Wednesday, 29 April 2026

Blog

ఖమ్మం

ఖమ్మం పోలీస్ అధికారులకి ప్రతిభ పురాష్కరాలు. పోలీస్ కమిషనర్ అభినందనలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి (పువ్వాడ నాగేంద్ర కుమార్) ఖమ్మం నగరం 2024 -25 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలకు గాను పలువురు పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. వీరిలో అదనపు DCP ప్రసాద్ రావు, పట్టణ ACP రమణ మూర్తి, CCRB ACP సాంబరాజు, పోలీస్ సిబ్బంది వున్నారు. మహోన్నత సేవ పతకం (01) ఉత్తమ సేవ పతకం (05) సేవ పతకం (64) ఉత్కృష్ట పతకాలు (12) సాధించారు. ఈ నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా 82 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేసి అభినందించారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో AR ACP నర్సయ్య, RI కామరాజు పాల్గొన్నారు.

హైదరాబాద్

బిసి ల తెలంగాణ బంద్ కి MRPS మద్దత్తు

పున్నమి ప్రతినిధి 42% బీసీ రిజర్వేషన్ సాధన కొరకు బీసీ సంఘం జాతీయ నేత రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘలు ఈ నెల 18న బంద్ కి పిలుపు నిచ్చిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ ని కలసి న బీసీ సంఘాల నేతలతో మంద కృష్ణ మాట్లాడుతూ 18న జరిగే తెలంగాణ బంద్ కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పూర్తి మద్దత్తు ఉంటుంది అని ప్రతి మాదిగ సోదరులు ఈ బంద్ కార్యక్రమం లో పాల్గొంటారని బీసీ సంఘ నేతలకి తెలియజేసారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

టీచర్ ఉద్యోగార్థులకు శుభవార్త!

టెట్ (TET) నోటిఫికేషన్ నవంబర్ 10న విడుదల కానుంది, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2026 జనవరి 1న వెలువడనుంది. ఈ మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. విద్యా శాఖ ఇప్పటికే ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియను ప్రారంభించింది. టెట్ పరీక్ష పూర్తి అయిన తర్వాత డీఎస్సీ ప్రక్రియ వేగంగా చేపట్టనున్నారు. యువతకు బంపర్ అవకాశంగా మారనున్న ఈ మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు సిద్ధం కావాలని సూచించారు.

జాతీయ అంతర్జాతీయ

2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి పంపే లక్ష్యంతో — 2027లో గగన్యాన్ మిషన్ ప్రారంభం: ఇస్రో చైర్మన్ వి. నారాయణన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2040 నాటికి భారతీయులను చంద్రునిపైకి దింపే ప్రతిష్ఠాత్మక ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా మానవ సహిత అంతరిక్ష ప్రయాణం “గగన్యాన్ మిషన్” తొలి దశగా 2027లో ప్రారంభమవుతుందని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ప్రకటించారు. ఇది భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి కానుందని ఆయన అన్నారు. గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశం స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపే నాలుగో దేశంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మిషన్ కోసం అత్యాధునిక సాంకేతికతలు, భద్రతా పరీక్షలు, మరియు వ్యోమగాముల శిక్షణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. భారతదేశం ఇప్పటికే చంద్రయాన్, మార్స్ మిషన్, ఆదిత్య ఎల్1 వంటి విజయాలతో అంతరిక్ష రంగంలో కొత్త పంథాను సృష్టించిందని ఆయన గుర్తుచేశారు. 2040 నాటికి చంద్రయాత్ర సాధ్యమవుతుందని, దీని కోసం పలు దశల ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ ప్రయాణం భారత అంతరిక్ష సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటుతుందని నారాయణన్ అన్నారు. ఇస్రో ఇప్పటికే దేశీయ ఉపగ్రహాల తయారీ, లాంచ్ వెహికల్ సాంకేతికత, మరియు అంతరిక్ష పరిశోధన రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. మానవ అంతరిక్ష యాత్రలు, చంద్ర యాత్రలు, భవిష్యత్‌లో మార్స్ మరియు డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ వంటి ప్రాజెక్టులు భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త దశను తెరవనున్నాయి. ఈ ప్రయత్నాలతో భారత్ అంతరిక్ష శక్తిగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, యువతకు కొత్త ఆశయాలను నింపే దిశగా ముందుకు సాగుతోంది.

అన్నమయ్య

ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్

రాజంపేట పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాజంపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్‌ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఈ రోజున జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది నిరసన కార్యక్రమం జిల్లా అద్య క్షుడు బి . లక్ష్మయ్య అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగిందికార్యక్రమంలో లక్ష్మయ్య గారు మాట్లాడుతూ 2024 మార్చి నుండి రిటైర్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు 18 నెలల నుండి బకాయిలు చెల్లించకుండా జాప్యం చేయడం వల్ల రాష్ట్రం లో రిటైర్మెంట్ అయిన ఉద్యోగ,ఉపాధ్యాయలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని బకాయిలు చెల్లించకపోవడం తో పిల్లల పెండ్లిలు చేయలేక, ఇల్లు కట్టుకోలేక,చేసిన అప్పులు తీర్చలేక బ్యాంకు ఈఎంఐ లు చెల్లించలేక నానా ఇబ్బందులకు గురవుతూ ఆరోగ్యాన్ని బాగుచేసుకోలేని దయనీయ మైన స్థితి లో ఉన్నాము.బకాయిలు రాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 26 మంది పెన్షన్ దారులు కృంగి పోయి అప్పుల బాధలు భరించలేక చనిపోవడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలిపిన టిపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీనివాస్,పెద్ది హరిబాబు TSGREA ప్రధాన కార్యదర్శి,అంబటి రాజయ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ ఉపాధ్యాయులకువెంటనే బకాయిలను చెల్లించి పెన్షన్ దారుల చావులను ఆపాలని అన్నారు.గౌరవ అధ్యక్షుడు మిరియాల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్ర సేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మా బాధను మానవతాధృక్పథంతో ఆలోచించి బకాయిలను వెంటనే చెల్లించి మా కుటుంబాలను ఆదుకోవాలి అని అన్నారు.జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది.కార్యక్రమం లో కృష్ణమూర్తి,రాంచంధర్,కుర్రెముల యాదగిరి ,రాంచందర్,రవీందర్,చలపతి రెడ్డి,మూర్తి, దాదాపు 50 మంది పెన్షన్ దారులు పాల్గొన్నారు

అన్నమయ్య

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ్ సాగర్

రాజంపేట తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు తో కలిసి మాజీ రాజంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ యెద్దల విజయ సాగర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విజయ సాగర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యపరంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కార్యక్రమం చేపట్టారని, పార్టీలకతీతంగా అందరిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అని. ప్రజల కష్టసుఖాల్లో ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపశమనం పొందుతున్నాయని తెలియజేశారు.

తూర్పు గోదావరి

సమాజంలో బాలిక పుట్టుకపై ఉన్న వివక్షను తొలగించి, ప్రతి ఆడపిల్లకు గౌరవం, భద్రత మరియు ప్రేమ లభించేలా ప్రజల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన సందేశంగా.

ఈస్ట్ రిడ్జ్ స్కూల్, బొమ్మూరు నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి Dr K. వెంకటేశ్వర రావు సూచనల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం — బాలికల హక్కులు, భద్రత, ఆరోగ్యం మరియు సమాన అవకాశాల గురించి యువతలో లోతైన అవగాహన పెంపొందించడం. సమాజంలో బాలిక పుట్టుకపై ఉన్న వివక్షను తొలగించి, ప్రతి ఆడపిల్లకు గౌరవం, భద్రత మరియు ప్రేమ లభించేలా ప్రజల్లో చైతన్యం కల్పించడమే ప్రధాన సందేశంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు టీనేజ్ ప్రెగ్నెన్సీ (Teenage Pregnancy) వల్ల కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాల గురించి వివరంగా తెలియజేశారు. చిన్న వయస్సులో గర్భధారణ వల్ల యువతీ జీవితం ఎలా ప్రభావితం అవుతుందో, విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో వివరించారు. ఈ అంశంపై విద్యార్థులకు చట్టపరమైన సమాచారం కూడా అందించబడింది. అదనంగా, PCPNDT చట్టం (Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act, 1994) గురించి విద్యార్థులకు అవగాహన కల్పించబడింది. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని స్పష్టంగా వివరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు సమాజంలో లింగ అసమానతకు దారితీస్తాయని, ఆడపిల్లల పట్ల వివక్షను పెంచుతాయని తెలియజేసి, ఇటువంటి చర్యలను అరికట్టడంలో ప్రతి పౌరుడూ బాధ్యత వహించాలనే పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సమాజంలో బాలికల ప్రాధాన్యత గురించి ఒక ఆడపిల్ల కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఎంతటి విలువైన ఆస్తో, ఆమె విద్య, ఆరోగ్యం మరియు భద్రత సమాజ ప్రగతికి ఎంత అవసరమో వివరిస్తూ ప్రేరణాత్మక ప్రసంగాలు చేయబడ్డాయి. బాలికలు చదువుకొని ఎదిగితే సమాజం బలపడుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులకు చైతన్యం కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో Dy. Demo NRPS సత్య కుమార్ , శ్రీనివాస్ ప్రసాద్, జోషప్ (హెల్త్ సూపర్వైజర్లు) పాల్గొన్నారు.

anji 2
Blog పశ్చిమ గోదావరి

20 మందికి లబ్ధిదారులకు రూ 21 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్

భీమవరం : ఆపదలో ఉన్నవారికి అభయ హస్తంలా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. బుధవారం భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ 20 విడతలో 20 మంది లబ్ధిదారులకు రూ 21,31,462 చెక్కులను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఇప్పటికి వరకు భీమవరం నియోజకవర్గంలో 321 మందికి రూ 2,90,48,358 లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.

క్రైమ్

జిల్లా వ్యాప్తంగా యాచకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, నేర చరిత్ర కలిగిన 18 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు.

జిల్లా అంతట ఘాట్లు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో కొంతమంది యాచకులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మద్యం సేవించి ఉంటూ నేరాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 193 మందిని గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… గుర్తించిన 193 మంది యాచకులలో 18 మందిపై నేర చరిత్ర ఉన్నట్లుగా గుర్తించామని, విచారణ అనంతరం వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, మిగిలిన 175 మందికి కౌన్సిలింగ్ నిర్వహించి వారి స్వగ్రామాలకు పంపించడం జరిగిందని తెలియజేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఇంకా కొనసాగిస్తామని, ఇకపై అటువంటి వ్యక్తులను గుర్తించినచో వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.