Tuesday, 28 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం ఇన్చార్జి తహసిల్దారిగా దివాకర్ నియామకం

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం తాసిల్దారిగా గతంలో పనిచేసిన పి అశోక్ ప్రసాద్ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఇన్చార్జి తాసిల్దారిగా దివాకర్ ను జిల్లా కలెక్టర్ వావిరాల మహేష్ కుమార్ నియమించారు ఇతను ప్రస్తుతం ఉప్పలగుప్తం మండలంలో తాసిల్దారిగా పని చేస్తున్నారు ఈ సందర్భంగా పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు

అన్నమయ్య

అతుకులు వేయండి… బ్రతుకులను కాపాడండి!

-చిట్వేల్ పట్టణం ప్రధాన రహదారిలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గుంతలు చిట్వేల్, అక్టోబర్ 18 (ఎల్లో సింగం ప్రతినిధి) చిట్వేల్ మండలం లో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పట్టణంలోని ప్రధాన రహదారులు మళ్లీ గుంతల బారిన పడ్డాయి. గత సంవత్సరం పూడ్చిన గోతులు తిరిగి తెరుచుకుని వాహనదారులకు ప్రమాదకరంగా మారాయి. ప్రత్యేకంగా వై.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద, కొత్త బస్టాండు సమీపంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద, ఎన్.టి.ఆర్ విగ్రహం వద్ద ఇలా పలు ప్రదేశాల్లో రహదారి దెబ్బతింది. గతంలో అనేక సార్లు వార్తా పత్రికల్లో ప్రచురితమైనప్పటికీ, తాత్కాలిక పూడికతోనే పని ముగిసింది.ఇప్పటికే వై.ఎస్.ఆర్ సర్కిల్ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఈ గుంతల్లో జారి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదాలు మరింత పెరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ప్రధాన రహదారిలో ఏర్పడిన గోతులకు అతుకులు వేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని చిట్వేల్ ప్రజలు కోరుతున్నారు.

తెలంగాణ

బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఈరోజు బీసీ నాయకుల జేఏసీ బంద్ కు బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతు… BJHPS బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప

పున్నమి: అక్టోబర్ 18 రంగారెడ్డి జిల్లా, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో BJHPS వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. 18 రోజున బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకై 18న బీసీల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీల బంద్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కేల బేడ బుడగ జంగం నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు రావాలని తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి చెందినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి అంటారు అని తెలియజేశారు.

అన్నమయ్య

గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు – షిఫ్ట్ కారు ఢీ

రామాపురం మండలంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది. మదనపల్లి నుండి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, హైదరాబాదు నుండి అరుణాచలం వైపు వెళ్తున్న షిఫ్ట్ కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. శివాలయం దగ్గర రెండో మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయబోయే క్రమంలో ఆర్టీసీ బస్సు షిఫ్ట్ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రామాపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనం ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రామాపురం ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం

తిరుమల వెళ్లే వారు బీ అలర్ట్…..తిరుమల రెండో ఘాట్ రోడ్డులో చిరుత సంచారం*

తిరుపతిలో శుక్రవారం తెల్లవారుజామున చిరుత పులి సంచారం కలకలం రేపింది. అలిపిరి జూపార్క్ రోడ్ సమీపంలో భక్తులకు కనిపించిన చిరుతను కారులో వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీటీడీ అధికారులు అప్రమత్తమై, చిరుత కనిపించిన ప్రాంతాన్ని పరిశీలించి, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డులో కూడా చిరుతల సంచారంపై నిఘా పెట్టాలని భక్తులు కోరుతున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

తిరుపతి

ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను ఆన్లైన్ “మీ భూమి” వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు….*

*👆ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ భూముల ఆస్తి హక్కుదారులు తమ పేర్లను, స్థిరాస్తులను ఆన్లైన్ “మీ భూమి” వెబ్ ల్యాండ్ లో నమోదు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు….* *పట్టించుకోని రాష్ట్రస్థాయి రెవెన్యూ ఉన్నత అధికారులు…* *కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న కొంతమంది అధికారులు…* అమరావతి: ప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ గుంటూరులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మీ భూమి ఆన్లైన్ వెబ్ ల్యాండ్ యొక్క ప్రభుత్వ వెబ్ సైట్లో వ్యవసాయ భూముల హక్కుదారులు తమ భూములను వారసత్వంగా రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఇతరులకు అమ్ముకున్న లేదా కోర్టుల ద్వారా రిజిస్ట్రేషన్ జరిగిన ఈ వ్యవసాయ భూములు ప్రస్తుత యజమాని పేరుతో 1 బి, 10 బి అడంగల్ లో, మరియు ప్రభుత్వ రికార్డులలో వీరి పేర్లు మ్యుటేషన్ ద్వారా ఆన్లైన్ వెబ్సైట్లో నమోదు కావాలంటే ఇతరులు అన్న సూచిక దగ్గర యజమానుల పేర్లను వెబ్సైటు తీసుకోవట్లేదు. రెవెన్యూ కార్యాలయాలలో అన్ని ఆధారాలతో ఉన్న ఆ భూ హక్కుదారు పేర్లు ఎక్కిస్తుంటే ప్రభుత్వ వెబ్సైట్ అసలు తీసుకోవట్లేదన్నారు. దీనితో వ్యవసాయ భూముల యజమానులు తమ భూములు అమ్ముకోలేక, ఇతరులకు, తమ వారసులకు ఇవ్వలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ కారణంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరగక ఆగిపోయాయని శ్రీధర్ తెలియజేశారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్లు జరగక రెవెన్యూ కూడా తగ్గిపోయిందని, భూ యజమానులు గత కొన్ని నెలలుగా ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న సరే స్థానిక అధికారులు ఉన్నత అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకుంటున్నారన్నారు. కొంతమంది రెవిన్యూ అధికారులు అయితే ఇది CCLA ప్రధాన కార్యాలయం వారు చేయాల్సిన పని తమది కాదని, వారి సాఫ్ట్వేర్ లో ఈ సమస్యను సరిచేయాలనీ చెప్పి మరి తప్పించుకుంటున్నారు. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక ఆంధ్రప్రదేశ్లో వున్న అన్ని జిల్లాల్లో వ్యవసాయ భూముల తాలూకా భూ యజమానులు గందరగోళానికి,తికమకకు గురై ఉన్నారని, భూ యజమానులు ఎన్ని ఫిర్యాదులు స్థానిక రెవెన్యూ అధికారులకు చేసినా సరే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సరే ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవని, తహసిల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల భూ యజమానుల మ్యుటేషన్ అర్జీలు పరిష్కారం జరగక కట్టలు కట్టలు పేరుకుపోయాయని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా రెవెన్యూ అధికారులు ప్రవర్తిస్తున్నారని శ్రీధర్ వాపోయారు. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్య ఉత్పన్నం అవ్వలేదని, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా కావాలని కొంతమంది అధికారుల అత్యుత్సాహంతో తమకి ఈ గతి పట్టించారని భూ యజమానులు వాపోతున్నారని, అందువల్ల రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, సి సి ఎల్ ఏ ఉన్నతాధికారులు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ యజమానులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవలసిందిగా శ్రీధర్ ప్రభుత్వ ఉన్నత అధికారులను డిమాండ్ చేశారు…!

తిరుపతి

శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి సందర్బంగా ఆయనకు నివాళులు అర్పించిన కోలా ఆనంద్ గారు.

*_17 జనవరి 1471– 17 అక్టోబర్ 1529_* *శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి.* *ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు.* *రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ* *సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు.* *శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి సందర్బంగా!!* *నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.* *ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారు నివాళులు అర్పించారు.*

తూర్పు గోదావరి

దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన బిఎస్ఎన్ఎల్ రూపాయి సిమ్ ఆఫర్

*దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన BSNL రూపాయి SIM ఆఫర్* స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ లో చాలామంది వినియోగదారులకు కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందించాం అని, ఆదరించిన ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL వినియోగదారులకు, వివిధ కళాశాలలు, సంస్థల యాజమాన్యాలకు ఒక పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియచేసారు. పలువురు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మళ్లీ ఇంకొకసారి దీపావళి పండుగ సందర్భం గా ఈ ఆఫరును తీసుకొచ్చామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో మేళాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నామని, కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందిస్తున్నాము అని, “కేవలం ఒక్క రూపాయితో 30 రోజుల పాటు రోజుకి 2GB డేటా మరియూ అపరిమిత కాల్స్ BSNL అందిస్తోంది” అని ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు తెలియజేసారు. పరిమితమైన ఈ ఆఫరును అందరూ వినియోగించుకోవాలని కోరారు

ఖమ్మం

ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారలా మీద సమీక్ష

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఏఐసీసీ నియమించిన పరిశీలకుడు శ్రీ మహీరధన్ గారు జిల్లా పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో, శుక్రవారం ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, జిల్లాలో పార్టీ కార్యకలాపాల బలోపేతం, శక్తివంతమైన నాయకత్వం ఏర్పాటుపై చర్చ జరిగింది. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ శక్తి, నాయకుల మధ్య సమన్వయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యత వంటి అంశాలపై మహీరధన్ గారు విశ్లేషించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, “ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి గౌరవప్రదమైన చరిత్ర ఉంది. పాత, కొత్త నాయకుల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరగాలి” అని పేర్కొన్నారు. అనంతరం, పరిశీలకుడు జిల్లా నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు కుచన రవలి రెడ్డి. పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

బీసీ బంద్ ను విజయవంతం చెయ్యండి

బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్ తెలిపారు. ఈ బంద్ ను పూర్తిగా విజయవంతం చేయాలని జిల్లాలోని ప్రతి మండల కమిటీ శ్రేణులను కోరారు.బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.