Tuesday, 28 April 2026

Blog

రంగారెడ్డి

హయత్నగర్: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పున్నమి: అక్టోబర్ 17 హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని శవం లభ్యమైంది. సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మార్వో కార్యాలయం ఎల్లమ్మ గుడి వద్ద వ్యక్తి (సుమారు 45) మృతదేహం స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో డెడ్బడీని మార్చురీకి తరలించారు. వివరాల కోసం 8712662640, 8712662285 నంబర్లకు సంప్రదించాలని సీఐ తెలిపారు.

కామారెడ్డి

అత్యవసర సమయాల్లో ధైర్యంగా ఉండాలి

– విద్యార్థులకు అంబులెన్స్ సిబ్బంది అవగాహన కామారెడ్డి, అక్టోబర్ 17:పున్నమి ప్రతినిధి . : అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలను సకాలంలో వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో తెలియజే స్తూ, కామారెడ్డి జిల్లా అంబులెన్స్ శాఖ ఆధ్వర్యం లో రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలోని బాల బాలికల పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబులెన్స్ విభాగం సిబ్బంది విద్యార్థులకు ప్రథమ చికిత్స, రోడ్డు భద్రత, సిపిఆర్ పద్ధతులు అత్యవసర సేవ ల వినియోగంపై వివరించారు.సిబ్బంది మాట్లాడు తూ, ప్రమాదం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో 108 నంబర్‌కు వెంటనే కాల్ చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కాల్ సమయంలో వివరాలు స్పష్టంగా చెప్పడం, భయపడకుండా ధైర్యంగా వ్యవహరించడం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.అంబు లెన్స్ వచ్చేలోపు ప్రథమ చికిత్స పద్ధతులు ఎలా పాటించాలో, చిన్న గాయాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రదర్శన రూపంలో వివరిం చారు.అదేవిధంగా అంబులెన్స్ లోపల ఉండే వైద్య పరికరాలు, వాటి వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదా లు జరిగినప్పుడు బాధితులకు తక్షణ సహాయం చేయడం, రోడ్డు భద్రత నియమాలు పాటించడం వంటి అంశాలను కూడా సవివరంగా వివరించా రు.అత్యవసర పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా వ్యవహరించి, వెంటనే 108 సేవలను సంప్రదిస్తే ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. ఈ సంద ర్భంగా ఉపాధ్యాయులు కార్యక్రమంపట్ల సంతో షం వ్యక్తం చేస్తూ అంబులెన్స్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు ఈ సదస్సు ద్వారా అత్యవసర వైద్య సేవలపై విలువైన అవగాహన పొందామంటూ ఆనందం వ్యక్తం చేశారు.

వికారాబాద్

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజీనామా

పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన స్వయంగా రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి సమర్పించారు. అయితే, బీజేపీ అధికృతంగా ఇంకా ధ్రువీకరణ ఇవ్వలేదు.

విశాఖపట్నం

శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం*

👆 తిరుమల, 2025 అక్టోబర్ 17: తిరుమల శ్రీవారికి శుక్రవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్ల‌ప‌ల్లెకు చెందిన శ్రీ కొప్పెర సాయిసురేష్‌ ఈ మేరకు హుండీని ఆలయంలో పోటు పేష్కార్ శ్రీ మునిరత్నంకు అందించారు. రాగి, ఇత్త‌డితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 70 కిలోలు ఉంటుంద‌ని, దీని విలువ రూ.2.50 ల‌క్ష‌ల‌ని దాత‌ తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

విశాఖపట్నం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు విచారణకు హాజరయ్యారు

ది.17.10.2025న వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు (మొద్దయ్య), జవిశెట్టి కోటేశ్వరరావుల జంట హత్యల కేసులో A6,A7 నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలు ఈరోజు రెండవ విడత పోలీసు పట్టణంలోని రూరల్ సీఐ వద్ద .

అన్నమయ్య

నందలూరు ఉరుస్ మహోత్సవమునకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కు ఆహ్వాన పత్రిక

ఈనెల 31-10-2025 శుక్రవారం జరిగే నందలూరు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా మగ్దుమ్ ఉరుసు మహోత్సవముకు నందలూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మల్లికార్జున్ రెడ్డికి మగ్దుమ్ షా దర్గా ఉరుస్ కమిటీ సభ్యులు దర్గా చిన్న గురువులయ్య సయ్యద్ హైదర్ హుసేని సాహెబ్ తో కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ వక్ఫ్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టిడిపి పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మహర్ ఖాన్,షేక్ అహ్మద్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ సయ్యద్ జుల్ఫికర్, తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గూగుల్ విజయోత్సవం ఘనవిజయం – పార్టీ ఆదేశాలను గౌరవించాలంటూ పల్లా శ్రీనివాసరావు హెచ్చరిక

విశాఖపట్నం, గాజువాక – పున్నమి ప్రతినిధి గాజువాకలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించిన గూగుల్ విజయోత్సవ కార్యక్రమం ఘనవిజయవంతంగా జరిగింది. పాత గాజువాక జంక్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పార్టీ విజయాన్ని ప్రజలతో పంచుకున్న నాయకులకు పల్లా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. అయితే పార్టీ ఆదేశాలు ఉన్నప్పటికీ గైర్హాజరైన కొంతమంది నేతల నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో పార్టీ శాసనాలను పట్టించుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం

పాత మొబైల్ ఫోన్ లతో సైబర్ నేరాలు :పోలీస్ ల హెచ్చరిక

(పున్నమి ప్రతినిధి) బద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల మండలంలో, ‘పాత మొబైల్స్‌కి ప్లాస్టిక్‌ సామాన్లు ఇస్తాం’ అంటూ గ్రామాల్లో తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన అక్తర్‌ ఆలీఖాన్‌ అనే వ్యక్తి పాత మొబైల్‌ ఫోన్లు సేకరించి, బీహార్‌లోని సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నట్లు విచారణలో తేలింది. వారు ఈ ఫోన్లను మరమ్మతులు చేసి, ఐఈఎంఐ నంబర్లు మార్పు చేసి సైబర్ నేరాలకు వాడుతున్నారని పోలీసులు తెలిపారు. అతడి వద్ద నుంచి 150 పాత ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటివారికి పాత ఫోన్లు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరించారు.

విశాఖపట్నం

ఈరోజు మురళి నగర్ వర్మ కాంప్లెక్స్ దగ్గర ఆహ్వాన ఫంక్షన్ హాల్ లో.

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) గారా జానకి కుమారుడు దాసు, రత్న కుమారి వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ . ఈరోజు 51వ వార్డులో ఉడా కాలనీ మాధవధార ఉడా కమ్యూనిటీ హాల్లో చెల్లూరి అప్పన్న(లేటు)& పైడితల్లి ఏకైక కుమారుడు చిన్నారావు,స్వప్న వారి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు .మరియు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ .

విశాఖపట్నం

జర్నలిస్టులే దిక్సూచి : బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం. డాబా గార్డెన్స్ , విజేఎఫ్ ప్రెస్ క్లబ్ : జర్నలిస్టులే పాలకులను సరైన మార్గంలో నడిపించే దిక్సూచులని బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు అన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జాప్ సభ్యులకు గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు నిర్వహించే బాధ్యత పైనే ప్రజాస్వామ్యం మనగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలకు, పాలకులకు వారిధిగా ఉంటూ పాత్రికేయులు అందించే సేవలు అమోఘమన్నారు. ప్రజా సమస్యలను, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపుతూ జర్నలిస్టులు సమాజానికి చేసే సేవలను కొనియాడారు. జర్నలిస్టులు అందించే సేవలు ఫలితంగానే సమాజం అభివృద్ధి జరుగుతుందన్నారు. జాప్ విశాఖ విశాఖ అధ్యక్షులు కే.ఎం. కీర్తన్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యుల సంక్షేమానికి రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రైలులో ప్రయాణానికి రాయితీతో కూడిన పాసులను పునరుద్ధరించాలని కోరారు. పాత్రికేయులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కీర్తన్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాత్రికేయులు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటుందని కీర్తన్ తెలిపారు. జాప్ విశాఖ విశాఖ ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ తమ యూనియన్ నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ కార్యవర్గ ప్రతినిధులు,,గంట చంద్రశేఖర్ వి ఉదయ్ కుమార్, జి దానేష్, కే సందీప్ కే పృథ్వీరాజ్ వై.యస్ సాయికుమార్, పి .అర్జున్, ఎస్ రామకృష్ణ, , ఎస్. ఎన్. నాయుడు, ఆర్. శ్రీనివాసరావు, జి రాజు, కే .శంకర్ ,సురేష్, జి సతీష్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.