Wednesday, 29 April 2026

Blog

జనగాం

బడుల తనిఖీ కి ఉపాధ్యాయులా?టిఎస్ యటిఎఫ్ జనగామ జిల్లా ‌శాఖ అధ్యక్షుడు చంద్ర శేఖర్ రావు

బడుల తనిఖీ కి ఉపాధ్యాయులా? ఉత్తర్వుల నిలుపుదలకై TSUTF డిమాండ్ ————————————————– జనగామ, అక్టోబర్14,పున్నమి న్యూస్: పాఠశాలల నిరంతరం తనిఖీల కోసం ప్రభుత్వం పాఠశాలలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులచే కమిటీ ఏర్పాటు కొరకు ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని ,తనిఖీ ల కోసం మండలానికి ఇద్దరు MEO లను నియమించడం సరైన పరిష్కారమని TSUTF జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రావు తెలిపారు జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 270 ప్రాథమిక పాఠశాలలకు ప్రతి టీం లో 3 సభ్యుల చొప్పున 3 టీం లను 64 ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రతి టీంలో 3 సభ్యుల చొప్పున ఒక్క టీం 103 ఉన్నత పాఠశాలల తనిఖీ కొరకు ప్రతి టీం లో 9 మంది సభ్యులతో 2 టీం లను ఏర్పాటు చేయుటకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అనగా జిల్లాలో మొత్తం తనిఖీ ల పేరు మీద 30 మంది ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరం మొత్తం వారు పనిచేస్తున్న పాఠశాలలకు దూరం కానున్నారు వీరి స్తానం లో అదనంగా ఉన్న పాఠశాలల నుండి సర్దుబాటు చేయమని ఉత్తర్వులలో పేర్కొన్నారు . కానీ వాస్తవం ఏమంటే విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటినుండి ఏవో కారణాలతో విద్యా కార్యక్రమాలు కుంటుపడుతూనే ఉన్నాయి ఒక వైపు వృత్తి పరమైన ట్రైనింగ్స్ ,స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ట్రైనింగ్స్ ,ప్రమోషన్స్ పేరుతో కొన్ని రోజులు ఇలా పాఠశాలలు విద్యా బోధన జరగకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాయి ,ప్రమోషన్స్ కారణంగా ఏర్పడిన ఖాళీలను ఇప్పటి వరకు సర్దుబాటు ద్వారా కూడా భర్తీ చెయ్యలేదు చాలా ప్రాథమిక ,కొన్ని హై స్కూల్స్ లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది ,ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఉపాధ్యాయులతో టీం లు ఏర్పాటు చేయడమంటే మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఉందని ,పాఠశాలల తనిఖీ చేపట్టడం తప్పు కాదు కాని దానికి ఎంచుకున్న విధానం సరికాదని ,తాత్కాలిక ఏర్పాట్ల కన్నా శాశ్వత ఏర్పాట్లు చేయాలని దానికి గాను ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి మండల విద్యాశాఖాధికారి పోస్టులు భర్తీచేయాలని ,ప్రతి మండలానికి ఇద్దరు MEO లను ఒకరిని విద్యాకార్యక్రమాలకు ,మరొకరిని పరిపాలనా పరమైన కార్యక్రమాల అమలు కొరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఉపాధ్యాయులచే పాఠాశాలల తనిఖీ ఎంత మాత్రం సరికాదని ,వెంటనే ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు

అన్నమయ్య

బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు డిఆర్ఎం ను కలిసిన రాచూరి మురళి

నందలూరు మండలంలో రైల్వే పరంగా ముఖ్యమైన సమస్యలను నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ నెంబర్ రాచూరి మురళి మంగళవారం నాడు గుంటకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎన్ మనోజ్ కలిసి వారితో గతంలో కోవిడ్ 19 సమయం కన్నా ముందున నిలబడే ప్రతి ఒక్క రైలు నిలుపుదల ఇవ్వవలసినదిగా మరియు రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్నటువంటి నూతన అండర్ సబ్ వే లో పాదాచారులకు ఫుట్ పాత్ నిర్మించలేదు కనుక దానికి పరిష్కారం చూపవలెనని అలాగే రైల్వే కమ్యూనిటీ హాల్ నందు ప్రతి సంవత్సరము వందల సంఖ్యలో ముఖ్యమైనటువంటి కళ్యాణాలు మరియు వివిధ ముఖ్యమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ రైల్వే కమ్యూనిటీ హాల్ యందు సరియైన వసతులు లేవు కనుక మీరు రైల్వే కమ్యూనిటీ హాల్ ని ఎయిర్ కండిషన్ చేసి సౌకర్యాలు కల్పించవలసిందిగా మరియు నందలూరు మండలంలోని చాలామంది కార్తిక మాసంలోని అయ్యప్ప భక్తులు శబరిమలై కి పోతూ ఉంటారు వారికి స్పెషల్ ట్రైన్లు నందలూరులో నిలుపుదల చేయవలసినదిగా మరియు నందలూరులోని వందల ఎకరాల రైల్వే స్థలాన్ని రైల్వే అవసరాలకు ఉపయోగించుకోవలసినదిగా మరియు మరియు మండలంలోని చిన్న పిల్లలు యువతకు రైల్వే క్రీడా మైదానాన్ని నిర్మించి దానిని అభివృద్ధి చేయాలని కోరడం జరిగినది దీనికి స్పందించినటువంటి అధికారులు ట్రైన్లు స్టాపింగ్ యొక్క సమస్యలను అప్రోలింగ్ పరిశీలనలో ఉన్నవని అలాగే అండర్ గ్రౌండ్ సబ్ వే ఫుట్పాత్ కొరకు వెంటనే తగు చర్యలు చేపడతామని శబరిమల స్పెషల్ ట్రైన్స్ నందలూరులో స్టాపింగ్ ఇస్తామని మరియు రైల్వే కమ్యూనిటీ హాల్ ని ప్రైవేటీకరణ టెండర్ల రూపంలో నిర్వహించి ఆధునీకరణ ఖచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరిగినది మరియు చిన్నపిల్లలు యువకుల కొరకు క్రీడా మైదానాల గురించి అధికారుల మీటింగ్ సమావేశాలలో చర్చించి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేయడం జరిగినది.

ఆంధ్రప్రదేశ్

తిరువూరులో ఆటో డ్రైవర్లతో కూటమి ప్రభుత్వం జయహో – ఎంఎల్ఏ కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం: తిరువూరు పట్టణం ఈ రోజు పండగ వాతావరణంలో మునిగిపోయింది. ఆటో డ్రైవర్లకు ₹15,000 ఆర్థిక సాయం అందించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా గౌరవ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది. అయ్యప్ప స్వామి గుడి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఫ్యాక్టరీ సెంటర్ వరకు ఆటలతో అద్భుతంగా సాగింది. తిరువూరు పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి వందలాది ఆటోలు పాల్గొనడంతో ర్యాలీ ఘనంగా జరిగింది. అన్నగారి విగ్రహానికి పూలమాల – నాయకుల పాలాభిషేకం ఫ్యాక్టరీ సెంటర్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, నాయకులు మరియు ఆటో డ్రైవర్లు మోడీగారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కల్యాణ్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రాంతమంతా “జయహో కూటమి ప్రభుత్వం” అనే నినాదాలతో మార్మోగింది. ఆటో డ్రైవర్ల కృతజ్ఞతాభావం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ — “మేము ప్రతిరోజూ ఆటో కిస్తీలు, ఇన్సూరెన్స్ లు, ఇంధన ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందించిన ₹15,000 సాయం మాకు పెద్ద ఊరట ఇచ్చింది. కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.” శాసన సభ్యుల మాటల్లో సంక్షేమం ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ — “సంక్షేమం అంటే కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదలకు ఆర్థిక భరోసా కలిగించడమే మా లక్ష్యం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆటో డ్రైవర్లకు ₹15,000 ఆర్థిక సాయం – ఇవన్నీ ప్రజల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం.” అలాగే ఆయన హామీ ఇస్తూ చెప్పారు — “తిరువూరు నియోజకవర్గంలోని ప్రతి ఆటో డ్రైవర్‌కి ప్రతి సంవత్సరం రెండు యూనిఫామ్‌లు అందిస్తాను. ఇన్సూరెన్స్ లేని ఆటోలకు ఇన్సూరెన్స్ చేయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది.” తిరువూరు పట్టణం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. ఆటో డ్రైవర్ల ర్యాలీతో వీధులు సందడిగా మారాయి. ప్రజల జీవనోపాధికి తోడ్పడే సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వానికి విశేష ప్రజాదరణ తెచ్చిపెడుతున్నాయి.

గుంటూరు

గుంటూరు పశ్చిమలో గళ్ళా మాధవి ఆగ్రహం – మహిళల గౌరవం కోసం గళమెత్తిన ఎమ్మెల్యే

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం రాజకీయంగా మళ్లీ ఉద్రిక్తతతో మార్మోగుతోంది. వైసీపీ నాయకులలో ఒకరు మహిళలపై చేసిన అవమానకర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. ఆ వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గట్టిగా స్పందించి, ఆ పార్టీ నాయకుల సంస్కారహీనతను బహిర్గతం చేశారు. “మహిళల పట్ల గౌరవం అనే విలువ వైసీపీ నాయకుల రక్తంలో లేదు” అంటూ గళ్ళా మాధవి మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ — “ఎన్నికల సమయంలో అక్కచెల్లెమ్మలమని నటిస్తూ ఓట్లు అడుగుతారు. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అదే మహిళలను అవమానపరచడమే వారి అసలైన స్వభావం. ఇది రాజకీయ అవినీతికి మించి మానవతా విలువలను కూడా తాకే స్థాయి దిగజారుడు సంస్కృతి,” అని వ్యాఖ్యానించారు. ఆమె మరింత ఆగ్రహంగా మాట్లాడుతూ — “బ్రాహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలు కేవలం మహిళలపై అవమానం కాదు; ఆ వ్యాఖ్యలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. ఆయన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మహిళలు మౌనం వీడి, ఉద్యమం ప్రారంభిస్తారు” అని హెచ్చరించారు. గళ్ళా మాధవి విమర్శలలో మరో ముఖ్యాంశం — కల్తీ మద్యం విక్రయాల సమస్య. ఆమె చెప్పిన మాటల్లో తీవ్రత కనిపించింది: “కల్తీ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు మహిళల గౌరవాన్ని కూడా దెబ్బతీయాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇక సహించలేము.” ఆమె పిలుపునిచ్చారు — “మహిళల గౌరవం కాపాడటం కేవలం మహిళల బాధ్యత కాదు; ప్రతి మనిషి బాధ్యత. మన సమాజం మరింత బలంగా ఉండాలంటే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలి. ఇలాంటి నీచ వ్యాఖ్యలను ఇక భరించబోము.” గళ్ళా మాధవి ఈ ప్రకటనతో గుంటూరు రాజకీయ వాతావరణం వేడెక్కింది. మహిళా సంఘాలు, యువత, సామాజిక సంస్థలు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నాయి. “మహిళల గౌరవం కోసం మాధవి గళం” అన్న నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గళ్ళా మాధవి మాటల్లో స్పష్టత ఉంది — ఇది కేవలం రాజకీయ ప్రతిస్పందన కాదు, మహిళా గౌరవం కోసం ఒక ఉద్యమానికి నాంది.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

డాడా నగర్ చౌరస్తాలో కొమరం భీమ్ 85 వర్ధంతి వేడుకలు

కొమురం భీమ్ జిల్లా (పున్నమి ప్రతినిధి ) ఈ రోజు కాగజనగర్ లోని డాడా నగర్ లో గల కుమురం భీమ్ విగ్రహం వద్ద ఘనంగా కుమురం భీమ్ 85 వ వర్ధంతిని భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీఎంస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య గారు పాల్గొన్నారు… వారు మాట్లాడుతూ కుమురం భీమ్ ఆశయాలతో మనం కలిసి కట్టుగా, ఐక్యమత్యంతో ముందుగు నడవాలని, వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. వారి వెంట కాగజ్ నగర్ మండలానికి చెందిన మాజీ సర్పంచులు రామ్ షా, భగవంత్ రావ్, భీంరావ్, అర్జు, భీమన్న వివిధ గ్రామాల సర్ మేడిలు, మోకాసిలు, పటేల్ లు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు… ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి.✊ జై కుమురం భీమ్…✊✊

సినిమా

ఓటీటీ తెరపైకి పొలిటికల్ థ్రిల్లర్…!

థ్రిల్లర్ జానర్‌కి సంబంధించిన కంటెంట్ ఏ భాషలో వచ్చినా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ థ్రిల్లర్‌లతో పాటు ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్‌లకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. రాజకీయ నేపథ్యంలోని ఈ తరహా కథలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇలాంటి సిరీస్‌ల వరుసలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది ‘మహారాణి’ వెబ్ సిరీస్. హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ‘సోనీ లివ్’లో ప్రసారం అవుతోంది. సాధారణ గృహిణి ఒకరు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే కథనే ఇది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్‌లకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఆ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు సీజన్ 4 రెడీ అయింది. అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 7వ తేదీ నుంచి ‘మహారాణి సీజన్ 4’ స్ట్రీమింగ్‌కి రానుంది. తాజా ట్రైలర్‌లో, ముఖ్యమంత్రిగా ఎదిగిన మహారాణి ఇక ప్రధాని పీఠం వైపు ప్రయాణం మొదలుపెట్టినట్టు చూపించారు. ఈ సీజన్‌లో హ్యూమా ఖురేషి‌తో పాటు శ్వేతా బసు ప్రసాద్, విపిన్ శర్మ, అమిత్ సియాల్, వినీత్ కుమార్, శార్దూల్ భరద్వాజ్, ప్రమోద్ పాఠక్ వంటి పలువురు ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈసారి మహారాణి ఎలాంటి రాజకీయ ఆటలు ఆడబోతుందో, అధికార శిఖరాలను ఎలా అధిరోహించబోతుందో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

విశాఖపట్నం

*విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్‌ — ఆంధ్రప్రదేశ్‌-గూగుల్ ఎంఓయూ సంతకం*

విశాఖ, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) భారత ప్రభుత్వం సహకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో విశాఖపట్నంలో 1 గిగావాట్ సామర్థ్యం గల నూతన ఏఐ హబ్‌ (Artificial Intelligence Hub) ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఎంఓయూ సంతకం కార్యక్రమం న్యూఢిల్లీలోని తాజ్ మాన్ సింగ్ హోటల్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్, బికాష్ కొలే (వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), కరణ్ బజ్వా (ప్రెసిడెంట్, ఏషియా పసిఫిక్ గూగుల్ క్లౌడ్) తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా ఏర్పడనున్న ఈ ఏఐ హబ్‌ ద్వారా టెక్నాలజీ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలలో కొత్త అవకాశాలు, ఉపాధి వృద్ధి కలుగనున్నట్లు అధికారులు తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కిడ్నీ బాధితునికి వైసిపి నేత కుంచే రమణారావు ఆర్థిక సాయం

అమలాపురం, అక్టోబరు 14 (పున్నమి ప్రతినిధి) : ఉప్పలగుప్తం మండలం సరిపల్లి కి చెందిన గెడ్డం రాంబాబు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ వైసిపి నేత,గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు కిడ్నీ బాధితుడు రామ్మోహన్ రావు వైద్యానికి ఆర్థిక సాయం అందించారు.మంగళవారం అమలాపురం లోని గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయం లో గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ రమణారావు రూ.20 వేలు చెక్ ను రామ్మోహన్ రావు అతని తల్లి వెంకటలక్ష్మి కి అందజేశారు. ఆర్థిక సాయం అందజేసిన గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ రమణారావుకు రాంబాబు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు గెడ్డం సుబ్బారావు,పరమట పండు,కాట్రు మధు, వైసిపి నాయకులు పందిరి సుబ్బరాజు, నేరేడుమిల్లి శ్రీను,నేలపూడి సుగంధ కుమార్,గంటా లక్ష్మీ ప్రసాద్,గుడ్ సీడ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

జనగాం

చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లను ప్రారంభించిన జనగామ ఏఎంసి చేర్మన్ బంక శివరాజ్ యాదవ్

ప్రజా ప్రభుత్వం లోనే రైతులకు మేలు జరుగుతుంది ——————————————– జనగామ,అక్టోబర్14,పున్నమి న్యూస్: రైతులను రాజు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు . శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ,అదేవిధంగా రైతులు తమ వడ్లను ఆరబెట్టుకొని సెంటర్ కి వచ్చే ముందు తగు నాణ్యతలు పాటించాలని మరియు A గ్రేడ్ వడ్లకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర 2389₹, సాధారణ రకం వడ్లకు 2369₹ రూపాయలకే వడ్లు విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు. అదే విధంగా రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించ వద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనే వడ్లను విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,ADE అపర్ణ,APM శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్, నాగబండి రవీందర్, పర్ష సిద్దేశ్,జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,రైతు సంఘం నాయకులు చందు నాయక్, బీరయ్య, నాయకులు సాదం జంపన్న,రత్నం, జగదీష్,రైతులు శ్రీనివాస్,రమేష్ ,రాజు, కొమురయ్య , ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏవో అనిల్,సిసి వెంకటేష్,రైతులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తగినంత యూరియా అందుబాటులో కలదు ఏవో హిమబిందు.

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలంలోని రైతు సేవా కేంద్రం నందు రబీ పంటలకు, యూరియా పంపిణీ పై రైతులకు, అధికారులకు, రైతు సేవా కేంద్రం సిబ్బందికి మరియు డీలర్లకు, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శివ నాయక్ (ఎడిఎ) మాట్లాడుతూ వరి పంటకు రైతులు ప్రభుత్వం సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడుకోవాలని అధికంగా వాడటం వలన, కలిగే నష్టాల గురించి వివరించారు. ఎకరాకి మూడు బస్తాలు మాత్రమే వాడాలని తెలిపారు. వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ, రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉంటుందని మరియు రైతు సేవా కేంద్రము మరియు ప్రైవేటు డీలర్ల వద్ద చేజర్ల మండలానికి అవసరమైన యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. రైతులు ఎవరు కూడా అపోహాలు నమ్మి కంగారు పడకుండా వ్యవసాయ సిబ్బంది నుండి యూరియా కార్డ్స్ తీసుకొని వరి పంట సాగు చేసే విస్తీర్ణానికి ఎకరాకి మూడు బస్తాలు విడతల వారీగా పంపిణీ ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ సిబ్బంది ఎఈఓ, విఎఎలు, ఎరువుల డీలర్స్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.