Thursday, 30 April 2026

Blog

ఖమ్మం

అయ్యప్ప స్వాములకి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభం.

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పట్టణం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురుస్వామి తాండ్రా ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద  వితరణ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ప్రాంత సామాజిక సమరత కన్వీనర్ అప్పలప్రసాద్ Bjp ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రావు లు హాజరై ఈ కార్యక్రమం ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ధనియాకుల వెంకట్ నారాయణ. టి రవీందర్, యుగంధర్ నాయుడు, నరేష్, రామకృష్ణ, సురేష్, రాజేష్, లతో పాటు పలువురు బీజేపీ నాయుకులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మకర సంక్రాతి వరకు ఇక్కడ అయ్యప్ప భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహుకులు తెలియజేసారు..

భక్తి

అయ్యప్ప స్వాములకి ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభం

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం పట్టణం అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గురుస్వామి తాండ్రా ప్రసాద్ గురు స్వామి ఆధ్వర్యంలో పాత వెంకటేశ్వర సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నప్రసాద ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ప్రాంత సామాజిక సమరత కన్వీనర్ అప్పలప్రసాద్ Bjp ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు రావు లు హాజరై ఈ కార్యక్రమం ని ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ధనియాకుల వెంకట్ నారాయణ. టి రవీందర్, యుగంధర్ నాయుడు, నరేష్, రామకృష్ణ, సురేష్, రాజేష్, లతో పాటు పలువురు బీజేపీ నాయుకులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మకర సంక్రాతి వరకు ఇక్కడ అయ్యప్ప భక్తులకి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది అని నిర్వహుకులు తెలియజేసారు.

ఆంధ్రప్రదేశ్

దివాళి పండుగ కానుకగా పటాకుల అమ్మకాలకు కలెక్టర్ పర్యవేక్షణ ఆదేశించారు

దివాళి పండుగ కానుకగా ఆంధ్రప్రదేశ్‌లో పటాకుల అమ్మకాలకు కలెక్టర్ పర్యవేక్షణ ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా పటాకుల అమ్మకాలు సురక్షితంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. పటాకుల నాణ్యత, నియమావళి పాటింపు, మరియు భద్రతకు సంబంధించి కలెక్టర్లు కఠినమైన పర్యవేక్షణ నిర్వహిస్తారని అధికారులు తెలియజేశారు. పటాకుల విపణిలో ఏ విధమైన అక్రమాలు, ప్రమాదాలు జరిగిపోకుండా ఈ చర్యలతో నిరోధించబడుతుందని, ప్రజలకు అంకితమైన విధంగా పండుగ ఆనందాన్ని పొందేలా చేయాలని ఈ ఆదేశాలు ఉద్దేశ్యంగా ఉన్నవి. పటాకుల కోసం అనుమతులు పొందిన దుకాణాలకే మాత్రమే అమ్మకాలు జరగాలని కూడా సూచన లభించింది.

ఆంధ్రప్రదేశ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ “విఫలమైతే రాజకీయాలనుంచి వైదొలుగుతాను” అని ప్రకటించారు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేశారు: “విఫలమైతే రాజకీయాలనుంచి వైదొలుగుతాను” అని ప్రకటించారు. ఆయన రాజకీయ బాధ్యతలు కొనసాగించే విషయంలో సమగ్ర ప్రతిజ్ఞతో ఉన్నారని, మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ప్రకటన ప్రజలముందు తన సీరియస్‌ ప్రమాణంగా భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ 2024లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వచ్చే స్థానిక ఎన్నికలకు ముందు తన విధులు మరింత జాగ్రత్తగా నిర్వర్తిస్తారని, తప్పైతే రాజకీయాలకు అంత తీరుతాననే స్పష్టత ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీ ఉద్యమం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గొప్ప ప్రభావం చూపుతాయి. పవన్ కళ్యాణ్ ఈ మాటల ద్వారా తన ప్రజలకు, పార్టీ కె సభ్యులకు స్ఫూర్తి చేకూర్చాలని ఉద్దేశించాడు.

నాగర్‌కర్నూల్

రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చు: హైకోర్టు_*

తెలంగాణ:బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధరాత్రి అందుబాటులో వచ్చాయి. గడువు తీరిన స్థానిక సంస్థలకు పాత విధానం ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కోర్టు తెలిపింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని పేర్కొంది. దీంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.

నాగర్‌కర్నూల్

కల్వకుర్తిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా*

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు నిన్న ఇచ్చిన *స్టే* ను బీసీ సంఘాలు తీవ్రంగా తప్పుపట్టాయి.. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ తాలూకా అధ్యక్షుడు మేకల రాజేందర్ అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, అన్ని బీసీ కులాల,ఆధ్వర్యంలో ఈరోజు కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపాయి, కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ అన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు ఆపి చిత్తశుద్ధితో నిజాయితీతో బీసీల పక్షాన నిలబడాలని, ఎన్నో తరాలుగా బీసీలు ఎదురుచూస్తున్న రిజర్వేషన్ ప్రక్రియను సాధించడానికై అఖిలపక్షాలు ఢిల్లీకి వెళ్లి వెంటనే 42% రిజర్వేషన్ సాధించాలని లేకపోతే పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరించాయి,రాబోయే రెండు మూడు రోజులలో కల్వకుర్తిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ నాయకులు బీసీ కులాలు పాల్గొనాలని తెలియజే సారు.. ¡

ఎన్ టి ఆర్ జిల్లా

ఈరోజు 8వ డివిజన్ GVV రాధా మాధవ్ అపార్ట్మెంట్ లో సూపర్ ‘జీఎస్టీ పై అవగాహన కార్యక్రమం’

*ఈరోజు 8వ డివిజన్ GVV రాధా మాధవ్ అపార్ట్మెంట్ లో సూపర్ ‘జీఎస్టీ పై అవగాహన కార్యక్రమం’ లో పాల్గొని, అనంతరం క్లబ్ హౌస్ లో చీరల షోరూంను ప్రారంభించిన చేనేత శాఖామాత్యులు సబిత గారు, , శాసనసభ్యులు గద్దె రామ మోహన్ గారు, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ గారు.*

ఎన్ టి ఆర్ జిల్లా

ఆక్వా రైతుల మీటింగ్ లో నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన గద్దె క్రాంతి కుమార్ గారు…

ఆక్వా రైతుల మీటింగ్ లో నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన గద్దె క్రాంతి కుమార్ గారు… ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు గద్దె క్రాంతి కుమార్ గారితో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ మై ఫేవరెట్ అని భుజంపై చేయివేసి శభాష్ క్రాంతి అని సంబోధించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలో చర్మవ్యాధి (చర్మ రోగం) బారిన పడి మృత్యువాత పడుతున్న ఆవులు, దూడలకు సకాలంలో చికిత్స అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు పట్టణంలో చర్మవ్యాధి (చర్మ రోగం) బారిన పడి మృత్యువాత పడుతున్న ఆవులు, దూడలకు సకాలంలో చికిత్స అందించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. గడచిన కొంతకాలంగా తిరువూరు పట్టణంలోని మూగజీవాలకు గుర్తుతెలియని చర్మవ్యాధులు సోకి మరణిస్తున్నాయి. తిరువూరులో పశువుల ఆరోగ్యంపై ప్రజలు చూపుతున్న శ్రద్ధ మరియు వారి ఆందోళనను తెలియజేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, చికిత్స అందించడం ద్వారా పశువుల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నారు.

విశాఖపట్నం

కాపుల వనభోజన మహోత్సవం 2025 డిసెంబర్ 14న

విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న కాపుల వనభోజన మహోత్సవంకు సంబంధించిన వివరాలను ఈ రోజు విశాఖ ప్రెస్ క్లబ్‌లో జరిగిన పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు మద్ధింశెట్టి సురేష్ కుమార్, కార్యదర్శి యర్రంశెట్టి సురేష్ మాట్లాడుతూ, “పార్టీలకతీతంగా అన్ని కాపు సోదరులు ఒకే తాటిపైకి వచ్చి ఈ మహోత్సవంలో పాల్గొని ఐక్యతను చాటాలని” కోరారు. 2011 సంవత్సరం నుండి నిరంతరంగా, విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా ముడుసర్లవా పార్క్లో ఈ మహోత్సవం భవ్యంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కాపు సోదరులు ఐక్యంగా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని” కోరారు. కాపుల అభివృద్ధి, ఏకతా కోసం అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.