Tuesday, 28 April 2026

Blog

అన్నమయ్య

గ్రామపంచాయతీలు సొంత ఆదాయ వనరులను సమీకరించుకోవాలి

గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల సమీకరణలో ప్రగతిని సాధించి ఆర్థికంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలని చిట్వేలు మండల అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు చిట్వేలు మండల పరిషత్ కార్యాలయం నందు రెండు రోజులు గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరుల పెంపుపై శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపిడిఓ మాట్లాడుతూ మండలంలోని అన్ని పంచాయతీలలో సర్పంచులతో కలిసి గ్రామ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు సంబంధిత సిబ్బంది పనిచేయాలని ఎంపీడీవో సూచించారు. ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి మండలంలోని అందరూ పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సర్పంచులు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆసక్తి చూపకపోవడం విచారకరం. ఈ కార్యక్రమంలో కౌశలం సర్వే కి సంబంధించి సాంకేతిక పరికరాలు, టెలిఫోన్ చిట్వేలు మండలంలోని గ్రామ సచివాలయాల కార్యదర్శులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పంపిణీ చేశారు. కౌశలం సర్వేని గ్రామాలలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని ఆయన కోరారు.

E-పేపర్

దండారి ఉత్సవాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారు

పున్నమి అక్టోబర్ 18 అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం: ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలం డోంగరిగాం గ్రామంలో దండరి ఉత్సవాలలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారి తో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ అధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య ఉట్నూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ ఖానాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ మరియు అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కోలా ఆనంద్

తిరుపతి పట్టణంలోని గాంధీ భవనలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సంజీవని స్వరం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ అటు దేవుని సేవలో, ప్రతి కుటుంబంలో శుభ కార్యములో వాళ్లు కీలకమని,అయితే వారికి కార్పొరేట్ రంగాల నుండి తీవ్ర పోటీ నెలకొనిందని ఇది చాలా శోచనీయం అని అన్నారు.దీనిపై ప్రభుత్వం తో చర్చించాలన్నారు.నాయి బ్రాహ్మణ పూర్వీకులు ధన్వంతరి వైద్యం చేసేవారిని కాలక్రమంలో అది తగ్గిపోయిందని భారతీయ సంస్కృతిలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవని కొనియాడారు.నాయి బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయాలని,వారి కులదైవం ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న అందుకు చాలా ఆనందంగా ఉందని కొనియాడారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్ స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన *NAVONMESHIKOTSAV… 2025…A NEW DAWN OF TALENT…*

విజయవాడ….శ్రీ వెంకటేశ్వర పురం న్యూస్… పున్నమి ప్రతినిధి సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్ స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన *NAVONMESHIKOTSAV… 2025…A NEW DAWN OF TALENT…* .సాంస్కృతిక పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ప్రదర్శించిన జానపద వాయిద్య ప్రదర్శనలో 2వ బహుమతి, జానపదనృత్వ పోటీలలో తృతీయ బహుమతి, జానపద మరియు దేశభక్తి గీతాలాపన పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు….. కల్చరల్ కో ఆర్డినేటర్… శ్రీమతి రత్న శ్రీ మేడం ను,కల్చరల్ విద్యార్థులను అభినందించారు.💐💐💐

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ త్రికోటేశ్వరలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లిలోని శ్రీ త్రికోటేశ్వర విద్యాలయంలో ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో దీపాలతో రంగవల్లికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థినీ విద్యార్థులు టపాకాయలు పేల్చి దీపావళి సంబరాలను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా తయారుచేసిన మట్టి దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ లక్ష్మీనరసారెడ్డి , డైరెక్టర్ సుధాకర్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని పెద్దల సమక్షంలో దీపావళిని జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు బాల బాలికలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్

విజయవాడ….శ్రీ వెంకటేశ్వర పురం న్యూస్… పున్నమి ప్రతినిధి స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన *NAVONMESHIKOTSAV… 2025…A NEW DAWN OF TALENT…* .సాంస్కృతిక పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ప్రదర్శించిన జానపద వాయిద్య ప్రదర్శనలో 2వ బహుమతి, జానపదనృత్వ పోటీలలో తృతీయ బహుమతి, జానపద మరియు దేశభక్తి గీతాలాపన పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు….. కల్చరల్ కో ఆర్డినేటర్… శ్రీమతి రత్న శ్రీ మేడం ను,కల్చరల్ విద్యార్థులను అభినందించారు.💐💐💐

నాగర్‌కర్నూల్

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

నాగర్ కర్నూల్ అక్టోబర్ 18 :వెల్దండ మండల సమీపంలోని రాచూర్ తాండా(Rachur Tanda)కి చెందిన వర్త్యవత్ ఫకీర(Vartyawat Fakir)కి వ్యవసాయ కాడి ఎద్దు ఈ రోజు కరెంట్ షాక్ తో మృతి చెందిందన్నారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం వ్యవసాయ పొలంలో గడ్డిమేస్తున్న సమయంలో కరెంటు వైరు(Electricity Wire) తగిలి కాడి ఎద్దు అక్కడికక్కడే మృతి చెందిన‌ట్లు తెలిపారు. ఎద్దు విలువ 70 వేల రూపాయలు ఉంటుందని వారు బోరున విలపిస్తూ ప్రభుత్వం నుండి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

సిద్ధార్థ్ అకడెమీ ఆఫ్ జనరల్ అండ్ టెకకల్ ఎడ్యుకేషన్

విజయవాడ….శ్రీ వెంకటేశ్వర పురం న్యూస్… పున్నమి ప్రతినిధి స్వ ర్ణోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులు ప్రదర్శించిన జానపద వాయిద్య ప్రదర్శనలో 2వ బహుమతి, జానపదనృత్వ పోటీలలో తృతీయ బహుమతి, జానపద మరియు దేశభక్తి గీతాలాపన పోటీలలో తృతీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు….. కల్చరల్ కో ఆర్డినేటర్… శ్రీమతి రత్న శ్రీ మేడం ను,కల్చరల్ విద్యార్థులను అభినందించారు.💐💐💐

జనగాం

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్లు 42% అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ 42 శాతం వెంటనే అమలు చేయాలి:బనుక శివరాజ్ యాదవ్ ———————————————— జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపిన ఇంకా అమలు చేయకపోవడం దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన బైక్ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ భారత జోడో యాత్ర లో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే అందుకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం జరిగింది. అయినా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యసభలో కాని ,లోక సభ లో కాని బీసీ బిల్లు ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వం తొందర్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయకపోతే ఎక్కడికక్కడ బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో కట్టడి చేస్తామని వారు హెచ్చరించారు??ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, AMC డైరెక్టర్ బోట్ల నర్సింగరావు,మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్,బోట్ల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,మల్లేష్, సాదం జంపన్న,పత్తి నరేందర్,రఘు గౌడ్ ,రాజు, ప్రభాకర్, మరియు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బంద్ జయప్రదం చేశారు.

నాగర్‌కర్నూల్

వెల్దండ మండల బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుని ఎన్నిక*

*వెల్దండ మండల బిజెపి పార్టీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుని ఎన్నిక* నాగర్ కర్నూల్అక్టోబర్ 18, (పున్నమి ప్రతినిధి) *వెల్దండ మండల కేంద్రంలోని రాచూర్ గ్రామానికి చెందిన బండ శ్రీశైలంను వెల్దండ మండల బీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కురిమిద్ద యాదగిరి తెలిపారు.ఈ సందర్భంగా బండ శ్రీశైలం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని,ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి కృషి చేస్తానని అన్నారు.త్వరలో తెలంగాణలో రానున్నది బిజెపి ప్రభుత్వమేనని అన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.