Tuesday, 28 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మృతుని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండకుదురు లంకలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఇటీవల అకాల మృత్యువాత పడ్డ పెట్టా నరేష్. ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘ సభ్యులు అందరూ తమకు తోసిన విధంగా 200 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ లక్ష రూపాయలు మృతుని ఇద్దరు పిల్లల పేరు మీద పిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంక గ్రామాల దళిత సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుర్రాల రాంబాబు, ఉపాధ్యక్షులు నల్లరాంజి అరుణ్ కుమార్, పోతుల హేమ సుందర నారాయణరావు ,సెక్రటరీ నక్క శ్రీనివాస్ ,కర్రి రాంబాబు మరియు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు

అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ప్రతిభ అవార్డుల ఘన కార్యక్రమం

చిట్వేల్, అక్టోబర్ 18 (ఎల్లో సింగం ప్రతినిధి) రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు‘ప్రతిభ అవార్డులు’ ప్రదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా.యం. భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు సివిల్ జూనియర్ జడ్జి శ్రీ పి.జె.తేజ సాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రిన్సిపాల్ డా. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ“విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి అవార్డులు పొందడం ఎంతో ఆనందకరం. వీరిని స్పూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా విజయం సాధించాలని” తెలిపారు.ముఖ్య అతిథి జడ్జి పి.జె. తేజ సాయి మాట్లాడుతూ “ప్రస్తుత కాలంలో కొంతమంది యువత ఫ్యాషన్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివితే భవిష్యత్తులో మంచి ఉద్యోగావకాశాలు పొందవచ్చు” అని సూచించారు.ఈ సందర్భంగా దాత శ్రీ పాములపాటి సుబ్బారాయుడు తమ అన్నగారి జ్ఞాపకార్థం విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ప్రతి తరగతిలో ప్రథమ స్థానంలో ఉన్న వారికి ₹5,000, ద్వితీయ స్థానంలో ఉన్న వారికి ₹2,000, మహిళల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థినులకు ₹3,000 చొప్పున బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. భాస్కర్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు యం. సుబ్బారెడ్డి పేరుతో “బెస్ట్ స్టూడెంట్ అవార్డు”ను కూడా ప్రధానించారు.కార్యక్రమం అనంతరం స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జడ్జి శ్రీ తేజ సాయి గారి చేతుల మీదుగా కళాశాల ఆవరణలో చెట్టు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వెంకట రామరాజు, సీనియర్ న్యాయవాదులు శ్రీ శంకరయ్య, శ్రీ గజపతివర్మ, వైస్ ప్రిన్సిపాల్ డా. జి. రమేష్, ఐ క్యు ఏ సి కో ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ డా. కె. రమేష్, యన్.యస్.ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం నగరము లో బీసీ బంద్ సంపూర్ణం,: బీజేపీ మద్దత్తు తో విజయవంతం

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) బీసీ సంఘాల స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలంగాణ బీసీ బంద్ కి, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మద్దతుగా ఉదయం 6 గంటలకే కొత్త బస్టాండ్ నుండి వైరా రోడ్డు మీదుగా పర్ణశాల నుండి మమతా రోడ్డు ముస్తఫా నగర్ నుండి పాత మున్సిపాలిటీ ఆఫీస్ మీదగా మయూరి సెంటర్ వరకి షాప్స్ ని స్కూల్స్ ని బంద్ చేపించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు అధ్యక్షులు వెంకటనారాయణ రుద్ర గాని మాధవ, రాజేష్, ప్రవీణ్, దొంగల సత్య నారాయణ, నరేష్, రామకృష్ణ, లతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది,

ఖమ్మం

ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో వృధాగా పోతున్న నీరు

ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో వృధాగా పోతున్న నీరు ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 18 నీరు వృధాగా పోతున్న పట్టించుకోరే నిరంతరం నీరు వృధాగానే పోతుంది మోటర్ పైపులైను పనిముట్లు నాసిరకం వస్తువులను ఉపయోగించినట్లు అనిపిస్తుంది అధికారుల నిర్లక్ష్యం కొట్టేసినట్టుగా కనిపిస్తుంది ఖమ్మం జిల్లా ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో వృధాగా పోతున్న నీరు .మోటర్ నుండి లీక్ అయ్యి నీరు వృధాగా పోతున్న ఏ ఒక్క అధికారి కూడా తమకు ఏం సంబంధం లేనట్టుగా పట్టించుకోకుండా అలాగే వదిలేయడం జరిగింది. మోటరు పైపు లీకేజీ నుండి నీరు కారు కుంట చిన్నపాటి ఒక కాలవ లాగా నీరు ప్రవహించి ప్రయాణికులకు నడవడానికి ఇబ్బంది గా మారింది .నిత్యం కొత్త బస్టాండ్ కు సుమారు 1000 నుండి 2000 మంది ప్రయాణికులు దూరప్రాంతాల నుండి ప్రయాణం చేస్తూ ఉంటారు కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరు వృధాగా పోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు అధికారులు బస్టాండ్ పరిసరాలలో పర్యవేక్షిస్తున్నారా లేదా వారి కేటాయించిన రూములలో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారా అని అధికారులపై ప్రయాణికులు మండి పడుతున్నారు మరి ఇలాంటి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షణ కూడా కరువైంది ప్రయాణికులు అట్టి లీకేజీ మరిమత్తులను వెంటనే చేపించాలని కోరుకుంటున్నారు వీరిపైన చర్యలు తీసుకునే జిల్లా అధికారులు ఉన్నారా లేరా అని ఎదురు చూడాలి మరి

ఎన్ టి ఆర్ జిల్లా

ఈ రోజు 13వ డివిజన్ RTC కాలనీ రామాలయం ఏరియాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్, సూపర్ GST పై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ శాఖా మాత్యులు పొంగూరు నారాయణ గారితో పాల్గొన్న శాసనసభ్యులు

ఈ రోజు 13వ డివిజన్ RTC కాలనీ రామాలయం ఏరియాలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్, సూపర్ GST పై ట్రాక్టర్లు ర్యాలీ కార్యక్రమంలో మున్సిపల్ శాఖా మాత్యులు పొంగూరు నారాయణ గారితో పాల్గొన్న శాసనసభ్యులు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ గారు, డివిజన్ పార్టీ అధ్యక్షులు గద్దె ప్రసాద్ గారు, నూతి శ్రీను గారు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం విజయవంతం అయిన బీసీల బంద్ కార్యక్రమం. హాజరైన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లెపల్లి లక్ష్మణ్ గౌడ్.

భువనగిరి,సంస్థాన్ నారాయణపురం,అక్టోబర్18,(పున్నమి ప్రతినిధి): 42 శాతం బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని దుకాణాలను వ్యాపార సంస్థలను విద్యాసంస్థలను బందు చేసి స్థానిక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లేపల్లి లక్ష్మణ్ గౌడ్,మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు.గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ రిజర్వేషన్లపై పెండింగ్ లో ఉన్న 9 వ, తొమ్మిదవ షెడ్యూల్ కింద తక్షణమే(జి ఓ),ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కురుమ,మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్,కొప్పు రామకృష్ణ, మండల కార్యదర్శి ఉప్పరగోని రాజు, అఖిలపక్ష నాయకులు ఉప్పల లింగస్వామి,అక్బర్ అలీ,ఏపూరి సతీష్,వీరమల్ల వెంకటేష్ గౌడ్, బచ్చనబోని గాలయ్య యాదవ్, సిలివేరు అంజయ్య,దుబ్బాక భాస్కర్, వీరమల్ల యాదయ్య,పందుల యాదగిరి,దొంతగోని పెద్దులు,గుంటోజ్ శ్రీనివాస చారి,వంగరి రఘు,బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,సూరపెళ్లి శివాజీ,రత్తుపల్లి యాదయ్య,దూసరి వెంకటేష్ గౌడ్, బైకని నరేందర్ యాదవ్,సురపెళ్లి వెంకటేష్,ఎలిజాల శ్రీను,సికిలమెట్ల వెంకటేష్,పందుల రాజు,బొమ్మగోని చంద్రయ్య,అంతటి స్వామి గౌడ్ రేవనపల్లి గోపాల్,బద్ధుల యాదగిరి, తదితరులు,పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం విజయవంతం అయిన బీసీల బంద్ కార్యక్రమం.హాజరైన బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లేపల్లి లక్ష్మణ్ గౌడ్.

42 శాతం బీసీ రిజర్వేషన్ల హైకోర్టు స్టే నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని దుకాణాలను వ్యాపార సంస్థలను విద్యాసంస్థలను బందు చేసి స్థానిక చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బొల్లేపల్లి లక్ష్మణ్ గౌడ్,మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కోరారు.గవర్నర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర బీసీ రిజర్వేషన్లపై పెండింగ్ లో ఉన్న 9 వ, తొమ్మిదవ షెడ్యూల్ కింద తక్షణమే(జి ఓ),ఇవ్వాలని డిమాండ్ చేశారు.అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ కురుమ,మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్,కొప్పు రామకృష్ణ, మండల కార్యదర్శి ఉప్పరగోని రాజు, అఖిలపక్ష నాయకులు ఉప్పల లింగస్వామి,అక్బర్ అలీ,ఏపూరి సతీష్,వీరమల్ల వెంకటేష్ గౌడ్, బచ్చనబోని గాలయ్య యాదవ్, సిలివేరు అంజయ్య,దుబ్బాక భాస్కర్, వీరమల్ల యాదయ్య,పందుల యాదగిరి,దొంతగోని పెద్దులు,గుంటోజ్ శ్రీనివాస చారి,వంగరి రఘు,బచ్చనబోయిన దేవేందర్ యాదవ్,సూరపెళ్లి శివాజీ,రత్తుపల్లి యాదయ్య,దూసరి వెంకటేష్ గౌడ్, బైకని నరేందర్ యాదవ్,సురపెళ్లి వెంకటేష్,ఎలిజాల శ్రీను,సికిలమెట్ల వెంకటేష్,పందుల రాజు,బొమ్మగోని చంద్రయ్య,అంతటి స్వామి గౌడ్ రేవనపల్లి గోపాల్,బద్ధుల యాదగిరి, తదితరులు,పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే బీవీ

ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే బీవీ ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 18(పున్నమి ప్రతినిధి) ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలోని పలు గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు.మొత్తం 16 మందికి గాను రూ. 8,53,968 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 122 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ 1 కోటి 12 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గా ప్రజలు అందుకున్నారు.ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 18(పున్నమి ప్రతినిధి) ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలోని పలు గ్రామాల బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అందజేశారు.మొత్తం 16 మందికి గాను రూ. 8,53,968 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 122 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ 1 కోటి 12 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ఎమ్మిగనూరు నియోజకవర్గా ప్రజలు అందుకున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మామిడికుదురు పాశర్లపూడి లంకలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల కోటి సంతకాల ప్రజా ఉద్యమం

డా” బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) : మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు, మామిడికుదురు మండలంలోని పాశర్లపూడి లంక గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఉద్యమంలో పి.గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ కోఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు కొమ్ముల రాము గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు పీతాని నరసింహారావు, పేరిచర్ల కుమార్ రాజు, దొమ్మేటి దుర్గారావు, సరేళ్ల అప్పారావు తదితరులు హాజరయ్యారు.

అన్నమయ్య

ప్రతి కుటుంబంలో ఆనంద వెలుగులు నెలకొనాలి రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు

ప్రజలు ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని, ప్రతి ఇంట్లో దీపావళి వెలుగులు వెలగాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు. నందలూరు లో దీపావళి టపాసుల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి సమయంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా పండుగ జరుపుకోవాలని, అలాగే టపాసులు పేల్చే సమయంలో పిల్లలను జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ దీపావళి జీవితాలలో అంధకారాన్ని పోగొట్టుకొని వెలుగుల్లో జీవించేలా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, నందలూరు టిడిపి మండల అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్, మదన మోహనపురం సర్పంచ్ యానాది, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గంధం గంగాధర్, గంట గోపి, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు, వెంకటసుబ్బయ్య నందలూరు నీటి సంఘం ప్రెసిడెంట్, ఎస్సీ సెల్ నాయకులు జ్యోతి శివ, నీలిపల్లి రెడ్డయ్య, నందలూరు గ్రామ టిడిపి అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, గంగాధర్, తేజల ఆనంద్, రెడ్డి శేఖర్, రమేష్, నారపు శెట్టి శివ, రాజా, మహబూబ్ బాషా, గణేష్, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.