Tuesday, 28 April 2026

Blog

నాగర్‌కర్నూల్

15 రోజులు గ‌డుస్తున్న మొల‌క రాని వేరుశనగ*

*పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు* *ఆందోళనలో రైతులు..* నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 17, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వేరుశనగను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య ఎకరం 20 గుంటలలో వేరుశనగ విత్తనాలు విత్తాడు. విత్తనాలు వేసి 15 రోజులు గడుస్తున్నా నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.అదే గ్రామానికి చెందిన మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు వేరుశనగ విత్తనాలు విత్తడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి శోభారాణి ని ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు

Blog

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నంద్యాలలో ఉన్న అనస్థీషియా వైద్యులు అనస్థీషియా పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16వ తేదీ అమెరికా మాసచూసేట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యుల దే కీలక పాత్ర అని అన్నారు డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు 30 మంది అనస్థీషియా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు డాక్టర్ బాలరాజు, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అనస్థీషియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు,ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ, సీనియర్ అనస్థీషియా వైద్యులు శాంతిరాం వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, మహిళా అనస్థీషియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీ లను ఐఎంఏ నంద్యాల శాఖ తరపున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా” ఆపరేషన్ థియేటర్ బయట అనస్థీషియా వైద్యుల పాత్ర” పై డాక్టర్ నాగరాజా రెడ్డి,”అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ” డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు. సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఎ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు .

నాగర్‌కర్నూల్

రోడ్డు ప్రమాద బాధితులకు గోలి శ్రీనివాసరెడ్డి పరామర్శ

ప్రమాద కుటుంబాల ఇరువురికి చెరి రూ.10 వేల రూపాయలు ఆర్థిక సహాయం..! వెల్దండ అక్టోబర్ 17 : వెల్దండ మండల పరిధిలోని గానుగట్టు తండా మాజీ సర్పంచ్ పత్యా నాయక్, చెర్కూరు గ్రామానికి చెందిన శ్రీను గురువారం రాత్రి హైదరాబాద్ -శ్రీశైలం జాతీయ రహదారి పై ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరామర్శించి తక్షణ సహాయంగా రూ. 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు అందజేశారు. గోలి శ్రీనివాస్ రెడ్డి తో పాటు బీఆర్ఎస్ నాయకులు నాగులు నాయక్, మాజీ ఎంపీటీసీ భీమయ్యగౌడ్, నరసింహ, జంగిలి నిరంజన్, తగుళ్ళ. కొండల్ యాదవ్, గొడుగు యాదయ్య, జంగిలి ఆనంద్, బర్కం గణేష్, చర్కా కొండల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నంద్యాలలో ఉన్న అనస్థీషియా వైద్యులు అనస్థీషియా పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16వ తేదీ అమెరికా మాసచూసేట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యుల దే కీలక పాత్ర అని అన్నారు డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు 30 మంది అనస్థీషియా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు డాక్టర్ బాలరాజు, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అనస్థీషియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు,ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ, సీనియర్ అనస్థీషియా వైద్యులు శాంతిరాం వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, మహిళా అనస్థీషియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీ లను ఐఎంఏ నంద్యాల శాఖ తరపున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా” ఆపరేషన్ థియేటర్ బయట అనస్థీషియా వైద్యుల పాత్ర” పై డాక్టర్ నాగరాజా రెడ్డి,”అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ” డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు. సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఎ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు .

E-పేపర్

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నంద్యాలలో ఉన్న అనస్థీషియా వైద్యులు అనస్థీషియా పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16వ తేదీ అమెరికా మాసచూసేట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యుల దే కీలక పాత్ర అని అన్నారు డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు 30 మంది అనస్థీషియా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు డాక్టర్ బాలరాజు, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అనస్థీషియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు,ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ, సీనియర్ అనస్థీషియా వైద్యులు శాంతిరాం వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, మహిళా అనస్థీషియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీ లను ఐఎంఏ నంద్యాల శాఖ తరపున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా” ఆపరేషన్ థియేటర్ బయట అనస్థీషియా వైద్యుల పాత్ర” పై డాక్టర్ నాగరాజా రెడ్డి,”అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ” డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు. సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఎ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు .

అన్నమయ్య

ఉపాధి హామీ పనులకు ఈ కేవైసీ తప్పనిసరి ఏపీవో అంజనప్ప

తంబళ్లపల్లె అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)తంబళ్లపల్లె మండలం లోని ఉపాధి హామీ పనులు చేసుకునే లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరి గా చేయించుకోవాలని ఎంపిడిఓ పట్నాయక్, ఉపాధి హామీ ఎంపిఓ అంజనప్ప కూలీలను కోరారు. శుక్రవారం మండలంలోని రేణుమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి పంచాయతీలలో ఏపీవో అంజనప్పతోపాటు టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు ఇంటింటికి తిరిగి ఈకేవైసీ చేయించడంతోపాటు వారికి ఈ కేవైసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ ప్రతి జాబ్ కార్డు హోల్డర్ కచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని లేదంటే ఉపాధి హామీ పనుల కల్పనలో భాగస్వామ్యం ఉండదని కావున కూలీలు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం

తేది 17.10.2025 నిడదవోలు *ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం* *గతేడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల అధిక ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది* *తక్షణమే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం.. అవసరమైతే 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం* *ధాన్యం మద్దతు ధర రూ.69 లు అధికంగా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం* *రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు* *రైతుల నుండి సేకరించిన ధాన్యం డబ్బులను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది* *కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కార్డులు అందిస్తాం* *డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి* నిడదవోలు: ధాన్యం సేకరణకు సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేశామని, గతేడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని డి.ముప్పవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం జల్లెడ, ధాన్యం నాణ్యత, గోనె సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాన్ని, డిజిటల్ వెయింగ్ స్కేల్ (తూనిక యంత్రాలు) ను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. సంబంధిత పరికరాలు పనిచేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులకు తెలిసేలా ప్రతిరోజు నోటీసు బోర్డులో నమోదైన రైతుల సంఖ్య, మొత్తం రైతుల సంఖ్య, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, మొత్తం ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. తక్షణమే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో మాట్లాడి 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాకు నగదు జమ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తామని భరోసానిచ్చారు. పండించిన పంటకు రూ.69 అధికంగా మద్దతు ధరను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ధాన్యం ఎక్కువగా పండించే నియోజకవర్గం నిడదవోలు అన్నారు. ఈ క్రమంలో తాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో ప్రత్యేకంగా చర్చించి నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచాలని కోరగా వెంటనే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచి రైతులకు సంతృప్తికర సహకారాన్ని అందించారని గుర్తుచేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని, ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు, రైతులకు డబ్బుల చెల్లింపు విషయంలో అన్నదాతలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయమని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గతంలో ధాన్యాన్ని సేకరిస్తే రెండు మూడు నెలలకు గానీ డబ్బులు జమ చేసేది కాదని స్వయంగా రైతులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సభాముఖంగా వెల్లడించారు. ఎన్నికల వస్తున్నాయన్న వేళ రైతులకు ధాన్యం డబ్బులు ఎగరగొడితే గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1674 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించామన్నారు. కాయకష్టం చేస్తున్న కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రుతువుల వారీగా వర్షాలు వచ్చే పరిస్థితి లేదని, ప్రకృతి వైపరీత్యాలు ముంచేస్తున్నాయని ఈ క్రమంలో ధాన్యంలో తేమ శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులు బాగుండాలని ఆలోచించే ప్రభుత్వమని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను రూ.4000 కు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ను రూ.2000 నుండి రూ.3000 పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన సాహసోపేతమైన హామీని నెరవేర్చిందని గుర్తుచేశారు. కొత్తగా పెన్షన్లు ఇచ్చే అంశంపై చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే స్పౌజ్ పెన్షన్లు అందించిన విషయాన్ని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనల క్రింద తొలి విడతగా రూ.7000 జమ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, తల్లికి వందనం క్రింద కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి రూ.15,000 ఆర్థికసాయం అందించామన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. యూరియా అధికంగా వినియోగించడం వల్ల భూమి సారవంతం కోల్పోతుందని, దిగుబడి తగ్గుతుందన్న విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి పెరుగుతుందని, ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ , కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితా, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ, సొసైటీ ఛైర్మన్, అధ్యక్షులు, సభ్యులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో వైభవంగా లక్ష్మీ నారాయణ కళ్యాణ మహోత్సవం

నందిగామ పట్టణంలోని సీఎం రోడ్‌పై ఉన్న భగవాన్ సత్యసాయి సేవా సమితి భవనంలో శ్రీ లక్ష్మీ నారాయణ అష్టోత్తర శత కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛార ణల మధ్య సంప్రదాయబద్ధంగా మహోత్సవం ప్రారంభమైంది. విశేష పూజా కార్యక్రమాలు శ్రద్ధాభక్తులతో కొనసాగాయి. ఎమ్మెల్యే సౌమ్య పూజల్లో పాల్గొని, పండితుల ఆశీర్వచనా లను స్వీకరించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడు తూ, “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల భావోద్వేగాలను, మార్పులను తీసుకువస్తాయి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, భక్తులు, స్థానిక ప్రజలు, సత్యసాయి సేవా సమితి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిపరవశంలో మహోత్సవం విజయవంతంగా ముగిసింది.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ న్యాయవాదుల నిరసన – అక్రమ కేసులు వెనక్కు తీసుకోవాలంటూ డిమాండ్

కంచికచర్ల పోలీసులచే నందిగామ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బండి మల్లికార్జున రావుపై నమోదైన అక్రమ కేసును తీవ్రంగా నిరసిస్తూ నందిగామ న్యాయ వాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ నిరసన కార్యక్రమం నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలోనిర్వహించబడింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ,న్యాయవాదులపై తరచూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవ్యవస్థకు తోడుగా పనిచేసే న్యాయవాదు లపై ఇటువంటి చర్యలు అన్యా యమని పేర్కొన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి, బండి మల్లికార్జున రావుపై నమోదైన కేసును రద్దు చేయాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్నవారు: బార్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, సీనియర్ కౌన్సిల్ చావాలి సాంబశివరావు, ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, లైబ్రేరియన్ ఆజాద్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఇన్‌చార్జ్ గూగులోతు రామారావు, కౌన్సిల్ మెంబర్స్ దారెల్లి అరుణ్ కుమార్, వేల్పుల కిషోర్, సీనియర్ న్యాయవాదులు కన్నెగంటి జీవరత్నం, మన్నెం నారాయణరావు, దాసరి వెంకట్రావు, పాలెపు వెంకట నరసింహారావు, ఈశ్వర ప్రగడ రంగారావు, పింగళి లక్ష్మీనరసిం హారావు, కొనకంచి శ్రీనివాస రావు, మంద వజ్రయ్య, షేక్ సైదా, నండ్రు శ్రీరామ్మూర్తి, దగ్గుపాటి కమలాకర్ రావు, ప్రభు జి, గుంజి వాసు, కోటా దేవదాస్, యర గొర్ల రామారావు, గింజుపల్లి రమేష్, గంటా నాగేశ్వరరావు, ఎక్కిరాల హనుమంతరావు, కొండలరావు, ప్రదీప్, పవన్ కుమార్, ఉప్పులూరి జవహర్ బాబు, పంది ప్రకాష్, గుడిశ సుమన్, కొమ్మినేని మౌళేశ్వరరావు, కస్టాల నూతన్, వేదుల సుబ్రహ్మణ్యం, కర్ల నాగభూషణం, వేల్పుల ప్రభాకర్ రావు, మొగిలిచర్ల లక్ష్మీకాంతం, పైడాకుల కృష్ణ ప్రసాద్, ఎరగని వీరబాబు, బెజవాడ గోపి, నెలకుదిటి లక్ష్మీనారాయణ, తదితరులు. అంతటితో ఆగకుండా, న్యాయవాదుల బృందం నందిగామ ఆర్డీవో ను కలిసి తమ ఆందోళన వివరించి, వినతిపత్రం సమర్పించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

8 గంటల పని పునరుద్ధరణకు CITU డిమాండ్ – నందిగామ లో కరపత్రాల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పనిగంటలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ, నందిగామ మున్సిపల్ వర్కర్ యూనియన్ (CITU) ఆధ్వర్యంలో శుక్రవారం కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా CITU ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ – “రాష్ట్రంలో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి అన్యాయం చేస్తూ, యజమాను లకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో అనేక మార్పులు చేసింది. కార్మికులు పోరాటాల తో సాధించుకున్న 8 గంటల పని వ్యవస్థను 10 గంటలకు పెంచడం అన్యాయమని,” అన్నారు. అతను చెప్పిన ముఖ్యాంశాలు: రోజుకు 10 గంటల పని, కానీ వారానికి 48 గంటలు – ఇది అభ్యంతరకరం. 8 గంటలు పని, 8 గంటలు కుటుంబం, 8 గంటలు విశ్రాంతి అనే తత్వాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదు. షాపులు, ఫ్యాక్టరీల చట్టాలలో చేసిన సవరణలు తక్షణం రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పనిగంటల పెంపుపై కార్మిక సంఘాలతో కనీసంగా చర్చించలేదు. గత 3 దఫాలుగా కనీస వేతనాల సవరణను ప్రభుత్వం అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు పనిగంటలు పెంచిన తరహాలో, ఇక్కడ కూడా అదే ధోరణి అనుసరించడాన్ని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో కార్మిక సంఘాల నేతలు దాసవరకు సైదా (యూనియన్ అధ్యక్షుడు), పూట్టా మాణిక్యం, గరికపాటి ప్రసాదు, రాజరత్నం, రూత్తుమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. CITU విజ్ఞప్తి – పని గంటలు పెంచే సవరణలను రద్దు చేసి, 8 గంటల పని విధానాన్ని పునరుద్ధరించేవరకు నిరసన పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సి ఐ టి యు), నందిగామ మండల కమిటీ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.