Tuesday, 28 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

అందరికీ నమస్కారం

తేది.23-10-2025, గురువారం నాడు ఉదయగిరి మండల కేంద్రంలోని SMGR అగ్రికల్చరల్ కాలేజి ప్రాంగణంలో జాబ్ మేళా..! నిరుద్యోగ యువతీ యువకులు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ సారధ్యంలో గురువారం ఉదయగిరి మండల కేంద్రంలోని SMGR అగ్రికల్చరల్ కళాశాల ప్రాంగణంలో పలు కంపెనీలు, వారి మేనేజర్లతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన యువకులు https://naipunyam.ap.gov.in/user registration వెబ్ సైట్లింక్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు. పదవ తరగతి పైబడి చదివిన 18 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల నిరుద్యోగ యువతీ యువకులు ఈ చక్కని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు. కావున మన తెలుగు దేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తమ తమ పంచాయతీలోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియపరచి ఈ జాబ్ మేళాలో పాల్గొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చూడవలసినదిగా కోరడమైనది. ఇట్లు…ఎమ్యల్యే కాకర్ల సురేష్ గారి క్యాంపు కార్యాలయం,ఉదయగిరి నియోజకవర్గం.

ఖమ్మం

బంద్ ని జయ ప్రదం చేయండి : బీజేపీ నేత ధనియాకుల పిలుపు

ఖమ్మం పున్నమి ప్రతినిధి 42% బీసీ రిజర్వేషన్ సాధాన కోసం తెలంగాణ బీసీ సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం నగరము లోని రెండవ పట్టణ పరిధిలో ప్రతి ఒక్కరు బంద్ కీ సహకరించాలి అని బీజేపీ రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో రెండవ పట్టణ కమిటీ బాద్యులు పాల్గొన్నారు

E-పేపర్

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 రాజమహేంద్రవరం, తేది:17.10.2025 నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనాను రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ శుక్రవారం ఆర్‌.ఎమ్‌.సి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని, మొక్కను అందజేశారు.” End

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా వైన్స్ షాప్స్ దరఖాస్తుల వివరాలు

* 2025-2027 పాలసీ సంవత్సరానికి వైన్స్ షాప్స్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది * తేది 17.10.2025 నాటికి మొత్తం *412 దరఖాస్తులు* అందాయి * ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం *668 దరఖాస్తులు* అందినట్టు అధికారులు వెల్లడించారు * విభాగాల వారీగా దరఖాస్తుల వివరాలు:* * నాగర్ కర్నూల్ స్టేషన్ పరిధి – *224* * కొల్లాపూర్ స్టేషన్ పరిధి – *80* * ఆచంపేట స్టేషన్ పరిధి – *100* * తెలకపల్లి స్టేషన్ పరిధి – *96* * కల్వకుర్తి స్టేషన్ పరిధి – *168* * దరఖాస్తుల సమర్పణకు చివరి తేది:* * *18.10.2025 సాయంత్రం 5 గంటల వరకు* * దరఖాస్తులు సమర్పించవలసిన స్థలం:* * రూమ్ నం. *F17 & F12, ఫస్ట్ ఫ్లోర్*, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), *కొల్లాపూర్ X రోడ్, నాగర్ కర్నూల్ జిల్లా* *- జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నాగర్ కర్నూల్*

కుమురం భీమ్ ఆసిఫాబాద్

బీసీ బంద్ ను విజయవంతం చెయ్యండి

** *కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధవత్ శివ ప్రసాద్ నాయక్ గారు* ఆసిఫాబాద్: బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లా నాయకులు సేవా లాల్ సేనా జిల్లా అధ్యక్షులు బాధవత్ శివ ప్రసాద్ నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్ ను పూర్తిగా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు, ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కోరారు.బీజేపీ, బీఆరెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు.బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు

కుమురం భీమ్ ఆసిఫాబాద్

Z.P.H.S కాగజ్‌నగర్‌లో పోలీస్ అవగాహన కార్యక్రమం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 17 జిల్లా ఎస్పీ శ్రీ కాంతిలాల్ పాటిల్ IPS ఆదేశాల మేరకు, కాగజ్‌నగర్ Z.P.H.S ప్రాంగణంలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. కళాబృందం సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, బాల్యవివాహాల ముప్పులు, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రత, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, హెల్ప్‌లైన్ నంబర్లు (1930, 100, 1098) తదితర అంశాలపై వినూత్నమైన సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు చైతన్యం కలిగించారు. స్థానిక ఎస్.ఐ శ్రీకాంత్ విద్యార్థుల ప్రశ్నలకు సమగ్రంగా స్పందించడమే కాక, యువతలో నైతిక విలువలు, క్రమశిక్షణ, సమాజసేవపై చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమ అనంతరం ఎస్.ఐ గారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ శ్రీకాంత్, కళాబృంద సభ్యులు రోహిత్, రాంచందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రజిత, సంఘవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

తిరుపతి

ముక్కంటి ఆలయంలో ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్

శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుక్రవారం ఇండియన్ ఆర్మీ జూనియర్ కమాండింగ్ ఆఫీసర్,చీఫ్ ఇంజనీర్ R&D సికింద్రాబాద్ JEE/M NB/SUB.మాధవ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి.శ్రీకాంత్ (మాజీ సైనికులు)దంపతులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వాదం చేయించి,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను అందివ్వడం జరిగింది.

నాగర్‌కర్నూల్

15 రోజులు గ‌డుస్తున్న మొల‌క రాని వేరుశనగ*

*పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు* *ఆందోళనలో రైతులు..* నాగర్ కర్నూల్ ప్రతినిధి అక్టోబర్ 17, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా వేరుశనగను అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు చొప్పరి శంకరయ్య ఎకరం 20 గుంటలలో వేరుశనగ విత్తనాలు విత్తాడు. విత్తనాలు వేసి 15 రోజులు గడుస్తున్నా నేటికీ మొలకెత్తక పోవడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు.అదే గ్రామానికి చెందిన మండలి ఎల్లయ్య పరిస్థితి కూడా ఇంతే. ఈ నేపథ్యంలో గ్రామంలోని మిగతా రైతులు వేరుశనగ విత్తనాలు విత్తడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి శోభారాణి ని ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు

Blog

సీనియర్ అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మాధవి లను సత్కరించిన నంద్యాల ఐఎంఏ వైద్యులు

ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ ఆధ్వర్యంలో, ఐఎంఏ నంద్యాల సహకారంతో స్థానిక మధుమణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ఇండియన్ అనస్థీషియా సొసైటీ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మధుసూదన రెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ రాజంపేటకు చెందిన డాక్టర్ బాలరాజు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు లు విశిష్ట అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నంద్యాలలో ఉన్న అనస్థీషియా వైద్యులు అనస్థీషియా పితామహుడు విలియం థామస్ గ్రీన్ మార్టన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారుఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ 1846 అక్టోబర్ 16వ తేదీ అమెరికా మాసచూసేట్స్ నగరంలో విలియం థామస్ గ్రీన్ మార్టన్ మొట్టమొదటిసారిగా మత్తుమందు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేయడం జరిగిందని అందువలన అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా అనస్థీషియా దినోత్సవం నిర్వహిస్తున్నారు అని తెలిపారు.వైద్య రంగ పురోగతిలో అనస్థీషియా వైద్యుల దే కీలక పాత్ర అని అన్నారు డాక్టర్ మధుసూదన రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో దాదాపు 30 మంది అనస్థీషియా వైద్యులు సేవలు అందిస్తున్నారని తద్వారా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నంద్యాలలోనే ప్రజలు చేయించుకోవడానికి ఆస్కారం ఏర్పడిందన్నారు డాక్టర్ బాలరాజు, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అనస్థీషియా రంగంలో వచ్చిన వినూత్న మార్పులు,ఉపయోగిస్తున్న అధునాతన పరికరాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితం చేసిందన్నారు ఈ సందర్భంగా నంద్యాల మొట్టమొదటి అనస్థీషియా వైద్యులు డాక్టర్ రవికృష్ణ, సీనియర్ అనస్థీషియా వైద్యులు శాంతిరాం వైద్య కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ శేష ఫణి, డాక్టర్ మధుసూదన రెడ్డి, మహిళా అనస్థీషియా వైద్యులలో సీనియర్ అయిన డాక్టర్ మాధవీ లను ఐఎంఏ నంద్యాల శాఖ తరపున ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా” ఆపరేషన్ థియేటర్ బయట అనస్థీషియా వైద్యుల పాత్ర” పై డాక్టర్ నాగరాజా రెడ్డి,”అనస్థీషియా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై ” డాక్టర్ రవితేజ మల్టీమీడియా సహకారంతో ప్రసంగించారు. సదస్సులో ప్రసంగించిన వీరికి ఐఎంఎ నంద్యాల జ్ఞాపికలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ నంద్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,కార్యదర్శి డాక్టర్ పనీల్ కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.