Tuesday, 28 April 2026

Blog

తిరుపతి

శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించిన కోలా ఆనంద్ గారు.

*_17 జనవరి 1471– 17 అక్టోబర్ 1529_* *శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి.* *ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు.* *రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ* *సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు.* *శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి సందర్బంగా!!* *నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.* *ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారు నివాళులు అర్పించారు.*

తూర్పు గోదావరి

దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన బిఎస్ఎన్ఎల్ రూపాయి సిమ్ ఆఫర్

*దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన BSNL రూపాయి SIM ఆఫర్* స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ లో చాలామంది వినియోగదారులకు కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందించాం అని, ఆదరించిన ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL వినియోగదారులకు, వివిధ కళాశాలలు, సంస్థల యాజమాన్యాలకు ఒక పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియచేసారు. పలువురు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మళ్లీ ఇంకొకసారి దీపావళి పండుగ సందర్భం గా ఈ ఆఫరును తీసుకొచ్చామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో మేళాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నామని, కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందిస్తున్నాము అని, “కేవలం ఒక్క రూపాయితో 30 రోజుల పాటు రోజుకి 2GB డేటా మరియూ అపరిమిత కాల్స్ BSNL అందిస్తోంది” అని ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు తెలియజేసారు. పరిమితమైన ఈ ఆఫరును అందరూ వినియోగించుకోవాలని కోరారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారలా మీద సమీక్ష

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు శ్రీ మహీరధన్ గారు జిల్లా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో, శుక్రవారం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, జిల్లాలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ శక్తి, నాయకుల మధ్య సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై మహీరధన్ గారు విశ్లేషించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, “ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన చరిత్ర ఉంది. పాత, కొత్త నాయకుల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగాలి” అని పేర్కొన్నారు. అనంతరం, పరిశీలకుడు జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు కుచన రవలి రెడ్డి. పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

బీసీ బంద్ ను విజయవంతం చెయ్యండి

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్ తెలిపారు. ఈ బంద్ ను పూర్తిగా విజయవంతం చేయాలని జిల్లాలోని ప్రతి మండల కమిటీ శ్రేణులను కోరారు.బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

హైదరాబాద్

విద్యా శాఖ పై ముఖ్య మంత్రి సమీక్ష -మెరుగైన విద్యా కోసం ముఖ్య మంత్రి ఆదేశాలు

పున్నమి ప్రతినిధి హైదరాబాద్ పేదలకు మెరుగైన విద్య అందించేందుకు, రాష్ట్రంలో విద్యా రంగానికి ప్రాధాన్యతనిచ్చేలా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలలో ప్లే గ్రౌండ్, తరగతి గదులు, మంచి వాతావరణం ఉండేలా మెరుగుపరచాలని, స్థల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ భూమిని వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా, నర్సరీ నుండి 4వ తరగతి వరకు కొత్త స్కూల్స్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు పాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. 2026 అకడమిక్ సంవత్సరం నుండి ఈ పాఠశాలలు ప్రారంభమవుతాయని తెలిపారు.

తిరుపతి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలి:ఎమ్మార్పీఎస్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం లోని శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం నందు,తొట్టంబేడు తహసిల్దార్ కార్యాలయం నందు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయ్ మీద దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇర్ల రాజా మాదిగ వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

నెల్లూరు లో జోరుగా వర్షాలు

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి ) అక్టోబర్ : 18. నెల్లూరు రూరల్ మండలం పరిధిలోని పలు చోట్ల గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాని కారణం గా చిన్న చెరువులు, కుంటలు నిండు కుండలు తలపిస్తున్నాయి. ఎండలు తగ్గి చల్లటి వాతావరణం కనిపించడం తో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వర్షాలు ఎక్కువ కావడం తో విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీపావళి దగ్గరకు రావటంతో దీపావళి వస్తువులు అమ్మే వ్యాపారస్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటికి వెళ్లాలంటే వర్షం, ఇంట్లో ఉంటే కష్టం అన్న సామెతగా, నెల్లూరు రూరల్ పరిధిలో కొన్ని ఏరియాలు జాలాదిగ్బoదం అయ్యాయి. రోడ్లు, రహదారులు నీళ్ల తో నిండి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. మురికి నీరు చేరటంతో విషయ జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున మున్సిపల్, హెల్త్ అధికారులు రోగాలు ప్రభలకుండా అన్ని శానిటేషన్ చర్యలు తీసుకొని పారిశుధ్యo పై దృష్టి పెట్టాలని ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.

ఖమ్మం

సమస్య ల పరిష్కారం దిశ బీజేపీ డివిజన్ ల పర్యటన

పున్నమి ప్రతి నిధి సమస్య ల పరిష్కారం దిశగా ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు వెంకటనారాయణ చేపట్టిన డివిజన్ యాత్ర 3 వ రోజు శుక్రవారం 57 వ డివిజన్ లో కొనసాగింగింది. ఈ కార్యక్రమం టూ టౌన్ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. 57వ డివిజన్లోని జగజీవన్ రావు కాలనిలోని సీసీ రోడ్డు ఇరువైపులా డ్రైనేజీ లేకపోవడంతో వర్షాకాలంలో వర్షపు నీటితో అల్లకల్లోలంగా మారిపోతుంది. ఈ సమస్య వల్ల ప్రజలు విషజ్వరాలు, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోయారు. దీనిపై, బిజెపి నాయకులు కచ్చితంగా పరిష్కార చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కన్నేకంటి కృష్ణ చారి, పాశం శ్రీనివాస్ రెడ్డి, భూక్యా వెంకట్, ఉపేంద్ర, నాగమణి, వసంత, కనమర్లపుడి ఉపేందర్ రావు, పద్మావతి, సురేష్ గౌడ్, తోడుపునూరి రవీందర్, దాసరి వీరభద్రం, జిల్లెల్ల నాగరాజు, యుగేందర్, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

సఖి సురక్ష కార్యక్రమం ని ప్రారంభించిన దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్

*విశాఖపట్నం అక్టోబర్ పున్నమిప్రతినిధి* *స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక ,మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే ప్రధాన లక్ష్యం* స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్యం ,సామాజిక, ఆర్థిక శ్రేయస్సు కోసం మొప్మా ఆధ్వర్యంలో రూపొందించిన సఖి సురక్ష కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు డోక్రా బజార్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక ,మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖి సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని తెలిపారు. మహిళలకు పలు రకాల పరీక్షలు తో పాటు వారికి లభించే ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై వివరించారు . కార్యక్రమంలో పలు వార్డు నుంచి వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు…

ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుతో వ్యక్తి మృతి

ఆపద్భాంధవుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పిడుగుపాటుతో మస్తానయ్య మృతి – బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం వెంకటాచలం మండలం, అక్టోబర్ 17:శ్రీకాంత్ కాలనీలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడి గుడిసెలో నిద్రిస్తున్న ఆమ్మటి మస్తానయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఇంట్లోని మొబైల్ ఫోన్ పగిలిపోగా, స్విచ్ బోర్డులు కాలిపోయాయి. చంటి బిడ్డ చెవికి స్వల్ప గాయం తగిలింది. ఉదయం సమాచారం అందుకున్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన మట్టి ఖర్చుల నిమిత్తం పార్టీ తరపున రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ,“ఈ విషాద ఘటనపై స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చాం. ప్రభుత్వం తక్షణ సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి, భవాని నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.