Tuesday, 28 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

దీపావళి సందర్భంగా నిరుపేదలకు బియ్యం పంపిణీ

నందిగామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దీపావళి పండుగ ను పురస్కరించుకుని, నందిగామ సమీపంలోని గుర్రాలపేట వద్ద నివాసముండే బుడగ జంగాల నిరుపేద కుటుంబాలకు సహాయంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్వర్గీయ పోలిశెట్టి సుధాకర్ ను స్మరించుకుంటూ, ఆయన సతీమణి పద్మావతి, కుమారు లు పోలిశెట్టి వెంకటరావు, ఉపేంద్ర, సురేష్ కలిసి సహకారం అందించారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు సమన్వ యంతో, ఎస్సై అభిమన్యు చేతుల మీదుగా 25 నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున సాంబమసూరి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై అభిమన్యు మాట్లాడుతూ, “నిరుపేదలు అయినా చదువు ద్వారా ఎదగవచ్చని, తల్లిదండ్రు లు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని, చదువుతో మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, ఉద్యోగా లలో స్థిరపడతారని” తెలిపారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు పారేపల్లి సాయిబాబు మాట్లాడు తూ, “ఇప్పటికే దసరా, దీపావళి సందర్భంగా మేము సుమారు 310 మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశాం. ఇది సమాజం పట్ల మేము చేస్తున్న చిన్న సహకారం” అనితెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బతి జనార్ధనరావు, అమ్రాన్ బ్యాటరీ డిస్ట్రిబ్యూటర్ పూర్ణతదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో 3D మోడల్స్ ద్వారా శరీర లోపాలను చూడొచ్చు

దిల్లీ-ఎన్‌సీఆర్‌లోని వర్ధమన్ మహావీర మెడికల్ కాలేజ్ (VMMC) / సఫ్దర్‌జుంగ్ ఆస్పత్రిలో కొత్తగా వర్చువల్ క్లినికల్ అనాటమీ లాబ్ ప్రారంభించారు. ఈ లాబ్‌లో “అనాటేజ్ టేబుల్ (Anatomage Table)” అనే అధునాతన సాంకేతికతను ఉపయోగించి, రోగుల శరీర భాగాల 3D మోడల్స్ సృష్టించి పాటు చూపించొచ్చు. ఈ సాంకేతికతలో గమనించిన ముఖ్యాంశాలు: స్కాన్ డేటా నుండి 3D మోడల్ CT లేదా MRI స్కాన్‌ల సమాచారం ఆధారంగా, రోగుల అవయవాలు, ఎముకలు, జబ్బులు, గుండె లోపాలు మొదలైనవన్నింటిని మల్టీ ఏంగుల్ 3D లో చూడవచ్చు. రోగుల అవగాహన పెరుగుతోంది రోగులు తమ పరిస్థితిని వైద్యులు ఎలా వివరించారో చూపించబడిన మోడల్స్ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల భయభక్తి తగ్గిపోతుంది, చికిత్సకు స్పందనం మెరుగవుతుంది. వైద్య నిర్ణయాలు మెరుగు చేయడం శస్త్రచಿಕಿತ್ಸకులు ముందుగా ఆపరేషన్ ప్లాన్ చేయవచ్చు, ఇన్‌సిషన్ మార్గాన్ని నిర్ణయించవచ్చు, ప్రతికూల పరిణామాలను ముందుగా ఊహించవచ్చు. వైద్య విద్యకు విప్లవాత్మక మార్గం వైద్య విద్యార్థులు డిజిటల్ కాడావర్‌లతో వర్చువల్ డిసెక్షన్‌లను నిర్వహించవచ్చు. వారు అరుదైన పరిస్థితులను వివిధ కోణాల్లో అధ్యయనం చేయవచ్చు. మోడల్స్ 0.2 మిల్లీమీటర్ వరిష్ట రిజల్యూషన్‌పై ఉండటం వల్ల వాస్తవికత బలపడింది. డైరెక్టర్ డాక్టర్ సందీప్ బాన్సాల్ పేర్కొన్నారు: “ఈ సాంకేతికత రోగులకు చికిత్స, ఆపరేషన్ గురించి స్పష్టత ఇస్తుంది, అవగాహన పెంచుతుంది.” అలాగే, వి.వి.వి.ఎమ్.సి/సఫ్దర్‌జుంగ్ అనాటమీ విభాగం అధికారి dr. వందనా మెహతా మాట్లాడుతూ, ఇది వైద్యరంగంలో వినూత్న మార్గంగా ఉంటుందని తెలిపారు. ఈ సదుపాయం వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోగులు, వైద్యులు ఒకే వేదికలో శరీర అంతర్గత విషయాలను బాగా విశ్లేషించుకోవచ్చు. ఇది కనుగొనే జబ్బులను ముందుగా గుర్తించడంలో, చికిత్సను సరిచూడడంలో, వైద్య విద్యలో కొత్త మార్గాన్ని తీసుకొస్తుంది.

విశాఖపట్నం

అదేశాలతో నగరంలో గంజా ఆయిల్ అక్రమముగా రవాణా చేస్తున్న ముఠా అరెస్టు, 04 లీటర్ల లిక్విడ్ గంజాయి(హ్యాష్ ఆయిల్) స్వాధీనం.

. విశాఖ అక్టోబర్ పున్నమి ( ప్రతినిధి) గత తేదీ 16-10-2025 న రాత్రి సుమారు 21:00 గంటలకు, అక్రమంగా లిక్విడ్ గంజాయి ను కలిగి ఉండటం మరియు రవాణా చేయడం గురించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, టాస్క్ ఫోర్స్ బృందం, గాజువాక పీఎస్ లిమిట్స్, శ్రీ నగర్, గార్బేజ్ వెహికల్ పార్కింగ్ యార్డు వద్ద ఒక డికాయ్ ఆపరేషన్ నిర్వహించింది. సదరు ప్రదేశంలో అనుమానాస్పద పరిస్థితులలో ఉన్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించి, వెంటనే అదుపులోకి తీసుకుని, వారి నుండి లిక్విడ్ గంజాయి ను స్వాధీనం చేసుకొని, తదుపరి చర్యల కోసం లిక్విడ్ గంజాయితో పాటు నిందితులను గాజువాక పోలీసు అప్పగించడం జరిగింది.నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు: గంజాయి నూనె (Hash Oil): 04 లీటర్ల బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్-01 రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్-01 ​సెల్ ఫోన్లు: 05 (ఆండ్రాయిడ్-04, కీప్యాడ్-01) ​​అదుపులోకి తీసుకున్న వ్యక్తుల వివరాలు: 01.​కురచ హేమ కుమార్, వయస్సు: 28 సం., చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా. 02.​కొలుపూరి వరాహ మూర్తి, వయస్సు: 27 సం.,చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా. 03.​కురచ సంజీవ్, వయస్సు: 26 సం.,చీడికాడ మండలం, అనకాపల్లి జిల్లా. ​04.వంతల కొండబాబు @ మన్మధ, వయస్సు: 35 సం., జి.మాడుగుల మండలం. విశాఖ నగరంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు రాకుండా మరియు ఎవరు వాటి బారిన పడకుండా ఉండాలని పోలీసు కమిషనర్ . పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది, నగర పరిధిలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్ధాలు ఎవరివద్దనైనా కలిగి ఉన్నట్లు అనుమానం ఉంటే నేరుగా డయల్ -100/112 కు గాని, సీపీ గారి ఫోన్ నెంబర్ 7995095799 గాని లేదా దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్ కి సమాచారం అందించాలని, అలా సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందనీ నగర పోలీసుల విజ్ఞప్తి. నగర పోలీసు తరపున, విశాఖపట్నం సిటీ.

విశాఖపట్నం

చేనేతకు చేయూతనిచ్చి హస్తకళ, చేనేత కళాకారులను ప్రోత్సహించాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాంప్రకాష్ సింగ్ కోరారు

. విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం M.V.P కాలనీ, లుంబినీ పార్క్, అప్పు ఘర్ బస్ స్టాప్ వెనుక, కల్యాణ మండపంలో హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రదర్శన – అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన – అమ్మకాలు జరుగుతాయన్నారు. దీపావళి స్పెషల్ బంపర్ ఆఫర్ ఇస్తున్నామన్నారు. జెంట్స్ -షర్టు, వైట్ ప్యాంట్, లేడీస్ టీ-షర్టు, వైట్ ప్యాంట్, ట్రాక్ ప్యాంట్, నైట్ షర్టు, ఖాదీ కాటన్ షర్టు, కుర్తా, అన్ని రకాల చిన్న పిల్లల ఐటమ్స్, పోచంపల్లి, బెడ్ షీట్స్, డ్రస్ మెటీరియల్స్ శారీస్ కళంకారి, సిద్దిపేట, నారాయణపేట చీరలు, చేబ్రోలు ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, హైదరాబాద్ బంజారా ఉత్పత్తులు, హైదరాబాద్ ఎంబ్రాయిడరీ చీరలు, గద్వాల్, చీరాల డ్రస్ మెటీరియల్స్, జైపూర్ టెడ్ట్స్ & టాప్స్, మధ్యప్రదేశ్ మహేశ్వరి కాటన్ చీరలు, బెంగాలీ కాటన్ చీరలు, లక్నో చికన్ వర్క్స్, సోఫా కవర్స్, దీవాన్ సెట్స్, చిన్నారుల డ్రెస్సెస్ & నైటీలు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, కుషన్ కవర్స్ లెదర్ బ్యాగ్లు, జ్యూట్ బ్యాగులు, హైదరాబాద్ మంచి ముత్యాలు, నిర్మల్ పెయింటింగ్స్ & టాయ్స్, ఇత్తడి నగిషీలు, బ్లాక్ మెటల్ ఐటమ్స్, షహరాన్పూర్ ఉడెన్ లాకర్ వేర్, ఖాదీ గ్రామోద్యోగ్ ఆయుర్వేద ఔషదాలు, ఇమిటేషన్ జ్యుయలరీ, అలంకరణ, మైసూర్ రోజ్ వుడ్ ప్యానల్స్, కళాత్మక అభరణాలు వంటి అనేక రకాలు కళాకారులచే నేరుగా విక్రయిస్తున్నామని, ఈ ఎగ్జిబిషన్ ను విశాఖ ప్రజలు తిలకించి ప్రోత్సహించాలని కోరారు.

తూర్పు గోదావరి

పత్రిక ప్రకటన

జిల్లా: తూర్పు గోదావరి. పోలీస్ స్టేషన్: రాజానగరం. *నేరము సంఖ్య: 367/2025, U/s:303 (2) BNS.* *Complainant:* అబ్బిరెడ్డి నాగేశ్వరరావు, S/o (L) సత్యనారాయణ, వయస్సు/ 53 సం,.లు, కులం/కాపు, D.No. 2-172, సమీపంలో; ఉన్నత పాఠశాల, నీలంతోట, దివాన్చెరువు గ్రామం, ANR వే-బ్రిడ్జి, గామన్ రోడ్డు, పాలచర్ల గ్రామం, రాజానగరం మండలం. సెల్: 99497-22343. *నేరము:* పిర్యాది అయిన అబ్బిరెడ్డి నాగేశ్వరరావు గారు గామన్ బ్రిడ్జి రోడ్డు నందు హైవే ప్రక్కన పాలచర్ల పంచాయతి ఏరియాలో ANR-లారీ కాటా పేరున వే-బ్రిడ్జి నడుపుచున్నారు. సదరు లారీ కాటా ప్రక్కన పిర్యాది స్నేహితుడు అయిన మన్యం గణేశ్వరరావు గారికి శ్రీ కృష్ణ ఇన్ఫ్రా పేరుతో లారీ ట్రాన్స్పోర్టు ఆపీసు కలదు. గణేశ్వరరావు గారు పిర్యాది స్నేహముగా ఉండుట చేత, ఆయనకు సంబందించిన లారీలను పిర్యాది way-బ్రిడ్జి ఎదురుగా ఉన్న ఖాలీస్థలములో పార్కింగ్ చేసుకుంటారు. ఇలా ఉండగా దివి. 24-09-2025 తేదిన లారీ ఓనర్ అయిన మన్యం గణేశ్వరరావు గారు తన బంధువులను వివాహ నిమిత్తం హైదరాబాదు వెళ్ళుచు, తనకు చెందిన నాలుగు ట్రిప్పర్ లారీలను ANR-లారీ కాటా ఎదురగా గల ఖాళీ స్థలములో పార్క్ చేసి, వాటి తాళాలు పిర్యాది ఆపీసులో భద్రపరచి, ఊరు వేల్లుచున్నానని చెప్పి వెళ్ళారు. ఇలా ఉండగా దివి. 25-092025 వ తేదిన రాత్రి 8-00 గంటలకు పిర్యాది, వారి సిబ్బంది లారీ-కాటా వద్దకు వచ్చి పనిముగించుకొని వెళ్ళినారు. ఆ తర్వత రోజు అనగా ఎప్పటిలాగా దివి. 26-09-2025 వ తేదిన ఉదయం సుమారు 10 -00 గంటలకు పిర్యాది లారీ-కాటా వద్దకు వచ్చి చూడగా, గణేశ్వరరావు గారికి చెందిన లారీలలో AP 39 WC 7729 నెంబరు గల 12 చక్రాల లారీ కనబడలేదు. ఎవరో గుర్తు తెలియని దొంగలు ట్రిప్పర్ లారీని దొంగిలిoచుకొని పోయినారు.. *Arrest:* ఈ కేసులో దొంగతనము జరిగిన రోజు నుండి నేరస్తుల గురించి రాజానగరం పోలీసు వారు ముమ్మర గాలిoపు చర్యలు చేపట్టగా, రాజానగరం ఇన్స్పెక్టర్ వారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారము మేరకు వారి సిబ్బంది స్పెషల్ టీంలతో వెళ్లి కొవ్వూరు రూరల్ నందలి దొమ్మేరు హైవే-రోడ్డు వద్ద పొదల్లో లారీని, ఈ దిగువ పేర్కొన్న ముద్దాయిలను ఈ రోజు అనగా దివి. 17-10-2025 ఉదయం 11-25 గంటలకు అరెస్ట్ చేసి, ట్రిప్పర్ లారీని రికవరీ చేయడం జరిగింది. *ముద్దాయిలు:* 1) షౌకత్ @ షౌకత్ ఖాన్, S/o కల్లు, Age/38 సం..లు, Caste/ ముస్లిం, ధహోట గావ్, ఖోహ్రి తాలుక్, భరత్పూర్ జిల్లా, రాజస్థాన్ స్టేట్. 2) జమాల్ ఖాన్, S/o ఆలెం, Age/35 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా, రాజస్థాన్ స్టేట్. 3) సోహిల్, S/o హరున్, Age/19 సం.,లు, Caste/ముస్లిం, శేర్పూర్ గావ్, ఆల్వార్ జిల్లా. 4) మహమ్మద్ ఫసిఉద్దిన్ ఖాన్ @ ఫసి,S/o (Late) జలాలుద్దీన్ ఖాన్, Age/ 41 సం.,లు, Caste/ ముస్లిం, D.No. 6-4-591, వనస్థలిపురం, హైదరాబాద్. పైన పేర్కొన్న రాజస్థాన్ రాష్ట్రమునకు చెందిన లారీ డ్రైవర్లు అనువారిని రాజానగరం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ గారైన శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు ఈ రోజు అనగా దివి. 17-10-2025 వ తేదిన ఉదయం 11-25 గంటల సమయములో A1,A2,A3, A4 ( are arrested in 367/2025 of Rajanagaram PS) అరెస్ట్ చేసినారు. *Seizing Property :* 12 Tyres AP 39 WC 7729 Tripper Lorry. *దర్యాప్తు:* తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో, నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో కేసును రాజానగరం ఇన్స్పెక్టర్ గారైన శ్రీ. S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారు దర్యాప్తు చేయుచున్నారు. పై కేసు దర్యాప్తులో ముద్దాయిలు ఇచ్చిన వాoగ్ములముల ప్రకారము AP 39 WC 7729 ట్రిప్పర్ లారీ విలువ Rs. 42,00,000/- రూపాయల చోరీ సొత్తును ముద్దాయిల వద్ద నుండి రికవరీ చేయడమైనది. తూర్పు గోదావరి జిల్లా SP శ్రీ డి. నరసింహకిషోర్ ఐ.పీ.ఎస్., గారు ఈ కేసులలో నేరస్తులను పట్టుకున్న నార్త్ జోన్ DSP శ్రీ Y. శ్రీ కాంత్ గారిని, రాజానగరం ఇన్స్పెక్టర్ శ్రీ S. ప్రసన్న వీరయ్య గౌడ్ గారిని, SI శ్రీ S. ప్రియ కుమార్ గారిని,రాజానగరం క్రైం సిబ్బంది, HCs అమ్మిరాజు, నరేశ్ బాబు, PCs సత్యన్నారాయణ, కరీం, మురళీ, సురేష్, B.V. రమణ, అనువారిని అబినందిoచారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించాలి

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను గుర్తించి ఉన్నత ఉపాధ్యాయులు వారి పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు నూతనంగా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*

* *అమరావతి, అక్టోబర్ 16:* ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.*

*అమరావతి, అక్టోబర్ 16:* ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుల జాబితాను బుధవారం సాయంత్రం ఆ పార్టీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 19 మంది నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ప్రకాశం జిల్లా నుంచి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఈ జాబితాలో స్థానం పొందడం విశేషం.. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ ఏలూరి “ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తాను. బీజేపీ సిద్ధాంతాలు, ప్రజా ప్రయోజనాలు ప్రతీ వేదికలో గళమెత్తి వినిపిస్తాను” అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండలం, గొబ్బూరు గ్రామానికి చెందిన ఏలూరి రామచంద్రారెడ్డి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో కూడా కీలక భూమిక పోషించారు, అయితే జాతీయవాద భావజాలంతో మెలిగే ఆయన.. ఆ పార్టీల వ్యవహారశైలి నచ్చక దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలన్న సంకల్పంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు.. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.. విద్యార్థి సమయంలో ఏబీవీపిలో పనిచేశారు.. స్పష్టమైన వాగ్ధాటి, విశ్లేషణా సామర్థ్యం కలిగిన నేతగా ప్రసిద్ధి చెందిన ఏలూరి, వివిధ టీవీ చర్చల్లో బీజేపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తారన్న నమ్మకంతో పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రాజకీయంగా, మేధోపరంగా బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి, పార్టీ భవిష్యత్తు వ్యూహాత్మక ఆలోచనల్లో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఆయనకు ఈ పదవి దక్కడంతో అనుచరగణం సంబరాల్లో మునిగితేలుతున్నారు.

అనకాపల్లి

నీళ్లు రాని కుళాయిల కోసం అవస్థలు పడుతున్నావు ఏటికొప్పాక ప్రజలు

అక్టోబర్ 17 ఎలమంచిలి నియోజక వర్గం : ఏటికొప్పాక ప్రజలు నీళ్లు కోసం ఎన్నో అవస్థలు పడుతున్నారు పదివేల రూపాయలు ఖర్చుపెట్టి కులాయి వేపించుకున్నాము కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయింది ఒకరోజు కుళాయిలు వస్తున్నాయి ఒకరోజు రావడం మానేస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందని సచివాలయం సిబ్బందిని అడిగితే పట్టించుకోవడం లేదు మా సమస్యలు ఎవరు తీరుస్తారని గ్రామ పెద్దలను అడిగితే వాళ్లు పట్టించుకోవడం మానేశారు అలాగని వీధి కులాయిలు అయినా వస్తాయేమో అని చూస్తే అవి కూడా సరిగా రావడం లేదు నీళ్లు రాక చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా సమస్యని ఎవరు తీరుస్తారని ఏటికొప్పాక గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మా సమస్య ప్రభుత్వ వారు త్వరగా తీరుస్తారని కోరుతున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.