Wednesday, 29 April 2026

Blog

హనుమకొండ

కాంగ్రెస్ లో దుమారం *మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు*

మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ పోలీసులతో గొడవకు దిగిన కొండా సురేఖ కూతురు కొండ సుస్మిత కొండా సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ కోసం నిన్నటి నుండి గాలిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమంత్ .. కొండ సురేఖ ఇంట్లో తలదాచుకున్నట్టు సమాచారం ఉండటంతోనే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లినట్టు తెలుస్తుంది నిన్న సుమంత్ ను బాధ్యతలనుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం….

నిర్మల్

పోషకాహార ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి-ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అంగన్వాడీ పిల్లలను తమ బిడ్డలుగా చూసుకోవాలి-జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

నిర్మల్ అక్టోబర్ 16 (పున్నమి ప్రతినిధి) జిల్లాలో పోషణ మాసం ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. మాతా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.        ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు. ఇది ఒక్క నెల కార్యక్రమంగా కాకుండా, ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహారం అందుతోందని భరోసా కల్పించాలని అన్నారు. ప్రతి చిన్నారి అంగన్వాడీలో చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలను తమ బిడ్డలుగా చూసుకోవాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.     ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 17వ తేదీ నుంచి నేటివరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాల నివారణపై విస్తృత అవగాహన కల్పించామన్నారు. జిల్లాలోని 931 అంగన్వాడీల్లో ప్రతిరోజూ పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారం అందిస్తోందని, వైద్యారోగ్య శాఖ సహకారంతో గర్భిణీ స్త్రీలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించే చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. అంగన్వాడీ టీచర్లు పిల్లలను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, బాల్యంలో పోషకాహార లోపం అధిగమిస్తే భవిష్యత్తులో పిల్లలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగి, దేశ నిర్మాణానికి తోడ్పడతారని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అంగన్వాడీ టీచర్లు, సిబ్బందిని ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు.     స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, జిల్లాలోని అంగన్వాడీల్లో వందశాతం పిల్లలకు పోషకాహారం అందుతోందని, శాఖకు సంబంధించిన సూచికల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. భవిష్యత్తులో అన్ని సూచికల్లో మెరుగైన స్థానాన్ని నిలబెట్టేలా కృషి చేస్తామని తెలిపారు.     కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పోషకాహారంపై నాటికలు, పాటల ద్వారా అవగాహన కల్పించారు. గర్భిణీ స్త్రీలకు పండ్లు, సారెలు పంపిణీ చేసి సామూహిక సీమంతం నిర్వహించగా, చిన్నారులకు అన్నప్రాసన జరిపారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు పోషకాహార స్టాళ్లను పరిశీలించి, టీచర్ల సృజనాత్మకతను ప్రశంసించారు.     ఈ కార్యక్రమంలో డీఈఓ భోజన్న, డిఆర్డీవో విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సీడీపీవోలు, సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, అధికారులు పాల్గొన్నారు.

హనుమకొండ

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

హనుమకొండ పి జె ఆర్ గార్డెన్స్ లో నర్సంపేట్ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి గారి మాతృమూర్తి కాంతమ్మ గారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు మరియు ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు గారు ఇతర ముఖ్య నేతలు సీఎం గారిని కలవడం జరిగింది

తెలంగాణ

ఈ ఫోటోలో వరుసలో నిలబడ్డ వ్యక్తిని గుర్తించారా?

పున్నమి అక్టోబర్ 16: CPM పార్టీ నుండి వరుసగా 5 సార్లు MLA గా ఇల్లెందు నియోజకవర్గము నుండి గెలిచిన గుమ్మడి నరసయ్య గారు. ఇప్పటికి కూడా సైకిల్ పై వెళ్లడం RTC బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం బుధవారం ఆయన అక్కడ అందరితో పాటే OP చీటీ తీసుకు వైద్యుల గది ముందు వరుసలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు. ఈరోజుల్లో వార్డు మెంబర్, ఎంపీటీసీలు హంగు ఆర్బాటలతో జీవిస్తుండగా 25 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి గుమ్మడి నరసయ్య గారు ఎంత సింపుల్ గా ఉంటారో…? ఇప్పటి రాజకీయ నాయకులు గుమ్మడి నరసయ్య గారిని ఎవరైనా ఆదర్శవంతంగా తీసుకుంటారా?

హనుమకొండ

కాంగ్రెస్‌లో పేలనున్న కొండా దంపతుల టైంబాంబ్ !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సంక్షోభం ముందు నిలిచింది. మంత్రి కొండా సురేఖ వ్యవహారం ముదిరి పాకాన పడింది. సుమంత్ అనే ఆమె ఓఎస్డీ చేసిన నిర్వాకాల కారణంగా ఆయనను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అదే సమయంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని తుపాకీ పెట్టి పాయింట్ బ్లాంక్ లో బెదిరించారంటూ ఫిర్యాదు రావడంతో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సుమంత్ ను స్వయంగా రక్షించి తనతో పాటు తీసుకెళ్లారు కొండా సురేఖ. ఆమె కుమార్తె సీఎంతో పాటు పలువురు తన తల్లిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించేశారు. ఇంత దాకా వచ్చిన తర్వాత తర్వాత ఇక ఈ వివాదం ఇంతటితో ఆగే అవకాశం కనిపించడంలేదు. బలవంత వసూళ్లకు పాల్పడిన కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ? కొండా సురేఖ వ్యవహారం కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతోంది. ఆమె వద్ద ప్రైవేటు ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వసూళ్లకు బెదిరింపులను స్వయంగా సుమంత్ చేస్తున్నారు. డెక్కన్ సిమెంట్స్ అనే సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించినట్లుగా చెబుతున్నారు. చివరికి మేడారం పనుల కాంట్రాక్టర్ ను కూడా బెదిరించినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రభుత్వ పెద్దల్లో ఒక్క సారిగా ఆగ్రహం వచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కల్పించుకుని సురేఖ ఓఎస్డీ సుమంత్ ను తీసేయమని ఆదేశించారు. ఆయనను అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో పోలీసులు ప్రయత్నించారు. మంత్రికి తెలియకుండా ఓఎస్డీ వసూళ్లకు పాల్పడతారా? సుమంత్ ను అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులకు మంత్రి కొండా సురేఖ షాక్ ఇచ్చారు. ఆయనకు తన ఇంట్లోనే షెల్టర్ ఇచ్చారు. పోలీసులు ఆ ఆచూకీ తెలుసుకుని అక్కడికి వచ్చినప్పుడు సురేఖ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విపక్ష పార్టీ నేతల్లా.. తన తల్లి, తండ్రిపై సీఎంతో పాటు ముఖ్యనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీలం అయిన తమను వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఓఎస్డీని తీసుకుని కొండా సురేఖ వేరే కారులో వెళ్లిపోయారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. అంటే ఓఎస్డీ తో అన్ని పనులు చేయించింది కొండా దంపతులేనని అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసి మంత్రి వర్గంలో ఉండగలరా? ఉంచుతారా? స్వయంగా ముఖ్యమంత్రి తమపై కుట్ర చేస్తున్నారని ఓ మంత్రి ఆరోపించడం చిన్న విషయం కాదు. ఓ మంత్రిపై సీఎం విశ్వాసం కోల్పోయినా.. ఆ మంత్రి సీఎంపై నమ్మకం కోల్పోయినా మంత్రి వర్గంలో ఉండలేరు . ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉంది. కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం లేదా ఆమెనే రాజీనామా చేయడం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. తమను అరెస్టు చేస్తారని కొండా సురేఖ, కొండా మురళీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన కుమార్తె చెబుతున్నారు. అలాంటి పరిస్థితే వస్తే బయటకు తెలియనిది ఏదో పెద్ద ఘటనే జరిగిందని అనుకోవాలి. ఎవరితోనూ సఖ్యతగా ఉండకపోవడం కొండా దంపతుల ప్రత్యేకత కొండా దంపతుల వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదమే. ఎవరితోనూ సఖ్యతగా ఉండరు. ఎవరైనా ప్రోత్సహిస్తే రెచ్చిపోతారు. కాంగ్రెస్ లో మంత్రి పదవి వచ్చిన తర్వాత ఆమె వరంగల్ జిల్లాలో ఏ ఒక్క నేతతోనూ సామరస్యంగా లేరు. చివరికి వరంగల్ జిల్లాకాంగ్రెస్ నేతలంతా .. మేము కావాలో.. ఆమె కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ అన్నీ భరించారు.. చివరికి ఆయన కూడా ఇక తెంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో కొండా సురేఖ అంశంలో చాలా కీలక పరిణామాలు జరగనున్నాయి.

అన్నమయ్య

శ్రీ గంగమ్మ జాతరలో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట నియోజకవర్గం, రాజంపేట మండలం కొత్త బోయినపల్లి గ్రామంలో శ్రీ గంగమ్మ దేవస్థానం నందు నేడు ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ గంగమ్మ జాతర ఉత్సవం నిర్వహించారు. నిర్వాహకులు, గ్రామస్తులు స్థానిక జనసేన నాయకుల ఆహ్వానం మేరకు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మహోత్సవం కమిటీ సభ్యులు మేరువ సుబ్బరాయుడు,మేడా జానకి రామయ్య,నల్ల బాబు, బొడిచెర్ల సుబ్బరాయుడు, పొట్టు శంకరయ్య,మేడా శ్రీకాంత్, ద్వారక మరియు, రాజంపేట జనసేన నాయకులు, మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, మౌలా, గాజుల కులాయప్ప, గూడూరు శ్రీనివాసులు, వెలిగండ్ల శ్రీనివాసరాజు, సాయిరాజు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల

రైల్వేకోడూరు పట్టణం బలిజవీధిలో ఉన్న శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ ద్వారా 19వ గురువారం “కీర్తిశేషులు అడ్లూరు సునీత జ్ఞాపకార్థం అడ్లూరు సుబ్బరామరాజు” కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద కమిటీ సభ్యులు మరియు దాతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ కళ్యాణ మండపం ద్వారా చేపట్టామని ప్రతి గురువారం ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ గంగమ్మ తల్లి దేవాలయం వద్ద నిర్వహిస్తామని తెలియజేశారు., ఈ అన్నదాన కార్యక్రమానికి ఒకవేళ దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి పేరుతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.అమ్మవారు అనుగ్రహిస్తే నిత్య అన్నదానం చేయాలనె తన ఆకాంక్షను బత్యాల ఈ సందర్భంగా వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతలు మరియు భక్తులు పాల్గొన్నారు.

తిరుపతి

అమ్మాయి వాయిస్ తో ఒక వృద్ధుడి నుంచి రూ. కోటి దోపిడీ*

*జంబ లకిడి పంబ….పంబ లకిడి జంబ…..గొంతు మార్చి….అబ్బాయి కాస్త అమ్మాయి వాయిస్ తో ఒక వృద్ధుడి నుంచి రూ. కోటి దోపిడీ* బాబోయ్ పోయాం మోసం …అంటూ పోలీసు కి పిర్యాదు చేసిన బాధితుడు….ఎట్టకేలకు నిందితుడు చైతన్యకృష్ణపవన్​ను అరెస్టు చేసిన పోలీసులు శైలజ, సుజాత, సునీత, నీలిమ ఇవన్నీ ఒకరి పేర్లే. అతడే ఆమెగా పేర్లు మార్చుకుని షోషల్ మీడియా లో… పురుషులను ఆకర్షించి డబ్బులు దొబ్బుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వివరాలను వెల్లడించారు బాపట్ల జిల్లా ఇంకొల్లుకు చెందిన చోడ చైతన్యకృష్ణపవన్‌ ఇంజినీరింగ్‌ చేసి హోటల్‌లో చెఫ్‌గా పని చేసేవాడు. ఆన్‌లైన్‌ జూదానికి అలవాటు పడిన అతను డబ్బుల కోసం సైబర్‌ నేరాలకు పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలను తెరిచి పురుషులకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపి, వారితో అమ్మాయిలా చాటింగ్​లు చేసేవాడు. అంతేకాకుండా కాల్‌బాయ్‌లా పని చేస్తే డబ్బులు ఇస్తామని మెసేజ్‌లను పంపి వారిని ముగ్గులోకి దింపి రిజిస్ట్రేషన్‌ పేరుతో దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు నగదును తన ఖాతాల్లో వేయించుకునేవాడు. వృద్ధుడి వద్ద రూ.కోటి దోచేశాడు: గుంటూరు ఎస్‌వీఎన్‌కాలనీకి చెందిన 68 ఏళ్ల వృద్ధుడితో శైలజ పేరుతో చాటింగ్‌ చేశాడు. కాల్‌బాయ్‌గా వెళ్తే డబ్బులొస్తాయని చెప్పాడు. ఇలాంటివి ఇష్టం లేదని ఆయన చెప్పినా వినకుండా పది రోజుల పాటు విసిగించాడు. తర్వాత వేరే నంబరు నుంచి ఫోన్‌ చేసి తాను పోలీసునని మహిళతో అసభ్యకరంగా చాటింగ్‌ చేస్తున్నట్టు నీ మీద కేసు నమోదైందని భయభ్రాంతులకు గురి చేశాడు. నిన్ను ఈ కేసు నుంచి తప్పించడానికి నాకు కావాల్సిన డబ్బులివ్వాలని బెదిరించాడు. అనంతరం మరుసటి రోజు వేరే నంబరు నుంచి ఫోన్‌ చేసి ఐటీ అధికారినని రైసుమిల్లులో సోదాలకు వస్తున్నానని చెప్పాడు. అలా పలు రకాలుగా వేధించి విడతలవారీగా రూ.కోటి వరకు అతని ఖాతాలోకి జమ చేయించుకున్నాడు. అరెస్టు చేసిన పోలీసులు: అనంతం మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఎస్పీ వకుల్‌జిందాల్‌ పర్యవేక్షణలో ఐసీకోర్‌ సీఐ నిస్సార్‌బాషా, ఎస్సైలు రాజ్‌కుమార్, ప్రదీప్, సిబ్బంది తదితరులు కేసుపై దర్యాప్తు చేసి, నిందితుడు చైతన్యకృష్ణపవన్‌ను అరెస్టు చేశారు. ఇతను గతంలో సైతం పలువురి నుంచి రూ. 24 లక్షల వరకు డబ్బులను కాజేశాడు నిందితుడు కాల్‌బాయ్‌గా పని చేయడానికి అంగీకరించిన వారిని పోలీసునని చెప్పి బెదిరించేవాడు. దాదాపు పదికి పైగా చరవాణి నంబర్లు ఉపయోగించి, గొంతు మార్చి కానిస్టేబుల్‌ సుబ్బు, కోర్టు కానిస్టేబుల్‌ తేజ, సైబరాబాద్‌ ఎస్సై శ్రీనివాస్, అనంతపురం సీఐ ప్రభాకర్‌రెడ్డి, హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ అని మాట్లాడి అందరినీ బురిడీ కొట్టించేవాడు. ఈ కేసు నుంచి తప్పించటానికి డబ్బులివ్వాలని బెదిరించి తన ఖాతాలో జమ చేయించుకునేవాడు

తెలంగాణ

*కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా-ఊడుతుందా⁉️*

పున్నమి తెలంగాణ ప్రతినిధి: – మా అమ్మను టార్గెట్ చేసిన్రు.. మా నాన్నను ఏం చేస్తరో..’ – బిడ్డ సుష్మిత వాఖ్యలు – రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీపై నిన్న మీడియా సాక్షిగా వెల్లడి – రేవంత్ అన్నదమ్ములకు గన్ మెన్ లు ఎందుకు ? – మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సంచలన ఆరోపణలు వరంగల్ జిల్లా ; మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన ఎన్. సుమంత్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే (అక్టోబర్ 14) విధుల నుంచి తొలగించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులైన సుమంత్‌పై అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించబడిన సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి మఫ్టీలో ఉన్న వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులుగా మంత్రి ఇంటికి వచ్చారు. సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని, రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని విమర్శించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి గన్‌మెన్లను తొలగించారని.. రేవంత్‌రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి పార్టీకి ఏం చేశారని, వారికి ప్రభుత్వం గన్ మెన్లను కేటాయించిందని ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కుట్ర ఉందని.. సుమంత్‌ను అదుపులోకి తీసుకుని తమ తండ్రి కొండా మురళి పేరు చెప్పేలా ఒత్తిడి చేసి ఆ తర్వాత ఆయనను కూడా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు. కాగా, ఈ హైడ్రామా జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ.. మాజీ ఓఎస్డీ సుమంత్‌ను తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మరింత కలకలం రేపింది. తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చిన వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై సుస్మిత రాజకీయ కుట్ర ఆరోపణలు చేశారు. ఈలోగా మంత్రి సుమంత్‌ను తన కారులో తీసుకెళ్లారు.

విశాఖపట్నం

యువ‌త‌ ప్ర‌త్యేక లక్ష్యంతో ముందుకు సాగాలి. యువ‌జ‌నోత్స కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్

విశాప‌ట్ట‌ణం, అక్టోబ‌ర్ 16 ః యువ‌త ప్ర‌త్యేక ల‌క్ష్యంతో ముందుకు సాగాల‌ని, అలా కాని ప‌క్షంలో జీవితంలో ఏమీ సాధించ‌లేమని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ అన్నారు. నీతి, నిజాయితీగా, మంచి పౌరుడుగా ఉండాల‌ని, స‌మాజానికి భారం కాకుండా బ్ర‌త‌కాల‌ని హిత‌వు ప‌లికారు. జీవితంలో ఎదిగేందుకు నైపుణ్యాలు పెంచుకోవాల‌న్నారు. క‌ష్ట‌ప‌డ‌కుండా ఏదీ రాద‌ని, ఒక‌వేళ వ‌చ్చినా ఎక్కువ కాలం నిల‌వ‌ద‌ని అన్నారు. ఏదొక ప్ర‌త్యేక లక్ష్యం పెట్టుకొని దాని సాధ‌న కోసం నిరంత‌రం కృషి చేయాల‌ని సూచించారు. సెట్విస్, ఎన్.వై.కె. ఆధ్వ‌ర్యంలో కృష్ణా కాలేజీలో గురువారం జ‌రిగిన యువ‌జ‌నోత్స‌వాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ ముఖ్య అతిథిగా పాల్గొని యువ‌త‌కు సందేశం అందించారు. చ‌దువుతో పాటు క‌ళ‌ల‌పై కూడా యువ‌త దృష్టి సారించాల‌ని, జీవితాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దుకునేందుకు శ్ర‌మించాల‌ని సూచించారు. తాత్కాలిక‌, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకోవాల‌ని, సింగిల్ పాయింట్ నినాదంతో ప‌ని చేయాల‌ని హిత‌వు ప‌లికారు. మ‌నం పెట్టుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే ఏయే ప‌నులు చేయాలో నిర్ణ‌యించుకోవాల‌న్నారు. నైపుణ్యాల‌ను మెరుగుప‌రుచుకోవాల‌న్నారు. ప‌త్రిక‌లు, పుస్త‌కాలు చ‌ద‌వాల‌ని, మంచి చేతిరాత‌ను అల‌వ‌ర్చుకోవాల‌ని చెప్పారు. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవాల‌ని, మంచికి ఉప‌యోగించుకోవాల‌ని, బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన వివిధ పోటీల్లో, కార్య‌క్ర‌మాల్లో యువ‌త ఉత్సాహంగా పాల్గొని తమ ప్ర‌తిభ‌ను చాటుకున్నారు. కార్య‌క్ర‌మంలో సెట్విస్ సీఈవో క‌విత‌, యూత్ ఆఫీస‌ర్ మ‌హేశ్వ‌ర‌రావు, కృష్ణా కాలేజీ ప్ర‌న్సిపాల్, ఇత‌ర అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.