Tuesday, 28 April 2026

Blog

నిర్మల్

బీసీ సంఘాల తెలంగాణ బంద్ లో పాల్గొన్న బిఆర్ఎస్ – సంపూర్ణ మద్దతు.

నిర్మల్ జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా నిర్మల్ లో బస్ డిపో ఎదుట, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకై 18న బీసీల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల బంద్ కార్యక్రమానికి *బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్. గారి ఆదేశాల మేరకు* బి.ఆర్.యస్. పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఆ పార్టీ *సీనియర్ పట్టణ నాయకులు మాహబూబ్ మాట్లాడుతూ* , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కేలా, అన్ని పార్టీల నాయకులు అందరూ ఐక్యతతో ముందుకు రావాలని తెలియజేశారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, అభివృద్ధి చెందినప్పుడే అది సంపూర్ణ అభివృద్ధి అంటారు అని తెలియజేశారు. ఇది ఇక్కడ స్థానికంగా కొట్లాడితే సరిపొదు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి సాధించుకోవాలని మాకు పార్లమెంట్ లో ఎంపీ లు లేకున్నా, రాజ్యసభ లో మాకు నలుగురి ఎంపీల బలం ఉంది కావున బిల్లు పెట్టితే మా మద్దతు ఉంటదని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ బి.ఆర్.యస్. పార్టీ పట్టణ నాయకులు G. రమేష్, మహబూబ్, అజీజ్, నయీమ్, షౌకత్, మసూద్, సుశీల, జుబేర్, రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

పాగల నాగ మోహన్ రెడ్డి గారు ఆకస్మిక మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి గారు

శ్రీకాళహస్తి మండలం,పుల్లారెడ్డికండ్రిగ గ్రామానికి చెందిన పాగల నాగ మోహన్ రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి. నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చంద్రారెడ్డి,శివారెడ్డి తదితరులు ఉన్నారు.

హైదరాబాద్

బీ సి ఉద్యమం ఆగదు.. ఐక్య పోరాటాలే మార్గం : బీజేపీ ఏం పి ఈటెల రాజేంద్ర

పున్నమి ప్రతి నిధి హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్: బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమం కేవలం ఓ పార్టీకి సంబంధించినదేగా కాదు, ఇది 52 శాతం ప్రజల ఆకాంక్షల తిప్పలు అని ఆయన స్పష్టం చేశారు. “తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన విధంగా, బీసీ రాజ్యాధికారం సాధ్యమే. మేము యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో ఉండాలన్నది మా ఆశయం” అని ఈటల అన్నారు. బీసీలకు చట్టసభల్లో పూర్తి రిజర్వేషన్లు రావాలని, మంత్రివర్గంలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలకూ, ఇప్పటి చర్యలకూ పొంతన లేదని ఎత్తిచూపారు. “రిజర్వేషన్ల పెంపు రాష్ట్రాల పరిధిలో లేదని రేవంత్ అన్నవీడియో ఉంద”ని అన్నారు. తెలంగాణలో బీసీ సీఎం అవసరమని, రాష్ట్రంలో బీసీలు శక్తివంతమైన రాజకీయం చేసేందుకు ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు మాదిరిగా చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం కాగా, అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని ఈటల పిలుపునిచ్చారు. “ఈ ఉద్యమం నిలిచిపోదు. ప్రతి బీసీ ఇంట్లో రాజ్యాధికారం సాధించాలనే తపన ఉంది” అని పేర్కొన్నారు. హైదరాబాద్, జూబ్లీ బస్ స్టేషన్: బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ ఉద్యమం కేవలం ఓ పార్టీకి సంబంధించినదేగా కాదు, ఇది 52 శాతం ప్రజల ఆకాంక్షల తిప్పలు అని ఆయన స్పష్టం చేశారు. “తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన విధంగా, బీసీ రాజ్యాధికారం సాధ్యమే. మేము యాచించే స్థాయిలో కాదు, శాసించే స్థాయిలో ఉండాలన్నది మా ఆశయం” అని ఈటల అన్నారు. బీసీలకు చట్టసభల్లో పూర్తి రిజర్వేషన్లు రావాలని, మంత్రివర్గంలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తూ, కాంగ్రెస్ రిజర్వేషన్ల విషయంలో మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పిన మాటలకూ, ఇప్పటి చర్యలకూ పొంతన లేదని ఎత్తిచూపారు. “రిజర్వేషన్ల పెంపు రాష్ట్రాల పరిధిలో లేదని రేవంత్ అన్నవీడియో ఉంద”ని అన్నారు. తెలంగాణలో బీసీ సీఎం అవసరమని, రాష్ట్రంలో బీసీలు శక్తివంతమైన రాజకీయం చేసేందుకు ఇది సరైన సమయం అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు మాదిరిగా చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం కాగా, అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందని ఈటల పిలుపునిచ్చారు. “ఈ ఉద్యమం నిలిచిపోదు. ప్రతి బీసీ ఇంట్లో రాజ్యాధికారం సాధించాలనే తపన ఉంది” అని పేర్కొన్నారు.

విజయనగరం 

చీపురుపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

చీపురుపల్లి, అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కమిటీ సభ్యులు, విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) పాల్గొన్నారు. చీపురుపల్లి అసెంబ్లీ పరిధిలోని చీపురుపల్లి మేజర్ పంచాయతీ రుంకాన వీధిలో జరిగిన ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ యువజన అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు గిరిడి రామదాసు, కోసిరెడ్డి రమణ, ముల్లు పైడిరాజు, వార్డు సభ్యులు కర్ణపు ఆదినారాయణ, మీసాల సాయి, బురాడ మహేష్, తలసీట్ల రాము తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు ఇజ్జురోజు రమణ, అప్పలనాయుడు, మాస్టర్, మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ సతివాడ అప్పారావు, సతివాడ అదికృష్ణ, దబ్బాడ జగదీష్, మీసాల గౌరీ, రుంకాన రాజేష్, శాంతారావు తదితర కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యం హక్కు, వ్యాపారం కాదు. వైద్య విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుంది” అని తెలిపారు.

ఆదిలాబాదు

ఉట్నూర్ మండలంలో సంపూర్ణ బంద్

పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం *ఎమ్మెల్యే శ్రీ వెడ్మ బొజ్జు పటేల్ గారి* పిలుపుమెరకు Bc లకు 42. శతం రిజర్వేషన్ కు మద్దతుగా *నాగపూర్ శ్యాంపూర్ సాలెవాడు x-road పెర్కగూడ* గ్రామాంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో గ్రామ కార్యకర్తలు నాయకులు వ్యాపార సముదాయాన్ని బందు చేయటం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలునాయకులు , తదితరులు పాలుగొన్నారు బంద్ కు సహకరించిన వ్యాపారస్తులకు వీరు ధన్యవాదాలు తెలియచేశారు.

ఆదిలాబాదు

ఉట్నూర్ లో భారీ బహిరంగ ర్యాలీ

పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఉట్నూర్ మండలం: ఉట్నూర్ మండల కేంద్రంలో శనివారం బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడామ బోజ్జు పటేల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగించారు. బిసి హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. Video: https://youtu.be/IKI2-lbcakA?si=10MLS3KYyB8r-X2H

ఆంధ్రప్రదేశ్

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. డి ఎల్ పి ఓ

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని డివిజనల్ పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇంటి తోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయవద్దని చేత్త బండ్ల లోనే వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేది అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ. ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్ డిప్యూటీ ఎంపీడీవో సునీల్ కార్యదర్శి సురేష్ . రామ్మోహన్ సచివాలయ సిబ్బంది డ్వాక్రా మహిళలు పారిశుద్ధ్య సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

E-పేపర్

కన్నడ కళామతల్లి ఒడిలో రైల్వే కోడూరు బిడ్డ అభినందించిన కర్ణాటక లెజెండరీ యాక్టర్ -శివరాజ్ కుమార్

రైల్వే కోడూరు మండలం సీనియర్ వైయస్సార్ నాయకులు వైయస్ అన్వర్ భాష మనవడు, ఎంపీటీసీ రౌఫ్ కుమారుడు ఫర్దిన్ అహ్మద్ కన్నడ చలనచిత్రంలో హీరో స్థానం పొందారు. చిన్న వయసు నుంచి నటన మీద తన ఆసక్తి వలన ఈ చోటు లభించింది.దిగులుపుర అనే థ్రిల్లర్ మూవీ ముహూర్తం ఘనంగా బెంగళూరు కంటీరవ స్టూడియో లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పలు కర్ణాటక చిత్ర నటీనటులు, పలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం

ఈరోజు విశాఖ పశ్చిమ నియోజవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే .

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) డాక్టర్* *మల్ల* విజయప్రసాద్. ఆదేశాల మేరకు 57వ వార్డులో దుర్గాపురం గ్రామంలో కోటి. సంతకాలు* మొట్టమొదటి ఎంబిబిఎస్ స్టూడెంట్ సంతకం పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ వాలంటరీ విభాగ అధ్యక్షుడు కోడ. ధనరాజు, వాణిజ్య విభాగ అధ్యక్షుడు గుణేశ్వరరావు , మాజీ సర్పంచి ఈశ్వర్ రావు , అప్పల రాజు , రామ రెడ్డిగారు, చిన్ని , శివాజీ , మణి , కాశి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

విశాఖపట్నం

92 వార్డ్ ఇందిరానగర్ , గోపాలపట్నం. విశాఖ అక్టోబర్ (పున్నమి )ప్రతినిధి ప్రాంతానికి చెందిన .లక్ష్మణరావు* అనే వ్యక్తి ఇటివలే*మరణించినారు

. వరియొక్క స్నేహితులు అందించిన ఆర్థికసాయం , రేషన్ సరుకులను* ప్రభుత్వ విప్ గణబాబు. చేతులు మిదిగా వారి కుటుంబసభ్యులకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారిపిన్ని సత్తిరాజు , స్నేహితులు నగు , సూరిబాబు , శ్రీను , మొదలగున్నవారు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.