Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

నూతన కిసాన్ స్మార్ట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ముక్కా వరలక్ష్మి

ఓబులువారిపల్లి మండలం గద్దలరేవుపల్లి గ్రామం చిట్వేల్ రోడ్ దారిలో ఏర్పాటు చేసిన “కిసాన్ స్మార్ట్” స్టోర్‌ను *రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జి మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.డాక్టర్ వెంకటేశ్వర్లు ఏదోటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కిసాన్ స్మార్ట్ స్టోర్ మరియు యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు, మరియు పంటల మార్కెట్ ధరల సమాచారాన్ని సులభంగా పొందగలరు.ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ రైతుల అభివృద్ధి, సాంకేతిక ప్రగతి లక్ష్యంగా తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం గ్రామీణ వ్యవసాయ రంగానికి దోహదం చేస్తుంది. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇటువంటి వినూత్నమైన సేవలు అందిస్తుంది డాక్టర్ వెంకటేశ్వర్లు వంటి ఔత్సాహికుల అవసరం ప్రస్తుత సమాజానికి ఎంతో ఉంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిట్వేల్, ఓబుళవారిపల్లి, రైల్వే కోడూరు నియోజకవర్గాల కూటమి నాయకులు, రైతులు, మరియు స్థానిక ప్రజలు పాల్గొని కిసాన్ స్మార్ట్ ప్రారంభాన్ని స్వాగతించారు.

ఆంధ్రప్రదేశ్

ప్రతీ విద్యార్థి “కలాం సర్” ను స్ఫూర్తిగా తీసుకోవాలి. – లయన్ డా. పైడి. సింధూర – అబ్దుల్ కలాం ఒక రోల్ మోడల్ – జిఎన్వి జ్యూయలర్స్ అధినేత ఊన్న కిరణ్ కుమార్ (శ్రీకాకుళం – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

ప్రతీ విద్యార్థి “కలాం సర్” ను స్ఫూర్తిగా తీసుకోవాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థానంలో నిలుస్తారని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డా. పైడి. సిందూర అన్నారు. స్థానిక విశాఖ కోలనీలోగల శ్రీ అక్షర పాఠశాలలో, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షురాలు డా.పైడి.సిందూర మాట్లాడుతూ ప్రపంచ విద్యార్థి దినోత్సవాన్ని భారతదేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, ఉపాధ్యాయులు, డా. ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినాన నిర్వహిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించడానికి, స్ఫూర్తినివ్వడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియాగా పేరుపొందిన ఆయన, గొప్ప సైంటిస్ట్ గానే కాకుండా మానవతావాదిగా కూడా పేరు పొందారన్నారు. అవినీతి ఆరోపణలు లేని గొప్ప వ్యక్తి కలాం అని, రాజకీయ చరిత్ర లేకుండానే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తుచేశారు. పర్యావరణ పరిరక్షణ మన ఊరు– మనబాధ్యతలో భాగముగా కాలుష్యరహిత జిల్లాగా మార్చటం మనతోనే మొదలుపెడదామని, ప్లాస్టిక్ ను అంతం చేసి, ప్రపంచాన్ని కాపాడుదామని పలు సూచనలను అందించారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న జిఎన్వి జ్యూయలర్స్ ఎండి ఊన్న కిరణ్ కుమార్ మాట్లాడుతూ కలాం గారు ఇప్పటికీ ఎందరికో రోల్ మోడల్ గా నిలుస్తున్నారని, రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన ఆ పదవికే వన్నెతెచ్చారన్నారు. ఆయన సాధించిన గొప్ప విజయాలకు గుర్తుగా భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా లభించిందని, భారతదేశ విద్యావ్యవస్థను మెరుగుపరచడానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారన్నారు. విద్యార్థులంటే ఆయనకు చాలా అభిమానమని, ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూనే తుది శ్వాస విడవటంతో ప్రపంచమంతా కన్నీటిపర్వమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, సభ్యులు పొడుగు. చరణ్, చౌదరి శ్రీనివాస్, శ్రీ అక్షర పాఠశాల ప్రిన్సిపాల్ హరిత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఆహారాన్ని వృధాచేయకండి .. – లయన్ డా. పైడి. సింధూర – రిక్షా కార్ముకులకు, దినసరి కూలీలకు అన్నప్రసాద వితరణ (శ్రీకాకుళం టౌన్ – అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)

ఆహారాన్ని వృధాచేయకండని, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు లయన్ డా.పైడి. సింధూర అన్నారు. ప్రపంచ ఆహారాన్ని దినోత్సవం సందర్భంగా స్థానిక సూర్యమహాల్ దగ్గరలో గల రిక్షా కార్మికులకు, దినసరి కూలీలకు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందించారు. ఇందులో భాగముగా అధ్యక్షురాలు లయన్ డా. పైడి, సిందూర మాట్లాడుతూ ప్రపంచ ఆహారాన్ని దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ సహకారంతో నగరంలో పలు చోట్ల, నిస్సహాయులకు ఆహారాన్ని అందించడం ఆనందంగా ఉందని, ఆకలి, పోషకాహార లోపం, ఆహార భద్రతపై అవగాహనను ప్రపంచవ్యాప్తంగా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మంచి జీవితం, మంచి భవిష్యత్తు కోసం.. ఆహారం అందించడమనే లక్ష్యంగా ఈ ఏడాది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ హంగర్ అంశం లో భాగంగా అన్నవితరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గాలి, నీరు తర్వాత ప్రాథమిక అవసరమైనది ఆహారమేనని, ప్రపంచంలో బిలియన్లకు పైగా ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుందన్నారు. జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడ.రవికుమార్ మాట్లాడుతూ రైతులు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారని, కొరత మాత్రం అలాగే కొనసాగుతోందని, చాలామంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. వాతావరణంలో మార్పులు, ఆర్థికమాంద్యం, కొవిడ్ వంటి మహమ్మారుల సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆకలి సమస్యలను ఎదుర్కొన్నారని, ముఖ్యంగా ఇవి పేదలు, బలహీన వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉపాధ్యక్షులు డా.బోగెల.ఉమామహేశ్వర రావు, ఉర్లం.శివతేజ పట్నాయక్, కార్యదర్శి టెక్కం.రామ్ గోపాల్, సభ్యులు చౌదరి.శ్రీనివాస్, మానవత సంస్థ పూర్వపు కార్యదర్శి టి. శ్రీనివాస రావు, రిక్షా కార్మిక యూనియన్ సభ్యుల బృందం పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీలో మరో హైటెక్ సిటీ.. దెబ్బకు విశాఖ రాత మారనుంది!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే ఘట్టం చోటుచేసుకుంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) హబ్‌‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి మంగళవారం నాడు ఢిల్లీలో గూగుల్‌ ప్రతినిధులతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే విశాఖపట్నం నగరం కొత్త టెక్‌ దశలోకి అడుగుపెట్టనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు “భారత్ ఏఐ శక్తి” పేరిట అమలులోకి రానుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర నాయకులు, గూగుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఏఐ హబ్‌ ఏర్పాటుతో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద టెక్‌ సిటీగా ఎదగనుంది. వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయి. ఐటీ, డేటా సైన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో యువతకు కొత్త మార్గాలు తెరుచుకోనున్నాయి. చంద్రబాబు నాయుడు టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి పథకాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్‌ టెక్‌ మ్యాప్‌పై నిలబెట్టే దిశగా మరోసారి ముందడుగు వేశారు. గూగుల్‌ ఏఐ హబ్‌తో విశాఖ రాత మారిపోనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సత్యసాయి

మన డబ్బులు -మన లెక్కలు మహాసభ

నల్లగుట్లపల్లిలో మన డబ్బులు మన లెక్కలు మరియు వార్షికమహాసభ నిర్వహించడం జరిగింది ఓడి చెరువు అక్టోబర్ 16 పున్నమి న్యూస్ : మండలం ఇనగలూరు క్లస్టర్ పవిత్ర వివో ఏ నల్లగుంట్ల పల్లి లో వార్షిక మహాసభ నిర్వచించడం జరిగిందిఈ ఈ కార్యక్రమంలో ఏపిఎం మాట్లాడుతూ మన డబ్బులు మన లెక్కలు దానిపై గ్రూప్ సభ్యులకు అవగాహన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీంద్ర సీసీ రతమయ్య వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప గ్రామ సంఘ అధ్యక్షురాలు కార్యదర్శి కోశాధికారి ఈసీ సభ్యులు హాజరు కావడం జరిగింది.

నిర్మల్

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమం

శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సూచన మెరకు ఈ రోజు శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల సుభద్ర నిలయం బైంసా వారి అద్వర్యంలో సప్త శక్తి సంగం కార్యక్రమాన్ని పూర్వ ప్రాథమిక విద్యార్థుల యొక్క మాతలకు నిర్వహించడం జరిగింది.ఇందులో శ్రీమతి కేంశెట్టి పూజ గారు మన పాఠశాల పోషకులు మాట్లాడుతూ కుటుంబం ఎలా ఉండాలి,కుటుంబ సభ్యులతో ఎలా మెలగాలి,ఉమ్మడి కుటుంబం యొక్క అవశ్యకతతో పాటు పర్యావరణం పైన పోషకులకు చక్కగ వివరించారు.ఆ తర్వాత శ్రీమతి సుమలత గారు సోషల్ వెల్ఫేర్ కళాశాల బైంసా ప్రధానాచార్యులు,పూర్వ విద్యార్థి.ముఖ్య అతిథిగా హాజరై పిల్లలను ఈ రోజుల్లో ఎలా పెంచాలో,ప్రతి మహిళ పొదుపు చేయడం పైన దృష్టి పెట్టాలని వివారించగా శ్రీమతి చిలింకర్ వందన గారు మన పూర్వ విద్యార్థి ,మరియు ప్రబంధకారిణి సభ్యురాలు భారతీయ అభివృద్ధిలో,కుటుంబ అభివృద్ధిలో పిల్లల అభివృద్ధిలో తల్లుల యొక్క(మహిళల యొక్క) పాత్ర ఎలా ఉండాలి మరియు మహిళల యొక్క శక్తి ఏమిటో చక్కగా వివరించగా మరో ముఖ్య అతిథి శ్రీ మతి మంజుల లడ్డా గారు ఈ రోజు శ్రీ సరస్వతి శిశుమందిరాల ఆవశ్యకతను వివరించారు .ఈ కార్యక్రమంలో 321 మంది పోషకులు పాల్గొని చక్కని కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు

జనగాం

ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుంది: ఏఎంసి జనగామ చేర్మన్ శివరాజ్

ప్రజా ప్రభుత్వమే రైతులకు అండగా ఉంటుందని రైతులకు మద్దతు ధరలు పెంచడం ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం ఈరోజు ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో జనగామ మండలంలో వెంకిర్యాల, గాను పహాడ్, ఎర్ర గొల్ల పహాడ్, ఎర్రకుంటతండా, వడ్లకొండ పెద్ద పహాడ్ గ్రామాలలో పిఎసిఎస్ మరియు ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ,జనగామ ,చిటకోడూరు PACS చైర్మన్ లు నిమ్మతి మహేందర్ రెడ్డి, చిర్ర శ్రీనివాస్ రెడ్డి, జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,AMC డైరెక్టర్లు నామాల శ్రీనివాస్, పర్ష సిద్దేశ్,PACS డైరెక్టర్ వంగల మల్లారెడ్డి,APM శంకరయ్య,CEO రామ్మోహన్, భాస్కర్ రెడ్డి,AEO ప్రవళిక, అనిల్,కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, శివరాత్రి కుమార్,జనార్ధన్ రెడ్డి, మిద్దెపక సిద్ధులు,ప్రభాకర్, గాజే అనిల్,జనగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాశ్ యాదవ్, ముక్కెర యాదగిరి,జడల మల్లేష్, దండెబోయిన ధర్మేందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు రఘు గౌడ్,రాజు, అరవింద్ , శ్రీను మరియు వివిధ గ్రామాల నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!మృతుల మట్టి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత..!

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ప్రమాదంలో తీవ్ర గాయాలైన మేఘన కి అత్యవసర చికిత్స అందించాలని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఆదేశం..!మృతి చెందిన వారికి ఇన్సూరెన్స్ క్లైమ్ కోసం, అన్ని ఏర్పాట్లు చేస్తున్న స్థానిక టిడిపి నాయకత్వం.. కలిగిరి అక్టోబర్ 16 :(పున్నమి ప్రతినిధి ):// ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం, దూబు గుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన, చవలమూడి బాబు, మమత దంపతులు వారి కుమార్తెలు, వైభ, మేఘన, ద్విచక్ర వాహనంపై, కలిగిరికి ఆధార్ నమోదు నిమిత్తం వచ్చి తిరుగు ప్రయాణంలో దూబు గుంట కు వెళుతుండగా, మార్గమధ్యంలోని తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద, బుధవారం సాయంత్రం బోర్ వెల్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చవలమూడీ బాబు, (34)మమత,(27)మరియు వారి కుమార్తె వైభ(8) ప్రమాద సంఘటనలోనే అక్కడికక్కడే మృతి చెందారు. మేఘన కు చేయి నుజ్జు నుజ్జు కావడం తోపాటు తీవ్ర గాయాల పాలయింది. ఈ ప్రమాద విషయాన్ని స్థానిక నాయకులు, పిచ్చ పాటీ చలపతి రెడ్డి ,హాజరత్ రెడ్డి శివరామయ్య,పవన్ కళ్యాణ్, మాలకొండా రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మండల నాయకులైన బిజ్జం వెంకటకృష్ణారెడ్డి, రావులకొల్లు వెంగపనాయుడు,కి, మృతుల కుటుంబానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ఆత్మకూరులో చికిత్స పొందుతున్న మేఘన కు అత్యవసర చికిత్స అందించాలని నెల్లూరులోని కిమ్స్ వైద్యులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు. హుటాహుటిన ఆత్మకూరు నుండి మేఘనాను నెల్లూరుకు తరలించారు. కిమ్స్ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబానికి బోర్ వెల్స్ లారీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైమ్ చేసే నిమిత్తం, ఎఫ్ ఐ ఆర్ నమోదు, పోస్టుమార్టం రిపోర్టు తదితర, పనులను స్థానిక నాయకులు దగ్గరుండి చేస్తున్నారు. ఈ కేసు నిమిత్తం అడ్వకేట్ ను నియమించి ఇన్సూరెన్స్ క్లెమ్ పై పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా మృతుల కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం 20వేల రూపాయలు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకులు అందజేశారు. మృతుల కుటుంబాలకి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇచ్చిన అండను, పలువురు ప్రశంసిస్తున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

🏆 “Aruvit 2K25”లో SDMSMK విద్యార్థుల దుమ్ము రేపిన విజయాలు

విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి వుయ్యూరులోని AG & SG కాలేజ్ ఆధ్వర్యంలో 14-10-2025న నిర్వహించిన “Aruvit 2K25” కార్యక్రమంలో, SDMSMK కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులు తమ ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నారు. వివిధ సాంకేతిక, సాంస్కృతిక పోటీలలో పాల్గొన్న మా విద్యార్థులు అనేక బహుమతులను సొంతం చేసుకున్నారు. విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: 🎯 టెక్నికల్ క్విజ్ ఎస్‌.కె. ఫుర్కానా – III AI – 2వ స్థానం ఎం.డి. నుహా – III AI – 2వ స్థానం యాస్మిన్ – II BCA – 2వ స్థానం 💻 PPT ప్రెజెంటేషన్ కె. స్వరూప రాణి – II CS(A) – 1వ స్థానం 🎤 పాటల పోటీ ఎస్‌.కె. మున్నీ – III CSCS – 1వ స్థానం 🎭 డంబ్ షో (Dumb Smash) చి. శ్రీవల్లి – III CSCS – 2వ స్థానం ఎం. భవాని – III CSCS – 2వ స్థానం 🎲 లూడో పోటీ ఎం. భవాని – III CSCS – 1వ స్థానం 🎈 బెలూన్ బ్లాస్ట్ చి. శ్రీవల్లి – III CSCS – 1వ స్థానం 🗝️ ట్రెజర్ హంట్ జహ్నవి – II CS(A) – 1వ స్థానం నవ్య – II CS(A) – 2వ స్థానం అనిత – II CS(A) – 3వ స్థానం ఈ విజయాలు మా విద్యార్థుల ప్రతిభ, కృషి, పట్టుదలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ గారు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మరియు అధ్యాపకులు విజేతలను అభినందించారు.

నిర్మల్

NSS స్పెషల్ క్యాంప్ పోస్టర్స్ విడుదల

ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భైంసాలో NSS యూనిట్ – 1 ఆధ్వర్యంలో నిర్వహించబోయే NSS ప్రత్యేక శిబిరం (Special Camp) కు సంబంధించిన పోస్టర్స్‌ను ఘనంగా విడుదల చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య గారు NSS చైర్మన్ హోదాలో హాజరై పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ – “NSS ద్వారా విద్యార్థులు సమాజానికి సేవ చేయడం నేర్చుకుంటారు. ప్రత్యేక శిబిరాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎ రాజు గారు మాట్లాడుతూ – “ప్రతి సంవత్సరం NSS ప్రత్యేక శిబిరాల ద్వారా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, పరిశుభ్రత, ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు” అని తెలిపారు. NSS వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని, రాబోయే ప్రత్యేక శిబిరంలో సమాజ సేవా కార్యక్రమాలను విజయవంతం చేయాలని సంకల్పబద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్, అధ్యాపకులు, రవికుమార్ డాక్టర్ శంకర్ డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్యార్థులు మరియు NSS వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ స్పెషల్ క్యాంప్ తేదీ 25.10.2025 నుంచి 31.10.2025, స్థలం: వాటోలి గ్రామం మండల్ భైంసా,

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.