Thursday, 30 April 2026

Blog

అన్నమయ్య

రక్తదానంతో రాసుకున్న అరుదైన చరిత్ర – రెడ్‌క్రాస్‌లో కొత్త బాధ్యతలు చేపట్టిన దొండ్లవాగు వేణుగోపాల్

చిట్వేలి,అక్టోబర్ 10: (వార్తలు ప్రతినిధి) రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల పరిధిలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంగా ఎంచుకున్న అలుపెరుగని యోధుడు దొండ్లవాగు వేణుగోపాల్ 105 సార్లకు పైగా రక్తదానం చేసి విశేష కీర్తిని సంపాదించారు. రక్తదానం అవసరం, వ్యసనం, ఆదర్శం, ఆవశ్యం అనే భావనలతో తన జీవితాన్ని అర్పించిన ఆయన, ఈ క్రమంలో డాక్టరేట్‌ను అలంకారంగా పొందారు. అనేక మంది ప్రముఖుల అభినందనలు అందుకుంటూ, సేవా మార్గంలో ముందుకు సాగుతున్న వేణుగోపాల్ శుక్రవారం రెడ్‌క్రాస్ సొసైటీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.బాల్యమిత్రులు మరియు సహచరులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్తులో తన సాహసయాత్రతో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.

తెలంగాణ

సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావలిని రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసినందున ఈనెల 13 (సోమవారం ) న ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలు తెలిపారు. అందువల్ల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించదలచుకున్న వారు సోమవారం వారి దరఖాస్తులను నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సమర్పించవచ్చని ఆమె స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఖైదీల ఓటు హక్కుపై సుప్రీంకోర్టు విచారణ – కేంద్రానికి, ఈసీకి నోటీసులు

దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న సుమారు 4.5 లక్షల విచారణ ఖైదీలకు ఓటు హక్కు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 62(5) రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో వాదించారు. నేరం రుజువుకాని ఖైదీలకు ఓటు హక్కు లేకపోవడం అన్యాయం అని పిటిషనర్లు తెలిపారు. దీనిపై స్పందన ఇవ్వాలని కేంద్రం, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జైళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదా పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయవచ్చని సూచించారు.

తెలంగాణ

రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఎస్ఎల్ బి సి కాలనీ లోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు, నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అయోధ్య రామాలయంలో ధ్వజారోహణకు సన్నాహాలు పూర్తి

అయోధ్యలో భవ్య శ్రీరామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా నవంబర్ 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో రామాలయం ప్రధాన గోపురంపై జెండా ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకకు మోదీకి అధికారిక ఆహ్వానం పంపింది. ఆలయ అర్చకులు ఈ కార్యక్రమం రామమందిర నిర్మాణం పూర్తయిన సందర్భంగా చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం

స్వాగతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి అక్టోబర్ 10 ఏన్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఈరోజు స్వాగతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మీటికోట సింహాచలం అధ్యక్షతన నిర్వహించారు ఉపన్యాసకులంతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించి ఫ్రీ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఉపయోగించుకోవాలని మంచిగా చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు ధనవంతులుగా పుట్టడం మన తప్పు కాదు కానీ ధనవంతులుగా చనిపోకపోవడం మాత్రం మన తప్పే అంతే కచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లేదే మనిషి తన అనుకున్న స్థానానికి చేరుకోగలడని విద్యార్థులకు సూచించారు కాలం మనతో నడవదు కాలంతోనే మనం పరిగెత్తాలని పాటతో విద్యార్థులకు తెలియపరిచారు విద్యార్థులు నృత్యాలతో అలరించారు సీనియర్ జూనియర్ అనేటువంటి భేదాలు లేకుండా అందరూ సోదర భావం వెలగాలని కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మీటికోట సింహాచలం ఉపన్యాసకులు సుందర్ కృష్ణ ప్రసాద్ బాబూలాల్ రామారావు విజయలక్ష్మి వెంకటేశ్వరరావు లక్ష్మీనరసింహ రమాదేవి కిషోర్ బాబు రాజన్న సాంబశివరావు నవీన్ లైబ్రరియన్ కవిత బోధనేతర సిబ్బంది లావణ్య సుహాసిని స్వరూప పాల్గొన్నారు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో వైయస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ

అమలాపురంలో వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన “కోటి సంతకాల ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ గారు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా అనురాధ మాట్లాడుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజల పన్ను డబ్బుతో నిర్మించిన ఈ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి ఇవ్వడం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ సంతకంతో వ్యతిరేకతను తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణ రావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి, జిల్లా సమన్వయకర్తలు పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, పిల్లి సూర్యప్రకాశ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదిలాబాదు

పారదర్శకత, జవాబుదారితనం కొరకే ఆర్టిఐ – రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కమలాకర హాజరై మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత జవాబుదారితనమే సహ చట్టం ఉద్దేశం అన్నారు. చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమాచారం పొందడం పౌరుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సమాచార హక్కు వికాస సమితి అధ్యక్షులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ చట్టబలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల సభ్యులు తాళ్ల రవీందర్, సైజాద్ హుస్సేన్, మస్కరాజు, విజయ్, సుదర్శన్, గంగారం, జితేందర్, శ్రీనివాస్, ఆనంద్, సుదీప్, హరీష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం కోటి సంతకాల సేకరణ  రైల్వేకోడూరు పున్నమి ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా తిమ్మిశెట్టిపల్లి అరుంధతి వాడనందు ముందుగా గ్రామ దేవత మాతమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోస్టర్ను ఆవిష్కరించి గ్రామస్తులతో కలిసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి  ఉద్దెశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇచ్చిన హామీలు అమ్ములు చేయకపోగా దోచుకోవడం దాచుకోవడం అనే విధంగా, వారి పాలన సాగుతుందనీ గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్ర రాష్ట్రానికి 17 నూతన మెడికల్ కాలేజీలును తీసుకువచ్చి అందులో ఏడు కాడే కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి పలు కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా నేడు కమిషన్లకు కక్కుర్తి పడి వాటిని పిపిపి పద్దతి లో ప్రైవేటై్సేషన్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వాటికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో మీ ముందుకు వచ్చామని 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియచేసి కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజా వ్యతిరేకతను తెలియజేయాలని *వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు.ఈ కార్యక్రమంలో పుల్లంపేట ఎంపీపీ బాబుల్ రెడ్డి, సీనియర్ నాయకులు పంజం వేణుగోపాల్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాస్ రెడ్డి, కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి, గుత్తి రెడ్డి హరినాథ్ రెడ్డి,మాదినేని వెంకట్ రెడ్డి,రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు, స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందభాల,సుబ్రహ్మణ్యం రెడ్డి శ్రీరామ్ నరేంద్ర,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, మండల నాగేంద్ర,ధనుంజయ నాయడు, అర్వీ రమణ, చెంగల్ రెడ్డిసుదర్శన్ రెడ్డి,ముస్లిం మైనారిటీ నాయకులు రౌఫ్, కరీముల్లా, ఫరూక్, షఫీ,మహిళా నాయకురాళ్లు నారాయణమ్మ, పుష్పలత శైలజ, గౌసియ, స్థానిక నాయకులు వెంకటయ్య,దామోదర్, తదితరులు భారీగా పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆదూరుపల్లి గురుకులంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన

అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండలం ఆదురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత, అది జీవిత నాణ్యత మరియు నిద్ర పై చూపే ప్రభావం గురించి ప్రిన్సిపాల్ శ్రీమతి పద్మజ , కెరీర్ గైడెన్స్ మరియు మానసిక ఆరోగ్య కౌన్సిలర్ బి. మల్లికార్జున వివరించారు.ప్రతిరోజు యోగా,వ్యాయామం,మంచి ఆహారం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంచుకోవచ్చని తెలిపారు.భావోద్వేగ సహాయం కోసం కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులతో భావాలను పంచుకోవడం అవసరమని సూచించారు.మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించారు.అలాగే ప్రపంచ ఆడపిల్లల దినోత్సవం సందర్భంగా బాలికల సాధికారత,సమానత్వం పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ప్రిన్సిపాల్ పద్మజ,మల్లికార్జున బాలికల హక్కులు,వారి భవిష్యత్తు అభివృద్ధి,సమాజంలో వారి పాత్రపై ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.