Thursday, 30 April 2026

Blog

ఖమ్మం

ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు – వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 ఉచిత వైద్యం చేస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ కు కృతజ్ఞతలు – వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గాయత్రి హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది కి ఉచిత వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ని శనివారం వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అభినందించారు. మండల పరిధిలోని నాచారం గ్రామంలో శనివారం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను కలిశారు. గత పది సంవత్సరాల నుంచి కొత్త మేడేపల్లి గ్రామంలో నివసిస్తున్న గుత్తి కోయలకు, ఏన్కూరు కాలువ కట్టమీద ఉన్న జంగాల కాలనీవాసులకు ఉచితంగా వైద్యం అందిస్తున్న డాక్టర్ కొలిశెట్టి నరేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా గాయత్రి హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తో చదువుకోలేని నిరుపేదలకి చదువు కోసం ఆర్థిక సహాయం చేసిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి ఈ మధ్యకాలంలో రేపల్లెవాడ గ్రామానికి చెందిన విద్యార్థిని ఎంబిబిఎస్ సీటు సాధించిన సంగతి తెలిసిందే ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థికంగా చదువుకొని స్తోమత లేకపోవడంతో తన వంతు సహాయం గాయత్రీ హెల్పింగ్ హాండ్స్ ద్వారా అక్షరాల పదివేల రూపాయలను డాక్టర్ కొలిశెట్టి నరేష్ అందజేశారు. అనారోగ్యముతో బాధపడుతున్న కేసుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి కూడా పదివేల రూపాయలు సహాయం చేశారు. ఈ విషయాలు తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నరేష్ ను ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నరేష్ సతీమణి కొలిశెట్టి రాజేశ్వరి ఇటీవల కారు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో కుడి కాలు ఫ్రాక్చర్ అయింది. విషయం తెలుసుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గాయత్రి హాస్పిటల్ వద్ద ఆగి రాజేశ్వరిని పరామర్శించి జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగాఉండాలని ధైర్యం చెప్పారు. ఎంతోమందికి సహాయం చేస్తున్నా మీ దంపతులకు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంటూ కరచాలనం చేశారు. ముఖ్యంగా కొత్త మేడిపల్లి గిరిజన గుత్తి కోయలకు ఉచితంగా పది సంవత్సరాల నుంచి వైద్యం చేయడం గ్రామీణ వైద్యుడిగా మన ఏన్కూరు మండలానికి గర్వకారణం అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

అనకాపల్లి

దీపావళి సందర్భంగా బాణాసంచా నిల్వ, విక్రయ కేంద్రాల తనిఖీ

పున్నమి ప్రతినిధి, అక్టోబర్ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు, శనివారం ఉదయం నాతవరం గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న లైసెన్స్ పొందిన “అయ్యప్ప ఫైర్‌వర్క్స్” నిల్వ మరియు విక్రయ కేంద్రాలను, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో కలిసి, ఎస్‌ఐ నాతవరం వై.తారకేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా అనే అంశంపై తనిఖీలు నిర్వహించడంతో పాటు, ప్రమాద పరిస్థితుల్లో సిబ్బంది తక్షణ స్పందన చూపేలా “ఎమర్జెన్సీ డ్రిల్” కూడా నిర్వహించారు. జిల్లా ప్రజల భద్రత కోసం బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలు తప్పనిసరిగా అన్ని భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు సూచించారు.

విశాఖపట్నం

రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు సత్వరం.. పరిష్కరించండి , ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించండి, కనీస పెన్షన్ సదుపాయం కల్పించండి, ఐ అండ్ పీఆర్ నూతన డైరెక్టర్ విశ్వనాథన్ తో ఫెడరేషన్ నేతలు వినతి

రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ఐ అండ్ పి ఆర్ నూతన డైరెక్టర్ గా నియమితులైన కె .విశ్వనాథన్ ను ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గం కోరింది.. శనివారం ఇక్కడ వి ఎం ఆర్ డి ఏ కార్యాలయంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ, కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బి శివప్రసాద్ లు నూతన డైరెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు అంశాలను డైరెక్టర్ దృష్టికి ఫెడరేషన్ నేతలు తీసుకువెళ్లారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తికావస్తున్న నేటికీ జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్లు మంజూరు కాలేదన్నారు.. కనీసం ఇప్పటివరకు నూతన దరఖాస్తులు స్వీకరించలేదని వీరు చెప్పారు.. అలాగే చిన్న . మధ్యతరహా పత్రికలకు సంబంధించి తాజా జీవో ప్రకారం కొద్దిగా మార్పులు చేయాల్సి ఉందన్నారు..అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను.. ఇతర రాష్ట్రాల మాదిరిగా పెన్షన్ సదుపాయం కల్పించాలని కోరారు.. కనీస పెన్షన్ సదుపాయం కల్పించండి అని చెప్పారు.. ఇందుకు నూతన డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు. తన పరిధి మేరకు జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు.. అలాగే ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సిన సమస్యలు వారి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.. సోమవారం అమరావతిలో తాను బాధ్యతలు స్వీకరించినున్నట్లు డైరెక్టర్ చెప్పారు…

తిరుపతి

యువజన అధ్యక్షులను సన్మానించిన దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు

శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి పట్టణ విభాగ యువజన అధ్యక్షులైన మల్లెంబాకం ముని కృష్ణారెడ్డిని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రకాశం పంతులు తన అనుచరులతో శనివారం దుస్సాల్వా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మల్లెంబాకం మునికృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత అంతా కలిసికట్టుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపులో మనమందరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తనకు ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కి,వైసిపి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహేష్, వెంకటరమణ,మురళి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కురుపాం గురుకుల విద్యార్థులకు మెరుగైన వైద్యం — సీఎం, ఆరోగ్యశాఖకు కృతజ్ఞతలు

కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురై కేజీహెచ్‌లో చికిత్స పొందారు. వారికి వైద్యసేవలను సమర్ధంగా అందించి, ఆరోగ్యవంతులుగా మార్చిన వైద్య సిబ్బందికి, ఆరోగ్య శాఖ అధికారులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆ ఆరుగురు గిరిజన విద్యార్థులను సురక్షితంగా ప్రభుత్వ అంబులెన్స్ ద్వారా వారి ఇళ్లకు పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ, “ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై చూపిన శ్రద్ధ అభినందనీయం. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి సకాల వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం మరింత ముందడుగు వేయాలి” అన్నారు.

అనకాపల్లి

ఉరలోవ కోండ భూ సమస్య పై.కూటమి నాయుకులకు అవగాహన లేదు,సిపిఎం

వి.మాడుగుల–ఉరలోవ కోండ భూ సమస్యల పై కూటమి నాయుకులకు పూర్తిగా,అవగాహన.లేకుండా జిల్లా కలెక్టర్ ఇచ్చిన అదేశాలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ద్వారా జిల్లా కలెక్టర్ కు చేప్పించి అడ్డు కుంటున్నారని దీనికి తగిన మూల్యం చేల్లించక తప్పదని వారు స్పష్టం చేసారు శనివారం వీలేకర్లు సమాశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి,వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి వ్వవసా యకార్మికసంఘం జిల్లా ఉపాద్యాక్షులు కె భవాని తదితరులు మాట్లాడారు వమ్మలి,జగన్నాదపురం క్రీష్ణాపురం,మరియు,రావికమతం మండలం కొమిరి గ్రామాల్లో 6 వ విడత భూ పంపిణీలో ఉరలోవ కొండకు చుట్టు 450 మందికి పట్టాలు ఇచ్చిన భూములకు సర్వే నెంబర్లు సరి చేయడం కోసం గ్రామ సభలు జరిపి వెంటనే వెబ్ లెండ్ లో నమోదు చేయాలని గత నెల 27 వ తేదిన జిల్లా కలెక్టర్ స్పష్ట మైన అదేశాలు ఇచ్చిన దాని పై మరల ఉరలోవ కోండ భూ సమస్యపై కూటమి ప్రభుత్వ బాధ్యత తీసు కోని పేదలకు న్యాయం చేస్తామని చేప్పడం లో అర్థం లెదన్నారు ఇప్పటికే సిసిఎల్ఏ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ సర్వే నెంబర్లు సరి చేసి,పట్టాలు ఇవ్వని వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలని అదేశాలు ఇచ్చిన దానిని ఆడ్డు కోని పేదలకు అన్యాయం చేస్తుంది చాలక ప్రజలను తప్పుదోవ పట్టిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఇది సరియైనది కాదని తెలిపారు 2016 – 2017లో 6 వ విడత భూ పంపిణీలో ఉరవ కొండ చుట్టు వందలాది మంది పేదలకు గిరిజనులకు ధళితులకు నాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని తెలిపారు పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు గల ఏ భూములు వెబ్ ల్యాండ్ లో నమోదు అవ్వ లేదన్నారు, పట్టాలు ఇచ్చిన సర్వే నెంబర్లు కు పేదల సాగులో ఉన్న సర్వే నెంబర్లు గల భూములకు సంభంధం లెదని తెలిపారు దీని వలన పట్టాదార్లు అందరు తీవ్ర ఆందోళన చేందు తున్నారని తెలిపారు,రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలు వలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో పాటు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమపథకాలు,స్కీములు అమలు కావడం లేదన్నారు. 2016 వ సంవత్సరం నుండి అనేక పర్యాయాలు వి మాడుగులం తహశీల్దార్ కు జిల్లా కలెక్టర్ కు గ్రామాల్లో జరిగిన రైవెన్యూ సదస్సుల లోను అనేక సార్లు ధరఖాస్తులు పెట్టుకు న్నారని తెలిపారు, దీంతో జిల్లా కలెక్టర్ అమరావతి సిసిఎల్ కు.సమస్య పరిష్కారం కోసం వ్రాయడం జరిందన్నారు ఆగస్టు 11 న సిపిఎం నాయకులు తో పాటు ఈ గ్రామాలకు చేందిన పేదలు విజయవాడలో సి సి ఎల్ ఎ కలిసి వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరించడం తో పాటు 26 తేదీన వమ్మలి లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఉరి తాళ్ళుతో నిర్సన తెలపడం జరిగిందన్నారు దీంతో కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామసభ జరిపి లబ్ధిదారులను గుర్తించి పట్టాలు లెని వారికి పట్టాలుతో పాటు గతంలో పట్టాలు ఇచ్చిన వారి అందరికీ వెబ్ లెండ్ లో సరి చేయాలని అదేశాలు ఇచ్చారని తెలిపారు అయి నప్పటికీ కూటమి నాయకులు రాజకీయ వత్తిళ్ళుకు తలవగ్గి నర్సీపట్నం ఆర్ డి ఓ స్తానిక తహశీల్దార్ జిల్లా కలెక్టర్ ఆదేశాలను చేత్త బుట్టలో వేసారని అగ్రహారం వ్యక్తం చేశారు ఇది చాలదన్నట్లు కూటమి నాయకులు ఎమ్మెల్యే కలెక్టర్ తో మాట్లాడారని ఉరవ కొండ బాదితులకు న్యాయం చేస్తామని గ్రామాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు ఇది ప్రజలు గ్రహి స్తున్నారని తెలిపారు గత పదహేను సంవ త్సరాలుగా ఈ సమస్యపై సిపిఎం ప్రజాసంఘాలు అందోన చేస్తున్నాయని గుర్తు చేసారు ఇప్పుడు సిసిఎల్ఏ జిల్లా కలెక్టర్ పేదలకు న్యాయం చేయడం కోసం ఇచ్చిన ఆదేశాలను కూటమి నాయకులు అడ్డు కోవడం మంచి పద్దతి కాదని కూటమి నాయుకులకు అవగాహన రాహిత్యం వలన చేస్తున్న పోరపాటు పనులు పేదలకు నష్టం కలిగిస్తుందని తెలిపారు వెంటనే జిల్లా కలెక్టర్ అదేశాలను అమలు చేయాలని ఉరవ కొండ భూ సమస్య పరిష్కారం చేసి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేసారు,

చిత్తూరు

మున్సిపల్ సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే*

పలమనేరు మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో స్వచ్చత అవార్డు రావడం పై హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్ ఎన్వీ రమణ రెడ్డితో పాటు సిబ్బందిని అభినందించి సన్మానించిన పలమనేరు శాసన సభ్యులు శ్రీ. ఎన్. అమరనాథ రెడ్డి గారు…. ఈ సందర్భంగా ప్రజలు అధికారుల పరస్పర భాగస్వామ్యంతోనే ఈ అవార్డు దక్కిందని దీంతో మనందరిపై మరింత బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో జాతీయస్థాయిలో అవార్డును దక్కించుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేసి పారిశుధ్యంలో పలమనేరుకు మంచి పేరును తీసుకొద్దామని ఆయన కోరారు. మున్సిపల్ పరిధిలో సమస్యలు ఏదైనా ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి చెత్త సేకరణ విషయంలో సహకరించి తోడ్పాటు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారుల తో పాటు సిబ్బంది ఉన్నారు..

E-పేపర్

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకలు

రైల్వేకోడూరు ఇంద్ర బస్ షెల్టర్ దగ్గర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మార్కెట్ చైర్మన్ పగడాల వరలక్ష్మి, పగడాల చంద్రశేఖర్ . జోగినేనీ మనీ . పగడాల వెంకటేష్ , కారుముంచి సంయుక్త . ఆలం రమేష్ , ఏనుగులు జగన్మోహన్ రాయులు , గుబ్బూరు హరి , కనకరాజు , పాడాల శివ , వేదం బీదం నవీన్ కుమార్ కొండేటి రమణ , సాదు కిషోర్ , పసుపులేటి వెంకటరమణ , చెన్న కిట్టయ్య , కటికం నాగేంద్ర , రాగిపాటి విజయ్ ,మరియు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

చిత్తూరు

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక

ఉపాధ్యాయులు,ఉపన్యాసకుల ఆత్మీయ కలయిక !)ఆదరించిన స్థలాన్ని మరువం !!)రిటైర్డ్ చిత్తూరు డీవైఈఓ వాసు వృత్తిపరంగా పనిచేసినా ఆదరించిన స్థలాన్ని తాము ఎప్పటికీ మరువమని చిత్తూరు రిటైర్డు డివైఈఓ వాసుదేవ నాయుడు అన్నారు.స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నందు 1990 – 2000 దశకములో పనిచేసిన ఉపాధ్యాయులు,ఉపన్యాసకులు ఆఫీస్ సిబ్బంది కలసి శనివారం ఆత్మీయ సమావేశం ఆ పాఠశాలలో నిర్వహించు కొన్నారు.అందరం కలసి ఒకరికొకరు యోగక్షేమాలు తెలిసికొని ఆ నాటి తీపిగుర్తులు నెమరు వేసుకొన్నారు.ఇందులో భాగంగా అప్పటి సహచరులు చాలా మంది మరణించగా వారినందరినీ ఒకసారి గుర్తు చేసుకొని వారికి నివాళులర్పిoచారు. రిటైర్మెంట్ పొందిన వారు రిటైర్డ్ మెంట్ ముందు,తరువాత జరిగిన విషయాలను అందరితో పంచుకొని సరదాగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డు చిత్తూరు డివైఈఓ వాసుదేవ నాయుడు మాట్లాడుతూ…..మనం పనిచేసినపుడు వున్న భవనాలు, స్థలo కూడా లేదని ఈ స్థలంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పడడo తో ఎందరో విద్యార్థులు ఇక్కడే చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగారన్నారు. ఈ పాఠశాలలో పనిచేసిన బదిలీ అయిన వారు రిటైర్డ్ అయినవారు ఈ కాంపౌండ్ లోకి కూడా రాక నేడు ఆత్మీయ సమావేశంలో కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకసారి మనల్ని ఆదరించిన ఇక్కడి స్థలాన్ని సందర్శిoచడంతో జన్మసార్ధక మయ్యిందన్నారు. మరో సారి ఇక్కడ కలసి మంచి కార్యక్రమo నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.చివర సన్మానాలు జరుపుకొని భోజన కార్యక్రమముతో ముగించారు. ఇందులో గంగవరం యాదమరి మండల విద్యాశాఖ అధికారులు వేణుగోపాల్ రెడ్డి, రుక్మిణమ్మ,సీనియర్ రిటైర్డ్ ఉపాద్యాయులు రంగారెడ్డి, రిటైర్డు ఉపాన్యాసకులు సుధాకర పిళ్ళై,ఈశ్వర్ రెడ్డప్ప,గుణశేఖర్,రిటైర్డ్ ఎంఈఓ వెంకటరమణ,రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఆదెమ్మ, వసుoధర,రామేశం,కేశవ పిళ్ళై,దుర్గాంబలతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులు నారాయణ బాబు,హరిప్రసాద్,వెంకట్రామయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తిరుపతి

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐

బి ఎన్ కండ్రిగ మండలం లో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదిన వేడుకలు 💐💐💐💐💐💐💐 బి. ఎన్ కండ్రిగ మండల అధ్యక్షుడు కె. మణి నాయుడు గారి శారద్యం లో ముఖ్య అధిదులుగా సత్యవేడు ఇంచార్జ్ నూకతోట రాజేష్ గారు మరియు వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భేరేంద్ర రాజు గారు భాను రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి జన్మదినాన్ని బి ఎన్ కండ్రిగ మండలంలో వైఎస్‌ఆర్సీపి నేతల ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా కేక్ కట్ చేసి, బాణాసంచా నడుమ వేడుకలను ప్రారంభించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు . సమిష్టిగా జరిపిన ఈ వేడుకలో యువత ఉత్సాహంగా పాల్గొని . పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులు అభినందనలు చెప్పారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర sc సెల్ ప్రధాన కార్యదర్శి ఉగ్గుముడి గురునాధం,రాష్ట్ర గ్రీవిన్స్ కార్యదర్శి సాయి నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా కో కాన్వీనర్ వేలూరు రాకేష్, ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బొర్రా మాధవి జిల్లా క్రియశీలక అనుబంధ విభాగల నాయకులు వైస్ ఎంపీపీ బాబు రెడ్డి, అజయ్ రెడ్డి జయ చంద్ర నాయుడు వెంకటేశ్వర్లు , నాగూర్,మాజీ, సర్పంచ్ గురవయ్య, ఎక్స ఎంపీపీ నియోజగవర్గం మహిళా అధ్యక్షురాలు మాణిక్యాల వెంకటమ్మ ,ప్రెసిడెంట్ వెట్టి ప్రసాద్, అమరలింగయ్య,ఉప అధ్యక్షుడు ప్రసాద్ పాల్ ,ప్రసాద్ ,అశోక్, సురేష్, బాలయ్య, రమేష్ నాయుడు, పెంచలయ్య, చెచ్చమ్మ,యాకోబు, చంద్రారెడ్డి సుధీర్,సర్పంచ్ కిష్టయ్య, పైపురు వెంకటకృష్టయ్య కత్తి సురేష్, చంద్ర, ధర్మయ్య, లక్ష్మీపతిరెడ్డి,బట్ట వెంకటేష్, కేశవులు,యాదవ్,శివయ్య,పరంధామయ్య,చీకోలు అశోక్, ధనంజయాలు,మిథున్ రెడ్డి ఫాలోవర్ కిరణ్ యాదవ్,కారణి వెంకటేష్ ,కత్తి శివ, మురళి నడిపయ్య, T వెంకటేష్ మంగయ్య, మోహన్, సిద్దెశ్వర్,వెంకటమ్మ,మురళి,కిక్ వెంకి శేఖర్,జగన్ , కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.