Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు నియోజకవర్గం అక్టోబర్ 15 (పున్నమి ప్రతి నిధి) రైల్వే కోడూరు మండలం, సి కమ్మ పల్లి గ్రామ వాస్తవ్వులు ఆర్డబ్ల్యూఎస్ డి ఇ మద్దెన మహేశ్వర్ తండ్రి వెంకట స్వామి మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కుటమి నాయుకులు పాల్కొన్నారు.

విశాఖపట్నం

ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష

బుధవారం VMRDA సమావేశమందిరంలో ముఖ్యమైన బృహత్తర ప్రణాళిక రహదారుల పనుల ప్రగతిని అధికారులతో,గుత్తేదారులు సమీక్షించిన VMRDA చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ ముఖ్యమంత్రి నాయుడు, మానవ వనరులశాఖ మంత్రి లోకేశ్ భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే రహదారులపై ప్రత్యేక దృష్టి సారించినందువలన ఎట్టి పరిస్థితుల్లో నిర్దేశించిన కాలపరిమితి లోగా పనులను పూర్తి చేసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి తీసుకుని రావాలని చెప్పారు.అదేవిధంగా GVMC తో సమన్వయం చేసుకొంటూ TDR సత్వరం ఇవ్వవలసిన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం క్లియర్ గా ఉన్న మేరకు పెగ్ మార్కింగ్ చేసి పనులు ముందుకు తీసుకొని వెళ్ళాలని సూచించారు. అటవీశాఖకు చెందిన భూములున్న రహదారి మార్గాల్లో అనుమతులు వేగంగా వచ్చే విధంగా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని చెప్పారు.ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని,అదేసమయంలో నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనులను పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేష్ ,కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదన రావు, కార్యనిర్వహక ఇంజినీర్లు రామరాజు, రాంబాబు, సుధీర్, వరుణ్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.*

యాదాద్రి భువనగిరి

దివిస్ కంపెనీని కాపాడేందుకు పేద రైతుల పొట్టగొడతారా.సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని దివిస్ లాబొరేటరీస్ పరిశ్రమను కాపాడేందుకు పేద రైతుల పొట్టగొడతారా అని సిపిఐ జాతీయ కార్యదర్శి,మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు.నేడు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ప్రకారం భూములు కోల్పోతున్న రైతుల భూములను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ ను ఆశాస్త్రీయంగా ఓఆర్ ఆర్ రోడ్డు నుంచి 40 నుంచి 60 కిలోమీటర్లు తీసుకొని చౌటుప్పల్ కు ఉత్తర దక్షిణ ప్రాంతంలో 28 కిలోమీటర్లు ఎందుకు కుదించారని ఆయన నిలదీశారు.త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ను పాము వంకర లాగా తిప్పుతూ ఒకచోట 50 కిలోమీటర్లు మరోచోట 60 కిలోమీటర్లు చౌటుప్పల్ దగ్గరికి వచ్చేసరికి 28 కిలోమీటర్లు ఎన్ని రకాలుగా మార్చడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో బయట పెట్టాలన్నారు.ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ సమాంతర దూరం నుంచి మార్చాలన్నారు.ప్రస్తుత అలైన్మెంటు దివిస్ ఫార్మా కంపెనీ కాపాడడం కోసమే మార్చినట్టు తెలుస్తుందన్నారు.ఫార్మా కంపెనీల కోసం కాకుండా పేద రైతులను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా అలైన్మెంట్ చేయాలని,సన్న చిన్న కారు రైతులను నాశనం చేసి,వారి శవాలపై రోడ్లు నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు.ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ చౌటుప్పల్ మండలంలో ప్రస్తుత అలైన్మెంట్ మూలంగా విలువైన భూములను ఇండ్లు తమ ఫ్లాట్లకు కూడా భారీ నష్టం వాటిల్లుతుందని,త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ 60 కిలోమీటర్ల దూరానికి మార్చాలని అక్కడ కూడా భూమి పోయే రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని లేని ఎడల బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం 3,రెట్లు నష్టపరిహారం చెల్లించాలని అన్నారు.అలాగే త్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల సమస్యలపై శాసనమండలి సమావేశంలో చర్చిస్తామని,ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలియజేశారు.అలాకాకుండా ఫార్మా కంపెనీల కొమ్ము కోస్తూ పేద రైతుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి,సహాయ కార్యదర్శి సత్యనారాయణ,భూ నిర్వాసితులు చింతల దామోదర్ రెడ్డి,పల్లె శేఖర్ రెడ్డి,కురిమిద్దె శ్రీనివాస్,బోడ సుదర్శన్,కళ్లెం కృష్ణ,ఇమ్రాన్,పెరబోయిన మహేందర్,పగిల్ల మోహన్ రెడ్డి,పిల్లి శంకర్,కొండూరి వెంకటేష్,ఉడుత రామలింగం,బద్దుల సుధాకర్,భూ నిర్వాసితులు సందగల మల్లేశం,జాల శ్రీశైలం,బోరం ప్రకాష్ రెడ్డి, గుండెబొయిన వేణు,మార్గం నరసింహ, సుర్కంటి శశికళ,భారతమ్మ తదితరులు,పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో ధర్నా నిర్వహించారు

అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనీ AITUC,CPI ఆధ్యర్యంలో ఆటో డ్రైవర్లు , హమాలీలు ఉదయగిరి హై స్కూలు నుంచి MRO కార్యాలయ వరకు ధర్నా నిర్వహించారు CPI , రాష్ట్ర కార్యదర్శి దామ అంకయ్య మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోవాలన్నారు ఆనంతరం MRO మోహన్ రావు కు వినతి పత్రం అందజేశారు.

హైదరాబాద్

18 న జరిగే తెలంగాణ బంద్ కి బీజేపీ సంపూర్ణ మద్దత్తు :బీజేపీ తెలంగాణ చీప్ రామచంద్ర రావు

పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్ అంశం లో తెలంగాణ హై కోర్టు వైఖరిని నిరసిస్తూ బీసీ సంఘము జాతీయ నేత రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ నెల 18 న ఇచ్చిన బంద్ పిలుపు కి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దత్తు తెలియజెస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు తెలియా జేశారు. బుధవారం నాడు హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యలయం కి వచ్చిన బీసీ సంఘాల నేతలతో రామ చంద్రరావు మాట్లాడుతు బీసీ వ్యక్తి ని ప్రధాని ని చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావడంలో నారా లోకేష్ కృషి అభినందనీయం… – టిడిపి సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంతర్జాతీయ గూగుల్ సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయటానికి మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి అన్నారు.యువతకు ఇది ఎంతో ప్రయోజనకరమని వారి భవిష్యత్తుకు బాసటగా నిలుస్తుందనీ.. సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వారు పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమించి కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకుని వస్తున్నారని తెలియజేశారు. గూగుల్ క్లౌడ్ సంస్థ మన ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం శుభ పరిణామం అని అన్నారు.ప్రపంచంలో అమెరికా తర్వాత దేశంలోనే అతిపెద్ద తొలి ఏఐ హబ్ గూగుల్ క్లౌడ్ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయబోతుందన్నారు. ఈ సబ్ సి కేబుల్ నెట్ వర్క్ ను అంతర్జాతీయ నెట్ వర్క్ కనెక్ట్ చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత సంస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుందని అన్నారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. ఈ హబ్ లోని ఏఐ టెక్నాలజీ ద్వారా గూగుల్ చర్చ్, సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ వంటి ఇతర గూగుల్ సేవలు విశాఖ నుంచి ప్రపంచానికి అందించబడునున్నాయన్నారు.గతంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని అప్పటి ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తీసుకుని రావడంతో ఏ విధంగా అభివృద్ధిలో కారకంగా నిలిచిందో అదే విధంగా గూగుల్ సంస్థ కూడా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు..భవిష్యత్తును ముందే గ్రహించి ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు వారసుడుగా నారా లోకేష్ భవిష్యత్ తరాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని సీనియర్ నాయకులు గుబ్బల మూర్తి తెలియజేశారు.

కోనసీమలో దారుణం: ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో బుధవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) తన ఇద్దరు చిన్నారులను విషం తాగించి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం — చంటి భార్య నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా, ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ, బుధవారం రాత్రి అయిదవ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్ (11), ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్ (8) లకు పురుగుమందు తాగించి, అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంటి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి. నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.