Tuesday, 28 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

యూరియా కొరత, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యూరియా పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం – ఈ-పంట నమోదు తప్పనిసరి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా కొరత, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం ఈ-పంట నమోదు చేసుకున్న రైతులకే యూరియా అందుబాటులో ఉంటుంది. రాబోయే రబీ సీజన్ నుండి పంపిణీలో ఆధార్ OTP వెరిఫికేషన్ వ్యవస్థను అమలు చేయనున్నారు. రైతు ఆధార్‌కి లింక్ అయిన మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది, ధృవీకరణ పూర్తయిన తర్వాత అవసరమైన యూరియా మూడు విడతల్లో ఇవ్వబడుతుంది. అదనంగా, యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ప్రతి తగ్గించిన బస్తాకు ₹800 ఆర్థిక సహాయం అందజేస్తుంది. రైతులందరూ అక్టోబర్ 25 లోపు తప్పనిసరిగా ఈ-పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. గడువు మించితే యూరియాతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు, బీమా ప్రయోజనాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

తిరుపతి

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభలో బొజ్జల .

*ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన నన్నూర్ టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సమక్షంలో తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వికసిత్ భారత్- వికసిత్ ఆంధ్రప్రదేశ్ వైపుగా మోదీ గారు రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మోదీ గారి రాజనీతి డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధి పథంలో పయనిస్తుంది.*

క్రైమ్

తెలుగు బిగ్ బాస్‌పై కలకలం – పోలీసులకు ఫిర్యాదు!

తెలుగు బిగ్ బాస్ షోను తక్షణం నిలిపివేయాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ షో కొనసాగుతోందని, కుటుంబ విలువలు, సంస్కృతి పూర్తిగా దెబ్బతింటోందని ఫిర్యాదుదారులు తెలిపారు. ప్రత్యేకంగా కంటెస్టెంట్లుగా ఎంపిక చేసిన దివ్వెల మాధురి, రీతు చౌదరి లాంటి వారిని తీసుకోవడం ద్వారా యువతకు తప్పు సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు. కర్ణాటకలో బిగ్ బాస్ షోను నిలిపివేసినట్టే, ఇక్కడ కూడా నిషేధం విధించకపోతే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. షో నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదులో కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, బిగ్ బాస్ షో భవితవ్యంపై ఆసక్తి నెలకొంది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

వంజిరి, బరేవాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటన

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని వంజిరి గ్రామం మరియు బరేవాడలో ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వివిధ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువస్తే, ఆయన సానుకూలంగా స్పందిస్తూ వీలైన పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.తరువాత ఎమ్మెల్సీ దండే విఠల్ బుద్ధ విహార్‌లో మరియు పూలాజీ బాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వంజిరి గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం చేయాలి: ముంజం ఆనంద్ కుమార్

*_వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలి._* *_కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 వెంటనే అమలు చేయాలి._* *_వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి._* *_తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్* *డిమాండ్* కగజ్‌ నగర్‌: సంపదను సృష్టిస్తూ దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెక్కల కష్టం చేసి సంపదను సృష్టిస్తున్న వ్యవసాయ కార్మికుల జీవనం దుర్భరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన వ్యవసాయ కార్మికులకుతినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట కరువైందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12000 ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేయటం సిగ్గుచేటు అన్నారు. వ్యవసాయ కార్మికులకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్నారు. వ్యవసాయ కార్మికులు సంపాదించే సంపాదనలో 90 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు మెరుగుపరచాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు నెలకు 7500 పింఛన్ మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వచ్చిన వ్యవసాయతర కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున వారికి ఉపాధి కల్పించాలన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సిబ్బంది వేతనాలు పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయి అన్నారు. అసైన్మెంట్ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలన్నారు. పేదల ఆధీనంలో ఉన్న ఇండ్ల స్థలాలకు పట్టా హక్కులుకల్పించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ముంజం ఆనంద్ కుమార్ వ్యవసాయ కార్మిక సంఘం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్

*“బీసీ రిజర్వేషన్ 42% కోసం జిల్లా బంద్ కు జాతీయ మాల మహానాడు సంఘం పూర్తి మద్దతు*

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజనగర్ లోనీ యాదవ సంఘం భవనంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 18వ తేదీన బంద్ సంపూర్ణ మద్దతుకై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ బిసి కుల సంఘాల నాయకులు తమ తమ వారి సందేశాలు ఇచ్చారు ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా నాయకులు, తెలంగాణ జాతీయ మలమహానాడు జిల్లా సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణర రాజ్యాధికారి పార్టీ నుండి, మరియు తెలంగాణ మాల మహానాడు కుల సంఘం నుండి కూడా బిసి రిజర్వేషన్ 42 శాతం కొరకై పూర్తి మద్దతు తెలుపుతామని అన్నారు. ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు ఐకమత్యమై పోరాటం చేయాలని సూచించారు . బిసి రిజర్వేషన్42% కొరకై అన్ని కుల సంఘాలు మద్దతు తెలపాలని అన్నారు. దీనికి సమయం ఎక్కువ లేనందున ఇప్పటి తక్షణం నుండే మన ప్రాంతంలోని చిరు వ్యాపరస్తుల నుండి మొదలుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ , హోటల్స్ సెల్ పాయింట్స్ కూరగాయల మార్కెట్ చికెన్ సెంటర్స్ హోటల్స్ విద్యాసంస్థలు మరియు వివిధ రంగాల వారిని సంపూర్ణ బందు మద్దతు కై తెలపాలని కోరుతూ శాంతియుతంగా బంధు నిర్వహించాలని పేర్కొన్నారు.

హైదరాబాద్

తెలంగాణ కేబినెట్ భేటీ లో తీర్మానం చేసిన పలు అంశాల ని మీడియా కీ వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్‌.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఆ వివరాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా కీ తెలియజేశారు. వాటిలో ని ప్రధానంశాలు: దేశంలోనే రికార్డు స్థాయిలో మన రాష్ట్రంలో ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. ఇందులో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్ర‌భుత్వం 50 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల సేక‌ర‌ణ‌కు అంగీక‌రించింది.. మ‌రో 15 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు సేక‌రించాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్ల‌ను ప‌క‌డ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వ్య‌వ‌సాయ శాఖ‌, రెవెన్యూ శాఖ‌, పౌర‌ సరఫరాల శాఖ, ర‌వాణా శాఖల సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ చేపట్టాలని నిర్ణయించింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోన‌స్ రైతుల ఖాతాల్లో వెంట‌ వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. క‌లెక్ట‌ర్లు, అద‌న‌పుక‌లెక్ట‌ర్లు కొనుగోలు కేంద్రాల‌ను త‌నిఖీ చేయాలని.. ప్ర‌తి కొనుగోలు కేంద్రం ప‌ర్య‌వేక్ష‌ణ‌, స‌మ‌న్వ‌యానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు కు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధన ను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు ప‌ది ఎక‌రాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అలాగే రాష్ట్రంలో పలు సెక్టార్లకు కావాల్సిన భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మెైన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొద‌టి ద‌శ‌లో 5,566 కిలోమీట‌ర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్రాలు, మండ‌ల కేంద్రాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఇత‌ర రాష్ట్రాల‌తో అనుసంధాన‌మ‌య్యే ర‌హ‌దారుల‌కు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులను రూ, 10,547 కోట్లతో చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రూ.7500 కోట్లతో 75 కిలోమీటర్ల పొడవున మున్ననూరు,శ్రీశైలం హై లెవెల్ ఎలివేటెడ్ కారిడార్ కు ఆమోదం తెలిపింది. ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి శామీర్ పేట ఓఆర్ఆర్, ప్యార‌డైజ్ జంక్ష‌న్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వ‌ర‌కు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి ర‌క్ష‌ణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్ర‌త్యామ్నాయంగా 435.08 ఎక‌రాల భూముల‌ను అప్ప‌గిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేక‌ర‌ణ‌కు అయ్యే రూ.438 కోట్ల వ్య‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించేందుకు అంగీక‌రిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. మ‌న్న‌నూర్‌ – శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాలని నిర్ణయం. ఈనెల 23వ తేదీన మళ్లీ కేబినెట్ సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియజేసారు.

జాతీయ అంతర్జాతీయ

పంజాబ్ IPS ఆఫీసర్ ఇంట్లో 5 కోట్ల నగదు స్వాధీనం – CBI అరెస్ట్!

పంజాబ్‌లో సంచలనం సృష్టించిన ఘటనలో రోపార్ రేంజ్ DIG, 2009 బ్యాచ్ IPS హర్చరణ్ సింగ్ భుల్లర్ను CBI అధికారులు లంచం కేసులో అరెస్ట్ చేశారు. 8 లక్షల రూపాయలు లంచంగా స్వీకరిస్తుండగా ఆయన పట్టుబడ్డారు. అనంతరం అధికారుల బృందం హర్చరణ్ సింగ్ ఇంటి, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా, 5 కోట్ల రూపాయల నగదు, 1.5 కిలోల బంగారు నగలు, 22 లగ్జరీ వాచీలు, ఆడి, మెర్సిడెస్ కార్లు, అనేక తుపాకులు, పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధ్యవర్తినీ అరెస్ట్ చేశారు. భారీ సొమ్ము స్వాధీనం కావడంతో పోలీసు వర్గాల్లో కలకలం రేగింది. మరిన్ని సోదాలు కొనసాగుతున్నాయని CBI వెల్లడించింది. రేపు ఇద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నారు.

తెలంగాణ

మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీ ల ప్రత్యేక అధికారులపై ఉందన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ద్వారా ఇంకా మెరుగైన విద్యను అందించాల్సిన బాధ్యత కేజీబీవీల ప్రత్యేక అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కేజీబీవీ లపై మండల ప్రత్యేక అధికారులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 27 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో సుమారు 1335 లక్షలతో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్లు నారాయన్ అమిత్, జె. శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, మండల ప్రత్యేక అధికారులు హాజరయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.