Tuesday, 28 April 2026

Blog

విశాఖపట్నం

ఈరోజు విశాఖ పశ్చిమ నియోజవర్గ వైయస్సార్ సిపి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే .

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) డాక్టర్* *మల్ల* విజయప్రసాద్. ఆదేశాల మేరకు 57వ వార్డులో దుర్గాపురం గ్రామంలో కోటి. సంతకాలు* మొట్టమొదటి ఎంబిబిఎస్ స్టూడెంట్ సంతకం పెట్టడం జరిగింది కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజవర్గ వాలంటరీ విభాగ అధ్యక్షుడు కోడ. ధనరాజు, వాణిజ్య విభాగ అధ్యక్షుడు గుణేశ్వరరావు , మాజీ సర్పంచి ఈశ్వర్ రావు , అప్పల రాజు , రామ రెడ్డిగారు, చిన్ని , శివాజీ , మణి , కాశి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

విశాఖపట్నం

92 వార్డ్ ఇందిరానగర్ , గోపాలపట్నం. విశాఖ అక్టోబర్ (పున్నమి )ప్రతినిధి ప్రాంతానికి చెందిన .లక్ష్మణరావు* అనే వ్యక్తి ఇటివలే*మరణించినారు

. వరియొక్క స్నేహితులు అందించిన ఆర్థికసాయం , రేషన్ సరుకులను* ప్రభుత్వ విప్ గణబాబు. చేతులు మిదిగా వారి కుటుంబసభ్యులకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారిపిన్ని సత్తిరాజు , స్నేహితులు నగు , సూరిబాబు , శ్రీను , మొదలగున్నవారు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఇటీవల దొంగతనాలు రోజురోజుకి పెరిగిపోతున్న కారణంగా,

విశాఖ అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) అదేవిధంగా రైతు బజార్లో మొబైల్స్, పర్సులు, డబ్బులు ఎక్కువగా దొంగతనం జరుగుతున్న కారణంగా ఈరోజు మర్రిపాలెం రైతు బజార్ వద్ద west crime CI . అయిన ఎం చంద్రమౌళి , ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దొంగతనాల నివారణ కొరకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలు తమ విలువైన బంగారు ఆభరణాలు, డబ్బులు, మనీ పర్సులు ఇతర విలువైన వస్తువులు అన్ని దొంగతనాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలో మరియు ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు చైన్ స్నాచింగ్ జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ అవగాహన కార్యక్రమంలో సిఐ . అందరికీ తెలియపరచడం జరిగింది.

తిరుపతి

అధ్వానంగా పారిశుధ్యం ..

శ్రీకాళహస్తి పట్టణం నాలుగో వార్డ్ శాంతినగర్ లో పారిశుధ్య కార్మికులు కాలువలలోని చెత్తను తొలగించి ఎక్కడ చెత్త కుప్పలు అక్కడే వదిలిపెట్టి వెళ్లడంతో వాటిని పందులు సైతం స్వైర విహారం చేస్తూ చెత్తను రోడ్ల మీదకు తీసుకొని వెళ్లి పడేస్తున్నాయి.అక్కడ ప్రజలు అటుగా వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు.చెత్త కుప్పలు తీయకపోవడం వలన దోమలు,పురుగు వారి ఇళ్లలోకి వెళ్తున్నాయి అని మున్సిపల్ సిబ్బంది పట్టించుకొని వాటిని శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.మున్సిపల్ కమిషనర్ స్పందించి ఇలాంటివి పునరావృతం కాకుండా,ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఏపీ ధాన్యం కొనుగోలు ముఖ్య అంశాలు

ఏపీ ధాన్యం కొనుగోలు ముఖ్య అంశాలు కొనుగోలు ప్రారంభ తేదీ: కొనుగోలు కార్యక్రమం 2025 అక్టోబర్ 27 నుండి ప్రారంభమవుతుంది. సేకరణ లక్ష్యం: ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల రిజిస్ట్రేషన్: రైతులు తమ ధాన్యం అమ్మకం కోసం WhatsApp ద్వారా “Hi” అని మెసేజ్ పంపి నమోదు చేసుకోవచ్చు. చెల్లింపుల సమయం: ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా చెల్లింపు రైతుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. కొనుగోలు కేంద్రాలు: 3,013 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. 2,061 సహకార సంఘాలు పాల్గొంటాయి. మొత్తం 10,700 మంది సిబ్బంది సేకరించడంలో పాల్గొంటారు. బ్యాంకు గ్యారంటీ/సౌకర్యం: ఈ పథకం కోసం 35 బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంటాయి. రైస్ మిల్లర్ల కోసం 1:2 విధానంలో బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటారు. గమనిక: ఈ సమాచారం అక్టోబర్ 18, 2025 నాటిది మరియు 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించినది.

కామారెడ్డి

తహసీల్దార్ ఎదుట నిరసన కార్యక్రమాలు

కామారెడ్డి జిల్లా, అక్టోబర్ 18, పున్నమి ప్రతినిధి రామారెడ్డి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం బీసీలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ BC-జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీసీలకు న్యాయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలన్న డిమాం డ్‌తో ప్రభుత్వంపై నినాదాలు జారిపడ్డాయి. నాయ కులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఇచ్చి న స్టే కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు.”బీసీలకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, రిజర్వేషన్ల సాధ న కోసం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అని జేఏసీ నాయకులు తెలిపారు.దీనికి మద్దతు గా ఈ నెల 18న సంపూర్ణ బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాల ని పిలుపునిచ్చారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందించారు. ప్రభుత్వ స్పందన ఆశించకుండా ఉంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అనకాపల్లి

కావుళ్ళుతో వినూత్న నిరసన — రోలుగుంట మండలంలో మంచినీటి కోసం ధర్నా

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని గొల్లపేట గ్రామ ప్రజలు మంచినీటి సమస్యపై వినూత్నంగా కావుళ్ళుతో నిరసన చేపట్టారు. ఈ గ్రామంలో సుమారు 45 కుటుంబాలు, 120 మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇటీవల జల్ జీవన్ మిషన్ (JJM) ద్వారా ₹22 లక్షల వ్యయంతో నీటి ప్రాజెక్టు ఏర్పాటు చేసినప్పటికీ, రెండు రోజుల పాటు మాత్రమే నీటి సరఫరా జరిగి ఆ తర్వాత ఆగిపోయింది. గ్రామ ప్రజలు తాగుతున్న నీరు కలుషితమై ఎర్రగా ఉండడంతో అనేక రోగాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు నర్సీపట్నం ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించారు, ఇంటింటా కొళాయిలు వేశారు. అయితే, మోటర్‌కు విద్యుత్ సరఫరా లేమి కారణంగా నీటి సరఫరా ఆగిపోయింది. పాత ట్రాన్స్ఫార్మర్‌ బలహీనంగా ఉండడంతో కొత్త లైన్ ద్వారా సరఫరా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్‌ శాఖ, ఆర్డబ్ల్యూఎస్‌ శాఖ సమన్వయంతో తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఈ. చిరంజీవి, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు, మేళం చిన్న రాజబాబుతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

గాజువాక లో మృత్యు రూపంలో లారీ.. మహిళా మృత్యువాత

గాజువాక సమతా నగర్ వెళ్లే మార్గ మధ్యలో శనివారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో స్థానికంగా ఉన్న మనుషులపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఒక మహిళ ఘటనా స్థలంలోనే మృత్యువాత పడినట్లు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఘట్నా స్థలానికి న్యూ పోర్ట్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

విశాఖపట్నం

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి తులసి దళార్చన సేవ

విశాఖపట్నం, అక్టోబర్ 18: శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నేడు భక్తి శ్రద్ధలతో శ్రీ అమ్మవారికి తులసి దళార్చన సేవ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, వేదపండితులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య తులసి దళాలతో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కటాక్షం పొందారు.

E-పేపర్

నెల్లూరు లో కుండపోత వర్షం

నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ :18: నెల్లూరు రూరల్ వేదాయపాలెం, గాంధీనగర్, డైకస్ రోడ్, పొదలకూరు రోడ్ పరిసర ప్రాంతం లో మధ్యాహ్నం 11 గంటలకు దంచి కొట్టిన వర్షం తో రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లు నిర్మాన్యూష్యం గా మారాయి. సుమారు అరగంట సేపు వర్షం కుండపోతగా కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జన జీవనం స్తంబించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.