Tuesday, 28 April 2026

Blog

జనగాం

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్లు 42% అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ 42 శాతం వెంటనే అమలు చేయాలి:బనుక శివరాజ్ యాదవ్ ———————————————— జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపిన ఇంకా అమలు చేయకపోవడం దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన బైక్ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ భారత జోడో యాత్ర లో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే అందుకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం జరిగింది. అయినా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యసభలో కాని ,లోక సభ లో కాని బీసీ బిల్లు ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వం తొందర్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయకపోతే ఎక్కడికక్కడ బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో కట్టడి చేస్తామని వారు హెచ్చరించారు??ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, AMC డైరెక్టర్ బోట్ల నర్సింగరావు,మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్,బోట్ల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,మల్లేష్, సాదం జంపన్న,పత్తి నరేందర్,రఘు గౌడ్ ,రాజు, ప్రభాకర్, మరియు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బంద్ జయప్రదం చేశారు.

నాగర్‌కర్నూల్

వెల్దండ మండల బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుని ఎన్నిక*

*వెల్దండ మండల బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుని ఎన్నిక* నాగర్ కర్నూల్అక్టోబర్ 18, (పున్నమి ప్రతినిధి) *వెల్దండ మండల కేంద్రంలోని రాచూర్ గ్రామానికి చెందిన బండ శ్రీశైలంను వెల్దండ మండల బీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కురిమిద్ద యాదగిరి తెలిపారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని,ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.త్వరలో తెలంగాణలో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు.*

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ వ్యవస్థ పునరవ్యావస్థీకరణ 2025లో మంత్రివర్గం ఆమోదం పొందింది…

గ్రామ పంచాయతీల #క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా మార్చనున్న కూటమి ప్రభుత్వం… ప్రతి పంచాయతీకి స్వతంత్ర అధికారాలు, శాఖల నిర్మాణం, మెరుగైన పారదర్శకత కల్పించడం లక్ష్యంగా పనిచేయనున్న గ్రామ పంచాయతీలు… గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు తో.. పెరగనున్న కొలువులు, వేతనాలు… ఈ కొత్త విధానం ద్వారా గ్రామ #పంచాయతీలు మరింత బలమైన స్వతంత్ర పరిపాలనా సంస్థలుగా మారనున్నాయి

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొజాంబిక్ తీరంలో బోటు ప్రమాదం “ముగ్గురు భారతీయులు మృతి, ఐదుగురి గల్లంతు”

మొజాంబిక్ బైరా పోర్ట్ సమీపంలో భారతీయులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది భారతీయులలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికితీయగా, గల్లంతైన వారి కోసం సముద్రంలో రెస్క్యూ బృందాలు శోధిస్తున్నాయి. ప్రమాదానికి అధిక అలలు, ప్రతికూల వాతావరణం లేదా సాంకేతిక లోపం కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొజాంబిక్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ రక్షణ చర్యలు పర్యవేక్షిస్తోంది. గల్లంతైన వారిని కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని మొజాంబిక్ ప్రభుత్వం ఆదేశించింది.

విశాఖపట్నం

కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం జీ వీ ఎం సి అదనపు కమీషనర్

కాలుష్య రహిత విశాఖ అభివృద్ధికి సహకరిద్దాం. *నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణంకు మొక్కలను నాటి చెట్లను పెంచుదాం . – జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి. – విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు, నగరంలో స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం అభివృద్ధికి మొక్కలను నాటి చెట్లను పెంచేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు “క్లీన్ ఎయిర్” కార్యక్రమాన్ని భీమిలి బీచ్ పార్కులో స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి , ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్ , భీమిలి జోనర్ కమిషనర్ అయ్యప్ప నాయుడు లతో కలిసి అదనపు కమిషనర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జీవీఎంసీ అదనపు కమిషనర్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ క్లీన్ హెయిర్ కార్యక్రమం పై రూపొందించిన స్వచ్ఛ ప్రతిజ్ఞను అందరితో చేయించి,సమీప పార్కులో మొక్కలను నాటి, స్వచ్ఛ దీపావళి – శుభ దీపావళి జరుపుకోవాలనే నినాదంతో పోస్టర్ ను ప్రారంభించి, ప్లాస్టిక్ ను విడనాడాలని అవగాహనకు వస్త్ర సంచులను అందరికీ ఉచితంగా పంచారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యమైన వాతావరణంలో ప్రజలు నివసించేందుకు ,కాలుష్య రహిత విశాఖనగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా నగర ప్రజలు సౌర విద్యుత్ ను వినియోగించుకోవాలని, రోజురోజుకు పెరిగిపోతున్న జల, వాయు, శబ్ద కాలుష్యాల నుండి విశాఖ నగరాన్ని కాపాడుకునేందుకు ఇంధన వినియోగాన్ని పొదుపు చేస్తూ విద్యుత్ వాహనాలు, సైకిళ్లు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడంతోపాటు మొక్కలను నాటి చెట్లను పెంచడం ద్వారా కాలుష్య నివారణ కు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తద్వారా స్వచ్ఛమైన గాలిని కాపాడుకొని అందరూ ఆరోగ్యం గా జీవించాలన్నారు. సోమవారం జరుపుకోనున్న దీపావళి పర్వదినాన్ని కాలుష్య రహితంగా , పర్యావరణహితంగా, హరిత దీపావళి ,స్వచ్ఛ దీపావళి- శుభ దీపావళి గా జరుపుకోవాలని అదనపు కమిషనర్ తెలిపారు . అనంతరం స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ విశాఖ నగరం ఎంతో ఆకర్షణీయమైన నగరమని, ఈ విశాఖ నగరాన్ని కి ఎంతోమంది పర్యాటకులు సందర్శకులు వస్తారని వారికి ఆకర్షణీయమైన, ఆహ్లాదకరమైన స్వచ్చ మైన గాలితో కూడిన వాతావరణాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం ద్వారా వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారని అందుకు ప్రజలు చెట్లు నాటడంతో పాటు విద్యుత్తు వాహనాలు, సైకిల్, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించి విశాఖ నగరాన్ని క్లీన్ ఎయిర్ విశాఖగా, గ్రీన్ విశాఖగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం అందరూ కలిసి అక్కడ ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహనపై ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీవో నేతృత్వంలో తెల్ల వంగ, నల్ల వంగ, పచ్చిమిర్చి ,టమాటా , బంతి నారు మొక్కలు ప్రజలకు,ప్రభుత్వ వసతి గృహాలకు పంపిణీ చేశారు. అనంతరం భీమిలి నరసింహ స్వామి దేవాలయం కొండపై పచ్చదనాన్ని పెంపొందించేందుకు గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు , సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం వారు 30 వేల సీడ్ బాల్స్ , మిషన్ గ్రీన్ భీమిలి 25 వేల సీడ్ బాల్స్ ఉచితంగా అందజేయగా వాటిని గ్రీన్ క్లైమేట్ టీం, మిషన్ గ్రీన్ భీమిలిల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి , దేశీయ కూరగాయ మొక్కల విత్తనాలు వెదజల్లే కార్యక్రమం అదనపు కమిషనర్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ ఎన్ వి నరేష్ కుమార్, భీమిలి జోనల్ కమిషనర్ అప్పయ్య నాయుడు, 3వ వార్డ్ టిడిపి నాయకులు గంటా నూకరాజు , జీవీఎంసీ ఎస్ ఆర్ యు బృందం, గ్రీన్ క్లైమేట్ బృందం , గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రమణ్య వర్మ ,సెయింట్ జోసఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానాపురం ప్రతినిధులు , మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

తెలుగుగంగ కార్యాలయంలో స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర పారిశుద్ధ్యంపై అవగాహన పెంపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి

తెలుగుగంగ ప్రాజెక్టు నంద్యాల కార్యాలయంలో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుగంగ నంద్యాల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తో కలసి కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుగంగ సూపరింటెండింగ్ ఇంజనీర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యాలయ ప్రాంగణం, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మనం పనిచేసే ప్రదేశం, నివసించే ప్రాంతం శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా, సక్రమంగా నిర్వాహించటం ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలి, అని అన్నారు. స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కేవలం ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, ఇది సమాజం మొత్తానికి ఉపయోగపడే ప్రజా ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని, మనందరం చిన్నచిన్న చర్యల ద్వారా పెద్ద మార్పు తీసుకురాగలమని దశరథ రామిరెడ్డి సూచించారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ సిబ్బంది, అధికారులు పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమం చివర్లో సిబ్బందికి పర్యావరణ పరిరక్షణ, చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించే సెషన్ కూడా నిర్వహించారు.

జనగాం

బిసిలకు 42% రిజర్వేషన్ బంద్ విజయవంతం

బిసిలకు 42% రిజర్వేషన్ లు అమలు చేయాలి: మంద దిలీప్ ————————————————– జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు టీఆర్పీ జిల్లా నాయకులు మంద దిలీప్ అధ్యక్షతన బీసీ 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలను బంద్ చేయించగా అందుకు పూర్తి మద్దతు తెలిపిన కళాశాల,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు.తెలంగాణ రాష్ట్రబంద్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా జనగామ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలను స్వచ్ఛందంగా బంద్ చేసి తెలంగాణ బంద్ ను విజయవంతం చేశామని మంద దిలీప్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిట్టబోయిన నరేష్, ఎండిసిరవుద్దీన్ , మల్లేశం, బొంకురి రమేష్, నక్క యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Blog

బాల అకాడమీ పాఠశాల నందు ఆసక్తికరంగా సాగిన ఊదారంగు ఆక్టివిటీ

బాల అకాడమీ పాఠశాలలో నేడు 18-10-2025 శనివారం రంగులు – ప్రత్యేకతలు కార్యక్రమంలో భాగంగా వంగపండు రంగు ఆక్టివిటీ చిన్నారులు మరియు ఉపాధ్యాయ బృందం ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వంగపండు దుస్తులు ధరించి, వంగపండు రంగు ఆట వస్తువులు తీసుకొని వచ్చారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కరెస్పాoడెంట్ MGV రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీ లత మాట్లాడుతూ ఇంద్రధనస్సు లోపలి అంచున ఉన్న ఏడవ రంగు వైలెట్ అనగా వంగపండు రంగు. ఈ రంగు ని ఊదారంగు అనికూడా పిలుస్తారు. వైలెట్ అనే మొక్క యొక్క పుష్పం నుండి ఈ పేరు వచ్చింది. ఈ వంగపండు రంగు మాయాజాలన్ని, సమృద్ధి మరియు సంపదను సూచిస్తుంది తెలివిని మరియు నియంత్రణ శక్తిని పెంచే రసాయనాలను ఉత్పత్తి చేసే శక్తి గలది అని వంగపండు రంగు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కరెస్పాoడెంట్ MGV రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీ లత చిన్నారులు మరియు ఉపాద్యాయుల బృందం పాల్గొన్నారు.

విశాఖపట్నం

సమాచార శాఖ కార్యాలయంలో స్వచంద్ర –స్వర్ణంద్ర

*సమాచార శాఖ కార్యాల‌యంలో స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌ర్ణాంధ్ర* *మొక్క‌లు నాటిన డీడీ కె. స‌దారావు, ఇత‌ర ఉద్యోగులు విశాఖ‌ప‌ట్ట‌ణం, అక్టోబర్ పున్నమి ప్రతినిధి: రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌దర్శకాల ప్ర‌కారం, జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు స్థానిక స‌మాచార పౌర సంబంధాల శాఖ కార్యాల‌య‌ ప్రాంగ‌ణంలో శ‌నివారం ఉదయం స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌ర్ణాంధ్ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆవ‌ర‌ణ‌లోని పిచ్చి మొక్క‌ల‌ను, చెత్తాచెదారాన్ని తొల‌గించారు. ఈ నెల‌ మూడో శ‌నివారం థీమ్ క్లీన్ ఎయిర్ కు అనుగుణంగా మొక్క‌లు నాటారు. వాటికి నీరు పోసి ర‌క్ష‌ణ కంచెలు ఏర్పాటు చేశారు. ఇప్ప‌టికే ఉన్న మొక్క‌ల‌కు హీడింగ్ చేశారు. వాటి వ‌ద్ద నీరు నిలిచేలా చుట్టూ గోతులు తవ్వారు. అనంతరం ప‌లువురు వాహ‌న‌దారుల‌కు క్లీన్ ఎయిర్ కాన్సెప్ట్పై అవ‌గాహ‌న క‌ల్పించారు. కాలం చెల్లిన వాహ‌నాల‌ను వినియోగించ‌రాద‌ని, వాయు కాలుష్యం కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులు సూచించారు. త‌దుప‌రి స‌మాచార పౌర సంబంధాల శాఖ డీడీ కె. స‌దారావు, ఇత‌ర అధికారులు స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌ర్ణాంధ్ర ప్ర‌తిజ్ఞ చేశారు. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌కు, ప‌చ్చ‌ద‌నం పెంపొందించుట‌కు, స్వ‌చ్ఛాంధ్ర సాధ‌న‌కు నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తామ‌ని ప్ర‌తినబూనారు. కార్య‌క్ర‌మంలో డివిజ‌న‌ల్ పీఆర్వో నారాయ‌ణ‌రావు, ఏపీఆర్వో శ్రీ‌నివాస‌రావు, ఏఐఈ రామ‌కృష్ణ‌, కిశోర్, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

అన్నమయ్య

బాలికల ప్రాధాన్యతపై అవగాహన — ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు

చిట్వేలు, అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి) అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా చిట్వేలు మండలంలోని వివిధ పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కేజీబీవీ స్కూల్, వెంకటరాజుపల్లి హైస్కూల్‌లలో బాలికల ప్రాముఖ్యత, జెండర్ ఈక్వాలిటీ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంలో విద్యార్థులలో ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలను నిర్వహించగా, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సివిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) వెంకటేశ్వర్లు విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖ రాణి అధ్యక్షత వహించగా, జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్‌ఎం దుర్గారాజు, ఎస్. రవి, తులసి మరియు అధ్యాపక బృందం సభ్యులు పాల్గొన్నారు. బాలికల సమాన హక్కులు, విద్యలో వారి ప్రాధాన్యతపై ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు అందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.