Thursday, 30 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొదలకూరు సంగం రోడ్డులో* *గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి.* =======================/// *నెల్లూరు జిల్లా, పొదలకూరు సంగం రోడ్డు, పొగాకు బ్యార్నిల్ సమీపంలో ప్రధాన రహదారిపై గుర్తు తెలియని (55)సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు.. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పొదలకూరు సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ,తన సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

తూర్పు గోదావరి

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరి శిక్ష వేయాలి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరిశిక్ష విధించాలి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం రాజ్యాంగాన్ని కాల్చడమే *అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్. కొవ్వూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గత గురువారం రాత్రి చిత్తూరు జిల్లా దేవళం పేట గ్రామంలో వైయస్సార్ సిపి కి చెందిన దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చివేసిన సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు ఎస్సీ సెల్ విభాగం వారు రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలతో ఆయన్ని సత్కరించమన్నారు, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ చిత్తూరు జిల్లాలో దేవళంపేటలో దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి ప్రజాస్వామ్యానికి మచ్చను మిగిల్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని భంగం చేసే ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని వీధిపాలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో జాతి సమైక్యతను దెబ్బతీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను అవమానించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. నిందితులను మాత్రమే కాదు వారి వెనక ఉన్న సూత్రధారులను కూడా అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దేశ పటిష్టతకు బలమైన రాజ్యాంగం అందించి, దళితుల హక్కుల కై పోరాడిన నాయకుడిగా దేశ ప్రజల మనసులను గెలిచిన అంబేద్కర్ గొప్పతనాన్ని చిల్లర పనులతో చెరపలేరన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి , డాక్టర్ సుధాకర్ ని చంపిన దళిత బిడ్డని సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డెలివరీ చేసిన సంఘటన, చంద్రబాబు నాయుడు దళితులకు ఇచ్చినటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబేద్కర్ కు జరిగిన అవమానం దళిత జాతికే అవమాన పరిచినట్టు అని మేము భావిస్తున్నాం, విగ్రహం కూల్చిన వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అరెస్టు చేయాలి, గడిచిన ఐదు సంవత్సరాలలో అంబేద్కర్ రాజ్యాంగం కాక పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్ అవమానపరిచిన వారిని ఉరిశిక్ష వేయాలని ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమా కుమార్ మరియు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ముప్పిడి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ విభాగం, టిడిపి మహిళా విభాగం కూటమి నాయకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి.

జర్నలిస్టుల సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్దించండి. *** మీడియా అక్రెడిటేషన్ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి —ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ పొదలకూరు అక్టోబర్ 9:: గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్టు సంక్షేమ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ యాదవ్ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన్నెపల్లి సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీ రామ్ మాట్లాడుతూ నెల్లూరు పున్నమి పత్రిక ఎడిటర్ కోటేశ్వరరావు సతీమణి అకాల మరణానికి చింతిస్తూ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారిని పరామర్శించడం జరిగినదని పేర్కొన్నారు.అలాగే ఈ సందర్భంగా ప్రజల సంక్షేమం కోసం అనేక జీ.ఓ.లను విడుదల చేసే ప్రభుత్వాలు మీడియా అక్రిడిటేషన్ జీ.ఓ. ఇచ్చి, నోటిఫికేషన్ విడుదల చేయడంలో తీవ్ర ఆలస్యం చేస్తూ ఉండటం వల్ల వర్కింగ్ జర్నలిస్టులు అభద్రతా భావానికి గురి అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రాని మీడియా జర్నలిస్టులు అందరికీ సులభతరంగా అక్రిడేషన్ మంజురు అయ్యే విధంగా జూలై లో ఇచ్చిన జీవో ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న జర్నలిస్టు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ,, సంక్షేమ నిధి తక్షణమే పునరుద్ధదించాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పరిమితి రెండు లక్షల నుంచి పది లక్షలకు పెంచాలని శ్రీ రామ్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాక ఇంటి నిర్మాణానికి తగు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు పెన్షన్స్ సౌకర్యం అమలు చేస్తున్నారన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వర్కింగ్ మీడియా ప్రతినిధులకు 15,000 పెన్షన్ సౌకర్యాన్ని కలిగించాలని ఆయన కోరారు. జర్నలిస్టుల మీద, పత్రిక కార్యాలయాల మీద దాడులు జరుగుతున్న నేపధ్యంలో తక్షణమే మీడియా దాడుల నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఏ.పీ.ఎం.పీ.ఎ నెల్లూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు కామంచి హాజరత్ ప్రధాన కార్యదర్శి మేకల ప్రభాకర్ కార్యవర్గ సభ్యులు కల్లూరు సుధాకర్ రెడ్డి మరియు ఏ.పీ.ఎం.పీ.ఎ కుటుంబ సభ్యులు పొదలకూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొనడం జరిగినది.

తూర్పు గోదావరి

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరిశిక్ష విధించాలి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం రాజ్యాంగాన్ని కాల్చడమే

అంబేద్కర్ ని అవమానించిన వారికి ఉరిశిక్ష విధించాలి అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చడం రాజ్యాంగాన్ని కాల్చడమే *అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్. కొవ్వూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. రాజమహేంద్రవరం :అక్టోబర్ 09,అఖండ భూమి: గత గురువారం రాత్రి చిత్తూరు జిల్లా దేవళం పేట గ్రామంలో వైయస్సార్ సిపి కి చెందిన దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి కాల్చివేసిన సంఘటన చోటు చేసుకోవడం శోచనీయం, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ దానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీ నిర్వహించి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు ఎస్సీ సెల్ విభాగం వారు రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాలలతో ఆయన్ని సత్కరించమన్నారు, అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ చిత్తూరు జిల్లాలో దేవళంపేటలో దుండగులు అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించి ప్రజాస్వామ్యానికి మచ్చను మిగిల్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సిద్ధాంతాల పరిరక్షణలో ఎల్లప్పుడూ ముందుండే తెలుగుదేశం పార్టీ, సమాజంలో శాంతి, సామరస్యాన్ని భంగం చేసే ఇటువంటి చర్యలను ఎంతమాత్రం సహించదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల ఆత్మగౌరవాన్ని వీధిపాలు చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలతో జాతి సమైక్యతను దెబ్బతీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల హక్కుల కోసం పోరాడిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ను అవమానించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. నిందితులను మాత్రమే కాదు వారి వెనక ఉన్న సూత్రధారులను కూడా అరెస్టు చేసి శిక్షించాలన్నారు. దేశ పటిష్టతకు బలమైన రాజ్యాంగం అందించి, దళితుల హక్కుల కై పోరాడిన నాయకుడిగా దేశ ప్రజల మనసులను గెలిచిన అంబేద్కర్ గొప్పతనాన్ని చిల్లర పనులతో చెరపలేరన్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి , డాక్టర్ సుధాకర్ ని చంపిన దళిత బిడ్డని సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ డెలివరీ చేసిన సంఘటన, చంద్రబాబు నాయుడు దళితులకు ఇచ్చినటువంటి 27 రకాల స్కీములు కూడా రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి దళితులకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబేద్కర్ కు జరిగిన అవమానం దళిత జాతికే అవమాన పరిచినట్టు అని మేము భావిస్తున్నాం, విగ్రహం కూల్చిన వారి మీద దేశద్రోహం కేసు పెట్టాలి అరెస్టు చేయాలి, గడిచిన ఐదు సంవత్సరాలలో అంబేద్కర్ రాజ్యాంగం కాక పులివెందుల రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలకు ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అంబేద్కర్ అవమానపరిచిన వారిని ఉరిశిక్ష వేయాలని ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమా కుమార్ మరియు కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ముప్పిడి వెంకటేశ్వరరావు టిడిపి కార్యకర్తలు ఎస్సీ సెల్ విభాగం, టిడిపి మహిళా విభాగం కూటమి నాయకులు, భారీ ఎత్తున పాల్గొన్నారు.

నిర్మల్

స్థానిక ఎన్నికల్లో నిజాయితీపరులకు అవకాశం: ఆమ్ ఆద్మీ జిల్లా అధ్యక్షుడు

నిర్మల్ అక్టోబర్ 08 (పున్నమి ప్రతినిధి) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని, సమాజ సేవ భావం కలిగి ఉండి, నిజాయితీపరులైన అభ్యర్థులకు పార్టీ నుంచి అవకాశం కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో సామాజిక మార్పు కోసం స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతం పలుకుతుందన్నారు. పార్టీ జాతీయ పార్టీ కనుక బ్యాలెట్ పేపర్లో మొదటి వరుసలో చీపురు గుర్తు ఉంటుందని, ప్రజల్లో చైతన్యం, సామాజిక మార్పు కోసం పోరాడే వారికీ సామాన్యుల పార్టీగా అవకాశం ఇస్తామన్నారు. పోటీ చేయదలచిన వారు తమ బయోడేటాతో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. బీ-ఫారం పొందే వారు పార్టీ సభ్యత్వం స్వీకరించడంతో పాటు, గెలిచినా, ఓడినా పార్టీ మారబోనని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 8106246177 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

ఆదిలాబాదు

పరామర్శించిన సిపిఐ ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం

ఎఐటియూసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు అక్క కొడుకు కొండ్ర ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధాంగి రమేష్, మహబూబ్ ఖాన్, షేక్ సలీం, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జిల్లా అధ్యక్షులు కామ్లే రామదాస్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, కడప సురేష్ లు వెళ్ళి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.

సత్యసాయి

సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌పై అవగాహన.

అమడగూరు: జీఎస్టీ పన్నులు తగ్గింపుపై సూపర్‌ జీఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌పై సచివాలయ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మండల పరిధిలోని తుమ్మల సచివాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భారత ప్రభుత్వం చేపట్టిన 2.0 సంస్కరణల వల్ల ప్రజలకు ఉపయోగకరమైన వస్తువులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన రాయితీల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.కావున ప్రభుత్వం కల్పించిన రాయితీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిజెపి మండల కన్వీనర్ రామిశెట్టి వేమనారాయణ,సీనియర్ నాయకులు మేకల శ్రీనివాసులు,టిడిపి సీనియర్ నాయకులు రహంతుల్లా,చంద్రమోహన్,ప్రజాప్రతినిధులు,సచివాలయ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలని లెక్క చెయ్యని మధిర ఆర్టీసీ డిపో అధికారులు

ఖమ్మం పున్నమి ప్రతినిధి మధిర ఆర్టీసీ డిపో విజిటింగ్ పున్నమి రిపోర్టర్ తెలంగాణ ఉప ముఖ్య మంత్రి ఆదేశాలని మధిర డిపో ఆర్టీసీ అధికారులు లెక్క చెయ్యడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మధిర ఆర్టిసి డిపోలో బస్సులు ఆర్డినరీ బస్సులు నడుపుతూ ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్న వైనం స్పష్టంగా కనిపిస్తుంది అధిక సర్వీస్ లని విజయవాడ టు ఖమ్మం నడుపుతూ ప్రజలపై భారం మోపుతున్న మధిర ఆర్టీసీ సిబ్బంది. పేరుకి పల్లె వెలుగు బస్సు లు టికెట్ మాత్రం ఎక్స్ప్రెస్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయానికులని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఏ రూటు కి ఎక్కువ ఆదాయం వస్తుందో ప్రతి పల్లెటూరు కలిసే విధంగా బస్సులు నడపమని చెప్పినా కూడా పట్టించుకోని మధిర ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ సిబ్బంది మహిళలను అని కూడా చూడకుండా డ్యూటీలకి రాత్రి ఒంటిగంట అయినా కూడా పంపించట్లేదు అంటున్న ఆర్టీసీ మహిళా కార్మికులు మధిర టు వైరా కి సాయంత్రం 6:30 దాటిన తర్వాత ఆర్డినరీ బస్సులు నడపట్లేదు అంటున్న ప్రయాణికులు మధిర డిపో నందు కార్మికులకు సర్వీస్ ను పెంచి కనీసంగా గ్యాప్ కూడా ఇవ్వట్లేదు అంటున్న ఆర్టీసీ కార్మికులు  ఆవేధన సాయంత్రం 7:00 దాటితే  మధిర నుండి ఖమ్మం పోవాలి అంటే బస్సులే కరువు అంటున్న ప్రయాణికులు సమయపాలన లేకుండా సర్వీస్ లని నడుపుతూ న్న వైనం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కలుగజేసుకొని టైం టేబుల్ ప్రకారం నడిపి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టకుండా బస్సులను నడపాలని కోరుతున్న ప్రజలు డిపో లోని సగం బస్ లకి ఫిట్ నెస్ లేదని ప్రయాణికుల ఆరోపణలు మధిర డిపో నుండి మధిర చుట్టుపక్కల మూడు పుణ్యక్షేత్రాలకి బస్సులు నడపమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించినా కూడా ఇంతవరకు మూడు పుణ్యక్షేత్రాలకి బస్సులు నడపటం లేదంటున్న ప్రయాణికులు. కనీసం ఇప్పటికి ఐన మధిర ఆర్టీసీ డిపో అధికారుల నిర్లక్ష్య వైకరి మీద సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత అయినా ఉంది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అత్త మెడలో గొలుసు కొట్టేసిన అల్లుడు… అరెస్టు, రిమాండ్ కు తరలింపు

అమలాపురం, అక్టోబరు 10 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం పట్టణం కల్వకొలను వీధి లో అత్త మెడలో బంగారపు గొలుసు దొంగిలించిన అల్లుడుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి నట్లు పట్టణ ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు. 7 వ తేది రాత్రి 11 గంటల సమయంలో అమలాపురం పట్టణం కల్వకొలను వీధిలో నివసించే అడపా ఉమా మహేశ్వరి మెడలో రెండు కాసుల బంగారపు గొలుసు ను భయపెట్టి బలవంతంగా అల్లుడు అయిన గునిశెట్టి నాగబాబు లాక్కునిపోయాడు. అల్లుడు మీద అత్త ఫిర్యాదు ఇవ్వగా పట్టణ SI NR కిషోర్ బాబు కేసు నమోదు చేసి ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేసి, అతను దొంగిలించిన బంగారపు గొలుసును రికవరీ చేశారు. అమలాపురం కోర్టులో హాజరుపర్చగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించగా, కోత్తపేట సబ్ జైలు కు తరలించి నట్లు ఎస్ ఐ కిషోర్ బాబు తెలిపారు.

విశాఖపట్నం

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్

రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్ గా కేఎస్ విశ్వనాథన్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ పోస్టులో పనిచేసిన హిమాన్షశుక్లాను నెల్లూరు జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడంతో.. ఆయన స్థానంలో తాత్కాలికంగా ప్రఖరైజైన్ కు బాధ్యతలు అప్పగించింది. కీలకమైన సమాచారశాఖ డైరెక్టర్ గా మరో యువ అధికారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.