జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు రెండు రోజుల్లో మొత్తం 21 నామినేషన్లు దాఖలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు రెండు రోజుల్లో మొత్తం 21 నామినేషన్లు దాఖలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 20 వ తేదీ నుండి స్వామి అమ్మవార్ల అభిషేకం మరియు మహాన్యాస పూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం,మృత్యుంజయ స్వామి అభిషేకాలను చేసుకోదలచిన భక్తులు ఆన్లైన్లో నమోదుచేసుకోగలరని దేవస్థానం ఈవో బాపిరెడ్డి తెలియజేశారు.భక్తులు https://www.aptemples.org వెబ్సైట్ ద్వారా అభిషేక టిక్కెట్లు పొందాలని ఆయన అన్నారు.ఆన్లైన్లో అభిషేకం టిక్కెట్లు నమోదు చేసుకున్న భక్తుల యొక్క ఆధార్ కార్డ్ మరియు ఇతర వివరాలు కౌంటర్ నందు పరిశీలించిన తరువాతే భక్తులను అభిషేకమునకు అనుమతించబడునని తెలియజేశారు.
కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: జీఎస్టీ తగ్గింపుతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మరియు నిర్మాణ రంగానికి, మేలు చేసిందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక 14, 15, 16 డివిజన్ నందు సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని తగ్గించుకుని సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే నిత్యవసర వస్తువులకు జీఎస్టీ తగ్గించిందని, జిఎస్టి తగ్గింపు కారణంగా నిర్మాణదారుకు ఖర్చు తగ్గుతుందని, నిర్మాణ రంగ ఖర్చులు తగ్గించి నూతన నిర్మాణాలకు ప్రోత్సాహం కల్పించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులకు తక్కువ ఖర్చుతో లాభం, భవిష్యత్తుకు మేలైన పెట్టుబడి పెట్టుకునే అవకాశం లభిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జిఎస్టి ద్వారా నిర్మాణ రంగానికి ఊతం లభించి, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు వ్యయం తగ్గి మేలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరదాడి శివ, మల్లాడి చిన్న,మల్లాడి రాజు, కోనాడ ప్రకాష్,పినపోతు రాము, మల్లాడి ఏడుకొండలు,పినపోతు జీవ రత్నం,పట్టా ధనలక్ష్మి, పాలెపు రాజు, వనమాడి కృపావర్మ, ఓలేటి పాండురంగడు,బలసాడి శ్రీను, మల్లాడి గంగాధరం,బలసాడి శ్రీను, కామాడి సుబ్బారావు,వనమాడి ధర్మారావు, తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి న్యూస్: గూగుల్ డేటా సెంటర్ రాకతో యంగెస్ట్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టేట్ గా మారుతుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం జరుగుతుందని, సాంకేతిక రంగం రాష్ట్ర భవిష్యత్తును ఏరకంగా మారుస్తుందో హైదరాబాద్ ఉదాహరణ అని, ఆనాడు చంద్రబాబు నాయుడు హైదరాబాదును ఐటీ హబ్ గా మార్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనకు దూర దృష్టితో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను హైదరాబాద్ కు తీసుకువచ్చారని, నేడు చంద్రబాబు సారధ్యంలో విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్ర రాష్ట్రం డిజిటల్ హబ్ గా మారుతుందని, నేడు గూగుల్ సంస్థ విశాఖలో 87 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రెండవ డేటా క్లస్టర్ ను ఏర్పాటు చేయబోతుందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా మారుతుందని, సింగపూర్, అమెరికా, మలేషియా, వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రానికి పెట్టుబడులను ఉద్యోగ అవకాశాలను తీసుకురావడం జరుగుతుందని, గూగుల్ రాకతో రానున్న కాలంలో ఐటీ, టెక్, ఏ ఐ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలు రాకతో ఆంధ్ర రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయి అని, నేడు గూగుల్ సంస్థ రాకతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపతం కావడంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు మెరుగుపడతాయని, గత వైసిపి ప్రభుత్వం ఎటువంటి ఐటీ కంపెనీలు, పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కృషి చేయలేదని, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తగిలిపోయే విధంగా పాలన సాగించారని పేర్కొన్నారు.
విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖలో ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ భారీ స్థాయిలో ఏఐ హబ్ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డేటా సెంటర్) ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఈ మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (MoU) సంతకం చేయబడింది. ఈ డేటా సెంటర్ 1 గిగావాట్ సామర్థ్యంతో రూపొందించబడనుంది. ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియా స్థాయిలో అత్యంత పెద్ద హైపర్‌స్కేల్ డేటా క్యాంపస్‌లలో ఒకటిగా నిలుస్తుంది. *సాంకేతిక విశేషాలు* గూగుల్ ఈ హబ్‌లో అత్యాధునిక AI ట్రైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ సర్వీసులు, TPU ఆధారిత హార్డ్‌వేర్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ తన గ్లోబల్ నెట్‌వర్క్‌కి కొత్త సబ్‌మరైన్ (సముద్రం కింద ఫైబర్) కనెక్టివిటీని కూడా విస్తరించనుంది. విశాఖ తీరప్రాంత వాతావరణానికి అనుగుణంగా రూపొందించిన కూలింగ్ సిస్టమ్‌లు, గ్రీన్ ఎనర్జీ వినియోగం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక ఫలితాల టెక్నాలజీలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. *ఆర్థిక లాభాలు* ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది, పరోక్ష ఉద్యోగాలు సృష్టి అవుతాయని అంచనా. నిర్మాణ రంగం, సాంకేతిక నిపుణులు, లోజిస్టిక్స్, సెక్యూరిటీ, చిన్న సరఫరా సంస్థలు ఇలా అనేక రంగాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రాష్ట్రానికి పన్ను ఆదాయం, పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో గణనీయమైన వృద్ధి లభిస్తుంది. *సామాజిక, విద్యా ప్రయోజనాలు* గూగుల్ స్థానిక విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్‌మెంట్, ఏఐ రీసెర్చ్, డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించనుంది. విశాఖను దక్షిణ భారతదేశ డిజిటల్ రాజధానిగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. *ప్రభుత్వం స్పందన* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “విశాఖలో గూగుల్ హబ్ స్థాపన రాష్ట్రానికి మైలురాయి. ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ కేంద్రంగా మార్చాలన్న సంకల్పానికి ఇది ఒక కీలక అడుగు” అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, “విశాఖను సిలికాన్ కోస్ట్‌గా అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. *పర్యావరణ అనుకూల విధానం* గూగుల్ ఈ ప్రాజెక్ట్‌లో 100% పునరుత్పాదక శక్తి వినియోగం, తక్కువ నీటి వినియోగం, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి పెట్టనుంది. పర్యావరణానికి హాని జరగకుండా సస్టెయినబుల్ టెక్నాలజీ డిజైన్ అమలు చేయనున్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు కేవలం పెట్టుబడి ప్రాజెక్టు మాత్రమే కాకుండా, భవిష్యత్తు టెక్నాలజీ విప్లవానికి మార్గదర్శక ఘట్టం. దీంతో విశాఖ ప్రపంచ మ్యాప్‌లో ఒక డిజిటల్ సూపర్ సిటీగా అవతరించనుంది.
నెల్లూరు రూరల్ (పున్నమి ప్రతినిధి )అక్టోబర్ :14, SPSR నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఇందుకూరుపేట గ్రామం లో స్థాపించి ఉన్న శ్రీ లలితా మహేశ్వరి ఆశ్రమం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ఈ నెల అనగా అక్టోబర్ 22 తేది నుండి నవంబర్ 18 తేది వరకు, శ్రీ కేదారనాధ్ జ్యోతిర్లింగ సహిత 300 శివలింగములకు సామూహిక రుద్రాభిషేకం లు, వన భోజనాలు, కార్తీక పౌర్ణమి, రుద్ర, చండీ హోమము లు నూతన శివలింగముల ప్రతిష్ట, కుంబాభిషేకములు, లోక కళ్యాణార్థం, ఆశ్రమ పీఠాదధిపతి డాక్టర్ శ్రీ శ్రీ శ్రీ రామాయణం మహేష్ స్వామి వారి ఆశీస్సులు తో, ఆధ్వర్యంలో ఆశ్రమం లో మహోత్సవాలు అత్యంత వైభవముగా జరుపబడుచున్నవి. కావున భక్తులు పై కార్యక్రమం లో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించి శ్రీ లలిత కేదారేశ్వరుల అనుగ్రహానికి పాత్రులు కావలసినదిగా పీఠం వారు కోరుకొనుచున్నారు.
🩺 *అక్టోబర్ 15 వరకు పోలియో స్పెషల్ డ్రైవ్* ➤ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0-5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు ➤ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన ప్రదేశాలు మరియు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు
జాతీయ స్థాయికి యస్ వి కె స్పోర్ట్స్ అకాడమీకీ చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు కు చెందిన ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఈ నెల 10,11,12 వ తేది బాపట్ల జిల్లా పెట్టురు మండలం లో 69 SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 రాష్ట్రా స్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో ఉన్న ఎస్ వి కే స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన కే. నవ్య శ్రీ U_16 kg , సంధ్య నా U_16-18 kg విభాగంలో బంగారు పధకము సాధించింధని అలాగే పి. శ్రీరామ కస్య పధకము సాధించాడు బంగారు పధకము సాధించిన ఇద్దరు నవంబర్ నెలలో పంజాబ్ లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ శివాజీ తెలీపారు.
పున్నమి ప్రతి నిధి తెలంగాణ బీజెపి అధ్యక్షులు నారప రాజు రామచంద్ర రావు ఈరోజు మంచిర్యాల జిల్లా లో పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది నాయకులు మధ్య జరిగిన బూతుల యుద్ధం పట్ల రామ చంద్ర రావు స్పందిస్తూ పార్టీ నాయకులు అయినా కార్యకర్తలు ఐన హద్దు దాటి ప్రవర్తిస్తే చర్యలు తప్పవు అని ఈ సం ధర్భముగా అయన హెచ్చరించారు.
రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తొలిసారిగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టిడిపి నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ కస్తూరిబా స్కూల్‌ను తనిఖీ చేసి విద్యార్థుల అవసరాలను తెలుసుకున్నారు. రైతులతో భేటీ అవుతూ వ్యవసాయ సమస్యలపై సమీక్షించారు. రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించి మెరుగుదల చర్యలను సూచించారు. కోడూరు–చిట్వేల్ డబుల్ రోడ్డు పనుల పురోగతిని సమీక్షించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.