Tuesday, 28 April 2026

Blog

విశాఖపట్నం

జి వి ఎం సీ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫారం కు 28 వినతులు జీ వీ ఎం సి చీఫ్ సిటీ ప్లానర్ ఎ. ప్రభాకర్ రావు

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ లో 28 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 28 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 06, 3వ జోన్ కు 05, 4వ జోన్ కు 02, 5వ జోన్ కు 06, 6వ జోన్ కు 05, 8వ జోన్ కు 03 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు.. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.

విశాఖపట్నం

సాంకేతిక రంగంలో స్వయం స్వయమువృద్ధి సాధించాలి సమిష్టిగా పనిచేస్తే మరింత వేగవంతమైన ఫలితాలు vastai👮

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: *సాంకేతిక రంగంలో స్వయం సంవృద్ధి సాదించాలని, స్వదేశీ సాంకేతిక ప్రగతి శరవేగంగా జరుగుతోందని డి.ఆర్.డి.ఓ డైరెక్టర్ జనరల్ (ఎన్.ఎస్ & ఎం) డాక్టర్ ఆర్.వి. హర ప్రసాద్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎన్.ఎస్.టి.ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అకడమిక్ కాన్ఫరెన్స్. 2025 ను శుక్రవారం అయిన ఏ.యూ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ వి. వార ప్రసాద్ మాట్లాడుతూ భారత్ నవతరం, భవిష్యత్ సాంకేతికతలపై పూర్తిస్థాయిలో పట్టు సాదించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా డ్రోన్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు* . దేశీయంగా అభివృద్ధి చేసిన పలు సాంకేతికతలు సమర్ధవంతంగా వినియోగించి సత్ఫలితాలను సాధించిన విధానాన్ని వివరించారు. డి.ఆర్.డి.ఒ సమిష్టిగా విశ్వవిద్యాలయాలు సాంకేతిక విద్యాసంస్థలతో కలసి పరిశోధనలు నిర్వహించే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 100 విద్యాసంస్థలకు చెందిన 500 మందికి పైగా ప్రతినిదులు ఒకరోజు సదస్సులో భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. భవిష్య సవాళ్లకు అనుగుణంగా మన దేశీయ సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. నీటి లోపల లోతైన ప్రదేశంలో సమాచారాన్ని సంగ్రహించి, విశ్లేషించే నూతన వ్యవస్థలు, స్టైల్త్ టెక్నాలజీ, సెన్సార్లు వంటివి దేశీయంగా అభివృద్ధి చేయడం, వినియోగించడం జరుగుతోందని తెలిపారు, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, స్టార్ట్ అప్ లతో సమిష్టిగా పనిచేస్తే మరింత వేగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడం సాధ్యపడుతుందని అన్నారు. జలాంతర్గాములలో వినియోగిస్తున్న సెన్సార్లు, శత్రుదేశాలు గుర్తించలేని విధంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలను వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న సాంకేతికతలు మన దేశ అవసరాలకు వినియోగించడం తో పాటు, విదేశాలకు ఎగుమతి చేసే దిశగా కూడా దేశం అడుగులు వేస్తోందని ఇప్పటికి పలు క్షిపణులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్న విధానం ప్రస్తావించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్ళ మన చరిత్రను కలిగి ఉందని ఇటువంటి సందర్భంలో ఏయూ తో కలసి పనిచేసి దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ఖ్యాతిని ఏ.యూ కలిగి ఉందని చెప్పారు. *ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ సాంకేతికతలో స్వీయ వికాసం కలిగి ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల నుంచి నూతన* సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలో పెరగాలని సూచించారు. వికసిత్ భారత లక్ష్యాలను చేరుకోవాలంటే దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలు, అభివృద్ధి విస్తృతంగా జరగాలని చెప్పారు. ఎన్ ఎస్ టి ఎల్ తో సంయుక్తంగా విద్యాసంబంధ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్ తరానికి అవసరమైన సాంకేతికతలను అభివృద్ధి చేసే దిశగా శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ సదస్సులో చర్చిస్తారని చెప్పారు. డి ఆర్ డి ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మను కోరుల్లా వర్చువల్ విధానంలో సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రానున్న రోజుల్లో 100 పేటెంట్లు సాధించడం లక్ష్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించే విభిన్న పరిశోధనల పలితాలు సమాజానికి ఉపయుక్తంగా నిలపాలని చెప్పారు. సాంకేతికతలో ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశాన్ని నిలపాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ దిశగా ప్రభుత్వం పూర్తిస్థాయిలో విభిన్న వ్యవస్థలను బలోపేతం చేస్తుందని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఆవిష్కరణలు, నోబెల్ బహుమతులు సాధించడం వెనుక ఉన్న పరిశోధనలలో మన భారతీయులు భాగం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎం ఎస్ టి ఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, కార్యక్రమ సమన్వయకర్త ఆచార్య టి.వి.కె భాను ప్రకాష్, ఏ.ఐ.ఓ-ఎన్.ఎస్.టి.ఎల్ శాస్త్రవేత్త విఎప్ సాజీ, డిప్యూటీ ఏ.ఐ.ఓ-శాస్త్రవేత్త టి. వేణుగోపాలరావు, డి.ఆర్.డి. ఓ శాస్త్రవేత్తలు రాజేష్ యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. *ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఎన్.ఎస్.టి.ఎల్ కి సంబందించిన వివిధ ప్రాజెక్టులపై డి ఐ ఏ- సి ఓ ఈ సెషన్ నిర్వహించారు. ఎన్ ఆర్ బి అంశాలపై నిపుణులు ప్రసంగం చేశారు. మధ్యాహ్నం సెషన్ లో భాగంగా ఎన్.ఎస్.టి.ఎల్ కి సంబంధించిన వివిధ ప్రత్యేకమైన అంశాలను చర్చించారు* . *చివరగా సదస్సులో శాస్త్రవేత్తలు అందించిన ప్రసంగాలు, వివరించిన అంశాలకు అనుగుణంగా పలువురు ఆచార్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను అందించారు.*

తిరుపతి

శ్రీకాళహస్తి లో శ్రీకృష్ణ దేవరాయలు వారి వర్ధంతి కార్యక్రమం

శ్రీకృష్ణ దేవరాయలు వారి వర్ధంతి సందర్బంగా శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయలు వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొని నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయలను తెలుగు,కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు.ఆంధ్ర భోజుడుగా,సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా,కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాపు నేతలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఈ రోడ్లకు మోక్షం ఎపుడు…?

నెల్లూరు జిల్లా పరిధిలో(పొదలకూరు) డెగపూడి, తుమ్మల తల్పూర్ రోడ్లు రోజు రోజుకు మరి దారుణంగా తయారు అవుతున్నాయి, ప్రతిరోజూ ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ రహదారులపై ప్రయాణించాల్సి రావడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల బైక్ స్లిప్ అయ్యి స్వల్ప గాయాలు జరిగిన ఘటనలు నమోదయ్యాయి. ప్రజలు ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించలేదు. వర్షం కారణంగా రోడ్లలో నీరు నిలిచిపోవడం వల్ల గుంతలు మరింత పెరిగిపోతున్నాయి.

విశాఖపట్నం

అక్టోబర్ 22నుంచి మండల కాల మహా అన్న ప్రసాద వితరణ

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, శ్రీ కోదండరామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కంచుమూర్తి వెంకటరమణమూర్తి తెలిపారు. వైర్లెస్ కాలనీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు సుచికరమైన రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని చెప్పారు. ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమానికి విశాఖలోని ఆధ్యాత్మిక మహాశయులు, అయ్యప్ప స్వామి భక్తులు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు. భక్తి భావంతో వస్తురూపణ గాని బియ్యం పప్పుదినుసులు, కాయగూరలు వంటివి స్వీకరిస్తామన్నారు. ఎవరైనా భక్తి భావంతో సమర్పించే విరాళాలు శ్రీ హరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్, విశాఖపట్నం పేరున అందించి, రసీదు పొందవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో శ్రీ కోదండ రామాలయ కమిటీ అధ్యక్షులు కే. కోటేశ్వరరావు, ట్రస్ట్ వ్యవస్థాపకులు, గురుస్వామి కడగల శ్రీను, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు కే సుబ్రహ్మణ్యం, కే శ్రీనివాస్, కే. లక్ష్మీనారాయణ,ట్రస్టు సభ్యులు కోరాడ అప్పారావు రామకృష్ణారెడ్డి, పి.అవతార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జిమ్నస్టిక్ ఇండోర్ స్టేడియం లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ స్టాళ్లను సందర్శించిన కలెక్టర్ హరింద్ర ప్రసాద్

*జిమ్మాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్* *స్టాళ్ల‌ను సంద‌ర్శించి సంతృప్తి వ్య‌క్తం చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ విశాఖ‌ప‌ట్టణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: సూప‌ర్ జీఎస్టీ.. సూప‌ర్ సేవింగ్స్ లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ‌, సెట్విస్ సంయుక్త ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం పాండురంగాపురంలోని జిమ్నాస్టిక్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిష‌న్ క‌మ్ సేల్ ఏర్పాటు చేశారు. ఇక్క‌డ క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించి వ‌స్తువుల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. క్రీడాకారులు, సాధార‌ణ పౌరులు వాటిన కొనేందుకు, వీక్షించేందుకు ఆస‌క్తి క‌న‌బరిచారు. ఈ క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ సంబంధిత ఎగ్జిబిష‌న్ ను సంద‌ర్శించారు. అక్క‌డ అందుబాటులో ఉంచిన క్రీడా ప‌రిక‌రాల‌ను, హ‌స్త క‌ళ‌ల‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణపై సంతృప్తి వ్య‌క్తం చేసిన ఆయ‌న నిర్వాహ‌కుల‌ను అభివ‌నందించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క్రీడా అధికారి వెంక‌టేశ్వ‌ర‌రావు, సెట్విస్ సీఈవో క‌విత‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి మంత్రి నారాయణ తొ గంటా భేటీ

విశాఖపట్నం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రగతిపై మున్సిపల్ మంత్రి పి.నారాయణతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటీ అయ్యారు. కొత్తగా అనేక అంతర్జాతీయ ప్రాజెక్టులు భీమిలి పరిసరాల్లో ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన తదితర అంశాలు చర్చకు వచ్చాయి. భీమిలిలో మూడు ప్రధానమైన రోడ్ల విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని గంటా పేర్కొన్నారు. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు వచ్చే ఏడాది జులై నాటికి అందుబాటులోకి వస్తున్నందున కనెక్టింగ్ రోడ్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చూడాలన్నారు. మధురవాడ ప్రాంతానికి మంజూరైన రూ. 460 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రూ.500 కోట్ల తాగునీటి ప్రాజెక్టు పనులు త్వరగా ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. గంటా ప్రస్తావించిన అంశాలపై మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. భేటీలో కమిషనర్ కేతన్ గార్గ్, గంటా రవితేజ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి: వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్

విశాఖపట్నం.అక్టోబర్ పున్నమి ప్రతినిధి: గూగుల్ డేటా సెంటర్ పై ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచాను- వాటికి సమాధానం చెప్పలేకే నారా లోకేష్ ఎగతాళి వ్యాఖ్యలు- నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడు- గుగూల్‌తో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకోవాలి- ఉద్యోగాల కల్పనపై గూగుల్ తో ప్రకటన చేయించాలి: వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ డిమాండ్విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్.- గూగుల్ డేటా సెంటర్ ప్రయోజనాలపై ప్రజల్లో పెద్ద చర్చే నడుస్తోంది- డేటా సెంటర్ ఏర్పాటుకు రూ.22 వేల కోట్లు రాయితీలు – సంస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రయోనాలేంటో స్పష్టం చేయాలి?- రాష్ట్రానికి వచ్చే ఆదాయమేంత? యువతకు లభించే ఉద్యోగాలెన్ని? – ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలి: స్పష్టం చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్విశాఖపట్నం.విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పై నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలనే ప్రభుత్వం ముందు ఉంచానని.. వాటికి సమాధానం చెప్పలేకే లోకేష్ ఎగతాళిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను హేళన చేయడం మొదలు పెడితే లోకేష్ తట్టుకోలేడని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగానే గుగూల్‌తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే… ● రాష్ట్ర ప్రయోజనాలపై స్పష్టత ఏదీ ?విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలిస్తున్న ప్రభుత్వం.. సంస్థ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలమీద మాత్రం స్పష్టతనివ్వడం లేదు. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల రానున్న ఉద్యోగ అవకాశాలు, పెరగనున్న రాష్ట్ర ఆదాయాలపై ప్రజలు, నిపుణుల్లో అనేక సందేహాలు నెలకున్నాయి. వాటికి సమాధానం చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే.. స్పందించడం లేదు సరికదా లోకేష్ నాపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు వస్తాయని.. కేబినెట్ మీటింగ్ లోనూ, ఎస్ ఐపీబీలో చెబితే.. అదే టీడీపీ అనుకూల పత్రికల్లో కూడా రాశారు. ఇవాళ టీడీపీ నేతలు 1.90 లక్షల ఉద్యోగాలొస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి.. ఒక సంస్థకు పెద్ద ఎత్తున భూములు, ఇతర రాయితీలు కల్పిస్తున్నప్పుడు ఒకటి మన రాష్ట్రానికి ఉపయోగం, నిరుద్యోగ యువతకు ఏ మేరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు? రెండోది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంతన్నది ప్రధానమైన అంశాలు. గతంలో జరిగిన ఎస్ఐపీబీ, కేబినెట్ మీటింగ్ లో రైడన్ అనే సంస్థ ద్వారా 1గిగా వాట్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసే క్రమంలో 200 మందికి ఉపాధి కల్పిస్తున్నామని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని వారి అనుకూల ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లోనే రాశారు. అయితే లోకేష్ తోపాటు మిగిలిన మంత్రులందరూ కూడా 1.90 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నామని చెబుతున్నారు. నాకున్న సమాచారం మేరకు గూగుల్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్ మెంట్ సెంటర్లు, డేటాసెంటర్లు, రీసెర్చ్ సెంటర్లలో కలిపి పూర్తిగా ఉన్న ఉద్యోగాలు దాదాపు 1.87 లక్షల మంది ఉన్నారు. అలాంటప్పుడు విశాఖలో రానున్న గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1.90 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రులు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు. దీనిపై మేం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే… మంత్రి లోకేష్ నన్ను వ్యక్తిగతంగా హేళన చేస్తున్నాడు. నేను హేళన చేయడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు లోకేష్. ● గూగుల్ సంస్ధతో ప్రకటన ఇప్పించగలరా ?మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో గూగుల్ తో ప్రకటన చేయించగలరా? మీరు గూగుల్ తో ఆ ప్రకటన చేయిస్తే… విశాఖ వాసిగా నేనే సత్కరిస్తాను. మీరు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. నిజానికి డేటా సెంటర్ ఏర్పాటుకు బాటలు వేసిందే వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఆదాని సంస్థని డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు, ఐటీ పార్కు ఏర్పాటుకు కూడా ఒప్పించాం. మా ప్రశ్నలకు సమాధానం లేక.. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మేం అడిగిన ప్రశ్నలకు ఎవరు క్లారిటీ ఇస్తారు? ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల డేటా సెంటర్లు ఉన్నారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్న గూగుల్ లో సెర్చ్ చేసి చూడవచ్చు. 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. మెక్సికో అమెరికా సరిహద్దుల్లో ఉన్న ఎల్ పాసో అనే నగరంలో మెటా సంస్థ 1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. అది 2028 నాటికి ప్రారంభం కానుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా 100 నుంచి 200 మంది అని సంస్థే ప్రకటించింది. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నిర్మాణ సమయంలో చాలా ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు. నిజానికి ఎలా పాసోలో డేటా సెంటర్ నిర్మాణంలో 1500 మంది మాత్రమే ఉన్నారు. మన దగ్గర సాంకేతికత అక్కడి కంటే మన దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి.. 5వేల మందికి నిర్మాణ సయమంలో ఉపాధి దొరుకుతుంది. కానీ మీరు ప్రచారం చేస్తున్న 1.90 లక్షల ఉద్యోగాలకు, మీ ప్రభుత్వ కేబినెట్ మీటింగ్ లో చెప్పిన 200 ఉద్యోగాలకు ఏమైనా పొంతన ఉందా? కనీసం దీనిపైనా అయినా స్పష్టత ఇవ్వండి ? లేదా గూగుల్ సంస్ధతో అయినా ఉద్యోగాల కల్పనపై కనీసం పత్రికా ప్రకటన అయినా ఇప్పించండి. అప్పుడు ఈ ప్రాంతానికి చెందిన యువతలో తమకు ఉద్యోగాలు వస్తాయన్న విశ్వాసం పెరుగుతుంది. ● ప్రజల తరపున ప్రశ్నిస్తే ఎదురు దాడా ?సహజంగా ఒక ఐటీ ఉద్యోగికి పరోక్షంగా 5 మంది సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అలా లెక్కలేసుకున్నా 30 వేలమందికి గూగుల్ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే… ప్రత్యక్షంగా వీరు చెప్పినట్లు 1.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు. కానీ గూగుల్ ద్వారా వస్తున్న ఉధ్యోగాలు కేవలం 200 మాత్రమే. డేటా సెంటర్ తీసుకొచ్చాం, ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని మీరు ప్రచారం చేసుకోవడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ తప్పుడు ప్రచారంలో ప్రజలను మోసం చేయవద్దు అన్నదే మా అభ్యంతరం. డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున రెవెన్యూ అయినా జనరేట్ కావాలి, లేదా పెద్ద సంఖ్యలో మన యువతకు ఉద్యోగాలు అయినా రావాలి. అప్పుడు వారికి ఏ స్ధాయిలో ప్రోత్సాహకాలు ఇచ్చినా ప్రభుత్వంపై ఎంత భారం పడినా భరించడానికి సిద్ధం. ఇవేవీ నివృత్తి చేయకుండా… ప్రజల తరపున ప్రశ్నిస్తే మా పై ఎదురు దాడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. ● మా హయాంలో డేటా సెంటర్ తోపాటు ఐటీ పార్క్…మా ప్రభుత్వ హయాంలో ఆదానీ సంస్థ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు వారి ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, సెంటర్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది… మనమిచ్చే రాయితీలు వల్ల ప్రభుత్వానికి ఏం ఉపయోగం, ఎంత మేర యువతకు ఉపాధి కలుగుతుందన్న అంశాలను స్టడీ చేశాం. కేవలం డేటా సెంటర్ ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించలేం కాబట్టి.. మీకు ఇస్తున్న భూమిలో ఐటీ పార్కును డెవలప్ చేసి కనీసం 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదానీ సంస్దను ఒప్పించి జీవో రూపంలో తీసుకొచ్చాం. అది వైయస్సార్ కాంగ్రెస పార్టీ నిబద్ధత. లోకేష్ నీలా నేను డొనేషన్లతో స్టాన్ ఫర్డ్ లో చదువుకోలేదు. నీలా ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి కావడానికి నా తండ్రి ముఖ్యమంత్రి కూడా కాదు. నా తండ్రి చనిపోయిన తర్వాత నేను కష్టపడి, సుదీర్ఘంగా ప్రజల పక్షాన పోరాటాలు చేసి.. విశాఖ ప్రాంత ప్రజల మన్ననలు పొంది వైయస్.జగన్ నాయకత్వంలో పనిచేసి ఈ స్దాయికి వచ్చాను. మన వ్యక్తిగత అంశాలతో ప్రజలకేం అవసరం. వారికి వాస్తవాలు చెప్పాలి. అది మన బాధ్యత.. కానీ దాన్ని పక్కనపెట్టి అనవసర విషయాల ప్రస్తావన వలన ప్రయోజనం లేదు.● మౌలిక సదుపాయాల కల్పనపై క్లారిటీ ఏది?గూగుల్ డేటా సెంటర్ కు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. విశాఖపట్నం నగరానికి 1 గంటకు ఎంత విద్యుత్ అవససరమవుతుందో డేటా సెంటర్ కి అంతే విద్యుత్ అవసరం. దీన్ని ఎలా రీచ్ అవుతామో అంచనా వేశారా? 1 గిగావాట్ పవర్ కావాలంటే 5వేల మెగావాట్ రెన్యువబుల్ పవర్ ఉండాలి. సోలార్ విద్యుత్ అయితే దానికోసం 20 నుంచి 25వేల ఎకరాల భూమి కావాలి. ఇది ఎలా చేస్తున్నామన్నది చెప్పాలి. గ్రేటర్ విశాఖ మున్సిపాల్టీలో ఉన్న ప్రజలకు ఏడాదికి 5 టీఎంసీల నీరు కావాలి. డేటా సెంటర్ కు ఏడాదికి 2.5 నుంచి 3 టీఎంసీల నీరు అవసరం. వేసవిలో విశాఖలో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంటుంది. ఈ అంశాలకు పరిష్కారం ఎలా అన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలి? మరోవైపు డేటా సెంటరు ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో దానివల్ల 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుందని మేధావులు చెబుతున్నారు. ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు అన్నదానికి ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారన్నది కూడా ప్రజలకు స్పష్టతనివ్వాలి. గూగుల్ తోపాటు మెటా, టీసీఎస్ వంటిసంస్ధలతో ఇదే ప్రాంతంలో 5-6 గిగావాట్ ల డేటా హబ్ ఏర్పాటు చేస్తామంటున్నారు. దీనిమీద కూడా స్పష్టతనివ్వాలని ప్రజలకు, నిపుణులు, ఈ ప్రాంత ప్రజల తరపున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ● ఇదీ మా ప్రభుత్వంలో అభివృద్ధి…మా ప్రభుత్వ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రామాయపట్నం, బందరు పోర్టుల నిర్మాణ పనులు మొదలుపెట్టామని గర్వంగా చెప్పగలం. మూలపేట పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం,

తిరుపతి

మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. టి.డి.పి. నాయకులు

శ్రీకాళహస్తి, అక్టోబర్ 17, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుదీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉదయం 8.30 లకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జరుగునున్నదని ఈ కార్యక్రమానికి తెదేపా రాష్ట్ర, పార్లమెంట్, పట్టణ నాయకులు కార్యకర్తలు తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జి. విజయకుమార్, టి.డి.పి. పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ లు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

పర్యావరణ-నేస్తమా…!

పర్యావరణ-నేస్తమా…! కవిత వ్రాసినందుకు గాను బందిల మోహన్(కవిమిత్ర)గారికి “కుసుమ ధర్మన్న కళాపీఠం “వారు “చిత్రకవిత” పర్యావరణ-నేస్తమా…! అను కవిత కు,17-10-2025 తేదీన “ద్వితీయ ప్రశంసా పత్రం “తో అభినందించిరి…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.