Wednesday, 29 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం పరిశుభ్రతకు షీ టీమ్స్

“విశాఖ నగర పరిశుభ్రతకు (SHE TEAMS) షీ టీమ్స్ నిరంతర నిఘా.”* నగర పరిశుభ్రత, సుందరీకరణ, అభివృద్ధే ప్రాధాన్యంగా జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ.* * బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను పారవేస్తే కఠిన చర్యలు, జరిమానాలు.* * పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కు ప్రజా సహకారమే ముఖ్యభూమిక.- జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్.విశాఖపట్నం, అక్టోబర్ 15: విశాఖ నగర పరిశుభ్రత, సుందరీకరణ, అభివృద్ధే ప్రాధాన్యంగా మహా విశాఖ నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను పారవేసే వారిని గుర్తించేందుకు నగరంలో “షి” టీమ్స్ (Sanitation & Health Enforcement Teams) నిరంతర నిఘా తో పనిచేస్తున్నాయని, పరిసర పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. విశాఖ నగర పరిశుభ్రతకు, పర్యావరణానికి, సుందరీకరణకు, ఆహ్లాద వాతావరణానికి భంగం కలిగించేలా విశాఖ నగరంలో గల పలు వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాలు, నివాసితులు, సందర్శకులు బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో, రోడ్లు, ఫుట్పాతులపై తమ వ్యర్థాలను పారవేస్తూ పరిసరాలను నిత్యం అశుభ్రపరచడం జీవీఎంసీ గమనిస్తూ వాటి నియంత్రణకు ఇప్పటికే ఏర్పాటు చేసిన” షి టీమ్స్” ద్వారా ప్రత్యేక నిఘాను నగరమంతా ఏర్పాటు చేశామన్నారు. అలాగే బీచ్ పరిసరాల్లోనున్న వ్యాపారస్తులు బీచ్ కు వచ్చే సందర్శకులకు, విహారయాత్రికులకు అవగాహన కల్పించకుండా బీచ్ తీర ప్రాంతాల్లో వ్యర్ధాలను పారవేసి పరిసరాలను, అశుభ్రపరుస్తూ సముద్ర జలాల కలుషితానికి కారకులవుతున్నారన్నారు. అందుకే జీవీఎంసీ నగరంలో ఏర్పాటుచేసిన షీ టీమ్స్ నిరంతర నిఘా ద్వారా అతిక్రమించి వ్యర్ధాలను పారవేసే వ్యాపారస్తులను, వాణిజ్యసముదాయాలను గుర్తించి 1000/- రూపాయలు జరిమానా తో పాటు వారి వ్యాపార లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను, అలాగే కాలనీలలో, రోడ్లపై , బహిరంగ ప్రదేశాలలో, కాలువలలో, ఫుట్పాతులపై వ్యర్ధాలు పారవేసే వారిపై 500/- రూపాయలు జరిమానా విధింపు ప్రక్రియను చేపట్టామన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా నగరంలో గల పలు హోటల్లు, రెస్టారెంట్లు, ఆహారం విక్రయించే స్టాళ్లు, వంటశాలలు పై జీవీఎంసీ షీ టీమ్స్ తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రమైన ఆహారాన్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను స్వాధీన పరుచుకుని జరిమానాలను విధించి, అతిక్రమించిన వ్యాపారాల లైసెన్సులను కూడా రద్దు చేయడం ఇప్పటికే జరుగుతోందన్నారు. ఆ దిశగా నగర పరిసరాల పరిశుభ్రతను మరింత పటిష్టపరిచేందుకు ఈ షీ టీమ్స్ నగరంలో నిరంతర నిఘా తో పరిశీలిస్తున్నాయన్నారు.విశాఖ నగరంలో అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమాలు జరుగబోవు నేపథ్యంలో మహా విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ…, సుందరంగా, పచ్చదనం, విద్యుత్ కాంతులతో అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దే కార్యక్రమాలను జీవీఎంసీ పూర్తి చేస్తోందన్నారు.కాబట్టి, వ్యాపారస్తులు, వాణిజ్య సముదాయాల వారు, కాలనీవాసులు, నివాసితులు తమ వద్ద రోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై, కాలువలపై ఫుట్పాతులపై పారవేయకుండా, జరిమానాలుతో వ్యాపార లైసెన్సుల రద్దులకు గురికాకుండా రోజు మీ వద్దకు వచ్చే జీవీఎంసీ వాహనాలకు వ్యర్థాలను వేరు చేసి అందించాలని, మన విశాఖ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తూ సుందరంగా తీర్చిదిద్దుతూ అతిధులను, పర్యాటకులను, విదేశీయులను, విహారయాత్రికులను ఆకర్షించేలా జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, పరిసరాల పరిశుభ్రతకు ,పర్యావరణ పరిరక్షణకు నగర ప్రజలు, వ్యాపారస్తులు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం

విశాఖపట్నం..టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ కామెంట్స్..పెట్టుబడులకు స్వర్గ ధామం గా ఆంధ్ర ప్రదేశ్ అవతరించి…అభివృద్ధికి చిహ్నం చంద్ర బాబు…16 నెలల్లో ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి.ప్రపంచం లో దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి…అందులో భాగం గానే గూగుల్ డేటా సెంటర్ విశాఖ కు వచ్చింది….బ్యాంక్ లు, బ్లడ్ బ్యాంకులు ఎలాంటివో.. సమాచారం పొందు పరిచేదే డేటా సెంటర్ అంటే..అమెరికా ప్రజలు వాడే డేటా కన్నా.. మూడు రెట్లు డేటా మన దేశం లో వినియోగిస్తున్నాం…ఈ డేటా వలన వచ్చే లాభాలు అమెరికాకు వెళ్తున్నాయి..లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి..ప్రస్తుతం మనదేశం లో వున్న డేటా సెంటర్ లు మొత్తం వెయ్యి మెగావాట్ల డేటాను ఉత్పత్తి చేస్తున్నాయి..చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తున్నారు..జగన్ హయం లో అభివృద్ధి సున్నా..అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు పోతుంది అంటే చంద్రబాబు, లోకేశ్ కారణం..నకిలీ మద్య వ్యాపారాలు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు నిర్వహిస్తూ… టిడిపి పై బురద జల్లా లని చూసి అడ్డంగా దొరికి పోయారు..రాజకీయాలు ప్రజల బాగుకోసం కోసం చేయాలి.. మీలా మీ స్వప్రయోజనాల కోసం కాదు..ఈదేశం లో పెద్ద కంపెనీలు అన్నీ మీ రాష్ట్రం లో పెట్టుబడులు పెడతాం అని చంద్రబాబు వెంట పెడుతున్నాయి.. చంద్రబాబు ఇమేజ్ అంటే అది…అమర్నాద్ గతం లో మీరు డేటా సెంటర్ తెచ్చామని హడావుడి చేశారు.. చివరకు ఏమైంది…వైసీపీ హయం లో అదానీకి 180 ఎకరాలు ఎండాడ లో కేటాయించి కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకున్నది మీరు కాదా.

ఆంధ్రప్రదేశ్

ఋషికొండ ప్యాలస్ ను సైన్స్ అభివృద్ధి కి వినియోగించాలి

*ఋషికొండ ప్యాలెస్‌ను సైన్సు అభివృద్ధికి వినియోగించాలి**పిపిపి మోడ్‌లో ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేయరాదు*.*సిపిఎం డిమాండ్‌.*గత వైసిపి ప్రభుత్వం 9 ఎకరాల భూమిలో 451 కోట్ల ప్రజాధనంతో భారీ భవణాన్ని ఋషికొండ ప్రాంతంలో నిర్మించింది. అది వినియోగంలోకి రాకుముందే వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. దీనిని ఏ విధంగా వినియోగించాలో ప్రజల అభిప్రాయాలను సేకరించబోతున్నట్లు పర్యాటక శాఖ, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించింది. టిడిపి కూటమి ప్రభుత్వం ఋషికొండ భవనాలను ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిమాండ్‌ చేసింది. నేడు అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఈ భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సైన్సు మ్యూజియం, సైన్సు పార్కుగా శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోనే దీని నిర్వహణ ఉండాలన్నారు. విశాఖపట్నం, రాష్ట్ర ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇది దోహదం పడుతుందన్నారు. ఒక ప్రక్క ప్రజాభిప్రాయాలను సేకరిస్తూనే మరోవైపు విజయవాడలో పిపిపి మోడ్‌లో ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు పూనుకోవడం సరైంది. ప్రజాభిప్రాయనికి అనుగుణంగా ప్రభుత్వ చర్యలుండాలి. ప్రజా అవసరాలకు దీనిని ఉపయోగించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

యాదాద్రి భువనగిరి

నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని కలెక్టర్ కు వినతి*

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్,ఆధ్వర్యంలో అల్లాపురం రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 106,లో అల్లాపురం రైతులకు పట్టా భూములున్నాయని,2018లో రైతులకు పాస్ బుక్కులు ఇచ్చారని పేర్కొన్నారు.పట్టాదారు పాస్ బుక్కులు వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతున్నా,అవసరమైన రైతులు తమ భూములను అమ్ముకోవడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.సర్వేనెంబర్ 106 ను పూర్తిస్థాయిలో సర్వే చేసి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విన్నవించారు.కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జ్ పబ్బు రాజు గౌడ్,అల్లాపురం తాజా మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి,మండల కాంగ్రెస్ నాయకుడు అర్ధ వెంకట్ రెడ్డి,ల ఆధ్వర్యంలో అల్లాపురం గ్రామ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ హనుమంతరావును కలిసి వినతిపత్రం అందజేశారు.అదేవిధంగా ఏడి,ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు స్పందిస్తూ రాచకొండ పరిధిలోని సర్వేనెంబర్ 106 ను సర్వే నెంబర్ ను పూర్తిస్థాయిలో సర్వే చేయించి,రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.వినతి పత్రం అందజేసిన వాళ్ళు అల్లాపురం గ్రామ రైతులు వరకాంతం రవీందర్ రెడ్డి,ముత్యాల కృష్ణారెడ్డి,సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి,సింగిరెడ్డి జంగారెడ్డి,సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి,ముత్యాల ప్రతాపరెడ్డి,భూతం లింగస్వామి,భూతం యాదయ్య,బొడ్డు జంగయ్య,తదితరులున్నారు.

విశాఖపట్నం

మరో హైటెక్ సిటీగా మన విశాఖ – రాష్ట్రానికి మహర్దశ గాజువాక నియోజకవర్గం తెలుగుయువత సంబరాలు

గాజువాక , అక్టోబర్ (పున్నమి ప్రతినిధి): విశాఖపట్నం నగరంలో గూగుల్ సంస్థ రూ.1,40,000 కోట్ల భారీ పెట్టుబడితో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుండటం రాష్ట్రానికి చారిత్రాత్మక పరిణామంగా అభివర్ణించిన గాజువాక యువత. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన నేపథ్యంలో గాజువాక ప్రాంతంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. పాత గాజువాక కూడలిలో యువత బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు యువత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మొల్లి పెంట్రాజు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు (చిరంజీవి), మార్కెటింగ్ డైరెక్టర్ రంబాయ్, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్, జనసేన సీనియర్ నాయకులు గంధం వెంకట్రావు, కరణం కనకారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, గాజువాక తెలుగు యువత అధ్యక్షులు ఎం. గణపతి, ప్రధాన కార్యదర్శి బియ్యపు నరేష్ పాల్గొన్నారు. మహిళలు, యువతతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొని, “మన విశాఖ మరో హైటెక్ సిటీగా అవతరించబోతోందని” ఉత్సాహంగా పేర్కొన్నారు.

E-పేపర్

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ మండల అధ్యక్షులు ముక్కా రూపేష్ రెడ్డి

ఓబుళవారిపల్లి మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో కోర్లకుంట క్రాస్ రోడ్డు నందు మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిధి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారు,నియోజకవర్గం ఇంచార్జి గడ్డం చెంగల్ రాజు , సినీయర్ నాయకులు వి.టీ చెంగల్ రెడ్డి ఇంటిదగ్గర ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం ఆర్ ఎఫ్ రాళ్లచెరువు పల్లి గ్రామం జెట్టి వెంకట రమణ కి,కోర్లకుంట గ్రామం వెంకటసుబ్బమ్మ కి మరియు,వి.లలితమ్మ కి,గోబురవారిపల్లి గ్రామం అక్కమ్మగారి అశోక్ మరియు శ్రీకాంత్ కి, మరియు బుర్రు నాగేశ్వరావు కి మొత్తం 4,80,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో జిల్లా ఉప అధ్యక్షులు కృష్ణయ్య యాదవ్, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ శంకర్యయ, శ్రీనివాసులు,ప్రధాన కార్యదర్శి జై.కేశవ రాజు,వేణు గోపాల్ రెడ్డి,రాజేష్ వర్మ, శశిధర్ రెడ్డి,నరసింహులు, చలపతి,సాయి, తేజ మరియు బిజెపి పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు నియోజకవర్గం అక్టోబర్ 15 (పున్నమి ప్రతి నిధి) రైల్వే కోడూరు మండలం, సి కమ్మ పల్లి గ్రామ వాస్తవ్వులు ఆర్డబ్ల్యూఎస్ డి ఇ మద్దెన మహేశ్వర్ తండ్రి వెంకట స్వామి మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కుటమి నాయుకులు పాల్కొన్నారు.

E-పేపర్

వెంకటస్వామి మృతదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

రైల్వే కోడూరు నియోజకవర్గం అక్టోబర్ 15 (పున్నమి ప్రతి నిధి) రైల్వే కోడూరు మండలం, సి కమ్మ పల్లి గ్రామ వాస్తవ్వులు ఆర్డబ్ల్యూఎస్ డి ఇ మద్దెన మహేశ్వర్ తండ్రి వెంకట స్వామి మరణించారని తెలుసుకొని వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన *ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కుటమి నాయుకులు పాల్కొన్నారు.

యాదాద్రి భువనగిరి

డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. పాల్గొన్న ఎండి రహీం షరీఫ్

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,అక్టోబర్ 15,(పున్నమి ప్రతినిధి): మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా,భారత రత్న, డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కలాం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడునియోజకవర్గం మైనార్టీనాయకుడు యండి రహీంషరీఫ్.

ఖమ్మం

తెలంగాణ బంద్ ని జయప్రదం చెయ్యండి:బీజేపీ నేత ధనియాకుల పిలుపు

ఖమ్మం పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హై కోర్టు వైకరికి నిరసన గా ఈ నెల 18న తెలంగాణ బీసీ సంఘాలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖమ్మం టూ టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఖమ్మం నగరము లో ప్రతి వ్యాపార వాణిజ్య, వర్తక, కర్షక, విద్యాసంస్థలు స్వచ్చందంగా బంద్ లో పాల్గొని బంద్ ని విజయవంతం చేయాలి అని పిలిపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.