Tuesday, 28 April 2026

Blog

విశాఖపట్నం

ఏపీలో చికెన్ వ్యాపారులకు అలర్ట్..! కొత్త విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం చికెన్ దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి

విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ వ్యాపారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన చికెన్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని చికెన్ దుకాణాలకు లైసెన్స్ విధానం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలతో అక్రమ వ్యాపారాలు, ఆరోగ్యానికి హానికరమైన మాంస విక్రయాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై లైసెన్స్ లేకుండా చికెన్ అమ్మకాలు జరపడం చట్టవిరుద్ధంగా పరిగణించనున్నారు. 🔹 పౌల్ట్రీ నుంచి దుకాణం వరకు పర్యవేక్షణ కొత్త విధానం ప్రకారం, కోళ్ల ఉత్పత్తి కేంద్రాల నుంచి దుకాణాల వరకు సరఫరా వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. ఏ పౌల్ట్రీ ఫారం నుంచి ఎన్ని కోళ్లు ఏ దుకాణానికి పంపబడ్డాయి, రోజువారీ అమ్మకాల వివరాలు వంటి సమాచారాన్ని ప్రత్యేక డేటాబేస్‌లో నమోదు చేయనున్నారు. దీనివల్ల కోళ్ల ఉత్పత్తి నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు ప్రతి దశను ట్రాక్ చేయడం సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. 🔹 ఆరోగ్యానికి హానికరమైన కోళ్లపై కఠిన చర్యలు స్టెరాయిడ్లు లేదా ఇతర రసాయనాలు వాడి కోళ్లు పెంచే ఫార్ములపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరోగ్యానికి ప్రమాదకరమైన చికెన్ విక్రయాలను నిరోధించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించనున్నారు. అదే విధంగా, హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే చికెన్ కొనుగోలు చేయాలని సూచన జారీ చేయనున్నారు. 🔹 వ్యర్థాల మాఫియాపై కత్తి చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను అక్రమంగా సేకరించి చేపల మేతగా వాడుతున్న మాఫియాపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ విధానం అమలులోకి రాగానే ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు తెలిపారు. 🔹 త్వరలోనే అమల్లోకి కొత్త విధానం ఆంధ్రప్రదేశ్ మాంసాభివృద్ధి సంస్థ (AP Meat Development Corporation) అన్ని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులు మరియు వ్యాపారులకు లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే ఈ నూతన నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. లైసెన్స్ లేకుండా వ్యాపారం కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. 🗞️ ప్రజలకు పరిశుభ్రమైన, నాణ్యమైన మాంసం అందించడం – ప్రభుత్వ ప్రధాన లక్ష్యం 🛑 లైసెన్స్ లేని చికెన్ షాపులు మూతపడే అవకాశం 📋 పౌల్ట్రీ నుంచి వినియోగదారుడి వరకు పర్యవేక్షణలో కొత్త సిస్టమ్

తెలంగాణ

ధాన్యం సేకరణ పై కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వానకాలం ధాన్యం సేకరణ పై నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్ 9281423653 కు ఫిర్యాదులను తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.

విశాఖపట్నం

దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక

పత్రికా ప్రకటన విశాఖపట్నం సిటీ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు – నగర పోలీసు కమిషనర్ హెచ్చరిక దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20, 2025న నగరవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, నిల్వలు, దుకాణాల ఏర్పాటు విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు ముమ్మర తనిఖీలు ప్రారంభించాయని తెలిపారు. — లైసెన్స్ పొందే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు బాణసంచా అమ్మకందారులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు క్రింది భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలి — 1️⃣ పటాకుల దుకాణాల మధ్య కనీసం 15 మీటర్ల భద్రతా దూరం ఉండాలి. 2️⃣ షెడ్ లొకేషన్ మ్యాప్, ప్లాన్‌లు విద్యుత్, అగ్నిమాపక, జీవీఎంసీ అధికారుల అనుమతితో ఉండాలి. 3️⃣ ఎలక్ట్రికల్, ఫైర్, జివిఎంసీ శాఖల NOC తప్పనిసరి. 4️⃣ దరఖాస్తుదారు వయస్సు 18 ఏళ్లు పైబడినవారై ఉండాలి. 5️⃣ వాణిజ్య పన్ను శాఖ (GST) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సమర్పించాలి. 6️⃣ షెడ్‌లో ఆయిల్ ల్యాంపులు, గ్యాస్ లైట్లు, నేకెడ్ లైట్లు వాడరాదు. 7️⃣ ప్రతి లైసెన్సు దుకాణం ఎప్పుడైనా తనిఖీకి సిద్ధంగా ఉండాలి. 8️⃣ దుకాణాలు ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాలు మొదలైన వాటి నుండి కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. 9️⃣ తగినంత ఇసుక బకెట్లు, నీరు అందుబాటులో ఉండాలి. 🔟 గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కొనుగోలు, అమ్మకాలు జరగాలి. 11️⃣ దీపావళి రోజున రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు మాత్రమే పటాకులు పేల్చేందుకు అనుమతి. 12️⃣ హ్యాండ్ శానిటైజర్ వాడరాదు – సాధారణ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. — దుకాణాలలో పాటించాల్సిన సూచనలు లైసెన్స్ పరిధిలోనే విక్రయం జరగాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే దుకాణాలు ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక సంచులు తప్పనిసరి. 18 ఏళ్ల లోపు పిల్లలకు బాణసంచా అమ్మకూడదు. షెడ్లు మూడు మీటర్ల దూరంలో ఉండాలి. దుకాణంలో లైసెన్స్ పరిమితిని మించని టపాసులు మాత్రమే ఉంచాలి. అనధికార వ్యక్తులను ప్రవేశించనీయకూడదు. తగినంత గాలి ప్రసరణ, ఎమర్జెన్సీ నిష్క్రమణ మార్గాలు ఉండాలి. — బహిరంగ బాణసంచా ప్రదర్శనలో పాటించాల్సిన సూచనలు 1️⃣ ప్రదర్శనకు కనీసం 7 రోజుల ముందుగానే పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలి. 2️⃣ ఆసుపత్రులు, పాఠశాలల నుండి 250 మీటర్ల లోపు ప్రదర్శన నిషేధం. 3️⃣ అగ్నిమాపక సిబ్బంది, పరికరాలు సిద్ధంగా ఉంచాలి. 4️⃣ ప్రేక్షకులకు కనీసం 100 మీటర్ల భద్రతా దూరం ఉండాలి. 5️⃣ లైసెన్సు పొందిన అధీకృత బాణసంచా మాత్రమే ఉపయోగించాలి. — ప్రజలకు పోలీసుల విజ్ఞప్తి నగరవాసులు తమ పరిసరాల్లో అనధికార బాణసంచా నిల్వ లేదా విక్రయాలు జరుగుతున్నాయని అనుమానం ఉంటే వెంటనే డయల్ 100 / 112 నంబర్‌కి గానీ, లేదా సీపీ గారి నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలని నగర పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, చట్టవ్యతిరేకంగా బాణసంచా నిల్వ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తూర్పు గోదావరి

ఏమి సాధించారని జి. ఎస్. టి. సంబరాలు -మేడా శ్రీనివాస్.

కేంద్రం లో మోదీ సర్కార్ కు , ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూటమి సర్కార్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ! అనిపిస్తుంది . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా , విభన హామీలు సాధించి నట్టు ” జి. ఎస్.టి. ” సంబరాలు ఏమిటి ! మోదీ రాజకీయ ప్రచారం కోసం చేసిన వందల కోట్ల ఖర్చు ఆంధ్ర రాష్ట్రంలో అనేక అవసరాలు తీరతాయని గ్రహించలేరా ! మతి చెలించిన చంద్రబాబు కూటమి సర్కార్ ఆంధ్ర రాష్ట్ర వెన్నుముక ను విరిచేస్తుంది . మోదీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో పాలకులు లేరు పాలెగాళ్ళు మాత్రమే వున్నారు అనే అహంతో ఆంధ్రప్రదేశ్ లో మోదీ ఉపన్యాసాలు చెల్లుతున్నాయి . ఆంధ్ర పౌరుషం లేని పాలకులు ఆంధ్రప్రదేశ్ కు అవసరమా ! అవినీతి కుంబకోణాలకు వ్యసన పరులు ఢిల్లీ పాలకులకు బానిసలు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాలకులుగా చెల్లుబాటు అవుతున్నారు . ఎన్నాళ్ళు సాగునో ఈ వైభోగం వేచి చూడాలి ..

తిరుపతి

జిఎస్టి తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలీ…. ఆర్.టి.ఓ దామోదర్ నాయుడు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 16, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం నాడు స్థానిక శరవణ ఆటోమొబైల్స్ వ్యాపార సంస్థలో జిఎస్టి అవగాహన సదస్సు చేపట్టారు. అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు అధ్యక్షతన వహించడంతో శ్రీకాళహస్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెన్నారెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిఎస్టి తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలన్న లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నారని, ఆటోమొబైల్స్ విక్రయాలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో దోహదపడుతుందని వాహనాలు విక్రయ సమయాలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో పాటు వాహన చోదకులకు హెల్మెట్ అందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్స్ డీలర్లు ప్రసాద్ రెడ్డి, మురళీకృష్ణ రెడ్డి, రమణయ్య, రవి, షోరూమ్ మేనేజర్లు పాల్గొన్నారు.

E-పేపర్

భవనాశి సోదరుల ఆధ్వర్యంలో ప్రధాని సభకు తరలి వెళ్లిన జనసైనికులు. కర్నూలు ప్రధాని సభకు 80 వాహనాలలో వెళ్లిన జనసేన కార్యకర్తలు, నాయకులు.

నంద్యాల జిల్లా జనసేన నాయకుడు భవనాశి శ్రీనివాస, భవనాశి నాగ మహేష్ ఆధ్వర్యంలో నంద్యాల నుండి జనసేన నాయకులు 80 వాహనాల్లో తరలివెళ్లారు భవనాశి సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు ప్రధాని సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భవనాశి సోదరులు భవనాశి శ్రీనివాస,భవనాశి నాగ మహేష్ మాట్లాడుతూ కర్నూలు సమీపంలోని నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ సభ సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యారన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రూ.13,340 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని మోదీ రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, మరో రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రూ.2,276 కోట్ల విలువైన పనులను ఆయన జాతికి అంకితం చేశారని తెలిపారు **రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట* కొత్తగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఉన్నాయని,వీటి నిర్మాణానికి రూ.4,920 కోట్లు కేటాయించారన్నారు కర్నూలులో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి రూ.2,880 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత 16 నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురానున్నాయని, ఈ ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు జనసేన పార్టీ తరపున కృషి చేస్తామని ఈ సంస్కరణల ఫలితంగా రాష్ట్ర ప్రజలకు ఏకంగా రూ.8,000 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని, జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందేలా చూడటమే జనసేన పార్టీ ద్యేయమన్నారు పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలను మార్చే శక్తి ఈ సంస్కరణలకు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్యంగా 99 శాతం నిత్యావసర వస్తువులపై పన్ను సున్నా శాతానికి చేరడం వల్ల సామాన్యులపై భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల వల్ల కేవలం వినియోగదారులకే కాకుండా, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ నినాదాలకు ఈ సంస్కరణలు ఊతమిస్తాయని, భారతీయ ఉత్పత్తులు ప్రపంచ బ్రాండ్లతో పోటీ పడేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు నాగి వెంకటేశ్వర్లు, దండు మురళీకృష్ణ మారాజు గురు బాబు హరిప్రసాద్ కృష్ణ గౌడ్ దినేష్ మరియు జన సైనికులు బిజెపి నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నన్నూర్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ సమక్షంలో తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వికసిత్ భారత్-వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపుగా మోదీ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ ని కలిసిన బోర్డు మెంబర్ కొప్పర్ల.నాగరాజు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు కొప్పర్ల.నాగరాజు ఈవో బాపిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈఓ మరియు శ్రీకాళహస్తి ఇరిగేషన్ టెక్నికల్ ఆఫీసర్ వంకీపురం.వేణు దుశ్శాలువతో ఘనంగా కొప్పర్ల.నాగరాజును సన్మానించడం జరిగింది.అనంతరం ఆయన జ్ఞానప్రసునాంబ సమేత వాయు లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని వేద పండితులచే ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కో.టచంద్రశేఖర్,విజయనగరం,అనకాపల్లి జిల్లాల నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు జి సత్యనారాయణ,పి.రమేష్,రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు శ్రీనివాసరావు,పి.సత్యనారాయణ రాష్ట్ర సాధికారతి కమిటీ సభ్యులు కోటిపల్లి.చంద్రశేఖర్,కాకినాడ సాధికార సమితి జిల్లా అధ్యక్షులు చిప్పల.శీను, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

*ఫుడ్ కమిటీ బాధ్యతలు చేపట్టిన జనసేన నాయకులు*

కర్నూలులో జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్’ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉపముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కమిటీ బాధ్యతలు నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్ మరియు చందు నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వీరు విస్తృత ఏర్పాట్లు చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే: మంత్రి పొంగులేటి

పున్నమి అక్టోబర్ 16 ప్రతినిధి TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా పోటీ చేయొచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేదని, అంతకంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేసే అర్హత ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని క్యాబినెట్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీంతో వార్డు మెంబర్, సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఊరట లభించనుంది._

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.