Tuesday, 28 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల( కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం ) వాణిజ్య మరియు నిర్వహణ విభాగం పరిశ్రమల పర్యటన…..

విజయవాడ శ్రీ వెంకటేశ్వరపురం న్యూస్………. పున్నమి ప్రతినిధి తేదీ: అక్టోబర్ 18, 2025 ఈ రోజు వాణిజ్య మరియు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పరిశ్రమల పర్యటన నిర్వహించబడింది. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ మరియు బీబీఏ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు జోసిల్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి సబ్బు తయారీ యూనిట్‌లోని ప్రక్రియలను ప్రత్యక్షంగా గమనించారు. విద్యార్థులు ఉత్పత్తి, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ మరియు సరఫరా వ్యవస్థలపై అవగాహన పొందారు. సంస్థ అధికారులు పరిశ్రమలో వ్యయ నియంత్రణ, మానవ వనరుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలను వివరించారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకున్న సిద్ధాంతాలను ప్రాక్టికల్ అనుభవంతో అనుసంధానించగలిగారు. పర్యటన ముగింపులో విద్యార్థులు అధికారులతో చర్చలు జరిపి పరిశ్రమలోని నూతన సాంకేతికతల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు విద్యార్థులలో వృత్తి పరమైన అవగాహనను పెంచి, భవిష్యత్తు కెరీర్ అభివృద్ధికి దోహదం చేస్తాయని విభాగాధిపతులు తెలిపారు. ఈ పర్యటన విద్యార్థులకు ప్రేరణాత్మకంగా, జ్ఞానదాయకంగా మరియు ప్రాయోగికంగా నిలిచింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట్ సుబ్రమణ్య కుమార్ గారు విద్యార్థులలోని జిజ్ఞాసను అభినందించారు

ఎన్ టి ఆర్ జిల్లా

వాణిజ్య మరియు నిర్వహణ విభాగం పరిశ్రమల పర్యటన

తేదీ: అక్టోబర్ 18, 2025 ఈ రోజు వాణిజ్య మరియు నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం పరిశ్రమల పర్యటన నిర్వహించబడింది. బీబీఏ బిజినెస్ అనలిటిక్స్ మరియు బీబీఏ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు జోసిల్ ఇండస్ట్రీస్‌ను సందర్శించి సబ్బు తయారీ యూనిట్‌లోని ప్రక్రియలను ప్రత్యక్షంగా గమనించారు. విద్యార్థులు ఉత్పత్తి, ప్యాకేజింగ్, నాణ్యత నియంత్రణ మరియు సరఫరా వ్యవస్థలపై అవగాహన పొందారు. సంస్థ అధికారులు పరిశ్రమలో వ్యయ నియంత్రణ, మానవ వనరుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు వంటి అంశాలను వివరించారు. ఈ పర్యటన ద్వారా విద్యార్థులు పుస్తకాలలో నేర్చుకున్న సిద్ధాంతాలను ప్రాక్టికల్ అనుభవంతో అనుసంధానించగలిగారు. పర్యటన ముగింపులో విద్యార్థులు అధికారులతో చర్చలు జరిపి పరిశ్రమలోని నూతన సాంకేతికతల గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు విద్యార్థులలో వృత్తి పరమైన అవగాహనను పెంచి, భవిష్యత్తు కెరీర్ అభివృద్ధికి దోహదం చేస్తాయని విభాగాధిపతులు తెలిపారు. ఈ పర్యటన విద్యార్థులకు ప్రేరణాత్మకంగా, జ్ఞానదాయకంగా మరియు ప్రాయోగికంగా నిలిచింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట్ సుబ్రమణ్య కుమార్ గారు విద్యార్థులలోని జిజ్ఞాసను అభినందించారు

E-పేపర్

రోడ్డు ప్రమాదం లో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

రాజంపేట – రాయచోటి రహదారి మార్గంలో కూచువారిపల్లి పాల కేంద్రం వద్ద ఇద్దరు విద్యార్థులు బైక్ పై వస్తూ స్థంబాన్ని ఢీకొని ఒక విద్యార్థి మృతి చెందాడు. మరొక విద్యార్థి కి గాయాలు అయ్యాయి.మృతుడు నంద్యాల (జిల్లా) కోవెలకుంట్ల కు చెందిన మహేంద్ర గా గుర్తించారు బోయినపల్లి అన్నమాచార్య కళాశాల లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.విద్యార్థులు ఉదయం కళాశాల నుంచి బాలరాజు పల్లె బ్రిడ్జి వద్దకు ఫోటోలు చిత్రీకరణ కోసం వెళ్లి వస్తూ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

E-పేపర్

నంద్యాల పట్టణ అభివృద్ధికి రూ. 75 లక్షలతో భూమి పూజ చేసిన మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్‌ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం

నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగా నేడు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో మొత్తం రూ. 75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మంత్రి ఫరూక్ తెలియజేశారు. ముఖ్యంగా పట్టణంలోని మూడు ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. *భూమి పూజ చేసిన పనుల వివరాలు*: కుందు బిర్జి నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్ వర్క్ రూ. 20 లక్షల వ్యయంతో కుందు బిర్జి నుండి పెట్రోల్ బంక్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు భూమి పూజ జరిగిందని. ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం అవుతాయన్నారు వైఎస్ఆర్ నగర్ నివాసితులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు రూ. 15 లక్షల అంచనా వ్యయంతో సిసి (సిమెంట్ కాంక్రీట్) రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ఈ సిసి రోడ్డు వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తుందన్నారు ఆటో నగర్ ప్రాంతంలో రూ. 40 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేశామని . ఈ గ్రావెల్ రోడ్డు ఏర్పాటుతో ఆటోనగర్‌లోని రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు మొత్తంగా రూ. 75 లక్షలతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాల రూపురేఖలను మార్చడంతో పాటు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని మంత్రి ఫరూక్ తెలిపారు . అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 38 వార్డు టిడిపి ఇన్చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు , మహేష్, గోవిందు నాయుడు , మరాఠీ సూరి , కామిని మల్లికార్జున, షేక్ మున్న , నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, పిడి వెంకట దాస్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు నందం బాబురావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు

క్రైమ్

అంతరాష్ట్ర దొంగ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన పోలీస్లు

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం జిల్లా ఖానాపురం హవెలి పోలీసులు సంచలన అరెస్టు చేశారు. చోరీ కేసుల్లో ఇప్పటికే అరెస్టయ్యి బెయిల్‌పై వచ్చిన నిందితుడు మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శామ్ రిచర్డ్, మళ్లీ తన పాత అలవాట్లకు వెళ్లిపోయాడు. హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లోని స్టార్ హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడుపుతూ అక్కడివారిపై కన్నేశాడు. పోలీసుల ప్రకారం, వంశీకృష్ణ మళ్లీ పలు చోరీలకు పాల్పడి, 66 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు ఒక కారుతో సహా పట్టుబడ్డాడు. ఖానాపురం హవెలి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడించిన ఏసీపీ రమణమూర్తి, నిందితుడి ఆడంబరమైన జీవితం ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడిందని తెలిపారు.

ఖమ్మం

బి సి బందు లో పాల్గొన్న బీజేపీ నాయకుల మీద కాంగ్రెస్ గుండాల దాడి :

సత్తుపల్లి అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్‌కు సంపూర్ణ మద్దతుగా సత్తుపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల ఐక్యత, 42% రిజర్వేషన్ అమలుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. “మతపరమైన రిజర్వేషన్లు తొలగించాలి”, “బీసీలకు న్యాయం చేయాలి” అనే నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇవి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు, సత్తుపల్లి పట్టణ అధ్యక్షుడు శాలి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ శ్రేణుల భారీ తరలింపు చూసి తట్టుకోలేక, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన బజారు రౌడీలు — కమల్ పాషా, సందీప్, చెన్నారావు ర్యాలీపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాఘవరావు గాయపడ్డారు. బీజేపీ నాయకులు ఈ ఘటనపై సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులకు కూడా ఫిర్యాదు చేశారు

తిరుపతి

శ్రీకాళహస్తిలో దంచి కొట్టిన వర్షం

శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం మధ్యాహ్నం వరకు ఎండ వాతావరణం కనిపించినా మధ్యాహ్నం అయ్యే సరికి నల్లటి మేఘాలు ఆవరించి ఉరుములు మెరుపులతో కూడిన తీవ్ర వర్షం కురిసింది.ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయినాయి.

ఆంధ్రప్రదేశ్

వీరస్వామిని పరామర్శించిన కావలి ఎమ్మెల్యే కావ్య

ఆర్యవైశ్య ప్రముఖులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు బచ్చు వీరాస్వామి! ఇటీవల జరిగిన ఒక యాక్సిడెంట్ లో గాయపడి, వైద్యశాలలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శనివారం కావలి పట్టణం బృందావనం లోని వారి నివాసానికి చేరుకొని ఆయనను పరామర్శించారు.. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. వైద్యుల సూచనలు పాటిస్తూ, త్వరగా కోలుకోవాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కేక్ కట్ చేస్తున్న శ్రీకాంత్ యాదవ్..

ఘనంగా యువనేత పుట్టినరోజు వేడుకలు వరికుంటపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోలుబోయిన శ్రీకాంత్ యాదవ్ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన వరికుంటపాడు లోని సొసైటీ కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టిడిపి మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ రావు, జడ్పిటిసి రావిళ్ల నాగేంద్ర, సొసైటీ అధ్యక్షులు గుర్రం గోపి, మండల క్లస్టర్ ఇంచార్జి పోక మహేష్, మండల తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మండల వైస్ ఎంపీపీ దేవనబోయిన మధు, యూనిట్ ఇన్చార్జి నాదెండ్ల రాజా, గ్రామ పార్టీ అధ్యక్షులు పొద మాధవరావు, మాజీ సర్పంచ్ ఆండ్రా బాల గురువారెడ్డి, ఆండ్రా శివరామిరెడ్డి, లింగం మాలకొండయ్య,ఆరికొండ వెంకటరత్నం, కామేపల్లి శ్రీనివాసులు,గుర్రం కొండలరావు, చంచల బొజ్జయ్య, టిడిపి నాయకులు జనసేన పార్టీ నాయకులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మృతుని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం కొండకుదురు లంకలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తూ ఇటీవల అకాల మృత్యువాత పడ్డ పెట్టా నరేష్. ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సంఘ సభ్యులు అందరూ తమకు తోసిన విధంగా 200 నుంచి పదివేల రూపాయల వరకు వసూలు చేసి ఆ కుటుంబానికి అందజేశారు. ఆ లక్ష రూపాయలు మృతుని ఇద్దరు పిల్లల పేరు మీద పిక్స్ డిపాజిట్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంక గ్రామాల దళిత సంఘం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుర్రాల రాంబాబు, ఉపాధ్యక్షులు నల్లరాంజి అరుణ్ కుమార్, పోతుల హేమ సుందర నారాయణరావు ,సెక్రటరీ నక్క శ్రీనివాస్ ,కర్రి రాంబాబు మరియు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.