందాం అని చెప్పింది గాడిద.ఇదిగోండి ఇక్కడ ఒక గోడ ఉంది కదా దానిని ఎవరు పడగొడితే వారే శక్తివంతులు అని చెప్పింది గాడిద.దానికి సింహం కూడా సరేంది.గాడిద ముందు సింహానికి అవకాశం ఇచ్చింది.సింహం వెళ్లి ఆ గోడని గోళ్ళతో గీకి,గీకి తన వల్ల కాక వచ్చేసింది.గాడిద వంతు వచ్చేసరికి గాడిద పరిగెత్తుకుంటూ వెళ్లి తన వెనక రెండు కాళ్ళు ఎత్తి గట్టిగా ఒక్క తన్ను తన్నింది అంతే ఆ గోడ దబెల్ మని కిందపడిపోయింది.అప్పుడు సింహం ఇది నాకంటే శక్తివంతమైనది గా ఉంది నేను ఇప్పుడు దానికి దొరికాను అంటే నన్ను చంపేస్తుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది సింహం.గాడిద తప్పించుకుందనుకొని గట్టిగా ఊపిరి పిల్చుకొని సంతోషంతో ఎగిరి గంతేసింది. నీతి:సమయస్ఫూర్తితో ఏ ఆపదనుండైనా బయటపడవచ్చు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.