Tuesday, 28 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చిరంజీవి నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ కి సన్మానం::::

అమలాపురం; స్థానిక విద్యానిధి స్కూల్లో వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ A.B. నాయుడు గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ సుధీర్ బాబు గారికి , స్కూల్ ప్రిన్సిపల్ మాధవి గారికి , టీచర్స్ అందరికీ మరియు పని సిబ్బందికి శాలువాతో సత్కారం చేసి వివేకానందుని జీవితం సందేశం అనే పుస్తకాన్ని అందించి దానితోపాటు ఖాదీ జేబురుమాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు టీచర్స్ పై గౌరవం పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన బాబీ మాస్టర్ ని కొనియాడారు. ప్రిన్సిపల్ మాధవి గారు మాట్లాడుతూ మాకంటే సంస్థకి ఎంతో అవసరమైన పని సిబ్బందికి సన్మానం చేయడం నాకు ఎంతో ఆనందం కలిగించిందని నరేంద్ర ని ఆశీర్వదించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చిరంజీవి నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ కి సన్మానం::::

అమలాపురం; స్థానిక విద్యానిధి స్కూల్లో వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ A.B. నాయుడు గారికి, కాలేజ్ ప్రిన్సిపల్ సుధీర్ బాబు గారికి , స్కూల్ ప్రిన్సిపల్ మాధవి గారికి , టీచర్స్ అందరికీ మరియు పని సిబ్బందికి శాలువాతో సత్కారం చేసి వివేకానందుని జీవితం సందేశం అనే పుస్తకాన్ని అందించి దానితోపాటు ఖాదీ జేబురుమాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాయుడు గారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు టీచర్స్ పై గౌరవం పెంచే ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన బాబీ మాస్టర్ ని కొనియాడారు. ప్రిన్సిపల్ మాధవి గారు మాట్లాడుతూ మాకంటే సంస్థకి ఎంతో అవసరమైన పని సిబ్బందికి సన్మానం చేయడం నాకు ఎంతో ఆనందం కలిగించిందని నరేంద్ర ని ఆశీర్వదించారు.

అన్నమయ్య

యువత మత్తు వదిలితే జీవితంలో విజయం మీదే

బి .కొత్తకోట అక్టోబర్ 17 వార్తలు ప్రతినిధి ; నేటి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే బావి జీవితం లో విజయం మీదేనని బి.కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాల్ రెడ్డి యువతకు సూచించారు. శుక్రవారం బి.కొత్తకోట సుంకు కాలేజీలో యువతనుద్దేశించి మాట్లాడుతూ యువత డ్రగ్స్ ముట్టుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఆ బలహీన క్షణాలను అధిగమించి జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నారు. సరదాకైనా డ్రగ్స్ జోలికి వెళ్లరాదని తాత్కాలిక సుఖం కోసం విలువైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దని హితవు పలికారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు మీ దృష్టికి వస్తే వారించాలని సూచించారు. అదేవిధంగా యువత వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రత పాటించాలని, హెల్మెట్ లేని ప్రయాణం చేయరాదని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో సుంకు కాలేజ్ అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కడప

గంగాభవాని అమ్మవారికి కుంకుమార్చన పూజలు

సిద్దవటం, అక్టోబర్ 17 ( వార్తలు ప్రతినిధి ) మండలంలోని మాధవరం 1 పంచాయతీ బంగారుపేట శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయ నిర్వహకులు అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలు,పుష్పమాలికలతో అత్యంత సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.ఆలయంలో నిర్వహించిన కుంకుమార్చన పూజలో పరిసర గ్రామాల నుంచి మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ ప్రతినిధులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి…. శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వృక్షశాస్త్ర విభాగం వారు ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా….

పుట్టగొడుగుల యొక్క పోషక విలువల పై అవగాహన కల్పించడం కోసం విద్యార్థులకు *Mu MUSHROOM CULINARY CHALLENGE *.. అనే అంశంపై పోటీని నిర్వహించారు. 16 10 25వ తేదీన కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు వైభవంగా జరిగాయి. వివిధ కళాశాలల నుంచి అనేకమంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొని ,వారు తయారు చేసిన పుట్టగొడుగుల వంటకాలను ప్రదర్శించి, వాటి యొక్క పోషక విలువల గురించి వివరించడం జరిగినది. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు పోరంకి విజయవాడ నుంచి వచ్చిన రీజనల్ రీసెర్చ్ సెంటర్ ICAR రిటైర్డ్ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరిగినది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వృక్ష శాస్త్ర విభాగాధిపతి T. సలోమి, అధ్యాపకులు శ్రీమతి. బి.శైలజ, మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని,కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

ఖమ్మం

యేరు గట్ల డబుల్ బెడ్ రూమ్ భాధితులకి న్యాయం చేస్తాను :కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని పెనుబల్లి మండలం ఎరుగట్ల డబల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలపై ఏరుగట్ల గ్రామ బాధితులు, ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి గారిని కలిసి ఫిర్యాదులు అందజేశారు. కలెక్టర్, 15 మంది బాధితులకు ప్రాధాన్యతతో డబల్ బెడ్ రూమ్‌లు కేటాయిస్తామని, మిగిలిన ఇళ్లు అర్హులకే ఇస్తాం హామీ ఇచ్చారు. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా బాధితులకు న్యాయం చేయాలని స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఈవి రమేష్, విజయ రాజు నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్రా , వీరం రాజు పడిగల మధు, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

సాక్షి పత్రికపై కక్షపు చర్యలు — మీడియా గొంతు నొక్కే యత్నం: జర్నలిస్టుల ఆగ్రహం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాక్షి దినపత్రికకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించిన నిరసనలో పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, సాక్షి పత్రికపై కొనసాగుతున్న కక్షపూరిత చర్యలు మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్రలో భాగమని అన్నారు. నకిలీ మద్యం విక్రయాలపై ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు పత్రికను లక్ష్యంగా చేసుకోవడం అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం దారుణమని అబ్దుల్ రహమాన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సాక్షి దినపత్రికపై నమోదైన కేసులను రద్దు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.సీనియర్ జర్నలిస్ట్ రావుల శంకర్ మాట్లాడుతూ, వార్తలను రాయడమే నేరంగా మలచడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. మీడియా నిజాలు చెబితే భయపెట్టే ధోరణి ఆపాలని ఆయన సూచించారు.నిరసనలో ప్రకాష్ గౌడ్, వారణాసి శ్రీనివాస్, హనమయ్య, సురేష్ చారి, శ్రీధర్, రాధాకృష్ణ చారి, జానకిరామ్, ఆశిష్, గిరిజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ నీ కలిసిన ఉపాధి హామీ పథక కేంద్ర బృందం

కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈరోజు అమలాపురంలో పర్యటించిన మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథక కేంద్ర బృందం అమలాపురం పార్లమెంట్ సభ్యులను తన కార్యాలయంలో ఈరోజు కలవడం జరిగింది .ఈ సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఈ ఉపాధి పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఈ పథకం ద్వారా గ్రామీణ కూలీలు కొంతమేర లబ్ధి పొందుతున్నారని ఆయన వివరించారు ఈ పథకం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంపీ ఈ బృందానికి కొన్ని సూచనలు చేశారు

ఆంధ్రప్రదేశ్

పర్యావరణ-నేస్తమా…!

“పర్యావరణ నేస్తమా…!” ఓ… నేస్తమా… నన్ను నీవు రక్షిస్తే నేను నిన్ను రక్షిస్తా…! నన్ను నీవు నరికేస్తే నేను నిన్ను చంపేస్తా…! నీవు మమ్ము కాపాడితే మేము మీ ప్రాణాన్ని కాపాడుతా…! అయితే…నేను… చల్లాదనా న్నిస్తాను ఆక్సిజన్ న్నిస్తాను వర్షాన్నిస్తాను కలపనిస్తాను మరెన్నో ఇస్తాను…! కలుషితం లేని వాతావరణాన్నిస్తాను…! ఆకుల అలుముల సేంద్రియ ఎరువు నిస్తాను…! మంచి ఆరోగ్యానిచ్చే వనమూలికలిస్తాను…! వర్షాన్నిపట్టి భూగర్బ జలాన్ని పెంచుతాను…! ఆహ్లాదకరమైన పర్యాటకానౌతాను…! ఆర్ధికభి వృధికి భరోసా నౌతాను…! చెట్లను పెంచుదాం ఆనందం,ఆరోగ్యాన్ని పంచుదాం…! “వృక్షో రక్షితి రక్షిత:” “ధర్మో రక్షితి రక్షిత:” రచన : స్వియరచన

తెలంగాణ

గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన : మంత్రి

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం లోని కంకణాలపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్నీ ప్రారంభించిన రోడ్లు,భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.