Thursday, 30 April 2026

Blog

తిరుపతి

లైసెన్స్ లు లేకుండా టపాసులు అమ్మడం నేరం:టూ టౌన్ సిఐ

శ్రీకాళహస్తి లో శనివారం టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రానున్న దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను పరిశీలించి దుకాణదారులకు తగు సూచనలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా అక్రమంగా టపాసులు అమ్మకూడదని,లైసెన్సు లేకుండా అక్రమంగా బాణాసంచా నిలువ ఉంచిన,రవాణా చేసిన,అమ్మిన కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు.ప్రజలందరూ దీపావళి సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోక్కును చెల్లించిన ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్

ఏన్కూరు మండలం పరిధిలోని నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని శనివారం వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాచారం గ్రామానికి చెందిన బొబ్బిలి అనే కాంగ్రెస్ కార్యకర్త మోక్కును చెల్లించడానికి వచ్చినట్లు తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో వైరా అసెంబ్లీ స్థానం నుండి మాలోత్ రాందాస్ నాయక్ విజయం సాధించాలని కార్యకర్త బొబ్బిలి ఇక్కడ మొక్కుకోవడం జరిగింది. అతని కోరిక మేరకు మోక్కును చెల్లించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీని త్వరలో ఎన్నుకొని, దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. దేవాలయం నుండి ఏన్కూర్ ప్రధాన సెంటర్ వరకు సుప్రభాతం వినేందుకు మైకులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, ఈవో శేషయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వర్ణ నరేందర్, ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, ఏ బ్లాక్ అధ్యక్షులు వేముల కృష్ణ ప్రసాద్, మండల మహిళా అధ్యక్షురాలు ప్రభావతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడా ధర్మారావు, హిమామ్ నగర్ మాజీ సర్పంచ్ మాలోతు నరసింహారావు, వక్కంతుల నాగార్జున, వక్కంతుల గుత్తా వెంకటేశ్వర్లు సాగర్, అజ్మీర సురేష్ నాయక్, దళపతి భువనేశ్వర్ రాజు, పంతగాని నరేష్,సాయి రోహిత్, నాచారం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిధి

శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెం గ్రామనికి చెందిన ఆదిలక్ష్మి అనారోగ్య కారణంతో హాస్పిటల్ నందు చికిత్స పొందగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,03,653 రూపాయల ఆర్థిక సాయం మంజూరవడంతో,ఆ చెక్కును శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ లబ్ధిదారుని ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మునిరజా నాయుడు,జయచంద్ర నాయుడు,కమల్ కుమార్,మల్లీశ్వరి,వెంకట్ రెడ్డి,ముని చంద్ర,బాలాజీ తదితరులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాకు ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ ప్రారంభం

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11 నాగర్ కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రానికి ప్రధానమంత్రి దన్ ధాన్య యోజన మరియు పప్పు ధాన్యాల స్వలంబన మిషన్ మరియు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, పశు సంపద మత్స్య సంపద ఆహార పదార్థాలకు విలువ జోడింపు వంటి రంగాలలో 1100 కు పైగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జిల్లా కలెక్టర్ పదవ సంతోష్ ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు పంట దిగుబడుల పెంపు, పంట వైవిధ్యానికి ప్రోత్సాహకం, గ్రామస్థాయిలో నిల్వ గోదాముల ఏర్పాటు, నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి, రైతులకు తక్షణ దీర్ఘకాలిక రుణాల లభ్యత, సుస్థిర వ్యవసాయ పద్ధతులకు మద్దతు తెలుపుతుందని తెలిపారు. మరియు ఈ పథకం ప్రధాన లక్ష్యం జిల్లాస్థాయి యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి గ్రామ రైతు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం వ్యవసాయానికి లాభదాయకంగా మలచడం. మన నాగర్కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా రైతులందరూ ఈ పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.

నాగర్‌కర్నూల్

శనేశ్వర స్వామికి తిలతైలా అభిషేక పూజలు…

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా అక్టోబర్ 11 శ్రీ విశ్వవసు సంవత్సరం ఆశ్విజ మాసం కృష్ణ పక్షం పంచమి శనివారం నాడు బీజినేపల్లి మండలం పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో గల శనేశ్వర స్వామికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులచే తిలతైలా అభిషేకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి శనివారం నాడు ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ ఈ మాసంలోభక్తి పూర్వకంగా స్వామివారిని కొలవడం ఎంతో విశేష ఫలితం అన్నారు.భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి, నవమి, త్రయోదశి, చతుర్దశి,అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామిని పూజించిన విశేష ఫలితం ఉంటుందన్నారు.ఇక్కడ గోన బుద్ధారెడ్డి కాలం నాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే రుద్రాభిషేక పూజలు,అర్చనలు,గణపతి, నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక అర్చనపూజలు భక్తులచే నిర్వహించారు.అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు,కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి,పుల్లయ్య, అడ్వకేట్ వీర శేఖర్ చారి, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్,సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు,మహిళలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీలో భారీ చేరికలు..*

*కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీలో భారీ చేరికలు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిజెపిలో చేరడం జరిగింది.* భారతీయ జనతా పార్టీ ఆమనగల్లు పట్టణ కార్యాలయంలో కడ్తాల్ పట్టణ అధ్యక్షులు మహేష్ గారి ఆద్విర్యంలో సీనియర్ నాయకులు మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి గారి సమిక్షంలో పలువురు బీజేపీ పార్టీ లో చేరిక. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మాజీ కమిషన్ సభ్యులు ఆచారి గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆకర్షితుతాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆకర్షితులై యువత భారతీయ జనతా పార్టీ వైపు మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధిని చూసి యువత మోడీ మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపే తెలంగాణ ప్రజల చూపు అని ఆచార్య దిమా వ్యక్తం చేయడం జరిగింది కల్వకుర్తి నియోజకవర్గం లో త్వరలో భారీ ఎత్తున చేరికలు ఉంటాయని పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బిజెపి పార్టీ చేర్ల నాయకులను కార్యకర్తలను దిశా నిర్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కడ్తాల్ మండల బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొనడం జరిగింది.

నంద్యాల

జస్టిస్ గవాయిపై న్యాయవాది దాడి చేయడానికి ప్రయత్నించడము న్యాయవ్యవస్థను కించపరిచినట్లే :నంద్యాల మజిలీస్ ఉలేమా అయ్మౌ మరియు ఇమాముల సంఘం

నంద్యాల, అక్టోబర్11,పున్నమి ప్రతినిధి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై సుప్రీంకోర్టులో అందరూ న్యాయవాదులు న్యాయమూర్తులు చర్చ జరుగుతున్న సమయంలో న్యాయవాది బూటు తో దాడి చేయడానికి ప్రయత్నించడము న్యాయవ్యవస్థను కించపరిచినట్లేనని రాజ్యాంగాన్ని పూర్తిగా తీవ్రవాదుల మాదిరి వ్యతిరేకించిన ట్లు అవుతుందని అతనిపై కఠినంగా శిక్షించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆ న్యాయవాది ఎక్కడ కూడా కోర్టులో పాల్గొన్న రాదని తీర్మానం చేసి అమలు చేశారు అయితే న్యాయవాది బూట్ విసిరే విధానాన్ని అతని వైఖరిని ఖండిస్తూ అతనిపై సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి కఠినంగా శిక్షించాలని నంద్యాల మజిలీస్ ఉలేమా అయ్మౌ మరియు ఇమాముల సంఘం నంద్యాల జిల్లా కమిటీలు నాయకులు డిమాండ్ చేశారు ఇమాముల సంఘం జిల్లా అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్ధికి మరియు నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో అందరి ఏకగ్రీవంగా తీర్మానించి పత్రికా ప్రకటనలు మీడియా ప్రకటన ఇవ్వడం జరిగింది ఇటువంటి దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తులను దేశవ్యాప్తంగా న్యాయవాదులు అందరు ఖండిస్తూనే ఉన్నారు ఆందోళన చేస్తున్నారు అయితే ప్రజాస్వా మ్యం కోరుకునే వ్యక్తులు రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన న్యాయ వ్యవస్థను గౌరవించే వారందరూ ఖండించాలని కోరుతున్నాము అని తెలియజేశారు ఇటువంటి చర్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో రౌడీ ఎలిమెంట్లో హంతకులు ఆర్థిక నేరస్తులు తమకు అనుకూలంగా తీర్పురాని ఎడల ఇటువంటి పరిస్థితి అన్ని కోర్టులలో పెరిగే అవకాశం ఉంటుంది కావున అందరూ నంద్యాల నుండి ఢిల్లీ వరకు వ్యతిరేకించి అవసరమైతే పోరాటం చేయాలని జిల్లా అధ్యక్షులు అంజద్ భాష సిద్ధికి గారు తెలియజేశారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇటువంటి దౌర్జన్యకాండను బాగా ప్రచారం చేయాలని కోరినారు.

ఖమ్మం

అయ్యప్ప స్వాములకి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం.

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పట్టణం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురుస్వామి తాండ్రా ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద  వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ప్రాంత సామాజిక సమరత కన్వీనర్ అప్పలప్రసాద్ Bjp ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రావు లు హాజరై ఈ కార్యక్రమం ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ధనియాకుల వెంకట్ నారాయణ. టి రవీందర్, యుగంధర్ నాయుడు, నరేష్, రామకృష్ణ, సురేష్, రాజేష్, లతో పాటు పలువురు బీజేపీ నాయుకులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మకర సంక్రాతి వరకు ఇక్కడ అయ్యప్ప భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహుకులు తెలియజేసారు..

భక్తి

అయ్యప్ప స్వాములకి ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పట్టణం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురుస్వామి తాండ్రా ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ప్రాంత సామాజిక సమరత కన్వీనర్ అప్పలప్రసాద్ Bjp ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రావు లు హాజరై ఈ కార్యక్రమం ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ధనియాకుల వెంకట్ నారాయణ. టి రవీందర్, యుగంధర్ నాయుడు, నరేష్, రామకృష్ణ, సురేష్, రాజేష్, లతో పాటు పలువురు బీజేపీ నాయుకులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మకర సంక్రాతి వరకు ఇక్కడ అయ్యప్ప భక్తులకి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహుకులు తెలియజేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.