Thursday, 30 April 2026

Blog

ఖమ్మం

బీసీ ల మీద కాంగ్రెస్ కి కపట ప్రేమ,: బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు

పున్నమి ప్రతి నిధి బిసి ల మీద కాంగ్రెస్ కి ఉన్నది కేవలం కపట ప్రేమమాత్రమే నని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ది కోసం చట్ట పరిధిని అతిక్రమించి సాగిస్తున్న బీసీ రిజర్వేషన్ కపట క్రీడలో కోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది అని అన్నారు. అయిల్ ఫామ్ రైతులకి నష్ట పరిహారం అందించాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశం ప్రధాన కార్యదర్శి గుత్త వెంకటేశ్వర్లు, ప్రవీణ్, ఉపాధ్యక్షులు వీర వెళ్లి రాజేష్,నెల్లూరు బెనర్జీ కందుల శ్రీ కృష్ణ, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

సింహపురి లో గోకులాన్ని సందర్శించిన సి. ఎం

వెంకటాచలం (పున్నమి ప్రతినిధి,, అక్టోబర్ 10):-వెంకటాచలం మండలం ఈదగాలి, సర్వేపల్లి పరిధిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూలు, నందగోకులం సేవ్ ద బుల్ కాజ్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, జిల్లా ప్రజాప్రతినిధులు, కంపెనీ యాజమాన్యంతో కలిసి పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఖమ్మం

గ్రీస్ దేశం లో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులకి ఆహ్వానం: జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్

పున్నమి ప్రత్యేక ప్రతినిధి గ్రీస్ లో హాస్పిటాలిటీ, నిర్వహణ, సేవా రంగాలలో 1000 విదేశీ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఉపాధి అధికారి కె. శ్రీరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ద్వారా గ్రీస్ లో హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ కలిగిన వారికి, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధృవీకరణ పొందిన అభ్యర్థులకు హాస్పిటాలిటీ, నిర్వహణ, సేవా రంగాలలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు వేతనం 92 వేల నుంచి లక్షా 22 వేల రూపాయల వరకు అందుతుందని,గ్రీకు భాషలో పరిజ్ఞానం అవసరం లేదని, ఆంగ్ల భాష పరిజ్ఞానం తప్పనిసరి అని, ఉద్యోగదారునికి ఉచిత వసతి, భోజనం, భీమా కల్పించునున్నట్లు అదనపు పని గంటలకు ప్రతి గంటకు 20 శాతం అదనపు వేతనం అందించబడుతుందని ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తు, రెజ్యూమ్ లను *tomcom.resume@gmail.com* కు మేయిల్ చేయాలని మరిన్ని వివరాలకు *9440052081, 9440051452* ఫోన్ నెంబర్ల నందు సంప్రదించాలని ఉపాధి అధికారి శ్రీ రామ్ పేర్కొన్నారు.

తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించడం మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులను కోరారు. శుక్రవారం ఆమె నకిరేకల్ మండలం తాటికల్,నల్గొండ మండలం ఆర్జాల బావిలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.

రంగారెడ్డి

తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత..హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్

పున్నమి: సెప్టెంబర్ 10 ప్రతినిధి దూపం అంజనేయులు: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర హోటల్ వద్ద ఆడుకుంటూ వచ్చి తప్పిపోయి బాలుడు ఏడుస్తూ స్థానికులకు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడిని హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ చేరదీసి ఈ విషయాన్ని అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ కుమారుడినీ క్షేమంగా పోలీసులు అప్పగించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. వారి కళ్ళల్లో కన్నీటితోపాటు ఆనంద భాష్పాలు వెళ్లి విరిసాయి. హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ తీసుకున్న చొరపై సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు..

తిరుపతి

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గహై గారి పైన దాడి నిరసనలు తెలియజేస్తున్న ఎంఆర్పిఎస్ నాయకులు q1

తిరుపతి జిల్లా గూడూరు డివిజన్ ఎమ్మార్పీఎస్ తిరుపతి జిల్లా మందకృష్ణ మాది గారి ఆదేశాలు మేరకు జిల్లా ఇంచార్జ్ దేవదాస్ మాదిగ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల .రాజా మాదిగ పాల్గొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గహై గారి పైన దాడి జరిగిన నేపథ్యంలో దళిత జాతి మొత్తం నిరసన కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు ఇర్ల రాజా మాదిగ. తొట్టంబేడు మండల అధ్యక్షులు కాపులూరి బాలు మాదిగ. శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు పావులూరి వెంకట ముని మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని 13వ తేదీ జరగబోయే తిరుపతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి అశేషంగా తిరుపతి జిల్లా లోని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని కోరుకుంటూ మీ ఇర్ల రాజా మాదిగ ఓం నమశ్శివాయ❤️‍🔥🩵💙💚💚💙🩵❤️‍🔥💙💛💛🩵❤️‍🔥💛💛

తిరుపతి

శ్రీకాళహస్తి లో రోడ్డు ప్రమాదం ఒక మహిళ మృతి

శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామ సమీపంలో ఒక టిప్పరు మోటార్ సైకిల్ ను డీ కొట్టడం జరిగింది.ఉడమలపాడు గ్రామానికి చెందిన గురువయ్య అతని భార్య స్వాతి వారి కుమారుడు ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా ఒక లారీ డీ కొట్టడంతో గురవయ్య భార్య స్వాతి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది.

ఖమ్మం

హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

*హత్యకేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.* పున్నమి Daily న్యూస్ ప్రతినిథి: T.Ravinder ఖమ్మం *వివరాలు వెల్లడించిన ఖమ్మం రూరల్ ఏసీపీ.* * సెప్టెంబర్ 15న ఖమ్మం నగరంలో ఓ అద్దె గదిలో గట్ల వెంకటేశ్వర్లు(45) అనే వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులు * మృత్తిని వంటిపై ఉన్న బంగారం, అతని వద్ద ఉన్న డబ్బుల కోసం హత్య చేసిన నిందితులు * మృతుని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసర ప్రాంత చెట్ల పొదల్లో పడేసిన నిందితులు * ప్రధాన నిందితుడు అశోక్, మృతుడు వెంకటేశ్వర్లుకు మధ్య గ్రంథాలయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త స్వలింగ సంపర్గానికి దారితీసింది * ఆ చనువుతో రూముకు వచ్చిన వెంకటేశ్వరను హత్య చేసిన నిందితులు * మృత్యుని స్వస్థలం కామేపల్లి మండలంలోని కెప్టెన్ బంజర.

తిరుపతి

అట్టహాసంగా శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం

శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ మండపం నందు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ విచ్చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు కోలా ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి అయిన ఖాదర్ భాషా కి అరుదైన గౌరవం ఇంతటి పదవి ఇవ్వడంతొ శ్రీకాళహస్తి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీకే బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రుజువు చేశారని,అలాగే మైనారిటీలను చైర్మన్ గా చేసిన బొజ్జల కు ముస్లిం మైనారిటీ సోదరులు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

రంగారెడ్డి

ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన.. భారీ దొంగతనం వెలుగులోకి

పున్నమి సెప్టెంబర్ 11 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దుండగులు కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందిన ఈ కళాశాల ఆవరణలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు కళాశాల ఆఫీస్లోని అల్మారాను బద్దలు కొట్టి లోపల ఉంచిన భారీ నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. శుక్రవారం ఉదయం ఘటన బయటపడడంతో కళాశాల యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్టమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. కోటి రూపాయల నగదు కళాశాలలో ఎందుకు ఉంచారనే అంశంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.