Tuesday, 28 April 2026

Blog

అన్నమయ్య

ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా

చిట్వేల్ అక్టోబర్ 17(పున్నమి ప్రతినిధి) అన్నమయ్య జిల్లా రాజంపేట డివిజన్ కార్యాలయం (డిఈ ఆఫీస్) వద్ద, శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది.కార్మికుల డిమాండ్లను న్యాయబద్ధంగా పరిష్కరించాలని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అలాగే ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం ఆపాలని నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల్ రవికుమార్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కనపర్తి కిరణ్, జిల్లా అధ్యక్షులు శ్రీహరి తదితరులు నేరుగా వేతనాలు చెల్లిస్తే సంస్థకు సంవత్సరానికి 192 కోట్ల రూపాయల ఆదా అవుతుందని, వేతన వ్యత్యాసాలను సవరించి పీస్‌రేట్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించడం ద్వారా సంస్థకు కూడా లాభమని పేర్కొన్నారు.పెన్షన్ హక్కు బిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు మాత్రమే అని వారు స్పష్టం చేశారు. 1.2.1999 తర్వాత నియామకం పొందిన కార్మికులు, ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.“ఎంఎల్‌ఏలు, ఎంపీలు రెండు మూడు పెన్షన్లు పొందుతుంటే, ఎందుకు కార్మికులకు హక్కుగా ఉన్న పాత పెన్షన్ ఇవ్వడం లేదు?” అని వారు ప్రశ్నించారు.ప్రస్తుత ప్రభుత్వము గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తోందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 9-10-2025 విద్యుత్ సవరణ బిల్లు ను వ్యతిరేకించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.12 గంటల పని విధానం, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మరియు విద్యుత్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగుతుందని స్ట్రగుల్ కమిటీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పందికాళ్ళ మణి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎరుకల రెడ్డి, వి. సుబ్రహ్మణ్యం, రమేష్, సిహెచ్. నారాయణ, చంద్రరాజు, ఆనంద్, బాలకృష్ణ, సురేంద్ర, సుధాకర్, కులయప్ప, చైతన్య, నాగ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అక్రమ మట్టి రవాణా పై మౌనం పాటిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం* *రాజకీయ నాయకుల అండ దండలతో యథేచ్ఛగా మట్టి మాఫియా ఆగడాలు.* *రెవెన్యూ అధికారులుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం.* *తమిళనాడు రాష్ర్టాలకు తరలి వెళ్లి పోతున్న ఎర్ర బంగారం.*

*అక్రమ మట్టి రవాణా పై మౌనం పాటిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం* *రాజకీయ నాయకుల అండ దండలతో యథేచ్ఛగా మట్టి మాఫియా ఆగడాలు.* *రెవెన్యూ అధికారులుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం.* *తమిళనాడు రాష్ర్టాలకు తరలి వెళ్లి పోతున్న ఎర్ర బంగారం.* తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం నెలవాయి గ్రామ పంచాయితీ లో ఉన్న మేత,ప్రభుత్వ, భూముల్లో ఉన్న ఎర్ర బంగార్రాన్ని కొందరి రాజకీయ నాయకులు అండదండలుతో యథేచ్ఛగా పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం.దీనిపై పలు మార్లు రెవెన్యూ అధికారులకు,పంచాయతీ అధికారులు కు,పోలీస్ శాఖ కు,జిల్లా అధికారులు కు తెలియజేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలు అనుమానాలు కు దారితీస్తుందని,గ్రామస్థులు వాపోతున్నారు.అవినీతి అక్రమాలకు అడ్డాగా మారి ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి దోపిడీ దొంగలుతో చేతులు కలిపి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారిందని అందుకే వారిపై చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.ఇకనైనా నిద్ర మత్తును వీడి అక్రమ మట్టి తరలింపు పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే గ్రామస్థులు అందరం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు హెచ్చరించారు.ఇళ్లకు మట్టి తీసుకురావలంటే రెవెన్యూ సిబ్బంది అనుమతి అడిగే అధికారులు, లారీలు లారీలు పక్క రాష్ట్రాలు కు తరలిస్తుంటే ఆఫీసుల్లో నిద్రపోతే ఎలా సారు అంటూ వాపోతున్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ పదో వార్డులో శానిటేషన్, నీటి పైపులైన్ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

నందిగామ పట్టణ ప్రభుత్వ విప్ మరియు నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు, నందిగామ మున్సిపాలిటీ పరిధిలోని పదో వార్డులో శానిటేషన్ కార్యకలా పాలు మరియు మంచినీటి పైపులైన్ మరమ్మత్తు పనులు చేపట్టారు. ఈ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి స్వయంగా ద్విచక్ర వాహనంపై పర్యటించి పరిశీలించారు. పనుల పురోగతి, పనితీరు, ప్రజలకు కలిగే లాభాలను ఆమె సమీక్షించారు. తద్వారా ప్రజలకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు మున్సిపాలిటీ కృషి చేస్తోందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్య భద్రతే ప్రథమ ప్రాధాన్యత. శానిటేషన్, త్రాగు నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు వినియోగదారులకు నిరంతరం అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం,” అని తెలిపారు. పరిశీలనలో మున్సిపల్ అధికారులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన ఏఈగా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు

ఉదయగిరి మండలం విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ ఈ గా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఇన్చార్జ్ ఏ ఈ గా పనిచేస్తున్న కుద్దుష్ బాషా రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న వరికుంటపాడుకు నియమించబడ్డారు అక్కడ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చెంగయ్య ను ఉదయగిరి లో ఇన్చార్జ్ ఏ ఈ గా నియమించబడ్డారు ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తమ వంతు నిరంతరం కృషీ చేస్తున్నారన్నారు.

ఖమ్మం

నేటి బంద్ ను జయప్రదం చేయండి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయండి

నేటి బంద్ ను జయప్రదం చేయండి కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయండి : __ బిజెపి  టూ టౌన్  ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ బీసీల హక్కుల సాధనకు శనివారం తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని శనివారం ఒక ప్రకటనలో బీజేపీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి  రుద్ర గాని మాధవ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి ఎన్నికల ముంగిటా కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీ  మీద ఏదో ఒక  ఆరోపణ చేయటం ఆనవాయితీగా మారిందని విమర్శించారు . బీసీల పై ప్రేమ , బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలనీ , 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అంటూ చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను సజావుగా జరపాలని  డిమాండ్ చేశారు . బీసీల హక్కుల సాధనకు 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణ బందును విజయవంతం చేయాలని తన ప్రకటనలో పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు రుద్రగాని మాధవ్ చేయాలని కోరారు.

సత్యసాయి

పల్లవి mms లో వార్షిక మహా సభ

ఓడిసిపల్లవి మండల సమ్మెకు ఆఫీస్ నందు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఓడి చెరువు అక్టోబర్ 17 పున్నమి న్యూస్ మండల కేంద్రంలో పల్లవి మండలం సమ్మెకు ఆఫీస్ నందు ఈరోజు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓబీ సభ్యులు వివో లీడర్స్ మండల సమైక్య సిబ్బంది సీసీలు. పాల్గొని 23 వార్షిక మహాసభ నిర్వచించి మండల సమైక్య చేపట్టినశిక్షణలు సమ్మెక్య సాధించిన విజయాల గురించి 2024 _25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పై చర్చించి లాభనష్టాల గురించి 2025__26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొత్త అధ్యక్షురాలను ఎన్నుకున్నారు పల్లవి మండలం అధ్యక్షురాలుగా పి లక్ష్మి. ఉపాధ్యక్షులుగా భాగ్యమ్మ కార్యదర్శిగా శారదమ్మ ఉప కార్యదర్శిగా పి రత్నమ్మ కోశాధికారిగా గంగ రత్నమ్మ సభ్యులందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం కే రవీంద్ర. మునియప్ప సీసీలు చెన్నకేశవులు. వేణుగోపాల్ రత్నమయ్య. అటెండర్ లక్ష్మి వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప తదితరులు వివో ఏలు పాల్గొన్నారు.

ఖమ్మం

ఏరుగట్ల డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం చేస్తా

ఏరుగట్ల డబల్ బెడ్ రూమ్ బాధితులకు న్యాయం చేస్తా…! బిజెపి ప్రతినిధులకు బాధితులకు హామీ ఇచ్చిన ఖమ్మం జిల్లా #Collector గారు.. సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం ఏరుగట్ల గ్రామంలో జరుగుతున్న డబల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అక్రమాలను ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురుశెట్టి గారికి మరియు జాయింట్ కలెక్టర్ పీ.శ్రీనివాస రెడ్డి గారికి ఏరు గట్ల బాధితులను తీసుకొని వెళ్లి సమస్యను వివరించి ఫిర్యాదులు అందజేసిన భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు Nelluri Koteswara Rao గారు. మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు .. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరైతే డబల్ బెడ్రూమ్స్ కోసం స్థలాలను ఇచ్చారో ఆ 15 మందికి మొదటి ప్రాధాన్యతగా డబల్ బెడ్రూమ్స్ కేటాయిస్తామని మిగిలిన ఇళ్లు కూడా అర్హులకే అందజేస్తామని జిల్లాలో ఎక్కడైనా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లయితే, రద్దుచేసి అర్హులకు కేటాయిస్తానని హామీ కలెక్టర్ గారు ఇచ్చారు.అలాగే ఏరుగట్ల గ్రామస్తులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.!! ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరీ కోటేశ్వరావు, రాష్ట్ర నాయకులు ఈవి రమేశ్, నంబూరీ,రామలింగేశ్వర రావు పెరమళ్ళ విజయరాజు. జిల్లా ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా, భాస్కర్ ని వీరమ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పడిగల మధుసూదన్ రావు పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు మట్ట ప్రసాద్ పర్షా రాంబాబు,చింతనొప్పు రామారావు మరియు ఏరుగట్ల బాధితులు అందరు పాల్గొన్నారు

నిర్మల్

ముధోల్–బాసర మండలాల్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా

ముధోల్ మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మరియు బాసర మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసన సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంలో MROలు, బీజేపీ మండల అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల జీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో *ITHERA-2025* సదస్సు ఘనంగా నిర్వహించబడినది.

విజయవాడ న్యూస్…..లబ్బీపేట పున్నమి ప్రతినిధి. *”TWO-DAY INTERNATIONAL CONFERENCE ON NEXT GENERATION DRUG AND DISCOVERY AND PERSONALIZED THERAPEUTICS* *DATE: 16 AND 17 OCTOBER 2025… “* ఈ కార్యక్రమంలో ఔషధ ఆవిష్కరణలు వ్యాధి నియంత్రణ మరియు భవిష్యద్వైద్య సాంకేతికతలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా మాజీ వైస్ ఛాన్స్లర్, క్లస్టర్ యూనివర్సిటీ…… తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ.. వైరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ వి ఆర్ సాయి గోపాల్ హాజరయ్యారు. వీరు ఆక్నోటిక్ థెరపీ మరియు బక్రీద్ బెలూన్ థెరపీ యొక్క ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ ఆధునిక చికిత్స పద్ధతుల ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వ్యాధి చికిత్స సాధ్యమవుతుందని తెలిపారు. SRM యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ అసోసియేట్ డీన్ డాక్టర్ జయశీలన్ మురుగన్ కీనోట్ పర్సన్ గా వ్యవహరించారు. భవిష్యత్తులో ఔషధ పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం మరియు కృత్రిమ మేధస్సు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మిషిగాన్ యూనివర్సిటీ నుండి డాక్టర్ ఎస్ బాల యశ్వంత్ కుమార్ 4HDHA అంశం మీద వర్చువల్గా విద్యార్థులతో విద్యార్థులతో ప్రసంగించారు. మరియు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అనేక అంశముల మీద పోటీలను నిర్వహించారు. వివిధకళాశాల నుండి అనేకమంది విద్యార్థులు పాల్గొని తమ సృజనాత్మకత ఆలోచనలను ప్రతిబింబించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం

ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా కొనసాగుతున్న ఫైనాన్స్ వ్యాపారం

ఏజెన్సీ ప్రాంతంలో జోరుగా కొనసాగుతున్న ఫైనాన్స్ వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారస్తులు ఏజెన్సీలో చట్టాలను అతిక్రమించి మరి అక్రమ దందాలు చేస్తున్నారు పేద ప్రజల బలహీనత వారి ఫైనాన్స్ వ్యాపారస్తుల పెట్టుబడి ఫైనాన్స్ వ్యాపారస్తులు మొదట చెప్పిన దానికి చివరి వరకు పొంతన లేకుండా పోయింది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా ప్రైవేట్ బ్యాంకులు వడ్డీలకు ఇస్తున్నారు ఏన్కూరు మండలం పిసా యాక్టు 1/70 లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం ఇక్కడ ఎలాంటి అనుమతులు గిరిజనేతరులకు చెల్లవు భూమి క్రయవిక్రయాలు కూడా చేయకూడదు ఇలాంటి అనేక కఠిన చట్టాలు అమలులోకి ఉన్న క్షేత్రస్థాయిలో ఈ కఠిన చట్టాలను అధికారులు అమలుపరచడంలో విఫలమవుతున్నారు దీంతో అక్రమ దందాలకు నిలయంగా ఏజెన్సీ ప్రాంతాలు మారిపోయాయి గిరిజన మహిళలే లక్ష్యంగా ప్రవేట్ బ్యాంకులో ఫైనాన్స్ వడ్డీలకు ఇస్తున్నారు ఐదుగురు మహిళ సభ్యులు పదిమంది గ్రూపుగా ఏర్పాటు చేసుకొని గ్రూపులోని ప్రతి ఒక్కరికి 30 వేల నుండి 40000 వరకు ఇస్తున్నారు నెలల వాయిదా పద్ధతిలో చెల్లించాలని కఠినమైన నిబంధనలు విధిస్తుంటారు ఇన్సూరెన్స్ పేరిట ప్రతి ఒక్క సభ్యుల నుంచి ఎంతో కొంత డబ్బును ముందే కోతకు కోసి మరి ఇస్తున్నారు గ్రూప్ సభ్యులలో ఏ ఒక్కరు వాయిదాలు చెల్లించకపోతే మిగిలిన వారు అందరూ కలిసి తప్పనిసరిగా కట్టాలి అనే కఠిన నిబంధనను పెట్టడంతో వీరి మితిమీరిన నిబంధన మూలంగా కొన్ని కుటుంబాల్లో మంటలు చిచ్చుపెట్టి కుటుంబ కలహాలకు దారితీస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన మహిళలు లక్ష్యంగా చిరు వ్యాపారుల నుండి మొదలుపెట్టి కిళ్ళి కొట్టు వ్యాపారస్తులు దాకా ఈ ప్రైవేట్ వడ్డీ బ్యాంకులో వడ్డీ బారిన పడినవారు ఎందరో ఒకటి కాదు పదుల సంఖ్యలో ఏన్కూర్ మండల కేంద్రంలో ఈ వడ్డీ దందా మహిళల గ్రూపులే లక్ష్యంగా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఏజెన్సీ గ్రామాల్లో సాగుతూ కోట్ల రూపాయల్లో వడ్డి దందా సాగుతుంది కొన్ని ముఖ్య శాఖల అధికారులు వీరికి అండగా ఉన్నాయనే సంకేతాలు మండల ప్రజల దృష్టిలో బాగా వినపడుతుంది ఈ మధ్యకాలంలో వారి వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు ప్రైవేట్ వడ్డీ బ్యాంక్ ఫైనాన్స్ భరినపడి ఆర్థికంగా నష్టపోతున్నామని వారు గ్రహించలేకపోతున్నారు ఏన్కూర్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు లేకుండా మండల వాసులు కొంతమంది వడ్డీ వ్యాపారం కొనసాగిస్తూ వడ్డీకే కాకుండా చక్ర వడ్డీలు కూడా విధిస్తూ నరకయాతన చూపిస్తున్నారు అనే మాట ఎక్కువగా వినపడుతుంది వారి ప్రైవేట్ దందాల రూపంలో కోట్లాది రూపాయలకు అధిపతిగా మారిన వారు ఈ ఏన్కూర్ మండలంలో ఉన్నారు వీరి వడ్డీ వ్యాపారాలకు అడ్డుగా వస్తే ఎంతటికైనా తెగించిన సంఘటనలు కూడా ఉన్నాయి కొన్ని శాఖల అధికారులకు ప్రజాప్రతినిధుల సమావేశంలో నజరానా చెల్లిస్తుంటారు వారికి బలమైన అధికారాలు ప్రజాప్రతినిధులు అండగా ఉండడంతో గిరిజన చట్టాలు వారికి బంధుమిత్రులయ్యాయి దీంతో వీరి వడ్డీ వ్యాపారం ఆగడాలకు అంతే లేకుండా పోయిందని మండల ప్రజలు భావిస్తున్నారు గిరిజన ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గిరిజన ప్రజలు కోరుకుంటున్నారు ఇలా మనీ లాండరింగ్ కి పాల్పడుతున్న వారిని ప్రత్యేక నిగా పెట్టి గిరిజన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వ మండల అధికారులకు పోలీస్ శాఖ వారికి బాధ్యత ఉందని మండల ప్రజలు గుర్తు చేస్తున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.