Thursday, 30 April 2026

Blog

E-పేపర్

కోల్గేట్పేరుతో నకిలీ టూత్ పేస్టులు

ఇప్పటిదాకా కల్తీ పాలు, అల్లం పేస్టులు, ఆయిల్ ప్యాకెట్లు బయటపడగా తాజాగా నకిలీ టూత్ పేస్టులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్లోని కచ్ జిల్లాలో Colgate పేరుతో రెడీ చేసిన ఫేక్ టూత్ పేస్ట్ బాక్స్లలు భారీగా బయటపడ్డాయి. చిత్రోడ్ ప్రాంతంలో పోలీసులు దాడులు చేసి వీటిని పట్టుకున్నారు. సుమారు రూ.9.43 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. దీని సప్లై చైన్ తెలుసుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

నాగర్‌కర్నూల్

జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు

జాతీయ పక్షులకు జీవం పోసిన పోలీసులు క్రిమిసంహారక పంట తిని అస్వస్థకు గురైన మూడు నెమళ్లు అధునాతన వైద్యం అందించిన పోలీసులు పార్కులో సురక్షితం వన్యప్రాణులను కాపాడిన గోపాల్పేట పోలీసులు జిల్లా ఎస్పీ చొరవతో మూడు నేమ్మలకు పునర్జీవం మహబూబునగర్ ప్రతినిధి/ అక్టోబర్ 11 వ్యవసాయ పంట పొలాలలో రైతులు పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారకమందు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగించాయి. ఈ సంఘటన వనపర్తి జిల్లా పరిధిలోని గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో రేమద్దుల గ్రామానికి వెళ్లే రహదారి పక్కల కంతుల్లోని కుంట వద్ద కంతుల కురుమయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో పంటలకు పిచికారి చేసిన క్రిమిసంహారక రసాయన పదార్థాలు కలిపిన పంటను ఆహారంగా తీసుకున్న మూడు జాతీయ పక్షులు (నెమళ్లు) అస్వసతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న గోపాల్ పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్ పేట వెంటనే అక్కడికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురైన నెమళ్ళను వనపర్తి ప్రభుత్వ పశు వైద్యశాలలో నాణ్యమైన వైద్యం వివిధ రకాల టీకాలు, గ్లూకోస్ బాటిల్ సెలీన్ తో పాటు అదనాతన వైద్యం అందించి మూడు జాతీయ పక్షుల ప్రాణాలను కాపాడడం విశేషం ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హుటాహుటిన ప్రభుత్వ పశు వైద్యశాలకు చేరుకొని మూడు నెమలి వన్యప్రాణులకు అక్కడే ఉండి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించి వన్యప్రాణుల ప్రాణాలను కాపాడడంలో విశేష కృషి చేశారు. చికిత్స అనంతరం నెమళ్ళను వనపర్తి జిల్లా సమీపంలోని అటవీశాఖ ఏకో పార్క్ లో సందర్శకుల కోసం పార్కులో వదిలిపెట్టారు. జాతీయ పక్షిగా1963 ఫిబ్రవరి 1 అప్పటి భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఈ మధ్యకాలంలో అడవులలో ఉండవలసిన వన్యప్రాణులు అంతరించిపోతున్న అడవులు అడవులలో త్రాగడానికి వన్యప్రాణులకు నీరు కూడా దొరకని పరిస్థితి మరోపక్క పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల తలదాచుకోవడానికి వీలలేని సమయాలలో తప్పని పరిస్థితుల్లో వన్యప్రాణులు గ్రామాలలో గ్రామ సమీపాలలోని వ్యవసాయ పొలాలలో సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. వన్యప్రాణులకు అడవులలో ఒక బాధ వ్యవసాయ పొలాలలో మరొక బాధతో రసాయనిక పదార్థాలు కాలుష్య కారకాలు వన్యప్రాణుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఎన్నో కొన్ని ప్రాణులు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయని అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుస్తుంది. అందుకే అడవుల్లో ఉండవలసిన వన్యప్రాణులు ఆవాసాల్లోకి ప్రవేశిస్తున్నాయని అంటున్నారు. వన్యప్రాణుల ప్రాణ రక్షణ కోసం పార్కులు రక్షణ కేంద్రాలుగా రక్షిస్తున్నాయని ఎక్కడైనా వన్యప్రాణాలు కనిపిస్తే చట్టాలకు అతిక్రమించి ఎవరు కూడా చంపకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన అటవీశాఖ ఆధ్వర్యంలోని పార్కులలో వదిలిపెట్టాలని అటవీశాఖ అధికారులు పోలీసులు సూచిస్తున్నారు. వన్నె ప్రాణుల ప్రాణాలను కాపాడడంలో ప్రతి ఒక్కరి బాధ్యత కర్తవ్యం ఎంతైనా ఉందని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిజన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామ శివారులో పోలీసులకు చిక్కిన మూడు జాతీయ పక్షులకు వైద్యం అందించి సురక్షితంగా ప్రాణాలను కాపాడి వదిలిపెట్టడంలో కృషిచేసిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో పాటు గోపాల్పేట ఎస్సై నరేష్ తో పాటు గోపాల్పేట హోంగార్డు సహదేవ్ యాదవ్, వనపర్తి పట్టణ పోలీసులు ట్రాఫిక్ ఎస్ఐ సురేంద్ర, తదితర పోలీసులు చేసిన కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

ఆర్టిఐ బలోపేతానికి కృషి చేయాలని ప్రతిజ్ఞ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కనర్గాం గ్రామంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు జాడి ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆర్టీఐ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన హక్కు అని, సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం పారదర్శకత సాధ్యమన్నారు. ఆర్టిఐ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సహా చట్ట రక్షణకు, దరఖాస్తుదారుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్,భారత్, వికాస్, బాబూరావు, అనిరుద్ ,ప్రణీత్,వంశీ,చిన్న పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు

రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో టీసీఎస్, మహేంద్ర, లూలూ, రిలయన్స్, ఎన్టీపీసీ, గ్రీన్ టెక్, హైద్రోజన్, వంటి అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయంటే సీఎం చంద్రబాబు వల్లే అన్నారు. విశాఖకు ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రాబోతోంది. విశాఖలో సిఫి ఏఐకి సంబంధించి ఒక డేటా సెంటర్ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రారభించబోతున్నారు. ఢిల్లీలో గూగూల్ కు చెందిన రైడెన్ తో రూ.87,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోబోతున్నాం. ప్రసిద్ధి చెందిన డేటా సెంటర్ గా వర్జీనియా ఉంది. రేపు వరల్డ్ డేటా సెంటర్ గా విశాఖ మారబోతోంది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా చేయాలన్న లక్ష్యంతో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేశారు. చంద్రబాబుపై నమ్మకంతో అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. విశాఖను డేటా హబ్ గా, డేటా వ్యాలీగా ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లబోతున్నాం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్ సాకారంతో నేడు విశాఖ ఐటీ సీటీగా రూపాంతరం చెందబోతోంది. విజన్ 2047 లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంటే… జగన్ రెడ్డి అడుగడుగునా భవిష్యత్ భయంతో అడ్డుపడుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారు. రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాకుండా చూడాలని కుట్రలు చేస్తున్నారు. పెట్టుబడి దారులకు భయాందోళనలు కలిగించేలా జగన్ అల్లర్లు చేస్తున్నారు. పెట్టబడులు పెట్టకండని అనేక ఆర్థిక సంస్థలకు వైసీపీ వాళ్లు లేఖలు రాసి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పీపీపీకి అర్థం తెలియని వ్యక్తి జగన్ జగన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారం చేశారు. గత ఐదేళ్లల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు జగన్ రెడ్డి ఒక్కపైసా ఖర్చు చేయలేదు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూ.8,700 కోట్లు కావాల్సి ఉంటే వైసీపీ కేవలం రూ.1400 కోట్లు ఖర్చు చేసింది. అది కూడా కేంద్రం నిధులే ఖర్చు చేసింది. ఐదు మెడికల్ కాలేజీలను అరకొర వసతులతో ప్రారంభించారు. ఒక్క కాలేజీని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేదు. ఆస్పత్రి నిర్మాణం లేకుండానే మెడికల్ కాలేజీల బిల్డింగులు నిర్మించారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకుండా శంకుస్థాపన చేసి కట్టేశామని ప్రచారం చేసుకుంటున్నారు. సీఎంగా ఉండి రూ.400 కోట్లతో పులివెందుల మెడికల్ కాలేజీ కట్టారు. అక్కడా కనీసం సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయాడు. మిగతా కాలేజీల నిర్మాణానికి ఇంకా రూ.7,300 కోట్లు కావాలి. పీపీపీ మోడల్ లో ప్రభుత్వం వెళ్తోంది. రూ.7,300 కోట్లు ఖర్చు చేయాలి. మీరు పెట్టిన జీఓ ప్రకారం ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీల పూర్తికి ఇంకా 15 ఏళ్లు పడుతుంది. ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీరు ఇచ్చిన ఫీజు విధానం చూస్తే ఆల్ ఇండియా కోటాకు 15 శాతం పెట్టారు. 85 శాతం లో 50 శాతం కన్వీనర్ కోటా పెట్టారు. మిగిలింది 35 శాతంలో 15 శాతం రూ.12 లక్షలు. మిగతాది రూ.20 లక్షల చొప్పున పెట్టారు. త్వరగా మెడికల్ కాలజీల నిర్మాణాలు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. అది పెట్టబడుల ద్వారా సాధ్యమవుతుంది. మీ తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చే విధానమే కదా. అప్పుడే ప్రభుత్వ కళాశాలలు పెట్టొచ్చు కదా.? ప్రజలకు వేగవంతంగా సేవలు అందాలన్న ఉద్దేశంతోనే పీపీపీ మోడల్ తీసుకొచ్చాం. ఈ విధానంపై జగన్ రెడ్డి తేడా తెలుసుకోవాలి. పోర్టుల్లో కూడా పీపీపీ మోడల్ లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. జగన్ లో భయం పట్టుకుంది. జగన్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఆందోళనలో ఏదేదో చేస్తున్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు. కేంద్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తే చాలా సమయం పడుతుంది. అందుకే పోలవరం ప్రాజెక్ట్ ను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాం విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం ద్వారా రూ.11,440 కోట్లు సాధించాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నాం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రైవేట్ పరం కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం. స్టీల్ ప్లాంట్ ను మేనేజ్ మెంట్, కార్మిక సంఘాలు లాభాల బాటలో తేవాల్సిన అవసరం ఉంది. కేంద్రం, రాష్ట్రం సహకారం అందిస్తాం. 32 సెక్షన్లను ప్రైవేట్ పరం చేయడం లేదు. ఇప్పటికీ కాంట్రాక్టర్లే అక్కడ పని చేస్తున్నారు. 1000 మంది 32 భాగాలుగా పనిచేస్తున్నార్నది జగన్ రెడ్డి గమనించాలి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యానికి ఆద్యుడు జగనే జగన్ రెడ్డి పాపాలు నేడు ప్రజలకు శాపాలుగా మారాయి. కల్తీ మద్యం మొత్తం కుంభకోణం జగన్ రెడ్డి ప్రోత్సహించిందే. కొందరు వైసీపీ ముసుగు వేసుకొని టీడీపీలోకి వచ్చారు. వాళ్లను ప్రక్షాళన చేస్తున్నాం. తప్పు చేస్తే కచ్చితంగా శిక్ష వేస్తాం. తప్పు చేశారనే పార్టీ నుంచి కల్తీమద్యం కేసులో సస్పెండ్ చేశాం. జగన్ రెడ్డి తన హయాంలో కల్తీ మద్యం కుంభకోణం బయటపడినా ఒక్క వైసీపీ నేతపై కూడా చర్యలు తీసుకోలేదు. బొత్సకు భద్రత కల్పిస్తాం బొత్స సత్యనారాయణ అంటే మాకు చాలా గౌరవం. నాకు ప్రాణహాని ఉందని బొత్స ప్రకటించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా బొత్సకు ఎటువంటి భయం అవసరం లేదు. బొత్స మాటలను బట్టి చూస్తే. జగన్ రెడ్డి వల్లే బొత్సకు ప్రాణహాని ఉందని అనిపిస్తుంది. జగన్ రెడ్డిని దాటి వెళ్లినా, పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకొన్నా వాళ్లని అంతం చేస్తాడు. వైఎస్ వివేకాను ఆ కారణంగానే హత్య చేశాడు. ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారు. మండలిలో కూడా ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స పనితీరు బాగుంది. బొత్సకు వైసీపీ నుంచే ప్రాణ హానీ ఉందని మాకు అనిపిస్తుంది. బొత్సకు కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు: కనకదుర్గమ్మ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా పనబాక భూలక్ష్మి ప్రమాణ స్వీకారం

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల బోర్డు సభ్యురాలిగా నెల్లూరు జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక భూలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ శ్రీ శీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు దేవస్థానం చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గారి సమక్షంలో బోర్డు ధర్మకర్తల కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ — “కనకదుర్గమ్మ సేవకు అవకాశం లభించడం మహా పుణ్యకార్యం. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తాను” అని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ప్రాంగణంలో భక్తి, భవ్యతతో కార్యక్రమం నిర్వహించబడింది

ఖమ్మం

పిడుగు పడి మిర్చి పంట దగ్ధం రైతుకు తీవ్ర ఆర్థిక నష్టం

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 ఇటీవల ఏన్కూరు మండల పరిధిలో వర్షాలు, పిడుగులు రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మండల కేంద్రానికి సమీపంలోని పొలాల్లో పిడుగు పడి పంటలకు నష్టం వాటిల్లింది.వేముల రమేష్ అనే రైతు పొలంలో అర్థ ఎకరానికి పైగా మిర్చి పంటపై పిడుగు పడడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటనతో రమేష్ తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు.పిడుగుల కారణంగా పంటలు నష్టపోతుండడంతో గ్రామ రైతుల్లో ఆందోళన నెలకొంది. బాధిత రైతులు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి నష్టానికి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఖమ్మం

ప్రభుత్వ వైద్యశాలకు 2000 చిరంజీలు అందజేత

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 ప్రభుత్వ వైద్యశాలకు 2000 చిరంజీలు అందజేత: ఏన్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో చిరంజీలు లేకపోవడంతో ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ B. రాములు గారు మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు గారికి సమాచారం ఇవ్వడంతో శనివారం ఏనుకూరు మండల మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 బాక్సులు 2 ML చిరంజీలు సుమారు 5000 రూపాయల ఖరీదైన చిరంజీలను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యాధికారి భూక్య రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో చిరంజీలు కొరత ఉన్నదని అడగగానే 2000 చిరంజీలు అందజేసిన మెడికల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కూడా వైద్యశాలకు రహదారి సమస్య ఉంటే మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు తన సొంత ఖర్చులతో రోడ్డు రిపేరు చేయించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ వేదమణి, ఫార్మసిస్ట్ నీరజ, ల్యాబ్ టెక్నీషియన్ ఉప్పెర్ల రమణ, మధు, మెడికల్ అసోసియేషన్ మండల అధ్యక్షులు గుడ్ల వెంకటేశ్వరరావు, పి.పాపారావు, కోపేల రామారావు, షేక్ హుస్సేనుద్దీన్, షేక్ పెంట్టు సాహెబ్, శివ, షేక్ జానీ, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జనగాం

జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు:ఏఐసిసి,టిపిసిసిఅబ్జర్వర్లు

డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న అబ్జర్వర్లు —————————————- జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్: సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమం థీమ్‌తో టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్నిక కోసం అధిష్టానం శనివారం కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా డిసిసి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే శంకరయ్య, ఎం.డి.అవేజ్, శ్రీకాంత్ యాదవ్, జువ్వాడి ఇంద్ర పాల్గొని దరఖాస్తు ఫారం ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబ్జర్వర్లు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ స్ఫూర్తితో ఏఐసీసీ అబ్జర్వర్లు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను సేకరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి నాయకుడితో తాము వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని టీపీసీసీ, ఏఐసీసీకి నివేదిస్తామన్నారు. ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా అధికారికంగా తన దరఖాస్తును ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు గ్రంథాలయ చేర్మన్ మారోజు రాంబాబు,వ్యవసాయ మార్కెట్ చేర్మన్ బంక శివరాజ్ యాదవ్, మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపు పున్నమి ప్రతినిధి అక్టోబర్ జీవీఎంసీ 48వ వార్డ్ శ్రీనివాస్ నగర్ లో పుత్చ అప్పలరెడ్డి అనే వ్యక్తి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న 48 వ వార్డు కార్పొరేటర్,జివిఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, జీవీఎంసీ బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ తక్షణమే అతని నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అతనికి అందుతున్న వైద్యం వివరాలను గూర్చి ఆరా తీశారు.ఇందులో భాగంగా గంకల కవితా అప్పారావు యాదవ్ తన సొంత నిధుల నుంచి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించారు.బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో దాతలు ముందుకు రావాలని గంకల కవిత అప్పారావు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి భరోసా కల్పించి, ఎటువంటి అవసరం ఏర్పడిన తక్షణమే తనకు సంప్రదించాలని సూచించారు.

విశాఖపట్నం

సీతమ్మపేటలో ₹2.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విశాఖపట్నం, అక్టోబర్ విశాఖ నగరంలోని 25వ వార్డు సీతమ్మపేట మెయిన్ రోడ్డులోని శ్రీ దుర్గా గణపతి ఆలయం వద్ద, ఈరోజు (శనివారం) సాయంత్రం 4 గంటలకు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణు కుమార్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 25వ వార్డు కార్పొరేటర్, జివిఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యులు సారిపిల్లి గోవింద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం రూ. 2.80 కోట్లు (రెండు కోట్ల ఎనభై లక్షలు) జివిఎంసి నిధులతో సీసీ డ్రైన్లు, కల్వర్టులు, బీటీ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రంలో మరుగుదొడ్లు మరియు పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామల దీపిక, బీజేపీ నార్త్ ఇన్‌ఛార్జ్ సురేష్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నొడగల కృష్ణ, మాజీ కార్పొరేటర్ ఇసరపు వెంకటలక్ష్మి, బీజేపీ వార్డు అధ్యక్షుడు ఉమాశంకర్, టీడీపీ వార్డు కార్యదర్శి ధనాజీ, అలాగే ఇంజినీరింగ్ అధికారులైన గంగాధర్ (ఈ.ఇ), విజయ్ కుమార్ (డి.ఇ), రాము (ఎ.పి.డి.ఓ), విస్సు (ఎ.ఇ), వర్క్ ఇన్‌స్పెక్టర్ రవి, జోనల్ కమిషనర్ శివప్రసాద్, ఆర్‌పీలు, 25వ వార్డు కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.