Wednesday, 29 April 2026

Blog

కుమురం భీమ్ ఆసిఫాబాద్

గుంతల రోడ్డును సరిచేసిన గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు

ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన సేవా కార్యక్రమం ఇటీవల జరిగింది. గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్ వెళ్ళే రహదారి ఇటీవల వర్షాకాలంలో భారీ వర్షాల వలన గుంతలమయమై, రవాణాకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దానిని గమనించిన గ్రామ మాజీ సర్పంచ్ సెండే దత్తు గారు వెంటనే స్పందించారు.తన సొంత ఖర్చుతో రోడ్డుపై మొరం మట్టి వేయించి, గుంతలను నింపించి చదును చేయించారు. గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని సెండే దత్తు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుసుల్ల సత్తయ్య, తిరుసుల్ల భీమ్ రావు, ఆరెందుల సంతోష్, గ్రామస్థులు రాస్పెళ్లి సుభాష్, దాన్‌పెల్లి సంతోష్, ఆటో డ్రైవర్లు సాయికృష్ణ, దిలీప్, మోండయ్య, అంజయ్య, పవన్, మహేష్, వినోద్, జాబరి రాజు, పెరుగు రవి తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

కర్నూల్ కి ప్రధానమంత్రి రాకతో… దారి మళ్లింపు

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని చౌరస్తాలో ఉండవెల్లి ఎస్సై శేఖర్, సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ పోలీసులతో పాటు 20 మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తూ కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, నందికొట్కూరు వెళ్లే వాహనాలను అలంపూర్ చౌరస్తా మీదుగా బ్రాహ్మణ కొట్కూర్ వైపు మళ్ళించారు. అదే రూట్లో వచ్చే వాహనాలను కర్నూలు మీదగా వెళ్లకుండా అలంపూర్ మీదుగా హైదరాబాద్కు ఇదే దారిలో వాహనాలు వెళ్లేందుకు భారీగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్లన్నీ ఏపీ నుండి వచ్చే వాహనాలతో రద్దీగా ఉన్నది.

హైదరాబాద్

తెలంగాణ కేబినెట్ నుండి కొండా సురేఖ ఔట్…?

పున్నమి ప్రతి నిధి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నుండి దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ని తొలిగించడం దాదాపు ఖరారు అయింది. దీనిలో భాగంగా నే ఆమె శాఖ యొక్క ఫైల్స్ ని ప్రభుత్వం కి అప్పాజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నుండి ఆదేశాలు అందగ హన్మకొండ లో ని ఆమె ఇంటి దగ్గర బందోబస్త్ ని కూడా కుదించడం దీనికి బలాన్ని చేకూరుస్తుంది.సెటిల్ మెంట్లు,దందాలు విషయం లో సురేఖ కూతురు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మీద అయన అనుచరుడు రోహిన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహా దారుడు వేం నరేంద్ర రెడ్డి ల మీద సురేఖ కూతురు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభం

అక్టోబర్ 16, 2025 ఉదయం 8:00 గంటలకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాల ప్రజా కార్యక్రమం జరిగింది. మండల అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో నిర్వహించిన ఈ రచ్చబండలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొని, ప్రజలతో కలసి ప్రభుత్వ వైద్య విద్య హక్కును రక్షించాలన్న పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ – వైద్యం మరియు విద్య ప్రతి పౌరుడి మౌలిక హక్కులు కావాలని, వాటిని వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను ప్రజా శక్తితో అడ్డుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర-జిల్లా-నియోజకవర్గ అనుబంధ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, సమితి కార్యదర్శులు, గ్రామ శాఖ అధ్యక్షులు, తాజా మాజీ ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు మరియు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ వైద్య విద్య పరిరక్షణకు మద్దతు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికిన శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కర్నూల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలికిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు మల్లన్న సేవలో మోదీ

E-పేపర్

గన్నవరంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు.

ప్రమాదం జరిగితే ప్రాణం పోవాల్సిందే. గన్నవరం అక్టోబర్ 16 ( పున్నమి ప్రతినిధి సురేష్ ) గన్నవరం పరిధిలో గడిచిన వారం రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదల్లో సుమారు ఐదుగురు చనిపోగా కొంత మందికి గాయాలు పాలయ్యారు. ఎన్ హెచ్ – 16 జాతీయరహదారి గన్నవరం పట్టణం నుండి వెళ్లడం అధిక ట్రాఫిక్ దీనితో నిత్యం చిన్న చితక పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదల బారిన పడి ఏంతో మంది మృత్యువాత పడి వారి కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు లేకపోలేదు. కృష్ణాజిల్లా పరిధి బూడిమేరు కెనాల్ వద్ద మొదలవుతుంది. అక్కడ నుండి గన్నవరం విమానాశ్రయానికి సుమారు రెండు కిలోమీటర్లు దూరం ఉంటుంది. నిత్యం ఎయిర్ పోర్ట్ నుండి భారీ స్థాయిలో రాకపోకలు సాగుతున్నాయి. అక్కడ నుండి గన్నవరం ఇంకొక కిలోమీటర్. ఈ మూడు కిలోమీటర్లు పరిధిలో ప్రధాన యాక్సిడెంట్ పాయింట్స్ కేసరపల్లి బైపాస్ లోని సవారిగూడెం జంక్షన్, దుర్గాపురం అమ్మవారి టెంపుల్, హెచ్ సి ఎల్, చైతన్య పాయింట్, గన్నవరం బస్టాండు ఏరియాల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని పాయింట్లలో ట్రాఫిక్ సిబ్బంది ఉన్నప్పటికీ వారి నిర్లక్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది లేక ప్రమాదాలు దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చెపట్టకపోవడం. అదేమని అడిగితే సిబ్బంది కొరత ఈ నెల 1వ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ లో తెల్లవారితే దసరా కారణంగా అధిక ట్రాఫిక్ సాగింది. ఆ సమయంలో ఒక్కసారె మూడు లారీలు మూడు కార్లను డికొన్న సంఘటన కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్. పాయింట్లో ఉండాల్సిన ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రమాదం జరిగిన 20 నిముషాలకు ట్రాఫిక్ సిబ్బంది వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి. నిన్న దుర్గాపురం వద్ద ఒక ప్రమాదం నేడు గన్నవరం చైతన్య కటింగ్ వద్ద ఒక ప్రమాదం రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత అసలు డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎందుకు నిలక్ష్యం వ్యవహారిస్తునట్లు. అదేమంటే మాది పెద్ద వయస్సు ఎక్కువ సేపు నిలబడలేము ఇది కారణంగా చెప్పడం. ఇలా ఎంతమంది ప్రాణాలు బలైపోవాలి అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవంబర్ నుండి బయోమెట్రిక్ తప్పనిసరి! eKYC పూర్తి చేయని అధికారులపై చర్యలు తప్పవు

నవంబర్ నుండి ఉపాధి హామీ పనులకు బయోమెట్రిక్ తప్పనిసరి — eKYC పూర్తి చేయని అధికారులపై చర్యలు తప్పవు! రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నవంబర్ నెల నుంచి ఉపాధి హామీ పనుల్లో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం సంబంధిత పనివారందరూ eKYC ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని సూచించింది. బయోమెట్రిక్ హాజరు లేకుండా వేతనాల చెల్లింపులు జరగవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామ, మండల స్థాయి అధికారులు పర్యవేక్షణలో నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు, బోగస్ హాజరులు నివారించడమే ఈ నిర్ణయ లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఇకపై పనివారు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. సమయానికి eKYC పూర్తి చేయకపోతే ఆ కార్మికులకు వేతనాల జాప్యం లేదా నిలిపివేత అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు . Municipal water reservoir క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది

అందరికీ నమస్కారం ఈరోజు 16-102025 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు ఆదేశాల మేరకు . Municipal water reservoir క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది అందువలన Division No 2. కార్మిక నగర్ GLSR Division No 3 . నాగార్జున నగర్ ELSR Division No 4. వెటర్నరీ కాలనీ ELSR Division No 5 మైత్రి నగర్ GLSR . మైత్రి నగర్ కొండపైన గల O D A GLSR వీటి పరిధిలోని ప్రాంతములకు ఈరోజు సాయంత్రం మంచినీటి సరఫరా కి అంతరాయము కలుగునని తెలియపరచడం అయినది

ఖమ్మం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని జనాలు అడుగుతున్నారు

*జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని జనాలు అడుగుతున్నారు..!!!* ఓవైసీకి మీకు ఉన్న ఒప్పందం వల్లనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడం లేదా? *కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్* కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా లేదా ఇంకేదైనా పార్టీని గెలిపిస్తున్నారా? *ఉప ఎన్నికలో ఓడిపోతే అధిష్ఠానానికి మొహం ఎలా చూపెడతారు?* కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడిపోతే మీరు ఏం సమాధానం చెబుతారు *నన్ను టార్గెట్ చేసి పార్టీ నుండి గెంటేసినట్టే మీకు కూడా అదే గతి పడుతుంది* *

ఖమ్మం

కాంగ్రెస్ లో దుమారం…*

*కాంగ్రెస్ లో దుమారం…* *మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు* *మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత* *కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు* *సుమంత్ .. కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది* *నిన్న సుమంత్ ను బాధ్యతలనుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.