Wednesday, 29 April 2026

Blog

తూర్పు గోదావరి

బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటే, మీ ప్రభుత్వం ఉంది మరి నిరూపించాలి కదా.

రాజమహేంద్రవరం : ఆధారాల్లేని ఆరోపణలతో బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటేనని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఎన్నికల ముందు కూడా 25శాతం కమీషన్ తీసుకున్నట్లు, ముడుపులు తీసుకున్నట్లు బురదజల్లుతూ కరపత్రాలు వేశారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించడం లేదని ఆయన ప్రశించారు బుధవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పేపర్ మిల్లు వ్యవహారంలో కూడా తనకేదో సూటుకేసులు అందించారని అనడం శోచనీయమన్నారు. దమ్ముంటే అధరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఐదేళ్ల క్రితం ఆయన రూ 9వేలు వేతనం పెంచి అగ్రిమెంట్ చేసారని, మరి ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికి రూ 5800 అగ్రిమెంట్ చేసారని భరత్ వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి అయినా ఎక్కువ అగ్రిమెంట్ చేయాలి కదా అని ఆయన నిలదీసారు. ఎవరు మగాడని ఆయన అన్నారు. తొమ్మిదివేలకు అదనంగా ఒక్కరూపాయి అయినా ఒప్పందం చేస్తే శభాష్ అంటారు కదా, మరి 5800చేసి ఏవేవో కబుర్లు చెప్తే ఎలా అని భరత్ నిలదీశారు. అలాగే గతంలో మా హయాంలో మేనేజ్ మెంట్ ని ఒప్పించి రూ 6500చేస్తామంటే ఎందుకు అడ్డుకున్నారని భరత్ అడిగారు. ఆరునెలల్లో ఈ ప్రభుత్వం పోతుంది నేను వస్తే రూ10వేలు, 10,500, 12వేలు చేస్తామని నోటికొచ్చినట్లు చెప్పిన ఈవీఎం ఎమ్మెల్యే ఇప్పుడు రూ 5800 పెంచడమేంటి అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కార్మికులు వెనక్కి తగ్గి ఇంకా ఎక్కువ వేతనం వస్తుందని భావించారని ఆయన గుర్తుచేసారు. ఇక ఆదిరెడ్డి అప్పారావు కూడా ఏదేదో మాట్లాడి, 50శాతం డిస్కౌంట్ అన్నారని, మరి ఇపుడు చేసిన అగ్రిమెంట్ ద్వారా మేనేజ్మెంట్ కి కోట్ల రూపాయలు మిగిల్చి సూటుకేసులు పట్టుకెళ్లినట్టు కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేశానని తనపై అభాండాలు వేస్తున్నారని, నిజానికి రూ 6500అగ్రిమెంట్ చేస్తానంటే, అడ్డుకుని, అంతకంటే తక్కువకు అగ్రిమెంట్ చేయడం మోసం కాదా అని భరత్ నిలదీసారు. నేను ఆస్తులు ఏమీ కొనలేదని, ఉన్నవి అమ్ముకున్నాని భరత్ అన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయడానికి నాకు, ప్రభుత్వానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటని భరత్ ప్రశ్నించారు. అది మేనేజ్మెంట్ పని అన్నారు. మరి మేనేజ్మెంట్ సూటుకేసులు వచ్చి నాకు ఇచ్చారా అన్నారు. అలాగే పరంపర మిల్లు యాజమాన్యం చేస్తే నాకు సంబంధం ఏమిటన్నారు. పరంపర వన్, పరంపర 2, కొర్ , నాన్ కోరు, టెంపరరీ పోస్టుల పర్మినెంట్ వంటివన్నీ కల్పి 324పోస్టులు 2014నుంచి 2024దాకా జరిగాయని, 2023దాకా ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ లీడర్ గానే తెలుగుదేశంలో ఉన్నాడని అయన గుర్తుచేసారు.2023వరకు 324పోస్టుల్లో 270పోస్టులు ప్రవీణ్ చౌదరి టీడీపీలో ఉండగానే జరిగాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అని భరత్ నిలదీశారు. అప్పుడు వాషింగ్ మెషిన్ లో కడిగి ఉన్నాడా అన్నారు. ప్రవీణ్ చౌదరి కి కొమ్ముకాయాల్సిన అవసరం నాకులేదన్నారు. టీఎన్టీయూసీ నుంచి 300,400మంది కార్మికులు వచ్చి కలిస్తే , కార్మికుల బలం వైసిపికి చేరుతుందని పార్టీలోకి తీసుకున్నానని ఆయన స్పష్టంచేసారు. అంతేకాని నేను సూటు కేసులు తీసుకున్నానని, నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడ్డం శోచనీయం. ఇలా మాట్లాడేముందు ఆధారాలు చూపించాలని భరత్ సవాల్ చేసారు. ఆచితూచి మాట్లాడ్డం నేర్చుకోవాలని అన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని భరత్ ఆరోపించారు. సుబ్రహ్మణ్య మైదానంలో నిద్రపోతున్న వృద్ధునిపై దాడిచేసి బ్లేడ్లతో చెక్కేసారని ఆయన అన్నారు. ఇంతదారుణంగా రాజమండ్రిలో వ్యవస్థ పాడుచేసారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో రాజమండ్రి ఎలా తయారుచేసాను, ఇప్పుడు ఎలా తయారవుతోంది అని ఆయన ప్రశ్నించారు. ఒక పక్క చెత్త శుభ్రం చేయరని, ఎక్కడ బడితే చెత్త కనిపిస్తోందని, వీధి దీపాలు వెలగవని, కళావిహీనంగా తయారుచేశారని భరత్ విమర్శించారు.

తూర్పు గోదావరి

రూ.10 లక్షల వ్యయంతో 43వ వార్డులో ఆయేషా మసీదు షెడ్డుకు శంకుస్థాపన.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమహేద్రవరం : ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని,మాట నిలుపుకోవడానికి నిరంతరం కృషి చేస్తుంటామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. తమను కుటుంబ సభ్యులుగా భావించి ఎన్నికల్లో తమ ఘన విజయానికి కారకులైనవారందరికి తాము సహయ సహకారాలు అందించగలమని ఆయన హామీ ఇచ్చారు. రూ.10 లక్షల వ్యయంతో 43వ వార్డులోని ఆయేషా మసీదుకు అవసరమైన షెడ్డు నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమయంలో తొలుత ఈ మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చి మిగతా వాటిని సందర్శించడం తమకు సెంటిమెంటు అని చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో తన సతీమణి ఇదిరెడ్డి భవానీ పోటీ చేస్తున్న సమయంలో ఈ మసీదు పెద్దలు తమను కుటుంబ సభ్యులుగా ఎంతో ఆదరించి భవాని ఘన విజయానికి తమవంతు కృషి చేశారని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు తప్ప తప్ప వారికి అవసరమైన షెడ్డు కోసం అడగలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తాము ఇచ్చిన మాకు కట్టబడి ఉంటామని వారెవరూ అడగక పోయినా తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, 45 రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 43 వ వార్డు కంటిపూడి శ్రీనివాస్ అమ్మవారి గుడి అభివృద్ధి గురించి అడిగారని ముందు ఇచ్చిన మాట ప్రకారం మసీదు షెడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. రాజేంద్రనగర్ మసీదుకు పొజిషన సర్టిఫికెట్ గురించి కృషి చేశామని తమ భవాని చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.లక్ష ఇచ్చామని తన మిత్రులు చెరో రూ.50 వేలు ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తమను ఆదరించి గెలిపిస్తున్న ప్రజలకు. ప్రభుత్వ పరంగాను,తమ భవానీ చారిటబుల్ ట్రస్టు ద్వారాను ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, వి శంకర్, ముస్లిం మైనారిటీ నాయకులు చాన్ బాషా, ఎస్ కె బషీర్, అస్లాం, ఎండీ బాబా ఖాన్ (ఖాన్ భాయ్), అప్సరీ, రఫీ, ఎండీ షాజన్,అహ్మద్ ఉనిషా, మసీదు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

గాయపడిన గోవును కాపాడిన – హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి.

రాజమహేంద్రవరం : మానవత్వం మాత్రమే కాదు సమితి ముఖ్య ఉద్దేశ్యం పూర్తి చేసాము. కర్తవ్య నిర్వహణలో ‘ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి’ సైనికులు సాయికృష్ణ, మీనాక్షి రెడ్డి. వివరాల్లోకి వెళితే స్థానిక రాజమహేంద్రవరం క్వారీ రోడ్ నుండి లాలాచెర్వు వెళ్లే దారిలో వున్న చిన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఒక గోవు గాయాలతో కొట్టుమిట్టడుతున్నట్టు సమాచారం సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రవికుమార్ కు తెలియడంతో కార్యాచరణ మొదలుపెట్టారు. గోవుల పరిరక్షణ కు ముందుండే సమితి సభ్యులు హుటాహుటిన అక్కడకు బయలుదేరి వెళ్లారు. గోవు పరిస్థితిని చూసి విజయవాడ కు చెందిన పశు సంరక్షణ శాఖకు సమాచారం అందించడం తో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి రాజమహేంద్రవరం శాఖకు సమాచారం అందించడంతో వెంటనే అంబులెన్సుతో సంఘటన స్థలానికి చేరుకొని లేగ దూడను పరీక్షించి తగిన చికిత్స చెయడం తో పాటు గోవును ఆసుపత్రి కీ తరలించి సెలైన్ ఎక్కించి మరింత మెరుగైన చికిత్స అందించి గాయలకు కట్లు కట్టి తిరిగి తల్లి ఆవు దగ్గర విడిచి పెట్టారు. ప్రస్తుతానికి దూడ పరిస్థితి మెరుగ్గా వుంది. దూడను ఆసుపత్రి కీ తరలించే క్రమంలో అంబులెన్సు కు అడ్డుగా నిలబడి తల్లి ఆవు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తల్లి ప్రేమ ను చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యనికి అవధులు లేవు. ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించిన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి చెందిన ప్రతి సభ్యునికి స్థానికి ప్రజలు కృతజ్ఞతలు తెలియచేశారు. సమితి సభ్యులకు జిల్లా అధ్యక్షులు రవికుమార్ ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన నేత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గూగుల్ రాకతో రాష్ట్రం స్వర్ణతో ముఖాభివృద్ధి చెందుతుందని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి తీసుకువస్తూ అభివృద్ధి వికేంద్రీకరణను చేతల్లో చూపిస్తున్న సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.విశాఖపట్నం కేంద్రంగా 1.33 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్‌ సంస్థ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుండటంపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్‌ కి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సాంకేతిక రంగంలో వినూత్న మార్పులు చోటు చేసుకుంటాయని, సాంకేతికంగా దేశంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలుస్తుందన్నారు. ప్రపంచం మొత్తం నేడు సిటీ ఆఫ్ డెస్టినీ గా విశాఖ వైపు చూసేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ చొరవ చూపారన్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద, దేశంలోనే తొలి ఏఐ హబ్‌ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతోందన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్య రంగాలు మెరుగుపడతాయన్నారు. ఈ డేటా సెంటర్‌ అంతర్జాతీయ నెట్వర్కు కనెక్ట్ చేసి, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని డిజిటల్ ఆధారిత వ్యవస్థలకు గూగుల్ అనుసంధానం చేయనుంది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విశాఖపట్నం కనెక్టివిటీ కేంద్రంగా మారనుందన్నారు. యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో మంత్రి శ్రీ నారా లోకేష్ 12 నెలల పాటు శ్రమించి నేషనల్ పాలసీల్లో కూడా మార్పులు చేయించి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేయడం ఆయనకే సాధ్యమైంది అన్నారు, దేశంలోనే 15 మిలియన్ డాలర్ల ఎఫ్ డి ఐ ను సాధించడం ఇదే ప్రథమం అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్ క్లౌడ్ సమస్త విశాఖలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. దేశం మొత్తం గర్వించే సమస్త రాష్ట్రానికి వస్తే దేశవ్యాప్తంగా అందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వైసీపీ నేతలు స్వాగతించకుండా గూగుల్ ప్లైవుడ్ సంస్థకు భూములు ఇవ్వకుండా అడ్డుపడి ఆ సమస్త పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

16:10:2025 న అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఎంపిడివో తెలిపారు

ఉదయగిరి లో గురువారం ఉదయం జీ ఎస్ టీ తగ్గింపు పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తామని ఎంపిడివో బీ శ్రీనివాసులు తెలిపారు స్తానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు మండలంలోని అన్నీ శాఖల అధికారులు తపన్ని సరిగా పాల్గొనాలని కోరారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏపీ సురక్ష యాప్ ను ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని ఉదయగిరి ఎక్సైజ్ సీఐ తెలిపారు

ఏపీ సురక్ష యాప్ ను ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని ఉదయగిరి ఎక్సైజ్ సీఐ ప్రోహి బిసిన్ సీఐ టీ, లక్ష్మణస్వామి కోరారు తన కార్యాలయం లో బుధవారం నాలుగు మండలాల మద్యం లైసెన్స్ దారులతో సమావేశం నిర్వహించారు సీఐ మాట్లాడుతూ స్కాన్ చేసిన తర్వాత మధ్యం విక్రయించాలని సూచించారు వినియోగదారులు సైతం సదరు యాప్ లో మధ్యం నకిలీదా, కాదా అని తెలుసుకోవచ్చన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

యుఏఈ టెలికమ్యూనికేషన్ రంగంలో చరిత్ర సృష్టించింది!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యుఏఈ) ప్రపంచ సాంకేతిక రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. దేశం తన తొలి 6G నెట్‌వర్క్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, 145 గిగాబిట్‌ పర్‌ సెకండ్‌ (Gbps) గరిష్ట వేగాన్ని సాధించింది. ఇది ప్రస్తుత 5G కంటే సుమారు 50 రెట్లు వేగంగా ఉండి, భవిష్యత్‌ కనెక్టివిటీకి విప్లవాత్మక మార్పు తీసుకురానుంది. ఈ పరీక్షతో యుఏఈ ప్రపంచవ్యాప్తంగా 6G టెక్నాలజీలో ముందంజలో నిలిచింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌, స్మార్ట్‌ సిటీల అభివృద్ధి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మరియు అంతరిక్ష కమ్యూనికేషన్‌ రంగాల్లో ఈ వేగం నూతన దశను ప్రారంభించనుంది.

విశాఖపట్నం

ఏపీలో మరో హైటెక్ సిటీ ఖాయం

ఏపీలో మరో హైటెక్ సిటీ ఖాయం -విశాఖకు క్యూ కడుతున్న ఐటీ దిగ్గజాలు – రూ. 6.5 లక్షల కోట్ల పెట్టుబడుల వరద! పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ; ​సాగర తీరం ఇప్పుడు సరికొత్త చరిత్రకు వేదికవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మరో హైటెక్ సిటీ ఆవిర్భవించడం ఖాయమనిపిస్తోంది. విశాఖపట్నం (వైజాగ్) ఇప్పుడు కేవలం పర్యాటక కేంద్రంగానే కాక, పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఐటీ, స్టీల్, ఎనర్జీ రంగాల్లో భారీగా వస్తున్న పెట్టుబడులు ఈ నగరాన్ని భవిష్యత్తులో దేశానికే తలమానికంగా నిలిపే దిశగా అడుగులు వేయిస్తున్నాయి. ​ఐటీ దిగ్గజాల దృష్టి విశాఖపైనే! ​విశాఖపట్నం ఇప్పుడు ఐటీ మరియు డేటా సెంటర్ల హబ్‌గా మారనుంది. గూగుల్ (Google), టీసీఎస్ (TCS), కాగ్నిజెంట్ (Cognizant), యాక్సెంచర్ (Accenture) వంటి ఐటీ దిగ్గజాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి. ​గూగుల్ (Google) ఏకంగా రూ. 88,000 కోట్ల పెట్టుబడితో ముందుకు రావడం, ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం విశాఖ ప్రతిష్టను అమాంతం పెంచింది. ఇది విశాఖను దేశానికి తలమానికంగా నిలిచే ఏఐ (AI) హబ్గా మార్చనుంది. ​టీసీఎస్ రూ. 1370 కోట్లు, కాగ్నిజెంట్ రూ. 1583 కోట్లు, యాక్సెంచర్ రూ. 1200 కోట్లు, పీపుల్ ఉర్సా రూ. 5278 కోట్లు వంటి భారీ పెట్టుబడులతో అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఇప్పటికే ఇక్కడ అడుగుపెట్టాయి. ​రియల్ ఎస్టేట్ రంగంలోనూ సత్వ డెవలపర్స్ (రూ. 1500 కోట్లు) వంటి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ​ఈ ఐటీ కంపెనీలన్నీ కొలువుదీరితే, భవిష్యత్తులో విశాఖలో మరో హైటెక్ సిటీ రూపుదిద్దుకోవడం ఖాయం అనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ​కేవలం ఐటీ మాత్రమే కాదు… ​విశాఖపట్నం బహుళ రంగాల్లో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతోంది. ఐటీతో పాటు స్టీల్ మరియు ఎనర్జీ రంగాల్లో కూడా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ​స్టీల్ హబ్‌గా: ప్రభుత్వ విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు, ప్రపంచ దిగ్గజ సంస్థ అర్సెలార్‌మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ (ArcelorMittal Nippon Steel India) రాజయ్యపేట ప్రాంతంలో స్టీల్ ప్లాంట్, క్యాప్టివ్ పోర్టుల నిర్మాణం కోసం రూ. 1.47 లక్షల కోట్ల భారీ పెట్టుబడి పెట్టనుంది. ​ఎనర్జీ హబ్‌గా: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టిన ఎన్టీపీసీ (NTPC), పూడిమడక ప్రాంతంలో రూ. 1.85 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది. ​16 నెలల్లో రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు! ​కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత దాదాపు 16 నెలల కాలంలో కేవలం విశాఖపట్నం పరిధిలోనే ఏకంగా రూ. 6.50 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ​ఈ భారీ పెట్టుబడులతో పాటు, రాంబిల్లిలో న్యూక్లియర్‌ సబ్‌మెరైన్‌ బేస్, భోగాపురం విమానాశ్రయం, మూలపేట పోర్టు, జీఎంఆర్‌ యూనివర్సిటీ వంటి కీలక ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. మాస్టర్‌ప్లాన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, కోస్టల్‌ కారిడార్, రైల్వే జోన్, మెట్రో వంటి రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేయడం విశాఖ భవిష్యత్తుకు మరింత భరోసానిస్తోంది. ​విశాఖకే ఎందుకు మొగ్గు? ​ఇతర నగరాలతో పోలిస్తే విశాఖకు పలు అనుకూలతలు ఉన్నాయి: ​భూమి, వనరుల లభ్యత: ఐటీ కంపెనీలకు చాలా తక్కువ ధరకే భూములు దొరకడం, విద్యుత్, నీరు వంటి వనరుల సరఫరా మెరుగ్గా ఉండటం. ​పునరుత్పాదక శక్తి (Renewable Energy): రాష్ట్రంలో రెన్యువబుల్‌ ఎనర్జీకి విస్తృత అవకాశాలు ఉండటం వల్ల, కంపెనీలు సొంతంగా సౌర/పవన విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుని డేటా సెంటర్లకు సరఫరా చేసుకోవచ్చు. ​డేటా సెంటర్ల అనుకూలత: డేటా సెంటర్లకు అవసరమైన హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ను సముద్ర మార్గంలో (సింగపూర్, అమెరికా వంటి దేశాల నుంచి) విశాఖకు తీసుకురావడం సాధ్యమవుతుంది. ​మానవ వనరులు: ఐటీ రంగానికి ఉపయోగపడే నైపుణ్యం కలిగిన మానవవనరులు సమృద్ధిగా ఉండటం. ​ఈ అంశాలన్నీ కలగలిసి విశాఖను పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి. ప్రపంచ స్థాయి ఐటీ మరియు పారిశ్రామిక కేంద్రంగా మారబోతున్న విశాఖపట్నం భవిష్యత్తులో దేశ పటంలో మరో ‘హైటెక్ సిటీ’గా ఖచ్చితంగా నిలబడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎమ్మెల్యే గిడ్డి కి కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేత

పి.గన్నవరం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : గ్రామ పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణని బుధవారం కలిసి పంచాయతీలో పనిచేయుచున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు‌. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామపంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు గుంట్రు చిన సత్యనారాయణ, కోలా నాగప్రసాద్, పెద్దిరాజు వేణులరావు, మామిడిశెట్టి శ్రీనివాసరావు, పితాని రాంబాబు, కుసుమే గిరీష్ కుమార్ మరియు పంచాయతీ కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : ఒక రైతు వద్ద 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్… అయితే కార్యాలయం లో 5 లక్షల 8 దొరకడం తో ఖంగు తిన్న ఏసీబీ అధికారులు. అమలాపురం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లక్ష లంచం డిమాండ్ చేసిన తహసీల్ధార్ అశోక్ ప్రసాద్.50వేల రూపాయలకు సెటిల్ చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము.రాము ద్వారా తహసీల్ధార్ అశోక్ ప్రసాద్ 50వేల నగదు తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు. దీంతో పాటు తహసీల్ధారు టేబుల్‌లో అనధికారికంగా ఉన్న రూ.5,84,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.మొత్తం రూ.6,34,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.ఎసిబి దాడులలో పాల్గొన్న డిఎస్పీ ఎం. కిషోర్ కుమార్, సిఐలు వై.సతీష్, ఎన్.వి.బాస్కరరావులు. తహసీల్దార్ అశోక్ ను రాజమండ్రి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఆయనను ఏసీబీ కోర్టు లో హాజరు పరుస్తారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.