Thursday, 30 April 2026

Blog

తిరుపతి

రేపు శ్రీకాళహస్తి లో జాబ్ మేళా

ఆదివారం శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల టిడిపి కార్యాలయం నందు శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.ఈ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని,పదవ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి పాస్ లేక ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతి,యువకులు జాబ్ మేళా నందు పాల్గొని ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

ఖమ్మం

మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి*

*మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి* పున్నమి: ప్రతినిథి T.Ravinder ఖమ్మం *మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ..!!* *సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు* *అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా మురళీ* వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు. *దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం* చేశారు. వచ్చే ఏడాది మేడారం జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే *మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి భార్య, మంత్రి కొండా సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.* ఈ వ్యవహారాన్ని ఆమె *

ఖమ్మం

సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్

*సుర్దేపల్లి స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్* —————————– ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్ధేపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, ప్రస్తుతం జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డిప్యుటేషన్ పై పనిచేస్తున్న టి. లక్ష్మణ్ రావ ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. టి. లక్ష్మణ్‌రావు, తన హెడ్‌క్వార్టర్‌ వదిలి కొణిజర్ల సమీపంలోని క్రాకర్స్‌ దుకాణానికి వెళ్లి, ఇతరులతో కలిసి వాగ్వివాదం చేయటంతో పాటు, అసభ్యపదజాలంతో దూషించి, సీసీ టివి కెమెరాలను ధ్వంసం చేసిన ఆరోపణలపై, కొణిజర్ల పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయినట్లు జిల్లా విద్యాధికారి చెప్పారు. తెలంగాణ సివిల్‌ సర్వీస్‌ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు, తన చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, శాఖ ప్రతిష్టను భంగపరిచే చర్యలకై సస్పెన్షన్‌ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో జిల్లా విద్యాధికారి పేర్కొన్నారు.

విశాఖపట్నం

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా — కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభం

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించాలనే కుట్రను అడ్డుకునే దిశగా ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు కొనసాగనుంది. ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ ఈ సంతకాల యజ్ఞంలో భాగస్వాములు కావాలి,” అన్నారు. అలాగే ఆయన ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ని ఉద్దేశించి “బీజేపీ పాలనలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించలేదు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఇలాంటి నిర్ణయం? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల చిన్న చూపు కాదా?” అని సూటిగా ప్రశ్నించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ — “తురకపాలెం, కురుపాం వంటి ప్రాంతాల్లో వైద్య సదుపాయాల లేమితో విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు పూర్తయ్యుంటే, అక్కడే వారికి వైద్యం అందేది,” అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, సాడి పద్మారెడ్డి, కె.అనిల్ కుమార్ రాజు, బర్కత్ అలీ, శశికళ, సేనాపతి అప్పారావు, కిరణ్ రాజు, పీలా వెంకటలక్ష్మి, యం.సునీల్ కుమార్, నీలి రవి, కర్రీ రామారెడ్డి, గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, బొడ్డెటి కిరణ్, బలిరెడ్డి గోవింద్, సుకుమార్, దల్లి రామకృష్ణ రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తుంది : వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పాటి శివకుమార్

అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నది అని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజకవర్గ వైసీపీ పరిశీలకులు పాటి శివకుమార్ అన్నారు,ప్రభుత్వం సుమారు మూడు వేల కోట్ల బకాయాలను చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ప్రజలు ఇబ్బందులు పట్ల గాని ఏమాత్రం ఆలోచన లేదు అనడానికి ఇదొక నిదర్శనం, అనారోగ్యం చేతగాని ఏదైనా ప్రమాదవశాత్తు గాని హాస్పటల్ బారిన పడినటువంటి పేద వర్గాల వారికి సంజీవనిగా ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరోగ్య శ్రీ పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారని, 2019 నుండి 2024 మధ్య మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుమారు మూడువేల జబ్బులు మరియు ఇతర ప్రొసీజర్ల ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబానికి 20 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య భద్రత ఇవ్వడం జరిగింది, ఈ కూటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరోగ్య శ్రీ ని తీసివేసి కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం కోసం మొదటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తూ వస్తుంది, దీని కారణంగా రాష్ట్రంలో పేద వర్గాల వారు ప్రమాదాల ద్వారా,అనారోగ్య సమస్యల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి భరోసా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు రోదిస్తున్నాయని ఈ రోదన కచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒక శాపంగా ప్రజల రోదన తగులుతుందని శివకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు

జనగాం

‘జరసం’ 15 ఏళ్లు & జనగామ జిల్లా పదేళ్ళ ఆవిర్భావ ఉత్సవం

సమాజం మనుగడకు సంస్కృతి మూలం: ప్రముఖ కవి డాక్టర్ పసునూరి రవీందర్ పిలుపు ——————————————– జనగామ, అక్టోబర్ 11,పున్నమి న్యూస్: సమాజం మనుగడకు సంస్కృతి మూలాధారమని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు. శనివారం జనగామలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జనగామ రచయితల సంఘం 15 ఏళ్ల ఆవిర్భావ సభ జనగామ జిల్లా పదేళ్ల ఆవిర్భావ ఉత్సవం జరసం అధ్యక్షులు నక్క సురేష్ ఆధ్వర్యంలో తొలుత జనగామ కవులు రచించిన వంద కవితల” సాగుబాటు” కవిత్వ సంకలనం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పసునూరి రవీందర్ మాట్లాడుతూ కవులు రచయితలు తమ సామాజిక అనుభవాలను సాహిత్యంలో లిఖితవ్యం చేయాలని కోరారు. సాంస్కృతిక ఉద్యమం తోనే సామాజిక రాజకీయ ఉద్యమాలు మరింత బలపడతాయని ఆయన చెప్పారు. కవులు సమాజ అవసరాలను గుర్తుంచుకొని రచనలు చేయాలని కోరారు. తాటికొండ రాజయ్య మాజీ తొలి ఉపముఖ్యమంత్రి ‌మాట్లాడుతూ జనగామ జిల్లా ఉద్యమంలో జనగామ యువత పోషించినటువంటి పాత్ర కీలకమైందని ఆయన అభినందించారు. జిల్లాను సాధించడంతోనే అభివృద్ధి కాదని రాష్ట్రంలో జనగామ జిల్లా అగ్రభాగంలో ఉండటానికి యువత పోరాటాలను ప్రణాళిక బద్ధంగా చేయాలని కోరారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభించడానికి పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ రంగ అభివృద్ధి ప్రణాళికలో జనగామకు పెద్దపీటవేసేలాగా ప్రభుత్వం దృష్టికి ఉద్యమాలు వెళ్లాలని కోరారు. ప్రముఖ కవి కటుకోజుల ఆనందాచారి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యాన్ని పరిమళ భరితం చేయడానికి జనగామ రచయితల సంఘం చేస్తున్నటువంటి కృషిని అభినందించారు.సమాజంలో మీ అట్టడుగు వర్గాల జీవితాల్ని కష్టసుఖాల్ని సాహిత్యంలో ప్రతిఫలింప చేయడానికి యువ రచయితలు దృష్టి కేంద్రీకరించాలని కోరారు.సాహిత్య సృజన అధ్యయనం సమాజంలో విలువల పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు యువత అభ్యుదయ ప్రగతిశీల ప్రజాస్వామిక సాహిత్యాన్ని తమ జీవితంలో భాగంగా అధ్యయనం చేయాలని కోరారు. జనగామ రచయితల సంఘం అధ్యక్షుడు నక్క సురేష్ మాట్లాడుతూ జనగామ ప్రాంతంలో సాహిత్య సృజన సామాజిక సంబంధాల అభివృద్ధి సాంస్కృతిక పరిరక్షణ కోసం జరసం కృషి చేస్తుందని అన్నారు. ‘ సాగుబాటు’ కవిత్వాన్ని డాక్టర్ పోరెడ్డి రంగయ్య సమీక్షించి ఆహుతులను ఆనందింపజేశారు. జనగామ జిల్లా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు, డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, జరసం ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్, జోగు అంజయ్య, భాస్కర్ సోమేశ్వర్, కృష్ణ, వెంకటేశం,రేణుకుంట్ల మురళి, సాంబరాజు యాదగిరి లింగంపల్లి రామచంద్రం, సోమ నరసింహ చారి, డాక్టర్ సదానందం, పుట్టవర్తిని భాస్కర్, మోహన్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జనగామ రచయితల సంఘం కవులు రచయితలు కళాకారులను ఘనంగా మెమెంటోలు శాలువాలతో సన్మానించారు.

ఖమ్మం

మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి*

*మంత్రి పొంగులేటిపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన కొండా మురళి* పున్నమి: ప్రతినిథి T.Ravinder ఖమ్మం *మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ..!!* *సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు* *అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా మురళీ* వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో అధిష్ఠానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు. *దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం* చేశారు. వచ్చే ఏడాది మేడారం జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే *మేడారం టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి భార్య, మంత్రి కొండా సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.* ఈ వ్యవహారాన్ని ఆమె *

ఖమ్మం

ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు

ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడు, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు ఏసీపీ కాల్‌లోనే షాపు యజమానిని లం*కొడకు అంటూ అసభ్యకరంగా తిడుతున్న లక్ష్మణ్

విశాఖపట్నం

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన అవసరం విశాఖ కలెక్టర్ సతీమణి, ప్రముఖ అడ్వకేట్ దివ్య ప్రసాద్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ కలెక్టర్ సతీమణి, ప్రముఖ అడ్వకేట్ దివ్య ప్రసాద్ అన్నారు. అక్టోబర్ నెలలో పింక్ మంత్ పేరిట రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కే. శిల్ప ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దివ్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి మహిళ ఖచ్చితంగా ఏడాదికి ఒకసారి విధిగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని కోరారు. కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రొమ్ము క్యాన్సర్ వ్యాధి పట్ల మహిళలకు విస్తృత అవగాహన కార్యక్రమం తో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేపట్టినట్లు తెలిపారు. మెమోగ్రామ్ ఇతర వైద్య పరీక్షలు కూడా కేజీహెచ్ లో ఉచితంగానే అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా నిత్యం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రేడియాలజీ విభాగతకి డాక్టర్ కే. బుజ్జి బాబు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తిస్తేనే సకాలంలో నయం చేయవచ్చునని కేజీహెచ్ లో ఉన్న అన్ని ఉచిత సదుపాయాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మెడికల్ ఆంకాలజీ విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవలతో పాటు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కే. శిల్ప దివ్య ప్రసాద్ తో పాటు కేజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ ఐ. వాణిని ఘనంగా సత్కరించారు. అనంతరం సిఎస్ఆర్ బ్లాక్ బయట గాలిలోకి పింక్ బెలూన్లు ఎగరవేశారు.

ఖమ్మం

ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు

ఖమ్మం ఏసీపీకి ఫోన్ చేసి బూతులతో రెచ్చిపోయిన మంత్రి తుమ్మల అనుచరుడు, ఉపాధ్యాయుడు లక్ష్మణ్ ఖమ్మం తనకు పోటీగా పెట్టిన క్రాకర్స్ షాపును తొలగించాలని ఏసీపీకి ఆదేశాలు ఇస్తున్న ఉపాధ్యాయుడు ఏసీపీ కాల్‌లోనే షాపు యజమానిని లం*కొడకు అంటూ అసభ్యకరంగా తిడుతున్న లక్ష్మణ్

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.