Tuesday, 28 April 2026

Blog

E-పేపర్

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచ ఆహార దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేసుల నాగరాజు అధ్యక్షతన స్థానిక ఎస్.ఆర్.బి.సి. కాలనీ సమీపంలో ఉన్న లైఫ్ పరివర్తన హెచ్ఐవి బాలల కేంద్రానికి, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో నెల రోజులకు సరిపోయే ఆహార సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాత ఆత్మకూరు సుదర్శనం శెట్టి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి ఆహారం దొరకదు అన్న పరిస్థితి పూర్తిగా పోవాలని, ఆహారం వృధా చేయరాదనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని, ప్రజలకు సరిపడా ఆహార ఉత్పత్తి కోసం స్వయం సమృద్ధి సాధించే దశకు ప్రపంచమంతా చేరుకోవాలన్నదే ప్రపంచ ఆహార దినోత్సవం ప్రధాన ఆశయం అన్నారు. పరివర్తన లైఫ్ సెంటర్ నిర్వాహకులు అబ్రహం కుటుంబం హెచ్ఐవి బాలల సంరక్షణ కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ సహదేవుడు, ఆత్మకూరు సుదర్శనం శెట్టి లతొ పాటు,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్, ఏ.ఎన్.సీ ఆగ్రోస్ నిర్వాహకులు ఆత్మకూరు రవి, లయన్స్ క్లబ్ సభ్యులు వాసు, లైఫ్ పరివర్తన కేంద్రం నిర్వాహకులు అబ్రహం లింకన్, కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న హెచ్ఐవి బాలలు పాల్గొన్నారు.

Blog

ప్రపంచ అనస్తీషియా దినోత్సవం సందర్భంగా డాక్టర్ రవికృష్ణ కు సత్కారం

ప్రపంచ అనస్తీషియా దినోత్సవం పురస్కరించుకుని, స్థానిక కళారాధన కార్యాలయంలో నంద్యాల మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులు డాక్టర్ రవి కృష్ణ ను జిల్లా బాషోపాధ్యాయుల సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కన్నయ్య, హుస్సేన్ మియా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అవ్వారి శేష ఫణి,ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, బాషోపాధ్యాయుల సంస్థ జిల్లా అధ్యక్షులు కన్నయ్య,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 1992లో నంద్యాలకు మొట్టమొదటి అనస్తీషియా వైద్య నిపుణులుగా వచ్చిన డాక్టర్ రవి కృష్ణ గత 33 సంవత్సరాలుగా విశిష్ట అనస్తీషియా వైద్య సేవలు అందించారని కొనియాడారు. కొన్ని వేల శస్త్ర చికిత్సలకు మత్తుమందు ఇచ్చి వివిధ రకాల శస్త్ర చికిత్సల కోసం నగరాలకు నంద్యాల ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే జరగడానికి దోహదం చేశారని అన్నారు. మొట్టమొదటి ఎమర్జెన్సీ ఆసుపత్రి సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రి ఏర్పాటు చేసి 15 సంవత్సరాల పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు విశేష సేవలు చేశారని గుర్తు చేశారు. కేవలం వైద్యుని గానే కాకుండా కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నంద్యాల ప్రాంతంలో కళలను విశేషంగా ప్రోత్సహించారని, రచయితగా కథలు,నాటకాలు రాయడమే కాకుండా,నాటక దర్శకులుగా నంద్యాలకు అనేక నంది పురస్కారాలను,వివిధ పరిషత్తు పోటీల రాష్ట్రస్థాయి బహుమతులను తీసుకువచ్చారని, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా దివ్యాంగులకు నిరంతర సేవలు అందిస్తున్నారని, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులుగా నిరంతర సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను నంద్యాలలో నిర్వహించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. వీరి కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కళా రత్న హంస పురస్కారం, ఉగాది తెలుగు తల్లి పురస్కారం, కందుకూరి రాష్ట్రస్థాయి తెలుగు నాటక రంగ పురస్కారాలు అందజేసి గౌరవించారని అన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు సంస్థల పురస్కారాలు డాక్టర్ రవి కృష్ణ అందుకున్నారని చెప్పారు. ఈర్నపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు నరేంద్ర, డాక్టర్ రవి కృష్ణ కు అందజేసిన సన్మాన పత్ర పద్యాలు పాడి వినిపించారు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తాను నంద్యాలలో 1992 లో వచ్చానని, అంతకు ముందు అనస్తీషియా వైద్యులు కర్నూలు నుండి వచ్చేవారని, తాను వచ్చిన తర్వాత స్థానికంగానే అనస్తీషియా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం నంద్యాల లో దాదాపు 30 మంది అనస్తీషియా వైద్య నిపుణులు సేవలందిస్తున్నారని తెలిపారు.వైద్యునిగా ఈ సేవలు కొనసాగిస్తూ, కళా, సేవా, క్రీడా రంగాలలో తన కృషిని కొనసాగిస్తానని చెప్పారు. అనస్తీషియా దినోత్సవం రోజు తనను గుర్తుంచుకుని సత్కరించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాషోపాధ్యాయుల సంస్థ ప్రతినిధులు దామోదర్ విశ్వనాథరెడ్డి సుధాకర్ గౌడ్, లింగమయ్య ముస్తఫా, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వానోస్తే కష్టమే

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో వానోస్తే కష్టాలు తప్పేట్టు లేవు. ఎందుకంటే చిన్న పాటి వర్షానికి సైతం వీడులు మరియు రోడ్లు జలమయం మురికి మయమ్ అన్నట్టుగా వుంది. సరేలే ఈరోజు వాన లేదు అని ఊపిరి పీల్చుకునేలోపు రోడ్లపైన దుర్గంధం. పంచాయితీ మాత్రం పన్నుల రూపంలో వేలకు వేలు వసూలు చేసినప్పటికి ఊరు రూపురేకలు మాత్రం మారలేదు. వారి మీద వీరు వీరి మీద వారు చెప్పుకోవడమే పరామవధిగా అయ్యింది.ఇదంతా ఇలా ఉంటే మండల కేంద్రంలో ఇప్పటిదాకా మురుగు కాల్వలు సరిగ్గా లేకపోవడం వర్షపు నీరు ఇలా రోడ్లపై వీడూల్లో నిలిచి పోవడం వినడానికి విడ్డురంగా వున్నా ఇదే నిజం ఇప్పటికైనా అధికారులు మేము నాయకులం అని చెప్పుకునేవాళ్ళు పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి…

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేల MIM కి బిగ్ షాక్ : MIM నుండి BRS లోకి చేరిక లు

పున్నమి ప్రతినిధి జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని బోరబండ డివిజన్‌లో బీఆర్‌ఎస్ మరింత బలం పుంజుకుంది. బోరబండ డివిజన్ ఎంఐఎం (MIM) ప్రెసిడెంట్ షేక్ మునీర్ ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. గతంలో ఈ డివిజన్ నుంచి ఆయన కార్పొరేటర్‌గా కూడా పోటీ చేశారు. ఈరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. కేటీఆర్ గారు షేక్ మునీర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంఐఎం తరఫున మైనార్టీ కమ్యూనిటీలో మంచి పట్టు ఉన్న షేక్ మునీర్ బీఆర్‌ఎస్‌లో చేరడంతో బోరబండ డివిజన్‌లో పార్టీకి మరింత బలం చేకూరనుంది.

మహబూబ్ నగర్

సిఐ ని కలిసిన బేడ బుడగ జంగం నాయకులు

పున్నమి: అక్టోబర్ 16 ప్రతినిధి తెలంగాణ: జడ్చర్ల పోలీస్ స్టేషన్ సీఐ కమలాకర్ ను కలిసిన బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి నాయకులు గురువారం రోజున జడ్చర్ల నియోజకవర్గ పోలీస్ స్టేషన్ లో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీఐ ఆయన కు శాలువాతో సత్కారంచి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం నాయకులు మాట్లాడుతూ… మహబూబ్నగర్ జిల్లాలో కొంతమంది యువత, కొంతమంది మేము నాయకులమని చెప్పుకొని తిరిగేవాళ్లు మద్యం-మత్తు పదార్దాలకు అలవాటు పడుతున్నారని, చేడు మార్గం నుంచి మంచి మార్గానికి వచ్చేలా కృషి చేయాలని వారు కోరారు. మండలంలో జరిగే కొన్ని నేరాలను అదుపు చేయాలని సీఐ కి వినతి పత్రం అందజేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సీఐకి వివరించి చర్యలు చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పొన్నగంటి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు కుమారి రవి, పొనకంటి దశరథం, ప్రధాన కార్యదర్శి గగనం మన్యం, సోషల్ మీడియా కన్వీనర్ సిరిగిరి చిత్ర సేన తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ లోని 15 డివిజన్ లల్లో బీజేపీ విజయమే నా లక్ష్యం : బీజేపీ టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరము లోని టూ టౌన్ పరిధిలో గల 15 కార్పొరేషన్ స్థానాల్లో బీజేపీ విజయమే తన లక్ష్యం అని ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ తెలియజేసారు ప్రతి డివిజన్లో పోలింగ్ బూత్ అధ్యక్షులను కలిసి వారి పోలింగ్ బూత్ లో, ఆ డివిజన్లో ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా చెప్పట్టిన డివిజన్ యాత్ర కార్యక్రమం గురువారం 2వ రోజు పర్యటన టూ టౌన్ పరిధిలో ఉన్న 44వ డివిజన్లో ఆ డివిజన్ ఇంచార్జి ఖమ్మం టూ టౌన్ ఉపాధ్యక్షులు,పాశం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా 44వ డివిజన్లో దావత్ ట్రస్టు ఢిల్లీ వారిపేరుతో ఉన్న ఓ ఇల్లుని మజీద్ పేరుతో పెద్ద సౌండ్ లతో మైకులు పెట్టి డివిజన్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఈ సమస్య గురించి సిపి గారికి కోర్టులో కూడా నడుస్తుందని ఈ సమస్య పరిష్కారం అయితే డివిజన్ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని, ఆ డివిజన్ ప్రజలు వాపోయారు, అలాగనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పోలింగ్ బూత్ అధ్యక్షులుని పరామర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో రుద్ర గాని మాధవ్,యుగంధర్ నాయుడు, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, దాసరి మధు, ఉపేంద్ర, వంశీ, ఉన్నారు,

తిరుపతి

ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి-కోలా ఆనంద్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు.

నాయీ బ్రాహ్మణుల కులదైవం ధన్వంతరి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8 గంటలకు తిరుపతి పట్టణంలోని గాంధీభవన్ నుండి రాష్ట్రంలోని సుమారు వెయ్యి మంది నాయి బ్రాహ్మణులతో నాదస్వరం మరియు డోలు విద్వాంసులతో శోభయాత్ర మరియు కచేరి జరుగునని,ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్,తిరుమల దేవస్థానం చైర్మన్ బి.రాజగోపాల్ నాయుడు, తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొంటారు.కావున శ్రీకాళహస్తి పట్టణంలోని నాయీ బ్రాహ్మణ సోదరులందరూ తమ యొక్క నాదస్వరం,డోలు వాయిద్యాలతో ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

*సూపర్ జీఎస్టీ… సూపర్ సేవింగ్స్ పై అవగాహనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్*

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* బెలూన్లు ఎగురవేసి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, స్టేట్ జీఎస్టీ అదనపు కమిషనర్ సీతారాం శేఖర్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, యుసిడి పీడీ సత్యవేణి, డిఆర్డిఏ పీడీ లక్ష్మీపతి, జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్.సి.హెచ్. శ్రీనివాసరావు*కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు…** ఇది చక్కటి కార్యక్రమం.. ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుతున్నా* గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ఒక మంచి ఫ్లాట్ ఫామ్ గా నిలుస్తుందని విశ్వసిస్తున్నా..* GST రిఫార్మ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలి.. తెలియాల్సి ఉంది* నాలుగు స్లాబ్ ల నుంచి రెండు స్లాబ్ లకు జీఎస్టీ తగ్గటం హర్షణీయం.. శుభపరిణామం* ఇదొక చరిత్రాత్మక నిర్ణయం.. 1990లలో ఎల్.పి.జి. (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) లా ఇది అనూహ్య ఫలితాలను ఇస్తుంది* ప్రజల ఆర్థిక శక్తి పెరుగుతుంది.. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలుస్తుంది* రాబోయే కాలంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం* 2047 లక్ష్యాలు సాధిస్తాం… నం.1 స్థానంలో ఉంటాం* స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించడంలో జీఎస్టీ 2.0 చుక్కానిలా దోహదపడుతుంది* విశాఖను మరింత మెరుగైన నగరంగా తీర్చి దిద్దడంలో ది గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ మైలు రాయిగా నిలుస్తుంది

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న కన్నా లక్ష్మీ నారాయణ

శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి సేవలో పాల్గొనడానికి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి గురువారం సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ విచ్చేశారు.వారికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామి అమ్మవార్ల దర్శనానంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు,చిత్రపటం అందజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.