Tuesday, 28 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

వరిపంట వ్యాధుల నియంత్రణకు రైతులకు సూచనలు

 కామారెడ్డి 17 అక్టోబర్ పున్నమి ప్రతినిధి   : వరి సీజన్‌లో పంటలను వివిధ తెగుళ్లు తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని రామారెడ్డి వ్యవసా యశాఖ అధికారి భాను శ్రీ ఒక ప్రకటనలో హెచ్చ రించారు. ముఖ్యంగా దోమపోటు, పొట్టకుళ్ళు, కాటుక పండు తెగులు, నల్ల కంకి, మెడ విరుపు వంటి వ్యాధులు ఇటీవల వర్షాలతో పెరిగిన తేమ కారణంగా విస్తరిస్తున్నాయని తెలిపారు.ఈ నేప థ్యంలో రైతులు సమయానుకూలంగా గుర్తించి సరైన మందుల పిచికారీ చేయాలని సూచించా రు.దోమపోటు పొలాల్లో పిల్ల, పెద్ద దోమలు గుంపు లుగా రసం పీలుస్తూ పంటను వలయాకారంలో ఎండిపోయేలా చేస్తాయి. నివారణకు డైనోటెఫ్యు రాన్ 0.4 గ్రా లేదా బ్యూప్రోఫేజిన్ 1.6 ml లేదా పైమెట్రోజైన్ 50WG 0.6 గ్రా లేదా ఇమిడక్లోప్రీడ్ 40% + ఎతిప్రోల్ 40% WG 0.25 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.   పొట్ట కుళ్ళు తెగులు…. పొట్టాకు నల్లటి లేదా గోధు మ మచ్చలు ఏర్పడి గింజలు తాలు పోవడం ప్రధా న లక్షణం. దీనికి ప్రోపికొనజోల్ 1 ml లేదా టేబు కోనాజోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి చిరు పొట్ట దశలో ఒకసారి, 25% పూత దశలో మరొకసారి పిచికారీ చేయాలని సూచించారు.   కాటుక లేదా మాణి పండు తెగులు….  కంకిలో గింజలు మొదట పసుపు రంగులోకి, తరువాత నలుపు రంగులోకి మారడం గమనించ వచ్చు. నివారణకు ప్రోపికొనజోల్ 1 ml లేదా కార్బెండజిమ్ 50% WP 1 గ్రా లేదా టేబుకోనా జోల్ + ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 75WG 0.4 గ్రా లీటరు నీటికి కలిపి రెండు దఫాలుగా పిచికారీ చేయాలని సిఫార్సు చేశారు.   వరి కంకి నల్లి / నల్ల కంకి….  గింజలపై నల్ల మచ్చలు ఏర్పడి, గింజలు పాలు పోసుకోక తాలు గింజలుగా మారడం సాధారణం. దీనికి స్పైరోమెసిఫెన్ 1 ml లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.   మెడ విరుపు తెగులు….  ఈనిక దశలో మెడ భాగంలో నల్ల మచ్చలు ఏర్ప డతాయి. కంకికి పోషకాలు చేరక మెడ విరిగి వేలా డుతుంటుంది. నివారణకు ట్రైసైక్లోజోలు 0.6 గ్రా లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 ml లేదా కాసుగ మైసిన్ 2.5 ml లీటరు నీటికి కలిపి 10–15 రోజు ల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వాతావరణాన్ని, తెగుళ్ల ఉధృతిని గమనించి సమయానుకూల చర్యలు తీసుకుంటే పంట నష్టం తగ్గించవచ్చని తెలిపారు.  

తెలంగాణ

లారీల వాహనాలను పంపించేందుకు రిబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన : మంత్రి

నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ నుండి ధాన్యం సరఫరా లారీల వాహనాలకు రెబ్బెన కట్ చేసి, జెండా ఊపి ప్రారంభించిన రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు ఇతర అధికారులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ లబ్బీపేట…. **పేదరిక నిర్మూలన దినోత్సవం**……..పున్నమి ప్రతినిధి.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల, అర్థశాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో *పేదరిక నిర్ములన దినోత్సవoసందర్బంగా* మూడవ సంవత్సరం అర్ధశాస్త్రం చదువుతున్న విద్యార్థుల విజయవాడ నగర బస్టాండ్, రైల్వే స్టేషన్ లో పేదవారికి ఆహారం పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అర్ధశాస్త్ర విభాగధిపతి డి. అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు… కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు వీరి సేవలను అభినందించారు.💐

తిరుపతి

గృహప్రవేశ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి నియోజకవర్గం,ఏర్పేడు మండలం, ఇసుకతాగేలీ చెందిన ఎంపీటీసీ ముని రెడ్డి నూతన గృహప్రవేశ మహోత్సవంలో మాజీ MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండలం అధ్యక్షుడు కునాటి రమణయ్య యాదవ్,సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,మాధవమాల సర్పంచ్ కరీముల్లా,పాతవిరాపురం సర్పంచ్ గురవారెడ్డి,పార్టీ ఉపాధ్యక్షులు రాజారెడ్డి,లోకనాథ్ రెడ్డి, పెరుమాళ్,జల్లి ప్రసాద్, మునిరత్నం నాయుడు,ప్రభు,కోబాకు సర్పంచ్ చంగల్రాయులు,ఎ.లోకేష్ యాదవ్,భాస్కర్ రెడ్డి,మహేష్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాద మృతుల కుటుంబానికి 10 వేళ రూపాయలు ఆర్థిక సాయం చేసిన టీడీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణరెడ్డి,,,!!

కలిగిరి. అక్టోబర్ 15.(పున్నమి న్యూస్ ప్రతినిధి):// కలిగిరి మండలo తూర్పు దూబగుంట గ్రామo ఒకే కుటుంబానికి చెందిన చవలమూడి బాబు,మమత, విభ, రోడ్డు ప్రమాదంలో మరణించగా కలిగిరి మండల పార్టీ కన్వీనర్ బిజ్జం వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల* రూపాయల ఆర్థిక సహాయం అందించినారు. నాయకులు కొప్పర్తి హజరత్ రెడ్డి, పిచ్చపాటి చలపతి, సాధనాల కొండప నాయుడు, కొప్పోలు కొండలరావు, గునుపాటి, రవీంద్ర రెడ్డి చవలమూడి మాధవ, పెద్దన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

అన్నారు గూడెం గ్రామంలో ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

అన్నారు గూడెం గ్రామంలో ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అన్నారు గూడెం గ్రామంలో ఈరోజు ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌ నవభారత్ ఐ సెంటర్‌ వారి సౌజన్యంతో, తల్లాడ విజన్ టెక్నీషియన్ శ్రీమతి వినోద గారి ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజల నుండి 150 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించగా, 100 మందికి పైగా ఉచిత కంటి అద్దాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు, గ్రామస్థులు, మా గ్రామాన్ని ఎన్నుకొని సేవలందించిన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌కి మరియు వారి డాక్టర్ల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో సేవలందించిన ఎల్.వి. ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్‌ బృంద సభ్యులు: • అడ్మినిస్ట్రేటర్ శ్రీ దేవి చందర్రావు • విజన్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ సాయి తేజ • విజన్ టెక్నీషియన్ శ్రీమతి రాయపాటి వినోద, శ్రీమతి స్నేహ చైతన్య విజయలక్ష్మి • ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీమతి జ్యోతి సారిక గ్రామస్థులకు సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఆ.పతి వెంకట రామారావు, దొడ్డ శ్రీనివాసరావు, ఎల్లంకి వెంకటేశ్వర్లు, చింతల నరేష్, గాదె కృష్ణారావు,పెరిక కిరణ్,తమ్మిశెట్టి కృష్ణ, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు, తంబళ్ల రమేష్, పంచాయతీ సిబ్బంది, గ్రామ వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆటో డ్రైవర్ల సేవలో ” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత

పల్నాడు జిల్లా, దాచేపల్లి టౌన్,లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలులో భాగంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం “స్త్రీ శక్తి” పథకం అమలు చేయడం వల్ల నష్టపోతున్నాము అని బాధపడుతున్న ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం కోసం అక్టోబర్ 4వ తేదీన అనగా దసరా కానుకగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున మొత్తం రూ. 436 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభం అయిన “ఆటో డ్రైవర్ల సేవలో” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత)పథకం కార్యక్రమాన్ని, గురజాల నియోజకవర్గ పరిధిలో దాచేపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో ” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత) కార్యక్రమంలో దాచేపల్లి మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి నారాయణ, దాచేపల్లి టౌన్ కన్వీనర్, షేక్ అహ్మద్ షరీఫ్, గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రి, దాచేపల్లి జి డి సి సి బ్యాంక్ చైర్మన్ తంగేళ్ల శ్రీనివాసరావు, దాచేపల్లి మండల TNTUC అధ్యక్షులు కల్లూరి రాఘవ, జనసేన మండల కన్వీనర్ పాముల కిషోర్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ TNTUC మరియు దాచేపల్లి మండల ఆటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కోరే ఆదినారాయణ, విద్యా కమిటీ చైర్మన్ పూసాల హఫీజ్, పల్నాడు జిల్లా, ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ హిదయ తుల్ల, సొసైటీ నారాయణ , అయినాల శ్రీరాములు, సాధినేని కోటేశ్వరరావు,కోట సాయన్న ,షేక్ సమీ , కూరాకుల నాగేశ్వరావు, బేతాళ మాధవి, షేక్ షకీనాభి,కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొనటం జరిగింది. అనంతరం ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి దాచేపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద వారి చిత్రపటాలకి పాలాభిషేకం చెయ్యటం జరిగింది….

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు*

*ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు* ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి-247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కమ్యూనిటీ హాల్ భ వన నిర్మాణ పనులను పరిశీలించిన శాసనసభ్యులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఈదరపల్లిలో రెండు కోట్లతో నిర్మితమవుతున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన గౌరవ శాసనసభ్యులు ఆనందరావు .త్వరితగతిన ఈ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆముడా చైర్మన్ అల్లాడి స్వామి నాయుడు, మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, పెచ్చట్ విజయలక్ష్మి ,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

అన్నమయ్య

గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తల్లెం భరత్ కుమార్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలం అక్టోబర్ 17: రైల్వే కోడూరు పట్టణంనకు చెందిన పసుపులేటి సూర్య దంపతులు, శుక్రవారం నాడు నూతన గృహప్రవేశం చేశారు.ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి వారి నూతన గృహానికి చేరుకొని, దంపతులకు వినాయక స్వామి ప్రతిమను అందజేసీ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.