Wednesday, 29 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోనసీమలో దారుణం: ఇద్దరు పిల్లలను చంపి ఉరేసుకుని తండ్రి ఆత్మహత్య

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారులోని చిలకపాడు గ్రామంలో బుధవారం రాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) తన ఇద్దరు చిన్నారులను విషం తాగించి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం — చంటి భార్య నాగదేవి ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై అప్పటినుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా, ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏమైందో తెలియదు కానీ, బుధవారం రాత్రి అయిదవ తరగతి చదువుతున్న కుమారుడు అభిరామ్ (11), ఒకటవ తరగతి చదువుతున్న త్రినాథ్ గౌతమ్ (8) లకు పురుగుమందు తాగించి, అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంటి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి చంటి ఓ వీడియో రికార్డు చేసినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే రావులపాలెం రూరల్ సీఐ సి.హెచ్. విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి. నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

యాదాద్రి భువనగిరి

బీసీ బంద్ ను జయప్రదం చేయండి

బీసీ బంద్ ను జయప్రదం చేయండి యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి బీసీ రిజర్వేషన్లు సాధన విషయంలో ప్రజలందరూ పాల్గొని ఈనెల 18న జరపతలపెట్టిన బీసీ బంద్ ని విజయవంతం చేయాలని బీసీ సంఘాల సమన్వయ సంఘం జాక్ కోరింది. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో వివిధ రాజకీయ పార్టీల బిసి నేతలు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు, బీసీ కులాల నేతలు సమన్వయ కర్తలు మెరుగు మధు, మాటూరి అశోక్ ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో 18 జరగనున్న తెలంగాణ బిసి బంద్ ను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వక్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. జిల్లాలోని వ్యాపార సంఘాలు, విద్యాసంస్థల యాజమాన్యాలు బందుకు సహకరించాలని కోరారు.. కార్యక్రమంలో తమ తమ పార్టీల నుండి పూర్తి సహకారం అందిస్తామని బందులో పాల్గొంటామని బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, BRS, TPS పార్టీలను నాయకులు అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిలు పెంట నరసింహ, అథీకం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, బిజెపి జిల్లా నాయకులు సుర్వి శ్రీనివాస్ గౌడ్, దేవరకొండ నరసింహాచారి, పిట్టల బాలరాజు, టిఆర్ఎస్ నాయకులు బీరు మల్లయ్య, ఏనబోయిన ఆంజనేయులు, సిపిఐ నాయకులు ఏశాల అశోక్, సిపిఎం మాయ కృష్ణ, ప్రైవేట్ డిగ్రీ కళాశాల నాయకులు చిక్కా ప్రభాకర్, దరిపల్లి ప్రవీణ్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్క వెంకటేశ్వర్లు, మేర సంఘం కీర్తి సత్యనారాయణ, పట్టు సంఘం కుమార్ విక్రమ్, కుమ్మర సంఘం గోపాల్, ముదిరాజ్ సంఘం సాధు విజయకుమార్, వంజరి సంగం కలియా నాగరాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, బీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బాబురావు గొట్టిపాముల, యాదవ సంఘం కనక బాలకృష్ణ, రజక సంఘం సిరికొండ శివ, ఎంబీసీ జిల్లా అధ్యక్షులు కొత్త బాలరాజు, బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి, పేరపు రాములు, ఎరుకల వెంకటేష్ గౌడ్, అశోకా చారి, అమృతం సత్యనారాయణ, మాటూరు బాలేశ్వర్, రామ్మూర్తి, రేఖల ఆనందం, మాటూరు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఘన స్వాగతం పలికిన భువనగిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల మరియు సినీ ఆటోగ్రాఫి శాఖామాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి గారి తల్లి గారి దశదిన కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డు బ్లూ ఫ్లాక్స్ హోటల్ లో భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనేక అక్రమ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు స్థానిక సంస్థ ఎన్నికలలో సరైన గుర్తింపు ఇవ్వడంతో పాటు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు కౌన్సిలర్లు లాగా గెలిపిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పట్టణం స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం సమచిత పదవులు కల్పిస్తామని అన్నారు పలు సమస్యలపై కార్యకర్తలు మంత్రిగారు దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్లు చేసి సమస్యలు పరిష్కరించాలని చెప్పడం జరిగింది అలాగే పలు సమస్యలపై లెటర్లు కూడా వ్రాయడం జరిగింది ఇలాంటి సమస్యలున్న కార్యకర్తల కోసం మా ఇంటి డోర్లు ఎల్లప్పుడూ తెలిసి ఉంటాయని ఎప్పుడైనా ఏ సమయంలో అయినా మా ఇంటికి రావొచ్చని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పోతాంశెట్టి వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు పడిగెల ప్రదీప్ ఈరపాక నరసింహ పిట్టల బాలరాజ్ ఇలియాస్ దాసరి మధు దేవరకొండ నరసింహ చారి మజర్ శిగ నరేష్ గౌడ్ జువ్వగాని శ్రీధర్ బింగి నరేష్ దేవరకొండ నరసింహ చారి చందుపట్ల గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్ శ్రవణ్ రెడ్డి బర్రె నరేష్ పొట్ట శివ సాల్వేరు ఉపేందర్ కాకునూరి మహేందర్ పిట్టల బాలరాజ్ మంచుకంటి కృష్ణమూర్తి పల్లెర యాదగిరి మహేందర్ ప్రభాకర్ సాయి నరేందర్ తదితరులు పాల్గొనడం జరుగుతుంది..*

నిర్మల్

బైంసా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి ఘనంగా చేసినారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ ఆధ్వర్యంలో డా. నహేదా తబస్సుం మాట్లాడుతూ భారత రత్న, మాజీ రాష్ట్రపతి, ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానీయుడు, మిసైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని బైంసా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కరోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ – “కలాం గారు విజ్ఞానానికి శ్రమ, విద్యార్థులకు స్ఫూర్తి, దేశాభివృద్ధికి మార్గదర్శకుడు. ఆయన కలలు, ఆలోచనలు యువతను ఎప్పటికీ ముందుకు నడిపిస్తాయి. విద్యారంగం, విజ్ఞానశాస్త్రం, నాయకత్వం రంగాలలో కలాం చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన చూపిన మార్గం నేటి యువతకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకం” అని అన్నారు. అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ మాట్లాడుతూ – “డ్రీమ్ బిగ్ – వర్క్ హార్డ్ – అచీవ్ గ్రేట్” అన్న కలాం గారి మాటలు ఇప్పటికీ ప్రతి విద్యార్థి హృదయంలో మారుమ్రోగుతున్నాయి. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని ఆయన జీవితం మనకు చూపిస్తుంది. ఆయన కలలు కనమని, కష్టపడమని చెప్పిన సందేశం దేశ యువతకు చిరస్మరణీయ పాఠం” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ – “కలాం గారి కలలు, కృషి, ఆత్మవిశ్వాసం నేటి తరానికి ఆదర్శం. దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చాలనే ఆయన కలను నెరవేర్చడం మనందరి బాధ్యత” అని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు కూడా కలాం గారి సూక్తులను పఠిస్తూ, ఆయన జీవిత చరిత్రపై ప్రసంగాలు చేశారు. “స్వప్నం కని, వాటిని సాకారం చేసేందుకు శ్రమించండి” అన్న ఆయన సందేశం తమ జీవితంలో అద్భుతమైన ప్రేరణగా మారిందని విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు కలాం గారి ప్రసంగాల వీడియోలు, జీవిత చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించి గొప్ప స్ఫూర్తి పొందారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా. పీజీ రెడ్డి, డా. పవన్ కుమార్ పాండే, డా. శంకర్, యు. రవికుమార్, డా. ఓమ్ ప్రకాష్, ఎ. రాజు, డా. న. హేదా, డా. కల్పన, మజర్, వహీద్, ఇర్ఫాన్, సురేందర్, రాజయ్య, కిషన్, మోహన్, అబ్దుల్లా, దివ్య, ఆఫ్రీన్ , ఆఫీస్ సిబ్బంది,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.

కామారెడ్డి

ప్రారంభమైన గాలికుంటు టీకాల కార్యక్రమం.

కామారెడ్డి, 15 అక్టోబర్, పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో బుధవారం పాడిపశువులలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. మండల పశువైద్య అధికారి డా. రాంచందర్ తెలి పారు. ఈ కార్యక్రమం ఈరోజు నుండి నవంబర్ 14 వరకు మండలంలోని ప్రతి గ్రామంలో కొనసాగనుం ది.డా. రాంచందర్ మాట్లాడుతూ, గాలికుంటు వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఇది పాడి రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు టీకా వేయడం ఒక్కటే సమర్థవంత మైన మార్గమని పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ టీకాలను అన్ని పాడిపశువులకు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ సదావకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.మండల కేంద్రంలో జరిగిన మొదటి రోజు కార్యక్రమంలో 30 గోజాతి మరియు 360 గేదె జాతి పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రావు, విఎల్ఓ నారాయణ, జేఎఓ, రమేష్, వీఏ బాలమ ని, దశరథ్, హారిక, రవీందర్ రెడ్డి స్వామి,గ్రామాని కి చెందిన పాడి రైతులు పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు పిలుపు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు గన్నవరపు శ్రీనివాసరావు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. అక్టోబర్ 16, 2025 తేదీ ఉదయం 8:00 గంటలకు అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో మరియు మధ్యాహ్నం 2:00 గంటలకు కొండకుదురు గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా “రచ్చబండ” మరియు “కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం” కార్యక్రమాలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వ రంగ విద్యా సంస్థలను కాపాడడం, సామాన్య విద్యార్థుల విద్యా హక్కులను రక్షించడం, మరియు వైద్య విద్యను అందరికీ అందుబాటులో ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ శాఖ నాయకులు, మాజీ ప్రతినిధులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మరియు పార్టీ కార్యకర్తలు అందరూ సమిష్టిగా పాల్గొనవలసిందిగా గన్నవరపు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

తిరుపతి

ఒక చిన్న ప్రయత్నం – పెద్ద ప్రయోజనం

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా బుధవారం ఆదర్శ ప్రాథమిక పాఠశాల, చియ్యవరం ఆవాస ప్రాంతం నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర పెరిమిడి మాట్లాడుతూ,సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు కచ్చితంగా పాటించాలి అని,ముఖ్యమైన ఏడు సందర్భాలలో చేతులను సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని గ్రామస్తులకు మరియు విద్యార్థినీ,విద్యార్థులకు తెలియజేసారు.ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు ప్లకార్డులతో ఒక చిన్న ప్రయత్నం -పెద్ద ప్రయోజనం,మన ఆరోగ్యం మన చేతుల్లో వంటి నినాదాలు చేస్తూ గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది సుహాసిని,గంగారావు రాజేంద్రప్రసాద్,సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి

కండరాల క్షీణిత బాధితులకు తహసిల్దార్ చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ..

సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ము,నుగోడు ప్రతినిధి,చౌటుప్పల్,అక్టోబర్15, (పున్నమి ప్రతినిధి): చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జయ శ్రీ ఫంక్షన్ హాల్ లో సివియర్ డిసబిలిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన కర్నాటి స్వప్న – అనిల్ దంపతుల,సహకారంతోని చౌటుప్పల్ చుట్టూరా ఉన్న 50 మంది కండరాల క్షీణత,వెన్నుముక మరియు తీవ్ర వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు విలువచేసే నిత్యవసర సరుకులను ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక తహసిల్దార్ మీరాబాయి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు బాలకృష్ణ కత్తుల మాట్లాడుతూ.. బాధితుల సమస్యలు వివరిస్తూ నిత్య నరకయాతన ఒకరి మీద ఆధారపడి జీవించే జీవనశైలి ఒకరి సహకారం లేనిది కాలు చేయి కూడా కదపలేని పరిస్థితి సొంతంగా ఏ పని చేయలేరని వివరించారు.ఈ నిత్యవసర సరుకులతో దీపావళి పండుగ ముందే వచ్చిందని దివ్యాంగులు సంబరపడ్డారు.జీవితంపై భరోసా కల్పించిన మనసున్న దాతకు కృతజ్ఞత తెలిపారు.అలాగే తహసిల్దార్ కు కొంత స్థలం బాధితుల కోసం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మీరాబాయి మాట్లాడుతూ… ధైర్యంగా ఉండండి.అధైర్య పడొద్దు,చదువుకునే వాళ్లు ఇంకా బాగా చదవండి చదివే మనకు మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది వారు కోరినట్టుగా స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో దివ్యాంగులు,కోఆర్డినేటర్ మహేష్త,దితరులు, పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.