Thursday, 30 April 2026

Blog

తిరుపతి

శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*

*శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల* *ఈ రోజు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరియు కోలా ఆనంద్ గారు* *సీనియర్ కార్యకర్త అయినా “ఖాదర్ భాషా” గారికి అరుదైన గౌరవం* *అతి సామాన్యమైన వ్యక్తికి ఇంతటి పదవి ఇవ్వడంతొ హార్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ప్రజలు* *నిజాయితీకె బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి రుజువు చేసిన ఎమ్మెల్యే బొజ్జల* *మైనారిటీలను చైర్మన్గా చేసిన బొజ్జల కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ముస్లిం మైనారిటీ సోదరులు* 👉 శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మా నాన్నగారు నుంచి మా కుటుంబానికి అండగా ఉండి టీడీపీ పార్టీకి విధేయుడుగా ఉన్న సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యుడైనటు వంటి ఖాదర్ భాషా గారిని చైర్మన్గా చూడడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన మాతోటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి బ్యాంకు అభివృద్ధికి పాటుపడి తద్వారా శ్రీ కాళహస్తి ప్రజలకు లబ్ధి చేకూరేలా పనిచేయాలని కోరారు, ఇదే రీతిలో రాబోయే రోజులలో కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలో నిలబెడతానని తెలిపారు RSk

తెలంగాణ

రాష్ట్ర బంద్ ని జయ ప్రదం చెయ్యండి : బీసీ జాతీయ నేత రాజ్య సభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య పిలుపు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ బీసీ రిజర్వేషన్ విషయం లో తెలంగాణ హైకోర్టు తీరుని నిరశిస్తూ ఈ నెల 14 న తెలంగాణ రాష్ట్ర బంద్ కి పిలుపు ఇస్తున్నట్లు బీసీ ఐక్య వేదిక జాతీయ నాయకులు, రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ న్యాయామైనది అని చట్టపరమైన ది అని అయన అన్నారు. 42 % బీసీ రిజర్వేషన్ లకి మద్దతూ ఇచ్చే అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్ కి మద్దత్తు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రిజర్వేషన్ కి ఎవరు అడ్డు రావద్దు అని కోరారు.

సత్యసాయి

ఎంఏ తెలుగులో బంగారు పతకాన్ని సాధించిన అమడగూరు మండల వాసి రజనీ.

అమడగూరు,అక్టోబర్,09.(పున్నమి ప్రతినిధి): అమడగూరు మండల పరిధిలోని మారుతిపురం గ్రామానికి చెందిన అజ్జే రజనీ బెంగళూరు విశ్వవిద్యాలయంలో 2024 ఎంఏలో తెలుగు పూర్తి చేసుకొని బంగారు పతకాన్ని సాధించింది.ఆమె తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, శ్రీనివాసులు అందించిన ప్రోత్సాహంతోనే బంగారు పతకాన్ని సాధించగలిగింది.ఈ సందర్భంగా అజ్జే రజనీ మాట్లాడుతూ…నేను నా చదువును శ్రీ సత్యసాయి జిల్లాలోని అమడగూరు,ఓడిచెరువు,కదిరిలో పదోతరగతి, ఇంటర్మీడియట్,డిగ్రీ చదువుకున్నానని ఆ తర్వాత మా గురువు షాన్వాజ్ సలహా మేరకు బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తి చేశానని అన్నారు. తెలుగులో స్వర్ణ పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని అన్నారు.ఇంతటి ఘన విజయానికి కారకులైన నా తల్లిదండ్రులు,గురువుల రుణం తీర్చుకోలేనిదని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు.మండల వాసి అయిన అజ్జే రజనీ బంగారు పతకాన్ని సాధించడం పట్ల పలువురు ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

ఖమ్మం

డ్రైనేజ్ మీద ఉన్న ఆక్రమణలని తొలగించిన ఖమ్మం కార్పొరేషన్ సిబ్బంది:

ఖమ్మం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) ఖమ్మం నగరము లో గట్టయ్య సెంటర్ లో లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ రోడ్డు నందు గల వివిద రకల వ్యాపార సంస్థ లు డ్రైనేజ్ లని ఆక్రమించు కొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ శ్రీమతి వసుంధర పర్యవేక్షణ లో శుక్రవారం నాడు కార్పొరేషన్ సిబ్బంది ఆక్రమణలని తొలగించారు.కార్పొరేషన్ కార్యలయం నుండి జిపి రెడ్డి స్వీట్స్ వరకు ఉన్న ఆక్రమణ లని తొలగించారు. మల్లి డ్రైనేజ్ ల మీద కి వస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని అదనపు కమిషనర్ శ్రీమతి వసుందర హెచ్చరించారు. వివిధ విభాగ ల అధికారులు డి ఆర్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు ఎస్సీ బోయ్స్ హాస్టల్‌లో మౌలిక వసతులపై తాసీల్ధార్ భాస్కర్ ఆకస్మిక పరిశీలన

రాజోలు, అక్టోబర్ 10 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు ఎస్సీ బోయ్స్ హాస్టల్‌లో మౌలిక వసతుల లోపాలపై వరుస ఫిర్యాదులకు స్పందించిన రాజోలు తాసీల్ధార్ సిహెచ్ భాస్కర్ శుక్రవారం ఆకస్మిక పరిశీలన చేపట్టారు. ఎంపిడివో కుసుమ వెంకటేశ్వరరావు, ఎంఈవోలు నల్లి మనోహరం, వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు, సర్పంచ్ రేవు జ్యోతి, దళిత చైతన్య వేదిక నాయకులతో కలిసి హాస్టల్ పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థులకు త్రాగునీరు, శానిటేషన్ వసతులు సక్రమంగా లేవని గుర్తించిన తాసీల్ధార్, మెరుగైన వసతులతో ఉన్న అద్దె భవనానికి హాస్టల్‌ను తక్షణం మార్చాలని సాంఘిక సంక్షేమ అధికారి ఎస్. సత్యనారాయణకు సూచించారు. పాడైపోయిన స్ట్రీట్ లైట్ మరమ్మతు చేయించి, వార్డెన్ల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలనలో పంచాయతీ కార్యదర్శి రెహమాన్, దళిత చైతన్య వేదిక నాయకులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళా.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి వద్ద కృష్ణా నది బ్రిడ్జిపై నుండి మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ జీడిమెట్లలోని సూరారం ప్రాంతానికి చెందిన జయశ్రీ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సంఘటనను గమనించిన కొండపేట గ్రామానికి చెందిన మత్స్యకారులు సాహసంగా నదిలోకి దూకి మహిళను కాపాడారు. వివరాల ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యాయత్నానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు.

జోగులాంబ గద్వాల

తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్.

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయ పుస్కారఘాట్ దగ్గర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను రక్షించేందుకు తుంగభద్ర నదిలో ఎన్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్ బృందాల ద్వారా మాక్ డ్రిల్ (Mock Drill) నిర్వహించారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 2 గంటల పాటు ఈ శిక్షణ జరిగింది. స్పెషల్ బోట్ల సహాయంతో వరద నీటిలో ప్రాణాలను ఎలా కాపాడాలో రెస్క్యూ టీమ్లు కళ్లకు కట్టినట్టు చూపించారు. విపత్తులు ఎదురైనప్పుడు స్వయంగా రక్షించుకోవాలన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొదలకూరు సంగం రోడ్డులో* *గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.* =======================/// *నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

తూర్పు గోదావరి

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరి శిక్ష వేయాలి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరిశిక్ష విధించాలి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం రాజ్యాంగాన్ని కాల్చడమే *అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్. కొవ్వూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గత గురువారం రాత్రి చిత్తూరు జిల్లా దేవళం పేట గ్రామంలో వైయస్సార్ సిపి కి చెందిన దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చివేసిన సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు ఎస్సీ సెల్ విభాగం వారు రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలతో ఆయన్ని సత్కరించమన్నారు, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ చిత్తూరు జిల్లాలో దేవళంపేటలో దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి ప్రజాస్వామ్యానికి మచ్చను మిగిల్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని భంగం చేసే ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని వీధిపాలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో జాతి సమైక్యతను దెబ్బతీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను అవమానించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. నిందితులను మాత్రమే కాదు వారి వెనక ఉన్న సూత్రధారులను కూడా అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దేశ పటిష్టతకు బలమైన రాజ్యాంగం అందించి, దళితుల హక్కుల కై పోరాడిన నాయకుడిగా దేశ ప్రజల మనసులను గెలిచిన అంబేద్కర్ గొప్పతనాన్ని చిల్లర పనులతో చెరపలేరన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి , డాక్టర్ సుధాకర్ ని చంపిన దళిత బిడ్డని సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డెలివరీ చేసిన సంఘటన, చంద్రబాబు నాయుడు దళితులకు ఇచ్చినటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబేద్కర్ కు జరిగిన అవమానం దళిత జాతికే అవమాన పరిచినట్టు అని మేము భావిస్తున్నాం, విగ్రహం కూల్చిన వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అరెస్టు చేయాలి, గడిచిన ఐదు సంవత్సరాలలో అంబేద్కర్ రాజ్యాంగం కాక పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్ అవమానపరిచిన వారిని ఉరిశిక్ష వేయాలని ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమా కుమార్ మరియు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ముప్పిడి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ విభాగం, టిడిపి మహిళా విభాగం కూటమి నాయకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి.

జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి. *** మీడియా అక్రెడిటేషన్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి —ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ పొదలకూరు అక్టోబర్ 9:: గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ యాదవ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నెపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ రామ్ మాట్లాడుతూ నెల్లూరు పున్నమి పత్రిక ఎడిటర్ కోటేశ్వరరావు సతీమణి అకాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారిని పరామర్శించడం జరిగినదని పేర్కొన్నారు.అలాగే ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం అనేక జీ.ఓ.లను విడుదల చేసే ప్రభుత్వాలు మీడియా అక్రిడిటేషన్ జీ.ఓ. ఇచ్చి, నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల వర్కింగ్ జర్నలిస్టులు అభద్రతా భావానికి గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాని మీడియా జర్నలిస్టులు అందరికీ సులభతరంగా అక్రిడేషన్ మంజురు అయ్యే విధంగా జూలై లో ఇచ్చిన జీవో ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న జర్నలిస్టు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ,, సంక్షేమ నిధి తక్షణమే పునరుద్ధదించాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని శ్రీ రామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక ఇంటి నిర్మాణానికి తగు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు పెన్షన్స్ సౌకర్యం అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్కింగ్ మీడియా ప్రతినిధులకు 15,000 పెన్షన్ సౌకర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు. జర్నలిస్టుల మీద, పత్రిక కార్యాలయాల మీద దాడులు జరుగుతున్న నేపధ్యంలో తక్షణమే మీడియా దాడుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం.పీ.ఎ నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కామంచి హాజరత్ ప్రధాన కార్యదర్శి మేకల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు కల్లూరు సుధాకర్ రెడ్డి మరియు ఏ.పీ.ఎం.పీ.ఎ కుటుంబ సభ్యులు పొదలకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగినది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.