Wednesday, 29 April 2026

Blog

Blog

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను చారిత్రాత్మక విజయంగా నిలుపుతాం – నంద్యాలలో రాష్ట్ర మంత్రుల బృందం సమీక్ష

నంద్యాల రాయలసీమ అభివృద్ధికి కేంద్ర బిందువైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్టోబర్ 16వ తేదీన జరగనున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రుల ఉన్నత స్థాయి బృందం ఈరోజు నంద్యాలకు చేరుకుంది. ఈ చారిత్రాత్మక పర్యటనను విజయవంతం చేసే కార్యాచరణపై చర్చించేందుకు నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల బృందం పార్టీ ముఖ్య నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో గౌరవనీయ మంత్రులు న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ, విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే రాధాకృష్ణ, శాప్ చైర్మన్ రవి నాయుడు, నంద్యాల నియోజకవర్గ పరిశీలకులు ఆలం నర్సం నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు సంయుక్తంగా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ముఖ్యంగా రాయలసీమ ప్రగతికి పెద్దపీట వేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన ప్రాంతానికి రావడం అత్యంత సంతోషదాయకమని . ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ పర్యటన మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది” అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లా నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చే ప్రజలు, అభిమానులు, మరియు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు . పోలీసు, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించామన్నారు . ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలనే దానిపై మంత్రులు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుండి ప్రజలను చైతన్యవంతం చేసి, సభకు తరలించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ సభ కాదని, వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఒక నూతన అధ్యాయం కానుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి పర్యటన ద్వారా ఈ ప్రాంతానికి నూతన పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయలసీమ ప్రజల తరఫున అపూర్వమైన, చారిత్రాత్మక స్వాగతం పలకడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రుల బృందం స్పష్టం చేసింది.ఈ కార్యక్రమంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శులు రామచంద్రరావు , ఏవీఆర్ ప్రసాద్ , కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్ , శ్రీదేవి , జైనాబి , గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి , నంద్యాల మండల కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , మాజీ కౌన్సిలర్లు శివశంకర్ యాదవ్ , కొండారెడ్డి , కృపాకర్ , 14వ వార్డు ఖలీల్ , దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ దస్తగిరి , ఉప్పరి సురేష్ కుమార్ , గాలి చంద్రశేఖర్ , కామిని మల్లికార్జున , చిన్నంశెట్టి శ్రీనివాసులు , నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న , నంద్యాల మండలం ,గోస్పాడు మండలం ఎంపీడీవోలు మరియు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్రంలో త్వరలో 190 కొత్త 108 అంబులెన్స్‌లు – గోల్డెన్ అవర్‌లో వైద్యం అందేలా కీలక నిర్ణయం

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, పాము కాట్లు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణరక్షణ కోసం ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు, రాష్ట్రంలో త్వరలోనే 190 కొత్త 108 అంబులెన్స్‌లు ప్రారంభించబోతున్నామని. ప్రస్తుతం ఉన్న అంబులెన్స్‌లలో చాలా పాతవి తరచుగా రిపేర్ అవుతున్నందున వాటిని తొలగించి, ఆధునిక సదుపాయాలతో కొత్త వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త వాహనాల్లో 56 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ మరియు 136 బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు ఉంటాయి. వీటి ద్వారా రోగులు, ప్రమాద బాధితులు గోల్డెన్ అవర్‌లోపే ఆస్పత్రులకు చేరేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 650 అంబులెన్స్‌లు పనిచేస్తున్నాయని, కొత్త వాహనాలతో కలిపి మొత్తం సంఖ్య 731కు చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక పాత అంబులెన్స్‌లు డొక్కు, తుక్కుగా మారాయని విమర్శించిన సత్యకుమార్, కొత్త వాహనాలు నేషనల్ అంబులెన్స్ కోడ్ (NAC) ప్రకారం తెలుపు-ఎరుపు రంగుల్లో ఉంటాయని చెప్పారు. ఇకపై అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. దీనివల్ల ప్రమాద బాధితుల ప్రాణరక్షణ శాతం పెరుగుతుందని ప్రభుత్వం నమ్మకం వ్యక్తం చేసింది.

E-పేపర్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన :- ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, ఎన్ఎండి ఫిరోజ్

నంద్యాల: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు (అక్టోబరు 16, గురువారం) ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలోని రాగ మయూరి వెంచర్ లో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నంద్యాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జి లు , వార్డు ఇంచార్జి లు మరియు ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల టిడిపి రాష్ట్ర పరిశీలకులు ఆలం నర్సం నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న ఈ సభకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా, నంద్యాల నియోజకవర్గం నుండి సభకు తరలివెళ్లే ఏర్పాట్ల గురించి, ఇతర అంశాల గురించి క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్ లకు వారు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన స్టిక్కర్లను విడుదల చేశారు ఈ సమావేశంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, కౌన్సిలర్లు కండే శ్యాం సుందర్ లాల్, శ్రీదేవి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ , పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయ గౌరీ, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్‌షాపులు, విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. చికెన్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టేందుకు కొత్త లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.l రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ, చికెన్ వ్యాపారంలో పారదర్శకతను పెంచడానికి ఈ లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ప్రతి చికెన్ దుకాణానికి లైసెన్స్ తప్పనిసరి అవుతుంది. ఈ లైసెన్స్ ద్వారా కోళ్ల సప్లై చైన్‌ను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. పౌల్ట్రీ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, షాపుల యజమానులు ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను ట్రాక్ చేసేలా పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు తీర్మానించింది. ఈ సమాచారం అంతా నమోదు చేస్తారు. ఈ మేరకు విజయవాడలో పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. డైరెక్టర్లు ప్రవీణ, అజ్ముద్దీన్, పశు సంవర్ధక శాఖ సంచాలకులు టి.దామోదర్‌నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.ఈ కొత్త విధానం చికెన్ వ్యాపారంలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా, రాష్ట్ర ప్రభుత్వం మాంసం దుకాణాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించింది. మున్సిపాలిటీల్లో మాంసం దుకాణాలపై ఆకస్మిక దాడులు చేసి, అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది. హోటల్స్, రెస్టారంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేసేలా ప్రోత్సహించడంతో పాటు, స్టెరాయిడ్లు వాడిన కోళ్ల అమ్మకాలను పూర్తిగా నియంత్రించనుంది. చికెన్ షాపుల్లో వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టి, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా వ్యర్థాలను సేకరించి, సురక్షితంగా పారవేయాలని ఆదేశించింది. అక్రమ కబేళాలపై దాడులు నిర్వహించి, కేరళ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాలకు గోవులను అక్రమంగా తరలించకుండా కఠిన చర్యలు తీసుకోనుంది. పీ-4 విధానంలో మాంసాభివృద్ధి సంస్థ ద్వారా మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఒక్కో మోడల్ దుకాణం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పశువుల సంతలను కూడా పర్యవేక్షించి, అక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోనుంది. ఈ చర్యల ద్వారా ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందుబాటులోకి తెచ్చి.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాణ్యతలేని చికెన్, మటన్ కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.. ఈ క్రమంలోనే రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ రంగంలోకి దిగింది. ప్రజలకు నాణ్యమైన మాంసం అందించే దిశగా అడుగులు వేస్తోంది.. అందుకే ఈ కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

Blog

గ్రామ పంచాయతీ కార్యదర్శుల రీ–కేటగిరైజేషన్‌పై హర్షం వ్యక్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప

గ్రామ పంచాయతీ కార్యదర్శుల రీ–కేటగిరైజేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఆమోదం తెలిపిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా సంఘ అధ్యక్షుడు యశ్వంత్‌ కుమార్‌ బాయికాటి మాట్లాడుతూ.. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు మిస్సైల్ మాన్‌ డాక్టర్‌ ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రీ–కేటగిరైజేషన్‌ ఫైల్‌ కేబినెట్‌ ఆమోదం పొందడం ఎంతో సంతోషకర పరిణామమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ కార్యదర్శి” అనే పదవిపేరు “పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)”గా మార్చగా, ఇప్పటి వరకు ఉన్న ఐదు గ్రేడ్లను స్పెషల్‌ గ్రేడ్‌, 1, 2, 3 గ్రేడ్లుగా పునర్విభజించడం ద్వారా త్వరిత ప్రమోషన్‌ అవకాశాలు లభించనున్నాయని వివరించారు. దీని వల్ల సంవత్సరాలుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు ఇది ఎంతో ఆనందదాయకమని అన్నారు.ఈ సంస్కరణల్లో భాగంగా గ్రామ పంచాయతీలలో అదనపు సిబ్బంది నియామకానికి అవకాశం కల్పించడం, అలాగే మినిస్టీరియల్‌ స్టాఫ్‌ ప్రమోషన్‌ ఛానల్‌లో పంచాయతీ కార్యదర్శులను కూడా చేర్చడం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమని అన్నారు.ఈ నిర్ణయాల అమల్లో పాత్ర వహించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పంచాయతీ రాజ్‌ కమిషనర్‌, ఓఎస్‌డీ వెంకటకృష్ణకు సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌ కుమార్‌ బాయికాటి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు వేదవతి, రాజశేఖర్‌, పరమేష్‌, భాస్కర్‌, షాహినూర్‌, ఆరిఫ్‌, రంగడు శంకర్‌ నాయక్‌, రాజ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా లో భారీ వర్షాలు – హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా మొత్తం ఉల్లాస వాతావరణం నెలకొంది. ఎండలతో వాడిపోయిన పంట పొలాలకు, పొంగిపొర్లుతున్న చెరువులకు వర్షాలు చల్లని ఊరటనిచ్చాయి. వర్షం కారణంగా గాలి చల్లబడడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి, డ్రైనేజ్ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది కూడా వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన లోపాలను సరిచేసేందుకు కృషి చేస్తున్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, వచ్చే రెండు రోజుల్లోనూ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అధికారులు ప్రజలకు సూచన చేస్తూ, వర్షం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని సూచించారు. నెల్లూరు ప్రజలు ఈ వర్షాలను దేవుడి ఆశీర్వాదంగా భావిస్తూ, రైతు సీజన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అరట్టై (Arattai) అప్లికేషన్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు:

1.’పాకెట్’ ఫీచర్: ఇది యాప్‌లోనే ఉండే మీ వ్యక్తిగత క్లౌడ్ స్టోరేజ్ లాంటిది. ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్లు లేదా నోట్సులను చాట్ లాగ్‌లో కాకుండా ప్రత్యేకంగా ‘పాకెట్’ విభాగంలో సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఇలాంటి వాటి కోసం చాలామంది తమకే తాము మెసేజ్ చేసుకునే గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు, కానీ అరట్టైలో దీనికి ప్రత్యేక ఫీచర్ ఉంది. 2. నేను చేరే వరకు’ లొకేషన్ షేరింగ్: మీరు మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేస్తున్నప్పుడు, గమ్యాన్ని సెట్ చేయవచ్చు. మీరు ఆ గమ్యాన్ని చేరుకోగానే లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది వాట్సాప్‌లో ఉన్నట్లుగా కేవలం సమయ పరిమితి కాకుండా, మరింత సౌకర్యవంతమైన ఫీచర్. 3.ప్రత్యేకమైన ‘మీటింగ్స్’ విభాగం: అరట్టై కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా మీటింగ్‌ల కోసం కూడా ఒక విభాగం (Dedicated Section) కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు యాప్‌లోనే ఆన్‌లైన్ మీటింగ్‌లను సృష్టించవచ్చు, జాయిన్ కావచ్చు లేదా షెడ్యూల్ చేయవచ్చు. దీనికి అదనంగా Google Meet లేదా Zoom లాంటి ప్లాట్‌ఫారమ్‌లు అవసరం లేదు. 4.టెక్స్ట్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం: వాట్సాప్‌కు భిన్నంగా, అరట్టైలో వాయిస్ మరియు వీడియో కాల్స్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ, టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రం ఇంకా పూర్తిస్థాయి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేదు. మెసేజ్‌లు భారతదేశంలోని డేటా సెంటర్లలో నిల్వ చేయబడతాయి మరియు నిల్వలో అవి ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. 5. వాట్సాప్‌లో లేని యూజర్‌నేమ్ ఫీచర్: మీ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను పంచుకోకుండానే, కేవలం యూజర్‌నేమ్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తులతో చాట్ చేయడానికి అరట్టై అనుమతిస్తుంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. 6.జోహో అనుభవం: అరట్టైని చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఎంటర్‌ప్రైజ్‌ల కోసం కమ్యూనికేషన్ మరియు సహకార సాఫ్ట్‌వేర్‌లను రూపొందించడంలో జోహోకు ఉన్న సుదీర్ఘ అనుభవం అరట్టై నిర్మాణానికి పునాదిగా ఉంది.

సినిమా

బాల సరస్వతి మృతి: సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి (పువ్వాడ నాగేంద్ర కుమార్) తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి గారు మృతి చెందారు. ఈమె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సినిమా

బాల సరస్వతి మృతి: సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి (పువ్వాడ నాగేంద్ర కుమార్) తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి గారు మృతి చెందారు. ఈమె మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కల్తీ మద్యం నియంత్రణకు ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధనలు

మద్యం విక్రయం ముందు క్యూఆర్ కోడ్ స్కానింగ్ తప్పనిసరి ప్రతి బాటిల్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాతే విక్రయం జరగాలి కస్టమర్లకు సురక్షితమైన మద్యం అందించేందుకు ఈ నియమం తప్పనిసరి ఎక్సైజ్ సురక్షా యాప్ వినియోగం తప్పనిసరి Excise Suraksha App ద్వారా సీసాపై ఉన్న కోడ్ స్కాన్ చేయాలి మద్యం నిజమైనదో కాదో యాప్ ద్వారా వెంటనే ధృవీకరించవచ్చు దుకాణాలు & బార్లలో ధృవీకరణ బోర్డులు తప్పనిసరి విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించాం అనే బోర్డులు ప్రతి చోట ప్రదర్శించాలి కస్టమర్లు విశ్వాసంతో కొనుగోలు చేసేలా చర్యలు డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు ప్రతి మద్యం షాపు, బార్లో ప్రతిరోజూ Liquor Verification Register నిర్వహించాలి మద్యం రకాలు, కోడ్‌లు, విక్రయాల వివరాలు రికార్డ్ చేయాలి ర్యాండమ్ ఎక్సైజ్ శాఖ తనిఖీలు ఎప్పుడైనా అనుకోకుండా ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నియమావళి ఉల్లంఘనకు తగిన చర్యలు నకిలీ మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు నకిలీ లేదా కల్తీ మద్యం గుర్తిస్తే షాపు లైసెన్స్ రద్దు చేయబడుతుంది సంబంధిత దుకాణంపై కఠిన చర్యలు తీసుకుంటారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.