Wednesday, 29 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మరమ్మతు నోచుకొని రహదారి ఆoదోనలలో ప్రయాణికులు

దుత్తలూరు మండల పరిధిలోని బైరవరం పంచాయితీ ఏరియాలో తురకపల్లి గ్రామానికి చెందిన రోడ్డు మరమ్మతులు కు నోచుకోలేదు ఈ మేరకు వాహనదారుల రాకపోకలకు తీవ్ర అసభ్యంగా ఏర్పడింది ప్రయాణికుల పరిస్థితి ఆందోళన కరంగా మారింది ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చర్యలు ఎందుకు చేపట్ట లేదని ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక అధికారులతో పాటు ప్రజా నాయకులు ఈ విషయం పై దృష్టి పెట్టి వెంటనే రోడ్డు మరమ్మతులు కార్యక్రమాన్ని చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలనీ ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

యాదాద్రి భువనగిరి

పానుగంటి క్రాంతి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,అక్టోబర్15,(పున్నమి ప్రతినిధి): పుట్టపాక గ్రామంలో ఆర్థిక సమస్యలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పానుగంటి క్రాంతి వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర తెలంగాణ ప్రాంత మహిళా పద్మశాలి సంఘంఅధ్యక్షులు గుంటక రూప,రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్,జనరల్ సెక్రెటరీ లు మధుర శశికళ – చిన్నకోట్ల స్వప్నరాజ్,కోశాధికారి నోముల రేఖ,గ్రేటర్ ఉపాధ్యక్షులు ఆడెపు శాంతి గారలు పరామర్శించి,వారికి రూ.10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల విజయలక్ష్మి,యాదాద్రి భువనగిరి జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సామల భాస్కర్,పుట్టపాక పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం హనుమంతు,ఉపాధ్యక్షులు పానుగంటి వెంకట్రావు,సహాయ కార్యదర్శి రావిరాల మల్లేష్,తదితరులు,పాల్గొన్నారు.

విశాఖపట్నం

పారిశ్రామిక, సాంకేతిక రాజధానిగా వైజాగ్

పారిశ్రామిక, సాంకేతిక రాజధానిగా వైజాగ్ పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ​విశాఖపట్నం (VIZAG) ఇకపై కొత్త స‌రిహ‌ద్దుల‌ను తాక‌నుంది. అతిపెద్ద పారిశ్రామిక, ఆవిష్క‌ర‌ణ‌ల కేంద్రంగా ప్రపంచ పటంలో నిలిచేందుకు వేగంగా రూపాంతరం చెందుతోంది. ఈ మెగా ప్రాజెక్టులు నగరాన్ని ద‌క్షిణ భార‌త‌దేశ పారిశ్రామిక, సాంకేతిక రాజధానిగా తీర్చిదిద్దనున్నాయి. ​అంతర్జాతీయ సంస్థల భారీ పెట్టుబడులు, అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో విశాఖ నగర ముఖచిత్రం పూర్తిగా మారిపోతోంది. వేలాది కోట్ల పెట్టుబడులు, లక్షల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఈ నగర భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దుతున్నాయి. ​ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు: భవిష్యత్తుకు బాటలు ​1. ఆర్సెలార్‌మిత్తల్ & నిప్పన్ స్టీల్ మెగా ప్లాంట్: ​పెట్టుబడి: ₹1.4 లక్షల కోట్లు. ​ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించ‌బోతున్నారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట సమీపంలో 7 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ​ప్రభావం: ఈ భారీ ప్రాజెక్టు ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా, స్టీల్ రంగంలో వైజాగ్‌ను గ్లోబల్ హబ్‌గా మారుస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. ​2. గ్రీన్ హైడ్రోజన్ విప్లవం: ​లక్ష్యం: స్వచ్ఛమైన ఇంధనం (క్లీన్ ఎనర్జీ), సుస్థిరమైన అభివృద్ధి దిశగా విశాఖ అడుగులు వేస్తోంది. ​ప్రాజెక్టులు: గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ స్టీల్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఏసీఎంఈ గ్రూప్ వంటి సంస్థలు గ్రీన్ స్టీల్ ఉత్పత్తి కోసం సుమారు ₹5,000 కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ​ప్రభావం: ఈ గ్రీన్ ప్రాజెక్టుల ద్వారా విశాఖ ప్రపంచంలోనే అతికొద్ది ‘గ్రీన్ హైడ్రోజన్ హబ్’ నగరాల సరసన చేరనుంది. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు, కొత్త తరం పరిశ్రమలకు మార్గం సుగమం చేస్తుంది. ​3. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు (VMR): ​వివరాలు: నగరంలో అత్యాధునిక అర్బన్ మొబిలిటీ కోసం 54 స్టేషన్లతో కూడిన మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తోంది. ​ప్రభావం: ఈ మెట్రో ప్రాజెక్టు నగరం నలుమూలలనూ కలుపుతూ సులభమైన రవాణా వ్యవస్థను అందిస్తుంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, నగర జీవనాన్ని మరింత సులభతరం చేస్తుంది. ​ఉపాధి, పెట్టుబడులు: అవకాశాల నగరం ​ఈ మెగా ప్రాజెక్టులన్నీ విశాఖపట్నంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలను సృష్టించనున్నాయి. పారిశ్రామిక, తయారీ (Manufacturing), సాంకేతిక (IT & Technology), లాజిస్టిక్స్, నిర్మాణ రంగాలలో యువతకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ​అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు కూడా విశాఖ వైపు చూస్తున్నాయి. ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌లు, ఏఐ హబ్స్‌ ను ఏర్పాటు చేసేందుకు కూడా అడుగులు పడుతున్నాయి. దీనితో పాటు పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్‌గా కూడా విశాఖ అభివృద్ధి చెందనుంది. ​ముగింపు: ​భారీ పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ, మెరుగైన రవాణా వ్యవస్థతో వైజాగ్ కేవలం ఒక తీర నగరంగానే కాకుండా, భారతదేశ ఆర్థిక అభివృద్ధికి చోదక శక్తిగా మారబోతోంది. వైజాగ్ రైజింగ్… నిజంగానే అవకాశాలు, ఆవిష్కరణల నగరంగా ఆవిర్భవిస్తోంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్ వి కండ్రిగ హెస్కూల్ నందు బాలికల దినోత్సవం

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఎన్.వి కండ్రిక హైస్కూల్ నందు జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా పిల్లందరికి బాల్య వివాహం వల్ల వచ్చే నష్టాలు మరియు హెల్ప్ లైన్ నెంబర్లు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ ఎమ్ పద్మ మాట్లాడుతూ సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం జరుపుకుంటారని ఆమె తెలిపారు. బాలిక శిశువు గురించి అసమానత్వం విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి అమ్మాయిలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొంటున్న వివిధ రకాల సాంఘిక వివక్ష, దోపిడీని తొలగించడం చాలా అవసరమని, సమాజంలో మహిళల అవసరం గురించి అవగాహన పెంచడానికి, వివిధ రాజకీయ, కమ్యూనిటీ నాయకులు సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం అమ్మాయిలు గురించి ప్రజలకు చెప్పడం జరుగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు స్కూలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగరావు నియామకం

గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగరావు (KNR) నియమితులయ్యారు. పార్టీ తన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర స్థాయిలో పని చేసే అవకాశం ఇచ్చిందని KNR ఆనందం వ్యక్తం చేశారు. “పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేస్తాను” అని KNR తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్ జీ, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో బీజేపీ బలోపేతం కోసం తాను సాయశక్తుల కృషి చేస్తానని కర్ణం రెడ్డి నర్సింగరావు వెల్లడించారు.

ఖమ్మం

జొన్నలగడ్డ ని పరామర్శించిన కొలిక పోగు

పున్నమి ప్రతినిధి నిన్న రాత్రి పెనుబల్లిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి,ఖమ్మం లోని కృష్ణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న,ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వర్లు మాదిగ ని ఈరోజు ఖమ్మంలో MRPS జాతీయ నాయకులు కొలిక పోగు వెంకటేశ్వర్లు మాదిగ బుధవారం నాడు పరామర్శించి ,ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని,డాక్టర్ గారితో మాట్లాడారు. జొన్నలగడ్డ త్వరగా కోలుకోవాలని అయన కోరుకున్నారు. అయన వెంట కోట ప్రసాద్ మాదిగ ఉన్నారు.

విశాఖపట్నం

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం – మంత్రి నారా లోకేష్ హామీ

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను అమరావతిలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ వ్యవస్థాపకుడు ఈశ్వర్ చౌదరి మాట్లాడుతూ, “సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల మంజూరు, అక్రిడిటేషన్ జారీ వంటి అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి” అని కోరారు. అలాగే, అక్రిడిటేషన్ కమిటీలలో అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ త్వరలోనే అక్రిడిటేషన్లు జారీ చేస్తామని, ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఇళ్ల స్థలాల కేటాయింపును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. “జర్నలిస్టులు సమాజానికి అద్దం పడే వర్గం. వారి సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం” అని మంత్రి లోకేష్ వెల్లడించారు. తెలుగు జర్నలిస్ట్స్ ఫోరమ్ నాయకులు ఈశ్వర్ చౌదరి, ఫోరమ్ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

_*టపాసుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం: పొదలకూరు ఎస్సై మహ్మద్ హనీఫ్

_*టపాసుల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం: పొదలకూరు ఎస్సై మహ్మద్ హనీఫ్*_ పొదలకూరు : ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా వారిపై పేలుడు పదార్థాల చట్టం, ఐపిసి సెక్షన్స్‌ ప్రకారం చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ ఐ ఎస్.కె. ఎం.డీ హనీఫ్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పోలీసు స్టేషను లో‌జరిగిన విలేఖరుల సమావేశంలో ఎస్.ఐ మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకొనిబాణసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచిన, తయారుచేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తహసీల్దారు, ఫైర్ ఆఫీసర్, పోలీసు వారు తో కూడిన మండల కమిటీ పరిశీలిస్తారన్నారు.ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా జనావాసాల మధ్యలో గోడాన్స్‌ ఏర్పాటుచేసి ప్రజా భద్రతను, ఆరోగ్యాన్ని దెబ్బతీసి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. బాణసంచా విక్రయ లైసెన్స్‌ కలిగిన దుకాణదారులు మాత్రమే వాటిని అమ్మాలి అని, మిగిలినవారెవరైనా విక్రయించినా చట్ట వ్యతిరేకమన్నారు. బాణసంచా విక్రయ, తయారీ లైసెన్స్‌ కలిగిన దుకాణదారులు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించాలన్నారు.అగ్నిపమాదాలను నిలువరించేందుకు వీలుగా నియమ నిబంధనలు పక్కాగా పాటించాలని. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పట్టణం లోని హంస రెడ్డి కళ్యాణ మండపం లో తాత్కాలిక టపాసులు అంగడిలు నిర్వహిస్తారన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, పోలీసు వారి నియమ నిబంధనలను ఏమాత్రం మీరిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు బాణసంచా అక్రమ నిల్వ విక్రయం నిబంధనలు పాటించకపోవడం వంటి వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీసు వారికి తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వైజాగ్ లో ‘G’ అంటే గూగుల్!

సాంకేతిక ప్రపంచంలో విశాఖపట్నం ఇప్పుడు కొత్త గుర్తింపును సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ టెక్ రాజధానిగా ఎదుగుతున్న వైజాగ్‌లో గూగుల్‌ తమ అతిపెద్ద ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ కారణంగా ఇప్పుడు “వైజాగ్‌లో G అంటే గూగుల్‌” అనే నూతన ప్రతీకగా మారింది. అందమైన బీచ్‌లు, పచ్చని కొండలు, శాంతమైన వాతావరణంతో గూగుల్‌ వంటి గ్లోబల్‌ సంస్థలు ఆకర్షితమవుతున్నాయి. విశాఖకు ఇది ఐటీ రంగంలో గొప్ప మైలురాయిగా నిలవనుంది.

విశాఖపట్నం

​వైజాగ్ గ్లోబల్ టెక్ హబ్

​వైజాగ్ గ్లోబల్ టెక్ హబ్ -గూగుల్ మెగా AI సెంటర్ రాకతో విశాఖ రూపురేఖలు మార్పు పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి,; ​విశాఖపట్నం: ​విశాఖపట్నం నగరం త్వరలోనే ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌లో కీలక కేంద్రంగా మారబోతోంది. అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్ ఇక్కడ ఏర్పాటు చేయనున్న మెగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్, కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశానికే ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ​భారీ పెట్టుబడి, లక్షల ఉద్యోగాలు ​ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం గూగుల్ సుమారు ₹ 1.3 లక్షల కోట్ల (సుమారు $15 బిలియన్) భారీ పెట్టుబడి పెట్టనుంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ కావడం విశేషం. ఈ కేంద్రం పూర్తయ్యాక, ప్రత్యక్షంగా 5,000–6,000 మందికి ఉద్యోగాలు లభించవచ్చని అంచనా. అయితే, పరోక్ష ఉపాధి అవకాశాలు మాత్రం ఊహించని విధంగా లక్షకు పైగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పరోక్ష ఉపాధిలో నిర్మాణం, కార్యకలాపాలు (Operations), నిర్వహణ (Maintenance), లాజిస్టిక్స్ మరియు స్థానిక సేవలు వంటి అనేక రంగాలు కలిసి ఉంటాయి. ​సముద్ర గర్భంలో కేబుల్ నెట్‌వర్క్ ​ఈ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలతో కనెక్ట్ అయ్యేలా సముద్రం కింద భారీ కేబుల్స్ వేయనున్నారు. దీని ద్వారా విశాఖ అంతర్జాతీయ కనెక్టివిటీకి ఒక కీలకమైన ‘సబ్‌సీ గేట్‌వే’గా మారుతుంది. ​విద్యుత్ సవాలు, గ్రీన్ సొల్యూషన్ ​ఈ డేటా సెంటర్ సామర్థ్యం 1 గిగా వాట్ కాగా, దీని పూర్తిస్థాయి వినియోగం ఏకంగా 6 గిగా వాట్స్ వరకు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం వైజాగ్ నగరం మొత్తం విద్యుత్ వాడకం కేవలం 1-2 గిగా వాట్స్ మాత్రమే కాగా, ఒక్క సెంటర్ ఇంత విద్యుత్తును వాడుకోవడం పర్యావరణంపై లోడ్ పెంచుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ​ఈ సవాలును దృష్టిలో ఉంచుకుని, గూగుల్ సంస్థ పునరుత్పాదక శక్తి (Renewable Energy) పై ఏకంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో 1 గిగా వాట్ విద్యుత్ ఉత్పత్తిని సెంటర్ లోపలే చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన విద్యుత్ అవసరాల కోసం కొత్త పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు అనివార్యం కావచ్చు. ​వైజాగ్ భవిష్యత్తు ​ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, స్థానిక ఆర్థిక వ్యవస్థ మరియు టెక్నాలజీ రంగంలో పెను మార్పులకు దారితీస్తుంది. వైజాగ్ త్వరలో భారతదేశంలోనే అగ్రగామి AI మరియు క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా ఎదగడం ఖాయమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యాంశాలు: ​పెట్టుబడి: సుమారు ₹ 1.3 లక్షల కోట్ల (సుమారు $15 బిలియన్) పెట్టుబడితో భారత్‌లో గూగుల్ అతిపెద్ద పెట్టుబడి. ​ఉద్యోగాలు: ప్రత్యక్షంగా 5,000–6,000 ఉద్యోగాలు, పరోక్షంగా లక్షకు పైగా (కొన్ని అంచనాల ప్రకారం 1.8 లక్షలకు పైగా) ఉద్యోగాలు. ​విద్యుత్ వినియోగం: 1 గిగా వాట్ సామర్థ్యం, అయితే మొత్తం వినియోగం 6 గిగా వాట్ల వరకు అంచనా. ​ప్రత్యేకత: అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేసే అతిపెద్ద AI డేటా సెంటర్ ఇదే. ​పర్యావరణం: పునరుత్పాదక ఇంధనంపై $2 బిలియన్లు ఖర్చు, 1 గిగా వాట్ విద్యుత్ ఉత్పత్తి సెంటర్ లోపలే లక్ష్యం.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.