Wednesday, 29 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

బాణాసంచా విక్రయ దారులకు పోలీస్ వారి సూచనలు

విశాఖపట్నంపున్నమి ప్రతినిధి బాణాసంచా అమ్మకం దారుడు లైసెన్స్ కోరకూ ధరఖాస్తు చేయు ముందు క్రింది నియమనిబంధనలను తప్పని సరిగా పాటించాలి:- బహిరంగంగా బాణసంచా ప్రదర్శన సమయంలో తీసుకోవలసిన పద్ధతులు :

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఈనెల 18న బీసీ బందును విజయవంతం చేయండి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో BC కులాలకు 42% రిజర్వేషన్ ను కల్పించాలని BC JAC ఆధ్వర్యంలో సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ఈ నెల 18. న జరిగే తెలంగాణ BC బంద్ ను విజయవంతం చేయాలని, హాజరైన సంఘాల నాయకులు కాగజనగర్ పట్టణ ప్రజలని బంద్ పాటించాలి, EWS ఎవ్వరు అడ్డుకోలేదని, కానీ 42% BC రిజర్వేషన్ ను రెడ్డి జాగృతి కుట్ర తోనే అడ్డు కోవడం జరిగిందని అన్నారు, రానున్న ఎన్నీకల లో, 42%BC రిజర్వేషన్ గురించి మాట్లాడని రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు, ఈ కార్యక్రమం లోBC బంద్ కొరకై, BC JAC జిల్లా వైస్ చైర్మన్ నీకోడే రవీందర్, పొన్న రమేష్, మాచర్ల శ్రీనివాస్, పుల్గం వెంకటేష్, మెహరాజ్, BRS నాయకులు అంబాలా ఓదెలు, గోలేం వెంకటేష్, BJP నాయకులు గజ్జల లక్షణ్, కొండా తిరుపతి, పుల్ల అశోక్, TRP నాయకులు కడారి శ్రీనివాస్, దుర్గం నిరంజన్, గాదే సురేష్ ,పద్మశాలి సంగం నాయకులు, నాగేశ్వర్, బోగా వెంకటేష్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు జయదేవ్ అబ్రహం, తదితరులు పాల్గొని BC బంద్ విజయవంతం కావడం కొరకు కృషి చేయలని అన్నారు.

యాదాద్రి భువనగిరి

మునుగోడులో డిసిసి అధ్యక్షుడి ఎంపిక పై అభిప్రాయ సేకరణ. డిసిసి అధ్యక్షులు గా బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,ఓసి ఎవరిని ఎంపిక చేసిన మద్దతిస్తామని. రాజ్ గోపాల్ రెడ్డి కి అధిష్టానం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవాలని తీర్మానం. జన్మతః నేను కాంగ్రెస్ పార్టీ,పుట్టిన నాటి నుండి నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది,కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని పార్టీని బ్రతికించడానికి పనిచేసిన వ్యక్తిని. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.

రిపోర్టర్ సింగం కృష్ణ,మునుగోడు ప్రతినిధి,అక్టోబర్16,(పున్నమి ప్రతినిధి): సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక కొరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోవడానికి మునుగోడుకు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతితో పిసిసి పరిశీలకులు వచ్చారు.మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ముఖ్య కార్యకర్త ఏఐసీసీ బీసీ ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ,ఓసిలలో ఎవరిని డిసిసి అధ్యక్షులుగా ఎంపిక చేసిన మా మద్దతు ఉంటుందని,దాంతోపాటు అధిష్టానం మునుగోడు నియోజకవర్గానికి ఇచ్చిన కమిట్మెంట్ కూడా నిలబెట్టుకోవాలని కుండ బద్దలు కొట్టినట్టు ఏకవాఖ్య తీర్మానాన్ని తెలిపారు.ఈ సందర్భంగా కొందరు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో వున్నపుడు రాజగోపాల్ రెడ్డిగారు పార్టీని బ్రతికించారని గుర్తు చేశారు.2009 నుండి ఈరోజు వరకు ప్రతిపక్షాలకు ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెడుతున్నాడని,మొన్నటికి మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎవరికీ తెలియని అభ్యర్థిని ఎంపీగా గెలిపించి సత్తా చాటాడని అన్నారు.ఎంపీగా గెలిపించి వస్తే మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చి హామీను నిలబెట్టుకోలేదన్న విషయాన్ని ఏఐసిసి మాజీ జనరల్ సెక్రెటరీకి తెలిపారు.మంత్రి పదవి ఇచ్చి మాట తప్పిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని పలువురు ముఖ్య నాయకులు తమ ఆవేదనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.రాజగోపాల్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో పేరున్న నాయకుడని,ఆయన స్థాయికి మంత్రి పదవి చిన్నదని,ఇంకా పెద్ద పదవులు అధిష్టించే సత్తా ఉన్న నాయకుడని విశ్వరంజన్ మహంతి కొనియాడారు.ఖచ్చితంగాఆయన ఆవేదనను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని,మీ ఓపికకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో క్రేజీ ఫాలోవర్స్ ఉన్న నాయకుడు రాజగోపాల్ రెడ్డి,ఆయనకు అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టాలని ఏఐసిసి ప్రతినిధి ద్వారా రిపోర్ట్ పంపిస్తామని ఎమ్మెల్సీ,ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తిలో పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమము

పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తిలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ నందు పేట బ్రదర్స్ ఆధ్వర్యంలో 65 వ వారం శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమమును పవన్ కళ్యాణ్ ఆశయాల కృషి కోసం పనిచేసే జనసేన నాయకులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి,ప్రదీప్ కుమార్, తేజ,మనీ,మహేష్,నవీన్,చందు,ముని చంద్ర,రాజా, చందు,వీర మహిళలు బత్తెమ్మ, పద్మ,తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

శ్రీ శైలం మల్లన్న ని దర్శనం చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి ప్రత్యేక ప్రతి నిధ గురువారం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనానంతరం… మధ్యాహ్నం 12.35 గంటలకు శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు.* గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ కూడా శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి విచ్చేశారు. ముందుగా శ్రీ శివాజీ దర్బార్ హాల్ ను సందర్శించి… రాజ దర్బార్ ను, అలాగే అక్కడి గోడలపై శ్రీ చత్రపతి శివాజీ జీవిత చరిత్ర పై శిల్పాలతో అద్భుతంగా చిత్రీకరించిన చిత్రమాలికను ఆసక్తిగా తిలకించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా అక్కడి శివాజీ విగ్రహానికి పుష్పాలను సమర్పించారు.* *అనంతరం ఆ పక్కనే ఉన్న శివాజీ ధ్యాన మందిరాన్ని కూడా సందర్శించారు. అక్కడ ధ్యానముద్రలో ఉన్న శ్రీ చత్రపతి శివాజీ, అమ్మవారి విగ్రహాలను తిలకించారు. అక్కడ కూడా అమ్మవారి విగ్రహానికి భక్తిశ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు.* *శ్రీ చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను అభినందించిన భారత ప్రధాని.* *ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సుశీల్ షెరాన్, డోన్ ఆర్డిఓ నరసింహులు, చత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రెసిడెంట్ టి.జీ.వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.సుబ్బారెడ్డి, క్షేత్ర ప్రచారక్ ఎస్. భరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. నాగేశ్వర రావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ జీ ఎస్ టీ ఉత్సవ్ తగ్గింపు ర్యాలీ

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి పంచాయితీ బస్టాండ్ వరకు కావలి రవాణా శాఖ అధ్యర్యలో జీ ఎస్ టీ ఉత్సవ్ అవగహన ర్యాలీ నిర్వహించారు ఆనంతరం పంచాయితీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రవాణా అధికారి కరుణాకర్ మాట్లాడారు జీ ఎస్ టీ తగ్గిన తర్వాత వాహనాలను ఎంత ధరలకు కొనుగోలు చేసుకున్నారో , లబ్ధి దారుల ఎంత వరకు లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు

సత్యసాయి

కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం

మండల కేంద్రం నందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం ఓడి చెరువు అక్టోబర్ 16 ప్రభ న్యూస్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి ఎంపీడీవో తాసిల్దార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ నందు జిల్లావ్యాప్తంగా కోటి ముక్కలు భాగంగా ఈరోజు ఓడిసి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వచించారు. ఎస్సై మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం పాల్గొనాలని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధి హామీ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సత్యసాయి

కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం

మండల కేంద్రం నందు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మొక్కలు నాటే కార్యక్రమం ఓడి చెరువు అక్టోబర్ 16 ప్రభ న్యూస్ మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి ఎంపీడీవో తాసిల్దార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక హాస్పిటల్ నందు జిల్లావ్యాప్తంగా కోటి ముక్కలు భాగంగా ఈరోజు ఓడిసి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వచించారు. ఎస్సై మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం పాల్గొనాలని ఎస్ఐ తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధి హామీ సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎస్సై తీవ్ర హెచ్చరికలతో పందుల బెడదకు పుల్ స్టాప్

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదూరుపల్లిలో పందుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. వీటి కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎస్సై తిరుమలరావు పందుల పెంపకందారులను తీవ్రంగా హెచ్చరించారు.అయితే వారిలో మార్పు రాకపోవడంతో,పందులు బస్టాండ్ వద్ద, రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయని తెలుసుకున్న ఎస్సై స్వయంగా ఆదురుపల్లికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.అనంతరం సంబంధిత పందుల యజమానులకు ఫోన్ చేసి పది రోజుల్లోగా పందులను గ్రామం బయటకు తరలించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.దాంతో గురువారం పెంపకందారులు వెంటనే స్పందించి గ్రామంలోని పందులను పట్టుకొని గ్రామం బయటకు తరలించారు. గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించిన ఎస్సై తిరుమలరావుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ఆదూరుపల్లిలో ఎస్సై తిరుమలరావు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ మహిళా కళాశాలలో పుట్టగొడుగుల సాగు పై శిక్షణా తరగతులు విజయవంతం

శ్రీ దుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆద్వర్యంలో వృక్షశా విభాగం వారు ఓబ్రిమొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం వారికి పుట్టగొడుగులు పెంపకంపై శిక్షణాతరగతులను 14/10/2025 మరియు 15/10/2025 వ తేదీన నిర్వహించడం జరిగినది అలాగే పుట్టగాడు గూలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, పుట్టగొడుగులు (ప్రోటిన్, విటమిన్, ఇనిజ లవంగాలు సమృద్ధిగా కలిగిన ఆహారం అని, తక్కవ వ్యయంలో, చిన్నస్థలంలో పుట్టగొడుగుల సాగు ద్వారా మంచి ఆదాయం వస్తుందని, అలాగే పుట్టగొడుగులు, యాంటా బయోటిక్, యాంటీ కౌన్సర్ వంటి ఔషదగుణాలను కలిగి ఉంటాయని, పుట్టగొడుగుల సాగుద్వారా, యువతకు, మహిళలకు స్వయంఉపాధి అవకాశాలు అజలభిస్తాయని, పుట్టగొడుగులసాన తర్వాత మిగిలిన మిశ్రమాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగించ వచ్చని ఈ శిక్షణాతరగతులలో వృక్షశాస్త్ర విభాగాధిపతిమైన T. సలోమి మరియు B. శైలజ విద్యార్థి నులకు అవగాపచ కల్పించడం జరిగినది. అలాగే సిద్ధార్థ మహిళా కళాశాలలో 2024వ సంవత్సరం లో పుట్టగాడుగులు పెంపకం యూనిట్ ప్రారంభించి, డిగ్రీ మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరం వారికి శిక్షణ ఇచ్చి, చిన్న చిన్న కుటార పరిశ్రమలు నెలకట్పే విధంగా మారితో వారిని తయారు చేస్తున్నాం అని వృక్షశాస్త్ర విభాగం వారు వివరించడం జరిగినది. ఈ కార్యక్రములో . వృక్షశాస్త్ర అధ్యాపకులు T. సలోమి, 3. శైలజ, సరిత మరియు విద్యార్థినులు పాల్గోని కార్యశ్రమాన్ని విజయ వంతం చేయడం జరిగినది.కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి వి సుబ్రహ్మణ్య కుమార్ వీరిని అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.