Tuesday, 28 April 2026

Blog

భక్తి

కార్తీకమాసం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లొని ప్రకాశం జిల్లా లో గల సుప్రసిద్ధ శైవ క్షేత్రం భైరకోన యొక్క విశేషాలు పున్నమి పాఠాకూల కోసం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (తెలంగాణ పున్నమి ప్రతి నిధి) బ్రహ్మ,విష్ణువు, మహేశ్వరుడు కలిసి ఉన్న ఆలయం మీకు తెలుసా? అదీ మన తెలుగు రాష్ట్రంలో ? ఒకే గుహలో చెక్కిన 9 ఆలయాలు ప్రకాశం జిల్లా..అదేనండీ..మన ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకాశం జిల్లానే…అందులో సి.యస్. పురం మండలం..సి.యస్.పురం అంటే పూర్తిపేరు చంద్రశేఖరపురం. ఆ మండలంలో వున్నది అంబవరం కొత్తపల్లి అనే ఊరు. ఆ ఊళ్ళోనే వున్నది అందాలకి ఆటపట్టు, అద్భుతాలకు నెలవైన లోయ #భైరవకోన. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దులలో వున్నదీ ప్రదేశం. ప్రకాశంజిల్లా ముఖ్యపట్టణమైన ఒంగోలుకు 120 కి.మీ.ల దూరంలో వున్నది అంబవరం కొత్తపల్లి. అంబవరం కొత్తపల్లి మరియు సి.యస్. పురం దాకా బస్సులున్నాయి. అక్కడనుండీ ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవాలి. సమయాభావం వున్నవారు ముందు నుంచి వారు ఏర్పాటు చేసుకున్న వాహనాలలో వెళ్ళివస్తే మంచిది. ఈ ప్రాంతమంతా నల్లమల అడవులు వ్యాపించి వున్నాయి. అడవుల అద్బుత సౌందర్యమేకాదు..7, 8 శతాబ్దాలలో పల్లవ రాజుల సమయంలో నిర్మింపబడిన అందాల ఆలయాలు కూడా చూపరుల మనసులు దోచుకుంటాయి. ఇవే కాకుండా ఇక్కడవున్న మిగతా విశేషాలేమిటంటే …. ఈ కోనలో కారు దిగగానే కనిపించేది పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం. ఆయన పక్కనుంచే వున్న దోవలో లోపలకి వెళ్తే 200 మీటర్ల ఎత్తునుంచి దూకే జలపాతం. జలపాతంలో నీరు వున్నా వేసవికాలంలో నీరు అతి తక్కువగా వుంటుంది. కొండలమీద నుంచి కారే ఆ అతి తక్కువ నీరు కింద నిర్మింపబడ్డ పెద్ద సిమెంటు టబ్లలో చేరుతాయి. వచ్చినవారందరూ అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ జల ప్రవాహం తను పయనించే దోవలో వున్న వివిధ వైద్య మూలికలను ఒరుసుకుని ప్రవహించటంతో ఆ నీటిలో స్నానం చేసినవారికి అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుందని ఇక్కడివారి నమ్మకం. అందుకే నీరు ఎంత తక్కువ వున్నా వచ్చిన వారిలో చాలామంది స్నానం చేస్తుంటారు. ఇక్కడి ఇంకొక విశేషం నిత్యాన్నదానం. జలపాతం దగ్గరకెళ్ళే దోవలోనే కుడివైపు నిత్యాన్నదానశాల వుంది. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి వచ్చినవారందరికీ భోజనం పెడతారు. ఈ దోవలోనే ఎడమవైపు దేవస్ధానం వారివే రెండు కాటేజ్ లు వున్నాయి. మరీ అవసరమైతే అక్కడ వుండవచ్చు. ఆ మొదట్లోనే టీ షాపు వున్నది. ఇవి తప్పితే ఈ ప్రాంతంలో ఇంకేమీ దొరకవు. రాత్రిళ్ళు మనుష్య సంచారం తక్కువ వున్నా ఏమీ భయం లేదని టీ కొట్టువాళ్ళు చెప్పారు. వాళ్ళు 15 సంవత్సరాల నుంచీ అక్కడే వుంటున్నారుట. అడవులూ, జలపాతమే కాదు సుమండీ..వాటిని మించిన సుందర దృశ్యమాలిక కావాలంటే మీరు కారాపిన చోటికి రండి. అక్కడ ఎదురుగా ఒక వంతెన, కొంచెం ఎడమవైపు వెళ్తే ఇంకో వంతెన వస్తుంది. వీటిలో దేనిమీదయినా బయల్దేరండి. మీరే ఊపిరి బిగబట్టి మరీ చూస్తారాసుందర దృశ్యాలని.. ఒకే కొండరాతిలో చెక్కిన తొమ్మిది గుహాలయాలు. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, విశ్వేశ్వర, నగరికేశ్వర, భార్గేశ్వర, రామేశ్వర, మల్లికార్జున, పక్షమాలిక లింగ. గుహలంటే మరీ లోతుగా వుండవు. మనం లోపలకు వెళ్ళక్కరలేకుండానే దైవ దర్శనం చేసుకోవచ్చు. ఆ గుహాలయాల వెలుపల అందమైన శిలా మూర్తులు. భారత దేశంలో ఎక్కడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకే చోట పూజించే ఆలయాలు వున్నట్లు లేదు. కానీ ఇక్కడ మాత్రం, త్రిమూర్తులు ఒకే చోట కొలువై వున్నారు. శివుని కోసం చెక్కిన ఈ గుహాలయాలలో శివుడు మధ్యన గర్భగుడిలో లింగరూపుడై పూజలందుకుంటుంటే, ఆలయ ప్రవేశ గోడమీద బ్రహ్మ, విష్ణువుల విగ్రహాలు చెక్కి వున్నాయి. ప్రతి ఆలయానికి ముందు ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు ఆలయం చెక్కిన శిల్పి (పూజారిగారు చెప్పారు..ముందు మేము కుబేరుడనుకున్నాము), విగ్రహాలుంటాయి. ఈ ఆలయాలన్నీ ఒకే శిల్పి చేత చెక్కబడటం విశేషం. ఈ శివాలయాలన్నీ పై వరసలో వుంటే కింద ఆలయంలో త్రిముఖ దుర్గ, ముందు శివలింగం పూజలందుకుంటున్నాయి. ఈ దుర్గ కుడివైపు ముఖం మహాకాళి..నోట్లోంచి జ్వాల వస్తూ వుంటుంది. మధ్యన మహలక్ష్మి, ప్రసన్నవదన. ఎడమవైపు మహా సరస్వతీదేవి. ఎక్కడా లేనట్లు ఇక్కడ సరస్వతీదేవి అద్దం చూసుకుంటూ వుంటుంది. కారణం అడిగితే పూజారిగారు తన భీకరమైన స్వరూపం భక్తులు చూస్తే తట్టుకోలేరని అలా అద్దం ద్వారా చూస్తే కొంత తీవ్రత తగ్గుతుందని చెప్పారు. నా కోతి బుధ్ధి అంగీకరించలేదు. నాకు తెలిసి సరస్వతీదేవి సౌందర్యవతి, జ్ఞాన ప్రదాత.. తను ఉగ్ర రూపిణి కాదు అంటే…అయితే ఆవిడ తన అలంకరణ చూసుకుంటోంది అనుకోండి అన్నారు. ఇక్కడ నన్ను అమితంగా బాధించినదేమిటంటే..ఆ ఆలయాలు నిర్మింపబడి ఇన్ని వందల సంవత్సరాలయినాయి. ఇదివరకు రోజుల సంగతి మనకి తెలియదు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు, సాధనాలు అందుబాటులో వున్నాయి. చదువు, తెలివిగల ప్రజలు, ప్రభుత్వమూ వుంది. వీరెవ్వరూ వీటిని గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు.?? కనీసం ఇలాంటి కొన్ని ప్రదేశాల చరిత్రలన్నా పరిశోధించి ప్రజలకందజేస్తే, మన గత వైభవం అందరికీ పరిచయం చేసిన వారవుతారుకదా. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి నిర్మించిన ఇలాంటి అపురూప నిర్మాణాల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయి ఎవరికి తోచిన కథలు వారు చెప్పుకోవలసినదేనా!!?? ఇదే ఏ విదేశాలలోనన్నావుంటే ఎంత శ్రధ్ధ తీసుకునేవారోకదా అని. పూజారిగారు చెప్పిన ఇంకొన్ని విశేషాలు. ఈ ప్రాంతంలో కోటి ఒక్క శివలింగాలు, 101 కొలనులు వున్నాయి. అమ్మవారి ఆలయానికి ఎదురుగా చిన్న కోనేరు మూసి వున్నది హైదరాబాదులో ఇళ్ళల్లో వుండే నీటి సంపుల్లా. కార్తీక పౌర్ణమినాడు చంద్రకిరణాలు ఆ నీటిలోపడి (ఆ రోజు మూత తీస్తారు) ఆ ప్రతిబింబం అమ్మవారిమీద పడుతుందిట. ఆ అద్భుతం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారుట. పక్కన ఒక గుహలో సొరంగ మార్గం వున్నది. అది హనుమనగిరి దాకా వెళ్తుంది. ఆ ఆలయాలన్నీ చెక్కిన శిల్పి సమాధి అక్కడ వుంది. ఒక కొండమీదకి మెట్లు వున్నాయి. పైన ఏమున్నదంటే దుర్గాలయం అన్నారు. అలసిపోయుండటంతో ఎక్కలేదు. ఇంకో చిన్న కొండమీదకి మెట్లు..లక్ష్మీ, అన్నపూర్ణాలయాలనే బోర్డు కనబడింది. పైకి వెళ్తే చిన్ని గుహ, మనిషి కూర్చుని వెళ్ళాలి లోపలికి.. లోపల 2, 3 కూర్చోవచ్చు. లోపల లక్ష్మీదేవి, అన్నపూర్ణేశ్వరీదేవి చిన్న విగ్రహాలున్నాయి. అక్కడ పూజారిగారు శ్రీ కాశీరెడ్డి నాయనగారి శిష్యులు. ఆయన ఈ ప్రాంతం గురించి చెప్పిన విశేషాలు… పూర్వం ఈ ప్రాంతాన్ని భైరవుడు అనే రాజు పాలించేవాడు కనుక భైరవకోన అనే పేరు వచ్చిందని కొందరంటారు. పూర్వం మునులు ఇక్కడ భైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి తపస్సు చేశారుకనుక భైరవకోన అనే పేరని ఇంకొందరంటారు. ఏది ఏమైనా, ఈ కోన క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయనకో చిన్న ఆలయం వున్నది త్రిముఖ దుర్గాలయానికి ఎదురుగా గట్టుమీద. పూర్వం ఈ ప్రాంతాన్ని అభివృధ్ధిపరచినవారిలో శ్రీ అన్నకావిళ్ళ సుబ్బయ్యతాత అనే ఆయన ముఖ్యులు. ఈయన విగ్రహం ఇక్కడ వున్నది. ఇక్కడ అన్నపూర్ణేశ్వరీమాత కొలువైవుండటానికికూడా ఆయనే కారణం. ఆయన శివ భక్తుడు. శివుడు స్వప్న దర్శనమిచ్చి నిన్ను కరుణిస్తానన్నాడట. కానీ ఎన్నాళ్ళకూ కనికరించలేదుట. అప్పుడాయన అమ్మతో మొరబెట్టుకున్నాడుట. అమ్మ ఆయన ఆర్తి గమనించి అన్నపూర్ణేశ్వరీ రూపాన కనిపించినదట. మరి నిన్ను నేను కరుణిస్తే నాకేమిస్తావని భక్తుడికి పరీక్షపెట్టినదట. అప్పుడా భక్తుడు నాదగ్గరకొచ్చిన వాళ్ళకి నేను మంచి చెయ్యాలి. అలా నాకు వరమివ్వు. నేను బతికున్నంతకాలం నీకు ఏదోవిధంగా నైవేద్యం పెడతానని చెప్పాడుట. ఆయన పరోపకార తత్వాన్ని గ్రహించిన జగజ్జనని ఆయన్ని అనుగ్రహించటమేగాక అన్నపూర్ణాదేవిగా అక్కడే స్ధిరపడ్డది. కాలచక్ర భ్రమణంలో కొంతకాలం మరుగునబడిన ఈ ప్రదేశం తిరిగి 1932లో బయటపడింది. 1949లో శ్రీ కాశీరెడ్డినాయన ద్వారా అందరికీ తెలిసింది. అద్భుతమైన పర్యాటకప్రాంతంగా అభివృధ్ధి చెయ్యటానికి అన్నివిధాలా తగిన ప్రదేశం ఇది. ఇలాంటి అద్భుత క్షేత్రాలను పర్యాటక స్ధలాలుగా అభివృధ్ధి పరచి, పరిశోధనలు జరిపించి వాటి చరిత్ర ప్రజలకందజేస్తే ఈ కళలకాణాచిలు మన వైభవాన్ని వేనోళ్ళ చాటుతూ ఎల్లకాలమూ నిలచివుంటాయి కదా..* . #శివయ్యా! నీవు మాతోనే ఉన్నావా లేదా మాలో కొలువై ఉన్నావా?? నీవు మా హృదయంలో వెలుగై, ప్రతి శ్వాసలో నీ పేరు మ్రోగేలా ఉన్నావు. నీ జటాజూటంలో ప్రవహించే గంగలా మా మనసులు కూడా పవిత్రమవ్వాలి అని కోరుకుంటాం. నీ కంఠంలోని నీలి కాంతి మా జీవితంలోని అంధకారాన్ని పారదోలుతుందని నమ్ముతాం. శివయ్యా, నీ ధ్యానంలో కూర్చుంటే సమాధి వంటి శాంతి వస్తుంది, నీ నామం జపిస్తే భయమంటే తెలియదు. మా చిన్న మనసులు నీలో లీనమై, నీ కరుణతో నిండిపోవాలని కోరుకుంటున్నాము.

కామారెడ్డి

బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కోసం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : సామాజిక, రాజ్యాంగ, న్యాయబద్ధమైన బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం,ఉప్పల్వాయి గ్రామంలో బీసీ నాయకులు, ప్రజలు శుక్రవారం బీసీ వ్యతిరేకుల దిష్టిబొమ్మను దహనం చేసి తమ ఆగ్ర హాన్ని వ్యక్తం చేశారు. ‘జై బీసీ, జై జై బీసీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయ కులు మాట్లాడుతూ, అనేక దశాబ్దాలుగా అణచి వేయబడ్డ బీసీ వర్గాల సామాజిక, రాజకీయ అభి వృద్ధి కోసం ఉద్దేశించిన 42 శాతం బీసీ రిజర్వేష న్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి, తీర్మానం చేసి అమ లు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఉందని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధిని వ్యతిరేకించే శక్తులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజలు, ముఖ్యంగా బీసీ సమాజం ఈ కుట్రలను అర్థం చేసుకొని, ఇకనైనా మేల్కొని చైతన్యవంతం కావాలని పిలుపునిచ్చారు. తమ హక్కులను సాధించుకోవడానికి మరో పెద్ద ఉద్య మాన్ని, పోరాటాలను నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు.రేపు రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని పిలుపు బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న బంద్‌లో అన్ని బీసీ సంఘా లు, ప్రజా సంఘాలు, యువత, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకమై, ఐక్యత చాటి, తమ హక్కుల సాధన కోసం కలిసి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో గ్రామ బీసీ నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్*

*తెలకపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్* పున్నమి: అక్టోబర్ 17 ప్రతినిధి తెలంగాణ: * విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల సమయపాలన, బోధనా ప్రమాణాలను పరిశీలించిన కలెక్టర్ * పాఠశాలలో మొత్తం 126 మంది విద్యార్థుల్లో 91 మంది మాత్రమే హాజరని గుర్తించి అసంతృప్తి వ్యక్తం * విద్యార్థుల హాజరు శాతం పెంచే బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని కలెక్టర్ స్పష్టం * తల్లిదండ్రులతో సమన్వయం చేసుకొని 100% హాజరు సాధించాలంటూ ఉపాధ్యాయులకు ఆదేశాలు * ఫేషియల్ అటెండెన్స్ విధానం సక్రమంగా అమలు అవుతుందో లేదో వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్ * విద్యార్థుల కోసం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలంటూ వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచనలు * పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచన * ప్రతి విద్యార్థి లక్ష్యం పెట్టుకుని దాని సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపు * గణితంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచన * ప్రతి వారం పరీక్షలు నిర్వహించి విద్యార్థుల పురోగతిని అంచనా వేయాలంటూ సూచించిన కలెక్టర్ * బోధనను మరింత ప్రాక్టికల్‌గా, ఆసక్తికరంగా మార్చాలని ఉపాధ్యాయులకు సూచన * దీర్ఘకాలంగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించి తల్లిదండ్రులతో సమీక్షలు నిర్వహించాలని ఆదేశం * పాఠశాల పరిసరాలను పరిశీలించి శుభ్రత, క్రమశిక్షణ, నిర్వహణపై సూచనలు ఇచ్చిన కలెక్టర్ * కలెక్టర్ వెంట మండల తహసిల్దార్ జాకిర్ ఆలీ, ప్రధానోపాధ్యాయుడు శోభన్ బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

2 టౌన్ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల డివిజన్ ల పర్యటన : బీజేపీ కీ మద్దత్తు తెలిపాలని ప్రజల ఆలోచన

ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో గల 15 కార్పొరేషన్ డివిజన్ లలో ప్రజల సమస్య లు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కొరకు పోరాటం చేసే ఆలోచనలో భాగంగా బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ చేపట్టిన డివిజన్ ల యాత్ర కార్యక్రమం ప్రజల్లో చర్చ ని తీసుకోని వచ్చింది. పార్టీ లు వేరు అయినా అధికారం వారిదే అని ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్ ల పని తీరు పట్ల విసిగి వేజారి పోయిన రెండవ పట్టణ పరిధిలో గల 15 డివిజన్ ల ప్రజలు ఈ సారి జరగబోవు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కీ మద్దత్తు తెలపాలి అని దృఢ నిశ్చయము తో ఉన్నారు. ప్రజా సమస్య ల పరిష్కారం కోరుతూ యాత్ర చెపట్టిన బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటే నారాయణ యాదవ్ కీ ఈ సందర్భంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. నేడు జరిగే 57 వ డివిజన్ యాత్ర లో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు సైతం పాల్గొనబోతుండటం ఈ యాత్ర యొక్క ప్రభావం కీ నిదర్శనం అనే చెప్పాలి.

ఖమ్మం

మాజీ ఎమ్మెల్సీ కొండా సురేఖ మురళి…కామెంట్స్

హనుమకొండ జిల్లా హనుమకొండ రాం నగర్ లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి…కామెంట్స్… హైదరాబాద్ లో సీఎం రేవంత్ అంటే బాగా ప్రేమ.. రాజశేఖర్ రెడ్డి తర్వాత… సీఎం రేవంత్ రెడ్డి మాకు సీఎం మధ్య ఏలాంటి వైరుద్యాలు లేవు… మీనాక్షి నటరాజ్.. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నారు.. సీఎం… కచ్చితంగా నాకు ఇస్తారు.. సుమంత్ విషయం లో నాకు తెల్వదు… కొండా సురేఖ ఛాంబర్ లో వాస్తు చూసి వచ్చాను… పలు సలహాలు ఇచ్చాను.. సెక్రటరీ ఎట్లా ఉంటుందో నాకు తెల్వదు… నా బిడ్డా… లండల్ లో ఉండే… కొండా సురేఖ నేను ఒక కారులో తిరగలేదు… ఒకరు పోయిన ఒకరు ఉండాలి.. తిరగడం లేదు… సీఎం, పొంగులేటి,మా ఇంటికీ వచ్చారు.. నన్ను కొండా మురళి ని టార్గెట్ చేస్తే… మీరే నష్టపోతారు.. సీఎం వద్దకు పోత… నాకు సీఎం దూరం కాదు.. మీనాక్షి నన్ను మీడియా లో మాట్లాడొద్దు అని చెప్పారు… నేను అమ్మకు క్షమాపణ చెబుతా.. పోలీస్ లు మా ఇంటికీ ఎందుకు వచ్చారో నాకు తెల్వదు…

ఖమ్మం

_Local Body Elections | స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తాం : మంత్రి పొంగులేటి.

*_Local Body Elections | స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తాం : మంత్రి పొంగులేటి.._* _Local Body Elections | హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు._ _సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు._ _ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసిందని పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు._ _భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు._ _ఈ సారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయింది. కేంద్ర సహకరించిన, సహకరించకపోయినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం. మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తాం. రాష్ట్రంలో మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.. ఈ మూడింటిని కొడంగల్, నిజామాబాద్, హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. మెట్రో సెకండ్ ఫేజ్‌పై కమిటీ ఏర్పాటు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు._ _రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది అని మంత్రి తెలిపారు._ _కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్‌-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది అని మంత్రి పొంగులేటి తెలిపారు._

కామారెడ్డి

జిల్లాలో గ్రామ పంచాయతీ సెక్రెటరీల ‘చీకటి రాజ్యం’!

– డ్యూటీకి డోకా: వచ్చామా, వెళ్లామా అన్న చందంగా పనితీరు! – గ్రామస్థాయి ‘పెద్దల’ మాటలకే విలువ!! సామాన్యుల పనులకు మోక్షమెక్కడ? – బ్రోకర్లతో ములాఖత్‌లు, చిందులు, మందులు… పనులన్నీ గాలికే! కామారెడ్డి, 17 అక్టోబర్. పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా: జిల్లాలోని పలు గ్రామ పంచాయ తీలలో సెక్రెటరీల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్రామానికి బాస్’గా ఉండాల్సి న పంచాయతీ సెక్రెటరీలు తమ ప్రాథమిక విధుల ను పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.వీరి నిర్లక్ష్యంతో గ్రామాల అభివృ ద్ధి, ప్రజల ముఖ్యమైన పనులు కుంటుపడుతు న్నాయని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు.పెద్దల మడులోత్తుతున్న ‘బాసులు’ సాధారణంగా, గ్రామ పంచాయతీ సెక్రెటరీ అంటే గ్రామ పరిపాల నకు కీలకమైన అధికారి. కానీ, కామారెడ్డి జిల్లాలో ని చాలా గ్రామాల్లో సెక్రెటరీల పనితీరు కేవలం ‘డ్యూటీకి వచ్చామా, పోయామా’ అన్న చందంగానే మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిపై గ్రామస్థాయి నాయకుల (లోకల్ లీడర్ల) ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, సెక్రెటరీలు వారి మాటకు మడులోత్తుతున్నారని లోబడడం అత్యం త ప్రాధాన్యత ఇవ్వడం పై స్థానికులు చెబుతు న్నారు. ఆస్తుల మార్పిడికి అడ్డుకట్ట.. నాయకుల మాటలే వేదం! పంచాయతీ సెక్రెటరీల అత్యంత కీలకమైన విధులలో ఒకటి ఆస్తి మార్పిడికి సంబంధించినది. ముఖ్యంగా, వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులు, ప్లాట్లు, భూముల జాగాలు వంటి వాటిని ఎంక్వయి రీ చేసి, అర్హులైన కుటుంబ సభ్యుల పేరు మీద మార్పిడి చేయాలని అనేకమంది ప్రజలు అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే, సెక్రెటరీలు ఈ పను లను సకాలంలో చేయడం లేదని, బదులుగా ‘స్థాని క నాయకుల మాటలు విని’ అర్జీలను పక్కన పెడు తున్నారని లేదా ఆలస్యం చేస్తున్నారని ప్రజ లు ఆరోపిస్తున్నారు.నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని చెపుతున్నారు. మురికి కాలువలు, రోడ్లు, తాగునీరు… పనులన్నీ గాలికే! మంచినీటి సరఫరా, వీధి రోడ్ల నిర్వహణ, మురికి కాలువల శుభ్రత వంటి గ్రామానికి సంబంధించిన అత్యవసర పనులను సెక్రెటరీలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి.ముఖ్య మైన పనులు మూలనపడి ఉన్నప్పటికీ, వాటిపై దృష్టి సారించకుండా… సెక్రెటరీలు ఇతర అంశాలపై దృష్టి పెడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. బ్రోకర్లతో ‘చిందులు, మందులు’ గడిపిస్తున్న కాలం! పని చేయాల్సిన సమయంలో సెక్రెటరీలు, గ్రామం లోని బ్రోకర్లు, మధ్యవర్తులకు ఎక్కువగా సమయం కేటాయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. “బ్రోకర్‌లతో కలిసి చిందేసి, మందేసి కాలం వెళ్ళదీ స్తున్నారే తప్ప! తమ పనులు చేసిపెట్టట్లేదని” జిల్లా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, కామారెడ్డి జిల్లాలో ని గ్రామ పంచాయతీ సెక్రెటరీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యతారహితంగా వ్యవహరి స్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, గ్రామాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి

విజయవాడ కనకదుర్గమ్మకు రెండు కోట్లు విలువైన ఆభరణాలు కానుక

🔹విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కీర్తిలాల్ జ్యువెలరీ వారు సుమారు రూ. 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలను కానుకగా అందించారు. 2026 క్యాలెండర్, భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదలయ్యాయి. ధన త్రయోదశి, దీపావళి వేడుకలతో పాటు కార్తీక మాసం ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. డిసెంబర్ 4న కలశజ్యోతి, 11-15 వరకు దీక్షా విరమణలు ఉంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్

మీ మెదడు మీ జీవితాంతం నడిపిస్తుంది — దానిని తెలివిగా పోషించండి!

మన జీవితంలో ప్రతి ఆలోచన, నిర్ణయం, భావోద్వేగం — అన్నింటినీ నడిపించే శక్తి మన మెదడు. దానిని ఆరోగ్యంగా ఉంచడం మన బాధ్యత. ప్రతి రోజు మెదడు శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. అవోకాడోస్, బెర్రీస్, డార్క్ చాక్లెట్, వాల్నట్స్, ఎగ్స్, ఫ్యాటీ ఫిష్, తుర్మెరిక్ (పసుపు), ఆలివ్ ఆయిల్, మరియు సముద్రపు పచ్చిక (సీవీడ్) వంటి ఆహారాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గించి, మానసిక స్పష్టతను అందిస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మీ మెదడుకు ఉత్తమ ఇంధనం — దానిని తెలివిగా ఎంచుకోండి, ఆరోగ్యంగా ఉంచుకోండి!

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్లడ్ గ్రూప్ పై అవగాహన ..!

వింజమూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు బ్లడ్ గ్రూపు పరీక్ష నిర్వహించి ఎవరిది ఏ బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండ రావు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఐడి కార్డులు మంజూరు చేస్తున్నందున ఐడి కార్డులో బ్రెడ్ గ్రూప్ పొందుపరచుట కొరకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంకొరకు కావలి రెడ్ క్రాస్ సొసైటీనిసంప్రదించ డం జరిగిందన్నారు. అందుకు వారు గురువారం పాఠశాల నందు 735 మంది పిల్లలకు బ్లడ్ శాంపిల్ తీసి బ్లడ్ గ్రూపు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డి పద్మావతి, జెవి శేషమ్మ, అనిల్, వివేకానంద కళాశాల ప్రిన్సిపల్మద్దూరి గోపాల్ రెడ్డి, నేతాజీ కళాశాల ప్రిన్సిపల్ కె.వి రత్నం, గుండె మడకల పాఠశాలఅధ్యాపకులు శివకోట రెడ్డి జడ్పీహెచ్ఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.