Wednesday, 29 April 2026

Blog

తెలంగాణ

*బిగ్ బాస్ రియాలిటీ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు*

పున్నమి తెలంగాణ ప్రతినిధి; తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోపై పోలీసులకు ఫిర్యాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బిగ్ బాస్ షోపై ఫిర్యాదు అశ్లీలతతో యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపణ సిద్దిపేటకు చెందిన ఇద్దరు యువకుల ఫిర్యాదు తెలుగులో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈ కార్యక్రమం అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.సిద్దిపేటకు చెందిన కమ్మరి శ్రీనివాస్, బి. రవీందర్ రెడ్డి అనే ఇద్దరు యువకులు ఈ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షోలో ప్రసారమయ్యే కంటెంట్ కుటుంబంతో కలిసి చూసేలా లేదని, యువతపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ షో ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వారు ఆరోపించారు.గతంలోనూ బిగ్ బాస్ షోపై పలు సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. అయితే, నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కర్నూలు

*శ్రీశైల మల్లన్న సేవలో.. ప్రధాని..!*

పున్నమి ప్రతినిధి: గురువారం శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ.. శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

తెలంగాణ

*బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రేవంత్ సర్కార్‌కు షాక్*

పున్నమి తెలంగాణ ప్రతినిధి: తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి తీసుకునే చర్యలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో జరుగనున్న కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చిస్తారా? అనే సందేహం వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని.. 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని.. సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ధర్మాసనం గురువారం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. కాగా, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే..

తెలంగాణ

*సమంత, తమన్నా, రకుల్ ఫేక్ ఓటర్ ఐడీలు.. సోషల్ మీడియాలో వైరల్*

పున్నమి తెలంగాణ ప్రతినిధి: హైదరాబాద్, అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్లు సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ ఫేక్ ఓటర్ ఐడి లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటర్ల జాబితాలో వీరి లిస్ట్ కనబడటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే అధికారులు రూపొందించిన జాబితాలో నిజంగానే వీరి పేర్లు ఉన్నాయా? లేదా ఎవరైనా దురుద్దేశంతో ఇలా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్ తో హీరోయిన్ల ఫోటోలు పెట్టీ ఓటర్ ఐడీ కార్డులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేయడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదయింది. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతతో పలు డివిజన్లలో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అటు నిన్ననే తమ అభ్యర్థిపై బీజేపీ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన కూడా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి ఉపఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే..

తెలంగాణ

సుప్రీం కోర్టు లో తెలంగాణ ప్రభుత్వం కి ఎదురు దెబ్బ

పున్నమి ప్రతినిధి తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. బీసీ లకి 42% రిజర్వేషన్ కలిపిస్తు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము పై తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదన లతో సుప్రీం కోర్టు ఏకీ భవించలేదు.దీంతో పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించినది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జీఎస్టీ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రవాణా శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జిఎస్టి ర్యాలీని ప్రారంభించిన అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ తగ్గించడం వల్ల అనేక వస్తువులు రేట్లు తగ్గి ఎంతోమందికి మేలు కలుగుతుందని ఆయన చెప్పారు ఇది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఘనత గా ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఆముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు రవాణా శాఖ అధికారులు వాణిజ్య శాఖ అధికారులు పాల్గొన్నారు

హైదరాబాద్

దీపక్ రెడ్డి కి బీ ఫామ్ అందజేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షులు నారప రాజు రామ చంద్ర రావు

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి అయినా దీపక్ రెడ్డి కి నేడు బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారప రాజు రామ చంద్రరావు బీ ఫామ్ అందజేశారు.

ఖమ్మం

బీసీ బంద్ కి ఖమ్మం జిల్లా బీజేపీ మద్దత్తు

ఖమ్మం పున్నమి ప్రతినిధి 42% బీసీ రిజర్వేషన్ అమలు కోరుతూ బీసీ జాతీయ నేత ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘాలు ఈ నెల 18 తెలంగాణ బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బంద్ కి పూర్తి మద్దత్తు తెలియజేసారు. ఈ బంద్ కార్యక్రమం లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాల్గొనలని పిలుపునిచ్చారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

గుంతల రోడ్డును సరిచేసిన గుండి మాజీ సర్పంచ్ సెండే దత్తు

ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చిన సేవా కార్యక్రమం ఇటీవల జరిగింది. గుండి గ్రామం నుండి ఆసిఫాబాద్ వెళ్ళే రహదారి ఇటీవల వర్షాకాలంలో భారీ వర్షాల వలన గుంతలమయమై, రవాణాకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. దానిని గమనించిన గ్రామ మాజీ సర్పంచ్ సెండే దత్తు గారు వెంటనే స్పందించారు.తన సొంత ఖర్చుతో రోడ్డుపై మొరం మట్టి వేయించి, గుంతలను నింపించి చదును చేయించారు. గ్రామ ప్రజలు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని సెండే దత్తు గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుసుల్ల సత్తయ్య, తిరుసుల్ల భీమ్ రావు, ఆరెందుల సంతోష్, గ్రామస్థులు రాస్పెళ్లి సుభాష్, దాన్‌పెల్లి సంతోష్, ఆటో డ్రైవర్లు సాయికృష్ణ, దిలీప్, మోండయ్య, అంజయ్య, పవన్, మహేష్, వినోద్, జాబరి రాజు, పెరుగు రవి తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

కర్నూల్ కి ప్రధానమంత్రి రాకతో… దారి మళ్లింపు

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్నూలు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం అలంపూర్, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని చౌరస్తాలో ఉండవెల్లి ఎస్సై శేఖర్, సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ పోలీసులతో పాటు 20 మంది సిబ్బందితో విధులు నిర్వహిస్తూ కడప, బెంగళూరు, నంద్యాల, తిరుపతి, నందికొట్కూరు వెళ్లే వాహనాలను అలంపూర్ చౌరస్తా మీదుగా బ్రాహ్మణ కొట్కూర్ వైపు మళ్ళించారు. అదే రూట్లో వచ్చే వాహనాలను కర్నూలు మీదగా వెళ్లకుండా అలంపూర్ మీదుగా హైదరాబాద్కు ఇదే దారిలో వాహనాలు వెళ్లేందుకు భారీగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ రోడ్లన్నీ ఏపీ నుండి వచ్చే వాహనాలతో రద్దీగా ఉన్నది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.