Tuesday, 28 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించాలి

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను గుర్తించి ఉన్నత ఉపాధ్యాయులు వారి పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు నూతనంగా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*

* *అమరావతి, అక్టోబర్ 16:* ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*

*అమరావతి, అక్టోబర్ 16:* ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.

అనకాపల్లి

నీళ్లు రాని కుళాయిల కోసం అవస్థలు పడుతున్నావు ఏటికొప్పాక ప్రజలు

అక్టోబర్ 17 ఎలమంచిలి నియోజక వర్గం : ఏటికొప్పాక ప్రజలు నీళ్లు కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు పదివేల రూపాయలు ఖర్చుపెట్టి కులాయి వేపించుకున్నాము కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది ఒకరోజు కుళాయిలు వస్తున్నాయి ఒకరోజు రావడం మానేస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందని సచివాలయం సిబ్బందిని అడిగితే పట్టించుకోవడం లేదు మా సమస్యలు ఎవరు తీరుస్తారని గ్రామ పెద్దలను అడిగితే వాళ్లు పట్టించుకోవడం మానేశారు అలాగని వీధి కులాయిలు అయినా వస్తాయేమో అని చూస్తే అవి కూడా సరిగా రావడం లేదు నీళ్లు రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా సమస్యని ఎవరు తీరుస్తారని ఏటికొప్పాక గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మా సమస్య ప్రభుత్వ వారు త్వరగా తీరుస్తారని కోరుతున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ధన్వంతరి జయంతి ఘనంగా నిర్వహణ

నందిగామ రూరల్ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య మార్గదర్శకత్వం లో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమం నందిగామ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ హాలులో అక్టోబర్ 17న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య, మాజీ బీజేపీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, మున్సిపల్ చైర్మన్ మండవ కృష్ణకుమారి, రాష్ట్ర తెలుగు తోరణం మీడియా ప్రతినిధి అన్నవరపు బ్రహ్మయ్య పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రూరల్ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డివి నాగేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ వైద్యుల సేవల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఏచూరి రాము, మునుగంటి కామేశ్వర రావు, అన్నవరపుగణపతిరావు, వినుకొల్లు నవీన్ బాబు, నిమ్మనపూడి రాణా ప్రతాప్ వంటి సంఘ నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రారంభంగా ధన్వంతరి స్వామికి పూలమా లలు వేసి, జ్యోతి ప్రజ్వలనం చేయడం జరిగింది. అనంతరం నందిగామ పరిధిలో సేవలంది స్తున్న 20 మంది ఆర్.ఎం.పి వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు, కుటుంబ నాయకులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత వైభవోపేతంగా మార్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*

* *అమరావతి, అక్టోబర్ 16:* ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.

అన్నమయ్య

దీపావళి బాణసంచా విక్రయాలు, నిల్వలపై జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరికలు

చిట్వేల్, అక్టోబర్ 17: (ఎల్లో సింగం ప్రతినిధి) రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రత కోసం అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ బాణసంచా నిల్వలు, విక్రయాలపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు.ప్రభుత్వం జారీ చేసిన పేలుడు పదార్థాల చట్టం ప్రకారం నిర్దేశించిన నిబంధనలను తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నిబంధనలుబాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలకు సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి తప్పనిసరి.నిల్వల ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పక అమలు చేయాలి.విక్రయాలు జనవాసాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులకు దూరంగా, అధికారులు నిర్ణయించిన సురక్షిత ప్రదేశాల్లో మాత్రమే జరగాలి.దుకాణాల మధ్య తగినంత భద్రతా దూరం పాటించాలి.ప్రతి విక్రయ కేంద్రంలో అగ్ని నిరోధక సిలిండర్లు, ఇసుక, నీటి బకెట్లు తప్పనిసరిగా ఉంచాలి.బాణసంచా నిల్వ ఉన్న ప్రదేశాలలో ధూమపానం, పెట్రోల్ లేదా మండే వస్తువులు ఉంచరాదు.18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బాణసంచా తయారీ లేదా విక్రయాల్లో నియమించరాదు. ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తిదీపావళి సందర్భంగా పటాకులు కాల్చేటప్పుడు చిన్నపిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి.గడ్డి నిల్వల దగ్గర, పశువుల పాకల వద్ద, లేదా పెట్రోల్ బంక్‌ల సమీపంలో పటాకులు కాల్చరాదు.పటాకులు కాల్చేటప్పుడు నూలు (కాటన్) దుస్తులు మాత్రమే ధరించాలి.బాణసంచా అక్రమ విక్రయాలు లేదా నిల్వల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు కాల్ చేసి పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని హామీ ఇచ్చారుజిల్లా ప్రజలందరూ నిబంధనలు పాటించి, ప్రమాద రహిత దీపావళి జరుపుకోవాలని కోరుతూ”అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వలు, విక్రయాలు నిర్వహించినా చర్యలు తప్పవు” అని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్ల హైస్కూల్లో బాలికా దినోత్సవం

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఎం పద్మ మాట్లాడుతూ, పిల్లలందరికీ బాల్యవివాహాలు మరియు రక్తహీనత గురించి మరియు శారీరకంగా, మానసికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే రక్తహీనత లేకుండా మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని పిల్లలందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 మరియు వన్ స్టాప్ సఖి181 నంబర్లకు సమస్య వచ్చినప్పుడు కాల్ చేస్తే వారి యొక్క సహాయం పొందవచ్చునని పిల్లలందరికీ తెలియజేశారు.ఈ కార్యక్రమం నందు అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికారులకు రోడ్డు మరమ్మత్తు పనులు పట్టదా?

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చేజర్ల మండలం ఆదురుపల్లి నుండి నెల్లూరు వెళ్లే దారిలో పడమటి కండ్రిక వద్ద రోడ్డు తీవ్రంగా కుంగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ ప్రమాదకర పరిస్థితి కారణంగా ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో భారత మహాసేన పార్టీ వ్యవస్థాపకులు,కార్యకర్తలు అక్కడ తాత్కాలిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్పందించిన అధికారులు మరుసటి రోజు కంకర తరలించి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అయితే నెలలు గడిచినా రోడ్డు మరమ్మత్తు పనులు పూర్తికాలేదు. ఈ మార్గంలో ప్రతిరోజూ అధికారులు,నాయకులు ప్రయాణిస్తున్నా సమస్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడితే బాధ్యత అధికారులదేనని వారు తీవ్రంగా మండిపడుతున్నారు. త్వరితగతిన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖమ్మం

_రేపు తెలంగాణ బంద్‌..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్

*_రేపు తెలంగాణ బంద్‌..వారికి డీజీపీ స్ట్రాంగ్ వార్నింగ్.._* _హైదరాబాద్: ఈనెల 18వ తేదీన వివిధ పార్టీలు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి స్పష్టం చేశారు._ _బంద్ పేరుతో అవాంచనీయ సంఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు గానీ పాల్పడినట్లయితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామని డిజిపి అన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయని, బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజిపి సూచించారు. సాధారణ ప్రజలకు సమస్యలు ఎదురవకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు._ _కాగా 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా, బీజేపీ, బీఆర్ఎస్ మద్దతు తెలిపాయి. అటు సుప్రీంకోర్టులో తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో..పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది._

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.