Thursday, 30 April 2026

Blog

అన్నమయ్య

మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగింపు

పీలేరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అవివాహిత మైనర్ బాలిక ప్రసవించిన మగశిశువును రాయచోటి శిశు గృహానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఘటనపై A1గా నరేంద్ర అలియాస్ నాని, A2గా డా. మాధవి పై కేసు నమోదు చేయబడిందని కె.వి.పల్లి ఎస్ఐ చిన్న రెడ్డెప్ప తెలిపారు. శిశు సంరక్షణ బాధ్యతను ICDS CDO రాజమ్మ మరియు సూపర్వైజర్ శంకరమ్మ స్వీకరించారు.

అన్నమయ్య

ములకలచెరువు నకిలీ మద్యం కేసు – కస్టడీ పిటిషన్ 13వ తేదీకి వాయిదా

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటికే అరెస్టై మదనపల్లె సబ్‌జైలులో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు అక్టోబర్ 7న తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను విచారించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని, మూడు రోజులపాటు కస్టడీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు అక్టోబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

ఖమ్మం

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి ఎఫెక్ట్

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి ఎఫెక్ట్* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 11 ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కు సంబంధించి తేదీ 09-10-2025 నాడు పున్నమి తెలుగు దినపత్రికలో వెలువడిన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం ఐటీడీవో ఆఫీస్ నుండి ఏటీవో అధికారి వచ్చి అట్టి పాఠశాల పరిసరాలను పరిశీలించి ఉన్నటువంటి హెచ్ఎం మరియు డిప్యూటీ వార్డెన్ ను డిప్యూటీ వార్డెన్ నుండి తొలగించి మరొకరిని డిప్యూటీ వార్డెన్ గా నియమించడం జరిగింది

ఆంధ్రప్రదేశ్

నెల్లూరు నుండి బుచ్చిరెడ్డిపాలెం పోవు హైవే పై రోడ్డు ప్రమాదం.. పున్నమి ప్రతినిధి

నిన్న రాత్రి సుమారు సాయంత్రం 8 గంటల సమయంలో ఐస్ ఫ్యాక్టరీ మరియు బజాజ్ షోరూం మధ్యలో రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని టాటా ఏసీ వాహనము ఢీకొట్టినది ఆ వ్యక్తికి తలపై బలమైన గాయమైనది ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనిని అక్కడ ఉన్న కొంతమంది 108 వాహనము పిలిపించి బుచ్చిరెడ్డిపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు ఢీ కొట్టిన వాహనము ఆపకుండా వెళ్లిపోయినది. పోలీసు వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.end

విశాఖపట్నం

మారిక వలస బాలికల గురుకుల పాఠశాలలో తనిఖీలు

రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి మారిక వలస బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల చదువు, భోజనం, వసతి సదుపాయాలపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ వై. రోజా సమక్షంలో పాఠశాలలో వివిధ విభాగాలపై తనిఖీలు నిర్వహించారు

తిరుపతి

✨ *ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త!*

పున్నమి న్యూస్ శ్రీకాళహస్తి 🌾✨ *ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త!* ✰ 🗓 రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటివరకు 50 శాతం లోపే ఈ-పంట నమోదు పూర్తయింది. ✰ 🌾 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ✰ 🧑‍🌾 రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా పంట నమోదు చేసుకోవాలి అని ప్రభుత్వం సూచించింది. ➥ 📍 తమ పంట వివరాలు సరిచూసుకుని ఖచ్చితంగా నమోదు చేయాలి. ✰ 📅 తుది జాబితా ఈ నెల 31వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది. ✰ 🚜 అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.

తిరుపతి

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం

శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదిలో మరో డెడ్ బాడీ కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు ఎర్రచొక్కా లుంగీ ధరించిన వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న చెక్ డాం వద్ద కర్మరియమ్మ గుడి దగ్గర మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని వివరాలు ప్రమాదాన్ని కళా కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు

విద్య విజ్ఞానం

భారతీయ సోషల్ మీడియా యాప్ ఆరట్టయి గురించి విశేషాలు

పున్నమి ప్రతినిధి అరట్టై (Arattai) అప్లికేషన్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు: 1.’పాకెట్’ ఫీచర్: ఇది యాప్‌లోనే ఉండే మీ వ్యక్తిగత క్లౌడ్ స్టోరేజ్ లాంటిది. ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలు, డాక్యుమెంట్లు లేదా నోట్సులను చాట్ లాగ్‌లో కాకుండా ప్రత్యేకంగా ‘పాకెట్’ విభాగంలో సేవ్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఇలాంటి వాటి కోసం చాలామంది తమకే తాము మెసేజ్ చేసుకునే గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు, కానీ అరట్టైలో దీనికి ప్రత్యేక ఫీచర్ ఉంది. 2.’నేను చేరే వరకు’ లొకేషన్ షేరింగ్: మీరు మీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేస్తున్నప్పుడు, గమ్యాన్ని సెట్ చేయవచ్చు. మీరు ఆ గమ్యాన్ని చేరుకోగానే లొకేషన్ షేరింగ్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది వాట్సాప్‌లో ఉన్నట్లుగా కేవలం సమయ పరిమితి కాకుండా, మరింత సౌకర్యవంతమైన ఫీచర్. 3.ప్రత్యేకమైన ‘మీటింగ్స్’ విభాగం: అరట్టై కేవలం మెసేజింగ్ కోసం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా మీటింగ్‌ల కోసం కూడా ఒక విభాగం (Dedicated Section) కలిగి ఉంది. దీని ద్వారా యూజర్లు యాప్‌లోనే ఆన్‌లైన్ మీటింగ్‌లను సృష్టించవచ్చు, జాయిన్ కావచ్చు లేదా షెడ్యూల్ చేయవచ్చు. దీనికి అదనంగా Google Meet లేదా Zoom లాంటి ప్లాట్‌ఫారమ్‌లు అవసరం లేదు. 4.టెక్స్ట్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేకపోవడం: వాట్సాప్‌కు భిన్నంగా, అరట్టైలో వాయిస్ మరియు వీడియో కాల్స్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ, టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రం ఇంకా పూర్తిస్థాయి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లేదు. మెసేజ్‌లు భారతదేశంలోని డేటా సెంటర్లలో నిల్వ చేయబడతాయి మరియు నిల్వలో అవి ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. 5. వాట్సాప్‌లో లేని యూజర్‌నేమ్ ఫీచర్: మీ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను పంచుకోకుండానే, కేవలం యూజర్‌నేమ్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తులతో చాట్ చేయడానికి అరట్టై అనుమతిస్తుంది. వాట్సాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులో లేదు. 6.జోహో అనుభవం: అరట్టైని చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఎంటర్‌ప్రైజ్‌ల కోసం కమ్యూనికేషన్ మరియు సహకార సాఫ్ట్‌వేర్‌లను రూపొందించడంలో జోహోకు ఉన్న సుదీర్ఘ అనుభవం అరట్టై నిర్మాణానికి పునాదిగా ఉంది.

విద్య విజ్ఞానం

వాట్సాప్ కి ధీటుగా వచ్చిన భారతీయ సోషల్ మీడియ యాప్ ఆరాట్టయి

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.