దుత్తలూరు
Date 30-4-2026
దుత్తలూరు మండలం BC కాలనీ చెందిన విద్యార్థిని కరీనా పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె మొత్తం 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి మండల స్థాయిలో టాపర్‌గా నిలిచింది.
దుత్తలూరు లోని ఏపీఎంఎస్ పాఠశాలలో చదువుతున్న కరీనా, తన కృషి, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించింది. ఆమె హాల్ టికెట్ నంబర్ 2618127832. చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కలిగిన కరీనా, గురువుల మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో చదివి ఈ ఫలితాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు కరీనాను అభినందించారు. ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.


